• facebook
  • whatsapp
  • telegram

జీవరాశుల వర్గీకరణ

1. కొన్ని నియమాల ఆధారంగా జీవులను వేర్వేరు వర్గాలుగా విభజించే విధానం ఏ శాస్త్ర పరిధిలోకి వస్తుంది?
జవాబు:  వర్గీకరణ శాస్త్రం

 

2. జీవరాశులను గుర్తించి, వర్గీకరించడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తి -
జవాబు:  అరిస్టాటిల్

 

3. వర్గీకరణలో ప్రాథమిక/మూల ప్రమాణం -
జవాబు:  జాతి

 

4. 'జాతులు' అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:  జాన్‌రే

 

5. జాతిని రెండు పేర్లతో పిలిచే 'ద్వినామీకరణ' విధానాన్ని మొదట ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:  గాస్పార్డ్ బాహిన్

 

6. 'లిన్నెయస్' వర్గీకరణలో భాగంగా జంతువుల మీద రాసిన గ్రంథం?
జవాబు:  సిస్టమా నాచురె

 

7. 'వర్గీకరణ' అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిందెవరు?
జవాబు:  ఎ.పి.డి.కండోల్

 

8. దగ్గరి పోలికలు ఉండి, ఒకదాంతో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరిపే జీవరాశుల సమూహాన్ని ఏమంటారు?
జవాబు:  జాతి 

 

9. 'వర్గీకరణ శాస్త్ర పితామహుడు' ఎవరు?
జవాబు:  లిన్నెయస్ 

 

10. చింతచెట్టు శాస్త్రీయనామం - టామరిండస్ ఇండికా L. ఇందులో 'L' అనే అక్షరం దేన్ని సూచిస్తుంది?
జవాబు:  ఆ చెట్టుకు శాస్త్రీయ నామం పెట్టింది లిన్నెయస్

 

11. భారతదేశంలో అనుసరిస్తున్న మొక్కల వర్గీకరణ విధానం?
జవాబు:  బెంథామ్, హుకర్ విధానం

 

12. 'అతి పురాతనమైన జీవులు' ఉన్న రాజ్యమేది?
జవాబు:  మొనీరా

 

13. 'నాస్టాక్, అనబీనా' లాంటి జీవులు ఏ రాజ్యంలో ఉంటాయి?
జవాబు:  మొనీరా 

 

14. 'సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లు' అని వేటిని అంటారు?
జవాబు:  డయాటమ్స్

 

15. 'భూమిని శుభ్రపరిచే తోటీలు' ఏవి?
జవాబు:  శిలీంద్రాలు

 

16. 'ట్రాకియోఫైటా' వర్గంలో అతిప్రాథమికాలు -
జవాబు:  ఫెర్న్‌లు

 

17. 'మూన్‌జెల్లీ'లు ఏ వర్గానికి చెందిన జీవులు?
జవాబు:  టీనోఫోరా

 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌