• facebook
  • whatsapp
  • telegram

లాభ నష్టాలు   

1. రమేష్ ఒక రేడియోను రూ.700లకు కొని రూ.630కి అమ్మాడు. నష్టశాతం ఎంత?
జ:  10%

 

2. ఒక వ్యాపారి స్కూటరును రూ.4085కు అమ్మడం వల్ల 5% నష్టం వచ్చింది. అయితే స్కూటరు కొన్నవెల ఎంత?
జ:  రూ.4300

 

3. ఒక దుకాణదారుడు డజను పుస్తకాలను రూ.180 కి కొని ఒక్కొక్క పుస్తకాన్ని రూ.18 చొప్పున అమ్మితే అతడికి వచ్చే లాభశాతం ఎంత?
జ:  20%

 

4. నష్టం 20% అయితే కొన్నవెలను ఏ భిన్నంతో గుణిస్తే అమ్మినవెల వస్తుంది?
జ:
    

 

5. ఒక ఇంటి ఖరీదు ఏటా కిందటి సంవత్సరం ఖరీదు కంటే 10% తగ్గుతుంది. ప్రస్తుత ఖరీదు రూ.81000 అయితే 2 సంవత్సరాల కిందట ఇంటి ఖరీదు ఎంత?
జ:  రూ.1,00,000

 

6. A ఒక వస్తువును రూ.800లకు కొని B కు 10% లాభానికి అమ్మాడు. B దాన్ని 5% నష్టానికి C కి అమ్మితే 'C' కొన్నవెల ఎంత?
జ:  రూ.836

 

7. కొబ్బరి కాయలను ఒక్కొక్కటి రూ.6 చొప్పున అమ్మగా 20% లాభం వస్తే, 100 కొబ్బరి కాయలు కొన్నవెల ఎంత?
జ:  రూ.500

 

8. ఒక టేబుల్ కొన్నవెల రూ.250, ప్రకటన వెల రూ.300. ప్రకటన వెలపై ఎంత శాతం ముదరా (రుసుము/డిస్కౌంట్) ఇచ్చి అమ్మితే కొన్నవెలపై 20% లాభం వస్తుంది?
జ:
  


 

9. ఒక వస్తువు ప్రకటన వెల రూ.250. దీనిపై 10% రుసుము ఇచ్చి అమ్మితే అమ్మినవెల ఎంత?
జ:  రూ.225

 

10. A, B లు వరసగా రూ.1600, రూ.1800 లతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతాన వాళ్లు పొందిన లాభం రూ.5440 అయితే B వాటా ఎంత?
జ:  రూ.2880

 

11. A, B లు వరసగా రూ.500, రూ.600 లతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతాన వచ్చిన లాభంలో B వాటా రూ.120. అయితే వచ్చిన మొత్తం లాభం ఎంత?

జ:  రూ.220
 

12. రాము రూ.3000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు. 4 నెలల తర్వాత ప్రసాద్ రూ.2000 పెట్టుబడితో చేరాడు. సంవత్సరాంతాన వచ్చిన లాభం రూ.2600 అయితే ప్రసాద్ వాటా ఎంత?
జ:  రూ.800

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌