• facebook
  • whatsapp
  • telegram

జంతు ప్రపంచం - మానవునిలో ప్రత్యుత్పత్తి

    ఒకజీవి తనలాంటి పోలికలు ఉన్న మరొక జీవిని ఉత్పత్తి చేయగల సామార్థ్యాన్ని ప్రత్యుత్పత్తి అంటారు.
ప్రత్యుత్పత్తి 2 రకాలు
    అలైంగిక
    లైంగిక
* అలైంగిక ప్రత్యుత్పత్తి కేవలం మొక్కలు, నిమ్న స్థాయి జీవుల్లో మాత్రమే జరుగుతుంది.
లైంగిక ప్రత్యుత్పత్తి ప్రధానంగా జంతువుల్లో, మొక్కల్లో జరుగుతుంది.
* సంయోగ బీజాల కలయిక ఫలితంగా కొత్తజీవి ఏర్పడటాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. సంయోగ బీజాల కలయిక జీవి బయట జరిగితే దాన్ని 'బాహ్య ఫలదీకరణం' అని, (ఉదా: చేప, కప్ప, వానపాము) జీవి లోపల జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు.
ఉదా: (సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, కీటకాలు.

 

మానవునిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ

పురుషప్రత్యుత్పత్తి వ్యవస్థ:
* ఒక జత ముష్కాలు, అనుబంధ గ్రంథులు, నాళాల వ్యవస్థ ఉంటాయి.
* రెండు ముష్కాలు బాహ్యంగా ఉండే సంచిలాంటి ముష్కగోణిలో ఉంటాయి. ప్రతి ముష్కంలో లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలోను బాగా మెలి తిరిగిన చిన్నచిన్న నాళికలు ఉంటాయి. వీటిని శుక్రోత్పాదకనాళికలు అంటారు. ఇవి శుక్రకణాలును ఉత్పత్తి చేస్తాయి.
* శుక్రనాళికలు శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రకణాలను సేకరిస్తాయి. శుక్రనాళికలన్నీ కలిసి ఎపిడిడిమిస్ గా ఏర్పడతాయి. ఇక్కడ శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉంటాయి.
* ఎపిడిడిమిస్ నుంచి శుక్రనాళం ద్వారా ప్రసేకంలోనికి, అక్కడి నుంచి శరీరం వెలుపలకు శుక్రకణాలు వెలువడుతాయి.
* శుక్రనాళాల ద్వారా శుక్రకణాలు ప్రయాణించేటప్పుడు అనుబంధ గ్రంథులు (1 పౌరుషగ్రంథి, 2 కౌపర్‌గ్రంథులు) శుక్రకణాలపైకి జిగురు లాంటి ద్రవాన్ని స్రవిస్తాయి. దీన్ని 'శుక్రం' అంటారు.
* శుక్రకణాలకు పోషక పదార్థాలను అందించడానికి, శుక్రకణాల కదలికకు శుక్రం సహాయపడుతుంది.
* పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి 13, 14, సంవత్సరాల్లో ప్రారంభమై జీవితంలో చాలకాలం పాటు కొనసాగుతుంది. అయితే వయసు వచ్చే కొద్దీ వీటి సంఖ్య తగ్గుతుంది. శుక్రకణాల జీవితకాలం 24 - 72 గంటలు.
* టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ వల్ల పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి
* శుక్రకణంలో ప్రధానంగా తల, మెడ, మధ్యభాగం, తోక ఉంటాయి.
* శుక్రకణాన్ని అండంతో కలిపే శుక్రకణంలోని కారకం - ఏక్రోసోమ్.
* శుక్రకణానికి కావల్సిన శక్తిని అందించే భాగం - మధ్యభాగం.
* శుక్రకణం ఈదుటలో సహాయపడే భాగం - తోక.
* పిల్లలు పుట్టకుండా పురుషులకు చేసే ఆపరేషన్ పేరు - వాసెక్టమీ.

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
     అండాలను ఉత్పత్తి చేసే రెండు స్త్రీ బీజకోశాలు స్త్రీ ఉదరకుహరంలో ఉంటాయి. స్త్రీ బీజకోశాల్లో ఉన్న పుటికలను గ్రాఫియన్ పుటికలు అంటారు. ప్రతి పుటికలోను ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వం చెందినప్పుడు పుటిక పగిలి అండం విడుదలవుతుంది. దీన్ని అండోత్సర్గం అంటారు.
* అండాలు వెడల్పాటి గరాటు లాంటి కుల్యాముఖం ద్వారా స్త్రీ బీజవాహికలోకి ప్రవేశిస్తాయి. పగిలిన పుటికను కార్పస్‌లూటియం అంటారు.
* అండం జీవితకాలం 24 గంటలు. స్త్రీలలో ఒక్కోసారి ఒక్క అండం మాత్రమే విడుదల అవుతుంది.
* అండం - శుక్రకణం 'స్త్రీ బీజవాహిక'లో ఫలదీకరణం చెందుతుంది. సంయుక్త బీజం తర్వాత గర్భాశయంలోకి చేరుతుంది. దీన్ని పిండ ప్రతిస్థాపన అంటారు.
* ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం ప్రవేశించడానికి ముందుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది.
* పెరుగుతున్న పిండం రెండు పొరలను ఏర్పర్చుకుంటుంది.

పిండపొరలు

పరాయువు
* ఇది పిండాన్ని ఆవరించి ఉన్న బాహ్యత్వచం
* ఇది పిండానికి పోషక పదార్థాలను అందచేయడంలోను, పిండం నుంచి విసర్జన పదార్థాలను తీసివేయడంలోను సహాయపడుతుంది.

ఉల్బము
* ఇది పిండం చుట్టూ ఉండే లోపలి భాగం.
* ఉల్బం, పిండానికి మధ్య ఉండే ప్రదేశం ఉల్బకద్రవంతో నిండి ఉంటుంది.
* ఉల్బం, ఉల్బకద్రవం యాంత్రిక అఘాతాల నుంచి పిండానికి రక్షణ కల్పిస్తుంది.

జరాయువు ఏర్పడుట
* పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువును ఏర్పరుస్తాయి.
* ఇది గర్భధారణ జరిగిన 12 వారాలకు ఏర్పడుతుంది.
* తల్లి, బిడ్డ ఇద్దరి రక్తప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరుచేయబడి ఉండి O2, CO2, పోషకాలు, వ్యర్థపదార్థాలు విసరణ పద్ధతి ద్వారా రవాణా జరుగుతుంది.
* గర్భధారణ జరిగాక 3 నెలలు నుంచి పిండాన్ని 'భ్రూణం' అంటారు. దీనిలో ముఖ్యమైన భాగాలు అన్నీ ఏర్పడతాయి.
లింగ నిర్ధారణ '6'వ వారంలో తెలుసుకోవచ్చు.
* పిండంలో హృదయస్పందన 21వ రోజు నుంచి ప్రారంభమవుతుంది.

నాభి రజ్జువు ఏర్పడుట
* పిండ ఆహారనాళం నుంచి ఉద్భవించిన ఎల్లంటోయిస్ త్వచం, పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తుంది. ఈ నాళాన్నే నాభి రజ్జువు అంటారు.
* ఇది రక్త నాళాలను కలిగి ఉండి తల్లి నుంచి బిడ్డకు పోషక పదార్థాలను అందజేస్తుంది.

గర్భావది కాలం
* గర్భదారణ జరిగినప్పటి నుంచి శిశుజననం వరకు ఉన్న మధ్య కాలాన్ని గర్భావధికాలం అంటారు.


Note: టెస్ట్‌ట్యూబ్ బేబి విధానం సృష్టికర్త - పాట్రిక్‌స్టెప్టో
* ఇతను జులై 5, 1996 లో ఇయాన్ విల్మట్ క్లోనింగ్ ద్వారా 'డాలీ' అనే గొర్రెపిల్లను సృష్టించారు.
* స్త్రీలలో పిల్లలు పుట్టకుండా పాలోపియన్ నాళాలను లేదా స్త్రీ బీజవాహికలను ముడిపెట్టడాన్ని ట్యుబెక్టమి అంటారు.
* శిశుజననం తర్వాత మొదటగా స్థనగ్రంథులు స్రవించే శోషరసాన్ని పోలిన ద్రవం - ముర్రుపాలు / ప్రథమస్తన్యం. నవజాత శిశువులో వ్యాధినిరోధకతను పెంచుతుంది.
* రెండు ప్రత్యుత్పత్తి అవయవాలూ ఒకే జీవిలో ఉండటాన్ని ఉభయ లైంగికత అంటారు.
ఉదా: వానపాము.
* బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించే లైంగిక వ్యాధులు - గనేరియా, సిపిలిస్.
* వైరస్‌ల ద్వారా సంక్రమించే లైంగిక వ్యాధులు - హెర్పిస్, ఎయిడ్స్.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌