ముఖ్యమైన ప్రశ్నలు
2. కొబ్బరికాయలను ఒక్కొక్కటి రూ. 6 చొప్పున విక్రయిస్తే, 20% లాభం వచ్చింది. అయితే 100 కొబ్బరికాయలను ఎన్ని రూపాయలకు కొన్నట్లు?
జ: రూ.500
3. ఒక పట్టణ జనాభా ఒక ఏడాదిలో 25,000 నుంచి 30,000 కు చేరింది. అయితే ఆ పట్టణ జనాభా పెరుగుదల రేటు ఎంత?
జ: 20%
జ: 27
5. ఒక పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే 288 మార్కులు పొందాలి. ఒక విద్యార్థి ఆ పరీక్షలో 33% మార్కులు పొంది 24 మార్కుల తేడాతో ఫెయిలైతే, ఆ పరీక్షలో గరిష్ఠ మార్కులు ఎన్ని?
జ: 800
6. ఒక వ్యక్తి రెండు సైకిళ్లను ఒక్కొక్కటి రూ.2236 లకు అమ్మాడు. మొదటిదానిపై 10% లాభం, రెండోదానిపై 10% నష్టం వచ్చింది. మొత్తం మీద లాభమా? నష్టమా? ఎంత శాతం?
జ: నష్టం 1%
7. ఒక సంఖ్యను 25% పెంచిన తర్వాత దాని విలువ 80 అయ్యింది. అయితే ఆ సంఖ్య ఏది?
జ: 64
8. ఒక సంఖ్య 73% విలువకు, 48% విలువకు మధ్య తేడా 615 అయితే ఆ సంఖ్యలో 15% విలువ...?
జ: 369
9. ఒక ఉద్యోగి తన నెల జీతంలో 97% ఖర్చు చేయగా, రూ.300 ఆదా చేస్తాడు. అయితే అతడి వార్షిక జీతం (Annual income) ఎంత?
జ: రూ.1,20,000
10. ఒక పాఠశాలలోని విద్యార్థుల్లో 70% మంది బాలురు. బాలికల సంఖ్య 504 అయితే ఆ పాఠశాలలోని బాలుర సంఖ్య ఎంత?
జ: 1176
11. ఒక వ్యక్తి రూ.1400 లకు ఒక సైకిల్‌ను కొని 15% నష్టానికి విక్రయించాడు. అయితే ఆ సైకిలు అమ్మకపు వెల ఎంత?
జ: రూ.1190
12. ఒక వస్తువు కొన్న వెలకు, అమ్మిన వెలకు మధ్య నిష్పత్తి 5 : 4 అయితే నష్టశాతం ఎంత?
జ: 20%
13. ఒక వ్యాపారి ఒక వస్తువును రూ.900 లకు అమ్మడం వల్ల అతనికి అమ్మిన వెలపై 10 శాతానికి సమానమైన లాభం వచ్చింది. అయితే వ్యాపారి ఆ వస్తువును కొన్నధర ఎంత?
జ: రూ.810

15. ఒక వ్యాపారి పంచదారను కొన్న ధరకే అమ్ముతానని ప్రకటించాడు. కానీ 1 కి. గ్రా. బదులు 900 గ్రా. లే ఇస్తున్నాడు. అయితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది?
జ:
16. ఒక వ్యాపారి ఒక కుర్చీని రూ. 720లకు అమ్మడం ద్వారా 25% నష్టం వచ్చింది. అతడికి 25% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి?
జ: రూ. 1200