• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక అధ్యయనాలు అర్థం, స్వభావం, పరిధి

1. సాంఘికశాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరమేది?
జ: 1916

 

2. పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనాన్ని ఒక నిర్బంధ పాఠ్యవిషయంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది?
జ:సెకండరీ విద్యాకమిషన్

 

3. సాంఘిక అధ్యయనం అనేది -
జ: సామాజికశాస్త్రాల సమ్మేళనం

 

4. 'బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం' అని నిర్వచించిన వ్యక్తి ఎవరు? 
జ: వెస్లీ

 

5. జె.ఎం. ఫారెస్టర్ ప్రకారం సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం కానిదేది?
జ: సామాజిక సంక్షేమం కంటే వ్యక్తి క్షేమానికి ప్రాధాన్యమివ్వడం

 

6. 'చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం మొదలైన వాటి గురించి సంప్రదాయికంగా తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం' అని నిర్వచించిందెవరు?
జ: సెకండరీ విద్యాకమిషన్

 

7. మనిషి ప్రవర్తన గురించి వివరించే సామాజిక శాస్త్రమేది?
జ: మనోవిజ్ఞాన శాస్త్రం

 

8. 'సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం' అని నిర్వచించిందెవరు?
జ: హెమ్మింగ్స్

 

9. సాంఘిక అధ్యయనాన్ని అమెరికా పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి భూమిక అయిన వాదమేది?
జ: వ్యవహారిక సత్తావాదం

 

10. సాంఘిక శాస్త్ర బోధనోద్దేశం కానిదేది? 
జ: విద్యార్థులు స్వయం ఉపాధిని స్వీకరించేలా చేయడం.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌