• facebook
  • whatsapp
  • telegram

సైన్స్ బోధనాపద్ధతులు

      టెట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు.. డీఎస్సీ టీచర్ పోస్టు ఎంపికల్లో టెట్ మార్కులకు 20% ప్రాధాన్యం ఇస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. గత డీఎస్సీలో ఉద్యోగం పొందినవారిలో టెట్‌లో 110కి పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 95% మంది ఉన్నారు. అందుకే ఎక్కువ మార్కులు సాధించాలంటే
టెట్‌లో ఉన్న అన్ని విభాగాలను శ్రద్ధగా అధ్యయనం చేయాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది.

 

విజ్ఞాన శాస్త్ర పాఠ్యప్రణాళిక

* పాఠ్య ప్రణాళికను ఆంగ్లంలో ''కరికులమ్" అంటారు.
* కరికులమ్ అనే ఆంగ్ల పదానికి మూలం ''కరీర్" అనే లాటిన్ పదం.
* కరీర్ అంటే పందెపు బాట లేదా పరిగెత్తే దారి లేదా నడపడం.
విద్యాపరంగా నిర్వచనం: బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గం.
నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి, విద్యా సంస్థలో ఒక కోర్సుకు సంబంధించిన విద్యా కార్యక్రమాలను నడపడానికి తోడ్పడే విద్యా ప్రణాళిక.
* NSSE year Book 1960 నిర్వచనం: పాఠ్య ప్రణాళిక విషయం, వనరులు, సామగ్రి, బోధన పద్ధతులు ఉన్న ఒక సంపూర్ణ ఛాయా సామస్త్యం. దీని ద్వారా విద్య ఆశయాలను సాధించవచ్చు.
* ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక - స్పియర్స్
* 'ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థులు సాధించడానికి ఒక సాధనంగా ఉపాధ్యాయుడు స్పష్టంగా పాఠశాలలో నిర్వహించే కృత్యాల కార్యక్రమమే పాఠ్యప్రణాళిక' - హిరస్ట్, పీటర్స్
* పాఠశాలలో నిర్ధారించిన లక్ష్యాలను, ఉద్దేశాలను రూపుదిద్దుకునేలా చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం.
* ఆటస్థలంలో, గ్రంథాలయంలో సమాచార సాంకేతిక విజ్ఞానంతో పాఠశాల వెలుపల కూడా విద్యార్థి పొందే ఉద్దేశపూర్వకమైన, యోచన చేసిన అనుభవాల సమ్మేళనమే పాఠ్యప్రణాళిక. - సెకండరీ విద్యా కమిషన్
* పాఠశాల, తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే పాఠ్యప్రణాళిక - అల్బర్టీ & అల్బర్టీ
* ప్రాచీనమైన, సంకుచితమైన భావన ప్రకారం పాఠ్య ప్రణాళిక అంటే పఠనం కోసం నిర్దేశించిన నియమిత పాఠ్యాంశాలు.
* విద్యా ప్రణాళిక పరిధి విస్తృతమైంది.
* పాఠశాలలో విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపాలే పాఠ్యప్రణాళిక.
* పాఠ్యప్రణాళిక = విషయప్రణాళిక + సహపాఠ్య కార్యక్రమాలు + పాఠ్యేతర కార్యక్రమాలు
* పాఠశాల జీవితం మొత్తం = పాఠ్య ప్రణాళిక
* జాతీయ పాఠ్యప్రణాళికలో కింది విధంగా పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను అనుసరించి సైన్స్ పాఠ్యప్రణాళిక ఉండాలి.
1. బయటి జీవితాన్ని, జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానించాలి.
2. కంఠస్తం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి.
3. పాఠ్యపుస్తకాల్లో చిక్కుకునేలా కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాలను రూపొందించుకోవాలి.
4. పరీక్షలను మరింత సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి.
* నిజమైన విజ్ఞానశాస్త్ర విద్య అంటే పిల్లవాడికి తన జీవితం గురించి, శాస్త్రీయంగా నిజానిజాలు చెప్పడమే. సైన్స్ పాఠ్యప్రణాళికలో ప్రధానమైన అంశం ఇదే.
* విషయ ప్రణాళిక (Syllabus) అనేది ఆయా తరగతుల్లో బోధించాల్సిన విషయాన్ని, పరిధిని తెలియజేస్తుంది.
        
* విషయ ప్రణాళిక అంశాల విస్తృతిని, పరిమితిని తెలుపుతుంది. 
* విషయ ప్రణాళిక ఆ తరగతి విద్యార్థుల మానసికస్థాయి, విషయజ్ఞానం, దశలపై ఆధారపడి ఉంటుంది.
* జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం - 2005 ప్రకారం విషయ ప్రణాళికను ఎలిమెంటరీ దశ (I - VIII తరగతులు), సెకండరీ దశ (IX - X తరగతులు), హయ్యర్ సెకండరీ దశ (XI - XII తరగతులు) లకు తయారు చేశారు.
* పరిసరాల పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను I, II తరగతుల్లో భాష, గణిత పాఠ్య పుస్తకాలకు సంబంధించిన విషయ ప్రణాళికల్లోనే అనుసంధానించారు.
* III, IV,V తరగతులకు సంబంధించి సైన్స్, సామాజిక అంశాలు (సాంఘికం) రెండింటినీ కలిపి ''పరిసరాల విజ్ఞానం" అనే పేరు పెట్టారు. 
* VI నుంచి VII తరగతుల వరకు సామాన్యశాస్త్రం (Science) పేరిట పాఠ్యపుస్తకాలుంటాయి.
* VIII, IX, X తరగతులకు భౌతికరసాయన శాస్త్రం, జీవశాస్త్రం పుస్తకాలుంటాయి.

పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు 

1. విద్యార్ధి కేంద్రీకృత సూత్రం          
2. కృత్య కేంద్రీకృత సూత్రం
3. జీవిత కేంద్రీకృత సూత్రం           
4. సమాజ కేంద్రీకృత సూత్రం
5. సమైక్యతా సూత్రం                       
6. పరిరక్షణ సూత్రం
7. సృజనాత్మక సూత్రం                   
8. దూరదృష్టి సూత్రం
9. నమ్యత, వైవిధ్యతా సూత్రం (మార్పులకు అనువుగా ఉండే సూత్రం)  
10. అనుభవ సామస్త్య సూత్రం       
11. విరామ సమయ సద్వినియోగ సూత్రం

పాఠ్య ప్రణాళికాభివృద్ధిని, మార్పును ప్రభావితం చేసే అంశాలు 

1. విద్యా తత్వశాస్త్రం                           
2. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం
3. విద్యా సామాజిక ఆధారాలు               
4. జాతీయ లక్ష్యాలు, అవసరాలు
5. సాంస్కృతిక అంశాలు
6. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి    
7. ఆర్థిక మార్పులు
8. మత సిద్ధాంతాలు                             
9. రాజకీయ ఆదర్శాలు
10. ఆధునికీకరణ ఆవశ్యకత

సెకండరీ విద్యా కమిషన్ (1952) దృష్టిలో పాఠ్య ప్రణాళిక అనేది...

1. అనుభవాల సమగ్రరూపం
2. భిన్నత్వం, మార్పులకు అనుగుణం
3. సామాజిక జీవనంతో సంబంధం
4. విరామసమయ వినియోగానికి శిక్షణ
5. సమైక్యత, సహసంబంధం

పాఠ్య ప్రణాళికపై కొఠారీ కమిషన్ సూచనలు 

1. పాఠశాలల్లో విద్యా ప్రణాళిక విస్తృత పరిధిలో ఉండాలని పేర్కొన్నారు.
2. పరిశోధనల ఆధారంగా పాఠ్య ప్రణాళికలో తరచూ మార్పులుండాలి.
3. పాఠ్య ప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలి.
4. కొత్త పాఠ్యప్రణాళికను రూపొందించడంలో, విద్యార్థుల అవసరాలకు తగినట్లు రూపొందించేలా ప్రయత్నించడంలో పాఠశాలలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండాలి.
5. వివిధ విద్యా విభాగాలు, శాఖలు జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగా పాఠశాల పాఠ్య ప్రణాళికను రూపొందించాలి.

జాతీయ విద్యా విధానం - 1986 ప్రకారం... 
 

* జాతీయ సమగ్ర పాఠ్య ప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి శాస్త్ర పాఠ్య ప్రణాళికలకు సంబంధించిన అంశాలు: 1. పర్యావరణ పరిరక్షణ 2. పరిమిత కుటుంబ భావన 3. శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం
* సైన్స్ పాఠ్య ప్రణాళిక ప్రాథమిక స్థాయిలో మన శరీరం - ఆరోగ్యం - పరిశుభ్రత, కుటుంబం, గాలి, నీరు, మన నివాసం, మన ఆహారం, మొక్కలు, జంతువులు, మన భూమి లాంటి పాఠ్యాంశాలను సర్పిలాకార విధానంలో (Spiral Approach) రూపొందించారు.
* VI - X వరకు ఉన్న విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళికను ఏకకేంద్ర పద్ధతిలో అమర్చారు.
* సామాన్యశాస్త్రం విషయప్రణాళికను VI నుంచి X తరగతులకు ఆయా తరగతుల స్థాయినిబట్టి ఏడు ప్రధానాంశాల్లో వివరించారు. 1. ఆహారం 2. పదార్థాలు 3. జీవప్రపంచం 4. వస్తువులు ఎలా పనిచేస్తాయి 5. కదిలే వస్తువులు 6. సహజ దృగ్విషయాలు 7. సహజ వనరులు.

సైన్స్ సహపాఠ్య కార్యక్రమాలు 

1. సైన్స్ కార్నర్‌ల ఏర్పాటు                      2. సైన్స్ కిట్‌ల తయారీ
3. ప్రయోగశాలల ఏర్పాటు                       4. సైన్స్ ప్రదర్శనలు
5. సైన్స్ సెమినార్ నిర్వహించడం           6. సైన్స్ డ్రామాల్లో పాల్గొనడం
7. కళావిద్యను ప్రోత్సహించడం (చిత్రలేఖనం, శాస్త్రీయ భావనల నృత్యాలు, తోలుబొమ్మలు, మృణ్మయ కళ, దృశ్యకళ, హస్తకళలు)
8. ఆరోగ్య, వ్యాయామ విద్యకు సంబంధించిన కృత్యాలు
9. పని విద్య ద్వారా విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం
10. క్షేత్రపర్యటనలు, విజ్ఞాన విహారయాత్రలు    
11. పర్యావరణ విద్యాకార్యక్రమాలు
* పరిసరాల విజ్ఞానం అనేది మూడు ప్రధానాంశాలను కలిగి ఉంటుంది.
1. పరిసరాల గురించి అభ్యసించడం
2. పరిసరాల ద్వారా అభ్యసనం
3. పరిసరాల నుంచి అభ్యసనం

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌