• facebook
  • whatsapp
  • telegram

వైయక్తిక భేదాలు - ప్రజ్ఞ

పార్ట్ - 1

1. దీక్షిత అనే విద్యార్థిని సమస్యలను చక్కగా పరిష్కరించగలదు. సుదీప్తి తన వద్ద ఉన్న క్రీడా పరికరాలను చక్కగా ఉపయోగించగలదు. అయితే వీరిద్దరి ప్రజ్ఞలు వరుసగా...
జ: అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ

 

2. కిందివాటిలో వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కానిది గుర్తించండి.
    1) సాహితికి ఆంగ్లం కంటే గణితంపై ఆసక్తి ఎక్కువ.
    2) శృతి తన వయసువారితో చూస్తే ప్రజ్ఞాశాలి.
    3) జ్యోత్స్న బాగా చదవగలదు. బాగా ఆటలు కూడా ఆడగలదు.
    4) గీత పాటలు బాగా పాడగలదు, డ్యాన్స్ కూడా బాగా చేయగలదు.
జ: 2 (శృతి తన వయసువారితో చూస్తే ప్రజ్ఞాశాలి.)

 

3. సుధీర్ అనే విద్యార్థి ఆటలపై ఆసక్తి చూపుతున్నాడు. సంగీతం అంటే కూడా ఇష్టపడుతున్నాడు అయితే ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి ఈ విద్యార్థిలో ఆసక్తితోపాటు ముఖ్యంగా ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి?
జ: సహజ సామర్థ్యం

4. కిందివాటిలో వ్యక్తంతర వైయక్తిక భేదాన్ని గుర్తించండి.
    1) లోహిత లెక్కలు బాగా చేయగలదు కానీ చదరంగం అంటే ఆసక్తి చూపుతుంది.
    2) హిమవర్షిణి బాగా చదవగలదు కానీ ఆటలంటే ఆసక్తి చూపదు.
    3) లోహిత్ పాఠశాలలోని విద్యార్థుల్లోకెల్లా తెలివైనవాడు.
    4) పార్థివ్‌కు గణిత సామర్థ్యం కంటే భాషా సామర్థ్యం అధికం.
జ: 3 (లోహిత్ పాఠశాలలోని విద్యార్థుల్లోకెల్లా తెలివైనవాడు.)

 

5. డాన్స్ నేర్చుకోవడానికి ఒకే సంస్థలో శిక్షణ పొందుతున్న అనేకమంది పిల్లల్లో కొందరు బాగా రాణిస్తున్నారు. అయితే సుశాంత్ ఎంత చక్కగా శిక్షణ పొంది, సాధన చేస్తున్నా ఆశించిన స్థాయిలో డ్యాన్స్ చేయలేకవడానికి కారణం?
జ: సహజ సామర్థ్యం లేకపోవడం

 

6. సునీత తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని అంతటినీ గ్రహించి తిరిగి తన మనసులో సంపూర్ణంగా ఊహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటే గార్డ్‌నర్ బహుళకారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఈమె కలిగి ఉన్న సామర్థ్యం ఏది?
జ: ప్రాదేశిక ప్రజ్ఞ

 

7. 'ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్' అనే గ్రంథం ఎవరికి సంబంధించింది?
జ: పియర్సన్

 

8. దర్పిత ఎల్లప్పుడూ టీవీలో వచ్చే కార్టూన్ సీరియల్స్‌ను ఆసక్తితో చూస్తుంది. హాసిని ఆంగ్లాన్ని ఎల్లప్పుడూ ధనాత్మక దృష్టితో చూస్తుంది. అయితే వీరిలో ఉన్న మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా...
జ: అభిరుచి, వైఖరి

పార్ట్ - 2

1. కిందివాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) జ్ఞానం, స్మృతి, నైపుణ్యం, ప్రావీణ్యం అనేవి ప్రజ్ఞ కావు
2) ప్రజ్ఞ వల్ల జ్ఞానం పొందుతాం
3) వ్యక్తిలోని ప్రజ్ఞపై మిగిలిన కారకాల కంటే అనువంశికత అధిక ప్రభావం చూపుతుంది
4) జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు
జ‌: 4) జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు

 

2. వ్యక్తిలో కలిగే మూర్తిమత్వ ఆటంకాలను అధిగమించి, అవసరాలు తీర్చడానికి జీవి చూపే కృత్యాల్లో వైవిధ్యమైన ఫలితం
జ‌: సర్దుబాటు

 

3. కిందివాటిలో అభిరుచులకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది?
1) అభ్యసనం, అనుభవాల వల్ల అభిరుచులు ఏర్పడతాయి
2) పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తాదాత్మీకరణం చేసుకుంటారో అవే అభిరుచులు
3) అభిరుచుల వికాసానికి, సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ తోడ్పడతాయి                    
4) పైవన్నీ
జ‌: 4) పైవన్నీ

 

4. కిందివాటిలో అభిరుచిని కొలిచే మాపని ఏది?
1) స్ట్రాంగ్ ఔద్యోగిక మాపని    2) బొగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్    
3) లైకర్ట్ వైఖరి మాపని          4) గట్‌మన్ స్కేల్
జ‌: 1) స్ట్రాంగ్ ఔద్యోగిక మాపని  

 

5. ఒక వ్యక్తి శారీరక వయసు అతడి మానసిక వయసుకు సమానమైతే ఆ వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి ఎంత?
జ‌: 100

 

6. Abilities of Man గ్రంథ రచయిత ఎవరు?
జ‌: స్పియర్‌మన్

 

7. RSPM Testకు సంబంధించి సరైంది ఏది?
     1) అశాబ్దిక పరీక్ష            2) వేగ పరీక్ష             3) వ్యక్తిగత పరీక్ష       4) నిష్పాదన పరీక్ష
జ‌: 1)అశాబ్దిక పరీక్ష

 

8. కిందివాటిలో అభిరుచులకు సంబంధించి సరికాని వాక్యమేది?
1) ఇవి పుట్టుకతో వస్తాయి                 2) ఇవి పరిసరాలను బట్టి మారతాయి
3) ఇవి జీవితాంతం ఒకే రకంగా ఉంటాయి        4) పైవన్నీ
జ‌: 1) ఇవి పుట్టుకతో వస్తాయి   

 

9. కిందివాటిలో సరైన జత ఏది?
1) ఆర్మీ ఆల్ఫా పరీక్ష - అశాబ్దిక పరీక్ష      2) ఆర్మీ బీటా పరీక్ష - శాబ్దిక పరీక్ష
3) బినే సైమన్ ప్రజ్ఞామాపని - శాబ్దిక పరీక్ష     4) RSPM Test - శాబ్దిక పరీక్ష
జ‌: 3) బినే సైమన్ ప్రజ్ఞామాపని - శాబ్దిక పరీక్ష 

 

10. చలనచిత్ర నటులు, రాజకీయ నాయకుల్లో అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది?
జ‌: సాంఘిక ప్రజ్ఞ

 

11. DATలో మాపనం చేయని అంశం ఏది?
జ‌: స్మృతి

 

12. రాజు శారీరక వయసు 48 నెలలు, అతడి మానసిక వయసు 60 నెలలు. అయితే అతడి ప్రజ్ఞాలబ్ధి ఎంత?
జ‌: 125

 

13. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) ప్రజ్ఞను పరిసర కారకాలతో పూర్తిగా అభివృద్ధి చెందించుకోవచ్చు
2) ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్త అంశం
3) వైఖరులు వ్యక్తిగత భేదాలు, లైంగిక భేదాలను కలిగి ఉంటాయి
4) అభిరుచులు పుట్టుకతో రావు
జ‌: 1) ప్రజ్ఞను పరిసర కారకాలతో పూర్తిగా అభివృద్ధి చెందించుకోవచ్చు

 

14. "An Inquiry Into Human Faculty and Its Development" గ్రంథకర్త ఎవరు?
జ‌: గాల్టన్

 

15. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్త భావన         2) ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి
3) ప్రజ్ఞా జ్ఞానాలతో పుట్టుకతో వచ్చేది ప్రజ్ఞ            4) ప్రజ్ఞ ఉన్నవారిలో సృజనాత్మకత ఉంటుంది.
జ‌: 4) ప్రజ్ఞ ఉన్నవారిలో సృజనాత్మకత ఉంటుంది

 

16. కిందివాటిలో వైయక్తిక భేదాలకు సంబంధించి సరికాని అంశం ఏది?
1) ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి             2) వ్యక్తుల భౌతిక అంశాల్లో కనిపిస్తాయి
3) సమరూప కవలల్లో ఉండవు             4) వ్యక్తుల అన్ని రంగాల్లో కనిపిస్తాయి
జ‌: 3) సమరూప కవలల్లో ఉండవు   

 

17. కింది అంశాల్లో వ్యక్త్యంతర భేదం ఏది?
1) రాజు పాటలు పాడటంలో శ్రద్ధ చూపుతాడు కానీ సరిగ్గా చదవడు
2) గీతకు వంటలంటే ఇష్టం కానీ ముగ్గులు సరిగ్గా వేయదు
3) రాజు తరగతిలో అందరికంటే బాగా చదువుతాడు
4) పైవన్నీ
జ‌: 3) రాజు తరగతిలో అందరికంటే బాగా చదువుతాడు

 

18. ప్రజ్ఞ ఉన్నవారిలో దాదాపుగా ఎలాంటి ఆలోచన ఉంటుంది?
జ‌: సమైక్య ఆలోచన

 

19. 'అమూర్త ఆలోచనా చింతనమే ప్రజ్ఞ' అని నిర్వచించినవారు
జ‌: టెర్మన్

 

20. 'ఆటల్లో ప్రతిభను చూపే విద్యార్థి ఇతర అన్ని రంగాల్లో కూడా అంతే ప్రతిభను చూపుతాడు' అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: బినే

 

21. కిందివాటిలో వైఖరులకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) ఇవి పుట్టుకతోనే ఏర్పడతాయి                                              
2) ఇవి తరచుగా మారతాయి
3) విద్యార్థుల విజయాలు వారి వైఖరులపై ఆధారపడి ఉంటాయి  
4) పైవన్నీ
జ‌: 1) ఇవి పుట్టుకతోనే ఏర్పడతాయి

 

22. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) జ్ఞానం, స్మృతి, నైపుణ్యం, ప్రావీణ్యం అనేవి ప్రజ్ఞ కావు         
2) ప్రజ్ఞ వల్ల జ్ఞానం పొందగలం
3) ప్రజ్ఞపై అనువంశికత ప్రభావాన్ని చూపుతుంది                   
4) జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు
జ‌: 4) జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు

 

23. ఉపాధ్యాయుడు విద్యార్థుల్లోని సామర్థ్యాలను బట్టి 'ఇంటి పని' కల్పించడం అనేది దేన్ని సూచిస్తుంది?
జ‌: వైయక్తిక భేదాలు

 

24. చంద్రశేఖర్ శారీరక వయసు 108 నెలలు. ఈ విద్యార్థి 8 సంవత్సరాల విద్యార్థులకు నిర్దేశించిన ప్రజ్ఞాంశాలను పూర్తిచేశాడు. అయితే ఇతడి ప్రజ్ఞా లబ్ధి (ఐక్యూ) ఎంత?
జ‌: 88

 

25. 'On Memory' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: ఎబ్బింగాస్

 

26. గతంలో జరిగిన విషయాన్ని అవసరమైనప్పుడు కొంత ప్రయత్నం ద్వారా గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు?
జ‌: పునఃస్మరణ

 

27. స్మృతిని పెంపొందించే మార్గాల్లో ఉపయుక్తమైంది ఏది?
జ‌: అభిరుచి, అవధానం

 

28. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులతో ప్రతిరోజు ఎక్కాలు, పద్యాలు చదివించడం అనేది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు?
జ‌: బట్టీ స్మృతి

 

29. 'హామిల్టన్‌'కు సంబంధించిన విషయం
        1) విలంబిత ప్రతిచర్యా పరికరం        2) టాచిస్టాస్కోపు        
        3) సైలస్                           4) పజిల్ బాక్స్
జ‌: 2) టాచిస్టాస్కోపు

 

30. ROSE - NXZ, DIAMOND - YMP, STAR - ZQR దీన్ని గుర్తించండి.
        1) కథనాలు                 2) ఆకృతుల పునరుత్పాదనం
        3) ద్వంద్వ సంసర్గాలు            4) స్మృతి విస్మృతి
జ‌: 2) ఆకృతుల పునరుత్పాదనం

 

31. ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆక్సిజన్ వాయువును ప్రయోగపూర్వకంగా తయారుచేసి దాన్ని అలాగే గుర్తుంచుకుంటే ఇది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు?

జ‌: క్రియాత్మక స్మృతి
 

32. రాజు మొదట రామాయణంలోని శ్లోకాలను చదివాడు. కొంతకాలానికి మహాభారతంలోని శ్లోకాలు చదివాడు. సంవత్సరం తర్వాత ఆ విద్యార్థికి రామాయణంలోని శ్లోకాలు పూర్తిగా గుర్తుకురాకపోతే ఇతడిలో జరిగిన అవరోధం ఏది?
జ‌: తిరోగమన అవరోధం

 

33. విద్యార్థికి హైదరాబాద్ అనగానే చార్మినార్, ఆగ్రా అనగానే తాజ్‌మహల్ గుర్తుకురావడంలో నిక్షిప్తమైన స్మృతి ఏది?
జ‌: సంసర్గ స్మృతి

 

34. మొదట విద్యార్థి తెలుగు నెలలను చదివి కొద్దిరోజులకు ఆంగ్ల నెలలను కంఠస్థం చేశాడు. కానీ పరీక్షల్లో అతడికి ఎంత ప్రయత్నించినా ఆంగ్ల నెలలు గుర్తుకు రాకపోతే అతడిలో జరిగిన అవరోధం ఏమిటి?
జ‌: పురోగమన అవరోధం

 

35. మనోజ్ మొదటిసారి విజయవాడకు వెళ్లి అక్కడ కృష్ణా నదిలో స్నానం చేస్తూ తల్లిదండ్రులతో 'నేను ఈ నదిని ఇంతకుముందే చూశాను' అని పదే పదే చెబుతున్నాడు. ఈ విషయాన్ని ఇలా చెప్పవచ్చు?
జ‌: డెజావూ

 

36. కిందివాటిలో స్మృతిని తగ్గించే అంశం
    1) అధిక ప్రేరణగా ఉండటం       2) న్యూమోనిక్          
    3) అధిక కోపం           4) అతి అభ్యసనం
జ‌: 3) అధిక కోపం

 

37. 'పొదుపు పద్ధతి'ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: ఎబ్బింగ్‌హాస్

 

38. కిందివాటిలో సరైన వాక్యమేది?
1) పూర్తిచేసిన పనుల కంటే మధ్యలో ఆపిన పనులే ఎక్కువ కాలం గుర్తుండటం - డెజావూ
2) స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం - కన్సాలిడేషన్
3) స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైనవి గుర్తులేకపోవడం - వేర్పాటు
4) పైవన్నీ
జ‌: 2) స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం - కన్సాలిడేషన్

 

39. 'ప్రజ్ఞా ఉద్యమ పితామహుడు' అని ఎవరిని పేర్కొంటారు?
జ‌: బినే

 

40. అభ్యసన స్మృతి విషయంలో కథనాలు, ఆకృతుల పునరుత్పాదనంపై ప్రయోగాలు చేసినవారు?
జ‌: బార్ట్‌లెట్

 

41. ఒక వ్యక్తిలో విద్యా విషయక సహజ సామర్థ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఏ సహజ సామర్థ్య పరీక్షను ఉపయోగిస్తారు?
జ‌: మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్

 

42. కింద పేర్కొన్న ప్రజ్ఞా పరీక్షల్లో అసత్యమైన జత ఏది?
1) ఆర్మీ ఆల్ఫా పరీక్ష - సామూహిక పరీక్ష      2) డ్రా ఎ మాన్ టెస్ట్ - అశాబ్దిక పరీక్ష
3) ఆర్మీ బీటా పరీక్ష - శాబ్దిక పరీక్ష        4) రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష - శక్తి పరీక్ష
జ‌: డ్రా ఎ మాన్ టెస్ట్ - అశాబ్దిక పరీక్ష

పార్ట్ - 3

1. మహర్షి ప్రజ్ఞా లబ్ధి 115 అయితే అతడు ఏ వర్గానికి చెందుతాడు?
జ: సగటు కంటే ఎక్కువ

 

2. కార్తీక్, శ్రీరామ్, గౌతమ్ అనే విద్యార్థులు కంప్యూటర్‌ను అభ్యసిస్తున్నారు. ఒకరు కంప్యూటర్ మెలకువలు తెలుసుకుని ముందుకు కొనసాగుతుంటే... రెండో వ్యక్తి వెనకబడ్డాడు. అతడిలో ఏ సామర్థ్యం లోపించింది?
జ: సహజ సామర్థ్యం

 

3. రాజీవ్ అనే విద్యార్థి ఆటపాటలు, మార్కుల్లో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో నిలిచాడు. ఇది ఏ భేదాన్ని తెలియజేస్తుంది?
జ: వ్యక్తి అంతర్ భేదం

 

4. కిందివాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది
      1) ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. ప్రజ్ఞా పాటవాల్లో వ్యక్తిగత భేదాలుంటాయి.
      2) జాతి, మత, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు
      3) దీన్ని కొలవవచ్చు
      4) చనిపోయేంతవరకు ఉంటుంది
జ: 4(చనిపోయేంతవరకు ఉంటుంది)

 

5. వెయిన్ లియోన్ పెయిన్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
      1) ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాన్ని రాశారు.
      2) ఉద్వేగాత్మక ప్రజ్ఞపై పరిశోధన చేశారు.
      3) ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు.
      4) ఎమోషనల్ ఇంటెలిజెన్స్: వై ఇట్ కెన్ మేటర్ మోర్ దేన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రాశారు.
జ: 3(ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు.)

 

6. పదేళ్ల విద్యార్థి పదమూడేళ్ల బాలుడికి ఉండాల్సిన సామర్థ్యాన్ని చూపితే అతడి ప్రజ్ఞ ఎంత?
జ: 130

 

7. కిందివాటిలో శాబ్దిక పరీక్ష కానిది
      1) ఆర్మీ ఆల్ఫా పరీక్ష       2) ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష      
      3) వెష్లర్ పరీక్ష          4) ఆర్మీ బీటా పరీక్ష
జ: 4(ఆర్మీ బీటా పరీక్ష)

 

8. 16 ఏళ్ల విద్యార్థి ప్రజ్ఞా లబ్ధి 100 అయితే అతడి మానసిక వయసు ఎన్ని సంవత్సరాలు?
జ: 16

 

9. కిందివాటిలో సరికాని జత ఏది?
      1) బహుకారక సిద్ధాంతం - థార్న్‌డైక్            2) ఏకకారక సిద్ధాంతం - బినే
      3) సామూహిక కారక సిద్ధాంతం - స్పియర్‌మన్      4) స్వరూప నమూనా సిద్ధాంతం - గిల్‌ఫర్డ్
జ: 3(సామూహిక కారక సిద్ధాంతం - స్పియర్‌మన్)

 

10. జతపరచండి.
1) డిక్షనరీ ఆఫ్ సైకాలజీ    ఎ) ఎబ్బింగ్‌హాస్
2) ఆన్ మెమొరి    బి) చాప్లిన్
3) ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్    సి) జాన్ డ్యూయీ
4) డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్    డి) థార్న్‌డైక్
జ: 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

 

11. గణితంలో మంచి తెలివితేటలు కనబరిచిన ఒక వ్యక్తి సైన్సు, సోషల్, చిత్రకళ, సంగీతం .... ఇలా ఇతర రంగంల్లోనూ అంతే ప్రావీణ్యాన్ని చూపుతాడని గుర్తించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త-
జ: బినే

 

12. సహకార క్రీడలు ఆడుకునే దశ
జ: పూర్వ బాల్యదశ

 

13. ఒక విద్యార్థి దూది లేదా డస్టర్ నుంచి నమూనాలు తయారుచేసి ప్రదర్శిస్తాడు. అతడిలోని ప్రజ్ఞ ఏ రకానికి చెందింది?
జ: యాంత్రిక ప్రజ్ఞ

 

14. సోనీ అనే విద్యార్థిని విద్యా సాధనలో మంచి ప్రతిభను కనబరుస్తుంది. చిత్రలేఖనంలో కూడా ఎన్నో బహుమతులు పొందింది. ఆ బాలికలో ప్రజ్ఞతోపాటు ఉన్న మరో అంశమేది?
జ: సహజ సామర్థ్యం

 

15. అమల అనే అమ్మాయి శారీరక వయసు 6 సంవత్సరాలు. ఆమె 6, 7, 8 సంవత్సరాల పరీక్షలను పూర్తిగానూ, 9 సంవత్సరాల పరీక్షలను మూడింటిని, 10వ సంవత్సర పరీక్ష 1 పూర్తి చేసింది. 11వ సంవత్సరం పరీక్షలు ఏమీ పూర్తి చేయలేదు. అమల వాస్తవిక వయసు ఎంత?
జ: 6

 

16. రాము అనే విద్యార్థి శారీరక వయసు కంటే మానసిక వయసు ఎక్కువైతే ఆ విద్యార్థి ప్రజ్ఞా వర్గీకరణలో ఏ వర్గానికి చెందుతాడు?
జ: సగటు కంటే ఎక్కువ

 

17. సహజ సామర్థ్యాన్ని ఎలా గుర్తించవచ్చు?
జ: ఏదో ఒక ప్రత్యేక రంగంలో ప్రావీణ్యాన్ని ఆర్జించే అంతర్గత సామర్థ్యం

 

18. కిందివాటిలో ప్రజ్ఞా లబ్ధికి చెందని అంశం ఏది?
      1) ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా పెరుగుతుంది.
      2) ప్రజ్ఞాపరంగా వయోజనులను కూడా కచ్చితంగా మాపనం చేయలేం.
      3) అమూర్త, మూర్త ప్రజ్ఞలను మాపనం చేయవచ్చు.
      4) ప్రజ్ఞను సంఖ్యాపరంగా చూపినప్పుడు శూన్య స్థానం ఉండదు.
జ: 1(ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా పెరుగుతుంది.)

 

19. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
      1) ప్రజ్ఞ ఉన్న విద్యార్థిలో సృజనాత్మకత ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
      2) సృజనాత్మకత ఉన్న విద్యార్థిలో అంతర్గత ప్రజ్ఞ ఉంటుంది.
      3) సాధారణంగా ప్రజ్ఞను సంకుచిత భావనగా, సృజనాత్మకతను విస్తృత భావనగా చూడవచ్చు.
      4) పైవన్నీ సరైనవే
జ: 4(పైవన్నీ సరైనవే)

 

20. రాజేష్ శారీరక వయసు (CA) 72 నెలలు, మానసిక వయసు (MA) 84 నెలలైతే ఆ విద్యార్థి ప్రజ్ఞా లబ్ధి ఎంత?
జ: 116

 

21. రాజు తన ఇంటి నుంచి పాఠశాలకు ఒక దారిలోనే వెళ్లగలడు. కానీ శ్రావణి విభిన్న మార్గాల్లో ఎలాగైనా వెళ్లగలదు. అయితే వీరిలో ఉన్న ఆలోచన వరుసగా
జ: సమైక్య, విభిన్న ఆలోచన

 

22. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
      1) జ్ఞానం, స్మృతి, నైపుణ్యం, ప్రావీణ్యం అనేవి ప్రజ్ఞ కావు.
      2) ప్రజ్ఞ వల్ల జ్ఞానం పొందగలం.
      3) వ్యక్తిలో ప్రజ్ఞపై మిగిలిన కారకాల కంటే అనువంశికత అధిక ప్రభావం చూపుతుంది.
      4) జ్ఞానం ద్వారా ప్రజ్ఞ వ్యక్తమవుతుంది.
జ: 4(జ్ఞానం ద్వారా ప్రజ్ఞ వ్యక్తమవుతుంది.)

 

23. కిందివాటిలో అభిరుచి మాపని ఏది?
      1) స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని       2) బొగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేలు
      3) లైకర్ట్ వైఖరి మాపని             4) గట్‌మన్ స్కేలు
జ: 1(స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని)

 

24. ఒక వ్యక్తి శారీరక వయసు, అతడి మానసిక వయసుకు సమానమైతే అతడి ప్రజ్ఞా లబ్ధి ఎంత?
జ: 100

 

25. కిందివాటిలో అభిరుచులకు సంబంధించి సరికానిది?
  1) పుట్టుకతో వస్తాయి   2) పరిసరాలను బట్టి మారతాయి    3) జీవితాంతం ఒకేరకంగా ఉండవు   4) అన్నీ
జ: 1(పుట్టుకతో వస్తాయి)

 

26. కిందివాటిలో సరైన జత ఏది?
      1) ఆర్మీ ఆల్ఫా పరీక్ష - అశాబ్దిక       2) ఆర్మీ బీటా పరీక్ష - శాబ్దిక
      3) బినే సైమన్ పరీక్ష - ప్రజ్ఞా శాబ్దిక       4) ఆర్ఎస్‌పీఎమ్ పరీక్ష - శాబ్దిక
జ: 3(బినే సైమన్ పరీక్ష - ప్రజ్ఞా శాబ్దిక)

 

27. కిందివాటిలో సరికానిది ఏది?
      1) సమస్యా పరిష్కార ఆలోచనా విధానం - ప్రజ్ఞ      
      2) మరింత మెరుగైన ఉత్పన్నం - సృజనాత్మకత
      3) అభ్యసనా సామర్థ్యం - సహజ సామర్థ్యం          
      4) నిరంతర వికాసం - ప్రజ్ఞ
జ: 4(నిరంతర వికాసం - ప్రజ్ఞ)

 

28. రాధ మానసిక వయసు 10 సంవత్సరాల 4 నెలలు, శారీరక వయసు 8 సంవత్సరాల 4 నెలలు అయితే ఆమె ప్రజ్ఞా లబ్ధి ఎంత?
జ: 124

 

29. శృతి శారీరక, మానసిక వయసులు సమానమైతే ఆమె ప్రజ్ఞా లబ్ధి ఎంత?
జ: 100

 

30. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
      1) భాటియా ప్రజ్ఞా మాపని - సామూహిక నిష్పాదనా పరీక్ష
      2) ఆర్మీ బీటా పరీక్ష - సామూహిక శాబ్దిక పరీక్ష
      3) రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష - సామూహిక నిష్పాదనా పరీక్ష
      4) కల్చర్ ఫేర్ టెస్ట్ - అశాబ్దిక పరీక్ష
జ: 4(కల్చర్ ఫేర్ టెస్ట్ - అశాబ్దిక పరీక్ష)

 

31. అయస్కాంత ఆకర్షణ, వికర్షణల అవగాహనకు అవసరమైన ప్రజ్ఞ
జ: అమూర్త ప్రజ్ఞ

 

32. సైమన్ బినే ప్రజ్ఞా పరీక్షలో 8 సంవత్సరాల రాముకు పరీక్షలు ఇవ్వగా 6, 7 సంవత్సరాలకు ఇచ్చిన ప్రశ్నల్లో అన్నింటికీ జవాబులు రాశాడు. 8వ సంవత్సరం వారికి ఇచ్చే పరీక్షలో 4 అంశాలను పూర్తిచేశాడు. 9 సంవత్సరాల వారికి ఇచ్చిన పరీక్షను పూర్తి చేయలేకపోయాడు. అతడి మానసిక వయసు ఎన్ని నెలలు?
జ: 92

 

33. కిందివాటిలో సహజ సామర్థ్యానికి సంబంధించి సరైంది ఏది?
      1) శిక్షణ ద్వారా మెరుగుపడుతుంది       2) అనువంశికత, పరిసరాల వల్ల ఏర్పడుతుంది
      3) ప్రత్యేక అంశానికి చెందింది        4) అన్నీ
జ: 2(అనువంశికత, పరిసరాల వల్ల ఏర్పడుతుంది)

 

34. సహజ సామర్థ్యానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
      1) పరిపక్వ శక్మత నుంచి సామర్థ్యం రావడాన్ని సూచిస్తుంది.
      2) అపరిపక్వ శక్మత నుంచి పరిపక్వ శక్మత రావడాన్ని సూచిస్తుంది.
      3) భవిష్యత్ సాధన ఆధారంగా ప్రస్తుత నిష్పాదనను సూచిస్తుంది.
      4) ప్రస్తుత సాధన ఆధారంగా పూర్వ సాధనను కనుక్కుంటుంది.
జ: 2(అపరిపక్వ శక్మత నుంచి పరిపక్వ శక్మత రావడాన్ని సూచిస్తుంది.)

 

35. ఒకరికి క్రీడలంటే ఇష్టం, మరొకరికి సంగీతమంటే ఇష్టం. ఈ విధంగా వ్యక్తుల్లో ఒక్కో రకమైన ఆసక్తి ఉండటానికి కారణం ఏమిటి?
జ: వ్యక్తి అంతర్గత భేదాలు

 

36. 9 సంవత్సరాల పిల్లవాడు 9 సంవత్సరాల పరీక్షలను పూర్తిగానూ, 10వ సంవత్సరానివి 3, 11వ సంవత్సరానివి 2, 12వ సంవత్సరానివి 1 పూర్తి చేశాడు. 13వ సంవత్సరంలోనివి ఒకటి కూడా చేయలేకపోయాడు. ఆ విద్యార్థి అసలు వయసు ఎన్ని సంవత్సరాలు?
జ: 9

 

37. ఒక విద్యార్థికి గణితంలో 100, ఆంగ్లంలో 35, తెలుగులో 60, సాంఘికశాస్త్రంలో 83 మార్కులు వచ్చాయి. ఒక్కో సబ్జెక్టులో ఒక్కో రకంగా మార్కులు వచ్చాయి. దీనికి కారణం ఏమిటి?
జ: వ్యక్తి అంతర్గత భేదాలు

 

38. కిందివాటిలో అంతర వ్యక్తంతర భేదాన్ని సూచించేది?
      1) రాజు క్రికెట్‌తోపాటు కబడ్డీ కూడా ఆడతాడు.
      2) రాజు డాన్స్ చేస్తాడు కానీ పాటలు పాడలేడు.
      3) చదువులో రాజుది ఎప్పుడూ మొదటి ర్యాంకే.
      4) రాజు కబడ్డీ కంటే క్రికెట్‌లో ఎక్కువ ప్రతిభ చూపుతాడు.
జ: 3(చదువులో రాజుది ఎప్పుడూ మొదటి ర్యాంకే.)

 

39. ఉపాధ్యాయుడు ఇచ్చిన ఒక గణిత సమస్యకు 'హాసిని' ఒకే ఒక పరిష్కారాన్ని సూచించిగా, 'ఆదర్శ్' అనేక పరిష్కారాలు సూచించాడు. ఈ విద్యార్థుల్లోని మనో వైజ్ఞానిక అంశాలు వరుసగా
జ: ప్రజ్ఞ, సృజనాత్మకత

 

40. అభిరుచులు, వైఖరులకు సంబంధించి సరికాని వాక్యమేది?
      1) స్థిరంగా ఉండకుండా పరిస్థితికి అనుకూలంగా మారతాయి.
      2) ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వస్తాయి.
      3) వీటిపై పరిసర ప్రభావం ఉంటుంది.
      4) ఏదీకాదు
జ: 2(ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వస్తాయి.)

 

41. ప్రజ్ఞకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
      1) అమూర్త ఆలోచనా చింతనం
      2) నూతన పరిస్థితికి అనుకూలంగా నడుచుకోవడం
      3) అధిక సృజనాత్మకత ప్రదర్శించడం
      4) పైవన్నీ
జ: 3(అధిక సృజనాత్మకత ప్రదర్శించడం)

 

42. సచిన్ క్రికెట్‌లో చూపే ప్రతిభ, ఆసక్తిని చదువులో చూపలేకపోతున్నాడు. వైయక్తిక భేదాల పరంగా ఈ భావనను ఎలా పేర్కొంటారు?
జ: వ్యక్తంతర్గత భేదాలు

 

43. ప్రజ్ఞా మాపన పితామహుడు అని ఎవరిని అంటారు?
జ: బినే

 

44. ఒక వ్యక్తిలో విద్యావిషయక సహజసామర్థ్యాలు ఉన్నవీ లేనిదీ తెలుసుకోవడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తారు?
జ: మెట్రోపాలిటన్ రెడీనస్ టెస్ట్

 

45. కింద పేర్కొన్న ప్రజ్ఞా పరీక్షల్లో సరికాని జత ఏది?
      1) ఆర్మీ ఆల్ఫా పరీక్ష - సామూహిక పరీక్ష      
      2) డ్రా ఎ మ్యాన్ టెస్ట్ - అశాబ్దిక పరీక్ష
      3) ఆర్మీ బీటా పరీక్ష - శాబ్దిక పరీక్ష                
      4) రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష - శక్తి పరీక్ష
జ: 3(ఆర్మీ బీటా పరీక్ష - శాబ్దిక పరీక్ష)

 

46. 'ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్' గ్రంథ రచయిత ఎవరు?
జ: స్పియర్‌మన్

 

47. ఒక గ్రామంలోని 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను విడివిడిగా పరీక్షించదలచుకున్న ప్రశాంత్ అనే వ్యక్తికి ఉపయోగపడే పరీక్ష
జ: భాటియా ప్రజ్ఞా మాపని

 

48. ప్రజ్ఞా లబ్ధిని గణించడానికి సూత్రం
జ: MA/CA * 100

 

49. జె.ఎం.అహుజా దేనికి సంబంధించినవారు?
   1) ప్రజ్ఞా పరీక్ష    2) అభిరుచి పరీక్ష   3) సహజసామర్థ్య పరీక్ష   4) వైఖరి పరీక్ష
జ: 3(సహజసామర్థ్య పరీక్ష)

 

50. 'అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ' అని నిర్వచించినవారు
జ: డేర్‌బాన్

 

51. సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చెస్ బాగా ఆడలేడు. ఈ వైవిధ్యం దేనికి ఉదాహరణ?
జ: వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు

 

52. కింది పరీక్షల్లో ప్రజ్ఞను కచ్చితంగా మదింపు చేసేది
     1) సంస్కృతి రహిత పరీక్ష       2) సంస్కృతి న్యాయశీల పరీక్ష
     3) సాంస్కృతికంగా ప్రాధాన్యం      4) సంస్కృతి మాంద్యం పరీక్ష
జ: 1(సంస్కృతి రహిత పరీక్ష)

 

53. రాము చేతి రాత బాగుంటుంది. గణితంలో అతడి నిష్పాదన సగటుగా ఉంది. అతడి సహాధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతడి నిష్పాదన సగటుగా ఉంది. ఇది ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది?
జ: వ్యక్తంతర్గత, వ్యక్తంతర వైయక్తిక భేదం

 

54. డేనియల్ గోల్‌మన్ ప్రవేశపెట్టిన భావన
జ: ఉద్వేగాత్మక ప్రజ్ఞ

 

55. రెండు చేతులతో బొమ్మను పట్టుకునే వ్యక్తి క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోవడాన్ని ఏ వికాస సూత్రంగా చెప్పవచ్చు?
     1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు              2) వైయక్తిక భేదాలు
     3) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి కొనసాగుతుంది      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

56. కిందివాటిలో ప్రజ్ఞా లక్షణం
     1) జ్ఞానం      2) నైపుణ్యం      3) ప్రావీణ్యం      4) ఏదీకాదు
జ: 4(ఏదీకాదు)

 

57. ప్రజ్ఞతోపాటు అనుబంధంగా ఉండేది
జ: సహజసామర్థ్యం

 

58. ప్రజ్ఞా పరీక్షలో మాపనం చేసే కారకం
జ: సామాన్య కారకం

 

59. మొదటి ప్రజ్ఞా మాపనిని ఏ సంవత్సరంలో రూపొందించారు?
జ: 1916

 

60. కిందివాటిలో సరికానిది ఏది?
     1) జ్ఞానం, స్మృతి, నైపుణ్యం, ప్రావీణ్యం ప్రజ్ఞ కావు.
     2) ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది.
     3) జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పెంపొందించవచ్చు.
     4) ప్రజ్ఞను అనువంశికత ఎక్కువ ప్రభావం చేస్తుంది.
జ: 3(జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పెంపొందించవచ్చు.)

 

61. అమూర్త ప్రజ్ఞ అంటే
జ: అక్షరాలు, మాటలు, సంఖ్యలు, పదాలు కంటి ముందు లేకపోయినా అర్థం చేసుకోవడం

 

62. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించినవారు
జ: గోల్‌మన్

 

63. EQ అంటే ఏమిటి?
జ: Emotional Quotient

 

64. 'Dictionary of Psychology' గ్రంథ రచయిత ఎవరు?
జ: జె.పి. చాప్లిన్

 

65. మానసిక వయసు భావనను మొదట ప్రతిపాదించినవారు
జ: బినే

 

66. "అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది" అని పేర్కొన్నవారు
జ: మెక్‌డొగల్

 

67. 'డ్రా ఎ మ్యాన్ టెస్ట్' అనేది
జ: అశాబ్దిక పరీక్ష

 

68. మానసిక సామర్థ్యాల పరీక్ష
జ: సమూహ పరీక్ష

 

69. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించడానికి ఆ వ్యక్తిలోని వేటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి?
జ: సహజసామర్థ్యం

 

70. భారతీయుల కోసమే ప్రజ్ఞా పరీక్షను రూపొందించినవారు
జ: భాటియా

 

71. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలోని కార్డుల సంఖ్య
జ: 8

 

72. గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ ఎన్ని రకాలు?
జ: 8

 

73. కిందివాటిలో సామూహిక పరీక్ష కానిది
     1) ఆర్మీ పరీక్షలు      2) ఆర్మీ బీటా      సి) ఓటిస్ గామా      4) భాటియా
జ: 1(ఆర్మీ పరీక్షలు)

 

74. మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకుని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం ఏ రకమైన ప్రజ్ఞ?
జ: అమూర్త ప్రజ్ఞ

 

75. కిందివారిలో ఆర్ఎస్‌పీఎమ్ పరీక్షను ఎవరు రూపొందించలేదు?
     1) జె.సి. రావెన్      2) జె. రావెన్      3) జె.హెచ్. కాస్ట్      4) అందరూ
జ: 4(అందరూ)

 

76. గార్డినర్ ప్రకారం శిల్పులు, ఆర్కిటెక్చర్లకు ఏ ప్రజ్ఞ అధికం?
జ: ప్రాదేశిక

 

77. జాన్ మేయర్, పీటర్ సలోవె ఉద్వేగాత్మక ప్రజ్ఞపై రాసిన వ్యాసం-
జ: ఎమోషనల్ ఇంటెలిజెన్స్

 

78. గార్డినర్ ప్రకారం హావభావాలకు తగ్గట్లుగా శరీర కదలికలు ఉన్నవారు
జ: బాడీ స్మార్ట్

 

79. 'జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్' ఎన్ని సంవత్సరాల వయసువారికి ఉద్దేశించింది?
జ: 7 - 11

 

80. ఒక ప్రత్యేక రంగంలో మాత్రమే రాణించడానికి కారణం ఏమిటి?
జ: సహజసామర్థ్యం

 

81. వైయక్తిక భేదాల గురించి వివరించిన మొదటి శాస్త్రీయ రచన-
జ: యాన్ ఇంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్‌మెంట్

 

82. ప్ర‌జ్ఞా లబ్ధి సూత్రాన్ని MA/ CA * 100  అని చెప్పిన‌వారు?
జ: స్టెర్న్

 

83. 'ఇంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్‌మెంట్' గ్రంథ రచయిత ఎవరు?
జ: గాల్టన్

 

84. వెష్లర్ ప్రజ్ఞా పరీక్షలు స్పియర్‌మన్ ప్రతిపాదించిన ఏ కారకాన్ని మాపనం చేస్తాయి?
జ: జి కారకం

 

85. 'సాంఘిక సంస్థలకు పునాదిరాళ్లు లాంటివి' ఏవి?
జ: వైఖరులు

 

86. ఇద్దరు సోదరుల్లో ఒకరు తెల్లగా ఉండి మరొకరు నల్లగా ఉండటానికి కారణం
జ: అనువంశికత

 

87. అభ్యసనంలో విద్యార్థి సాధించగలిగేది దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ: అంతర్గత శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞ

 

88. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలకు కారణం
జ: వయసు

 

89. ప్రజ్ఞను మూడు రకాలుగా వర్గీకరించినవారు
జ: థార్న్‌డైక్

 

90. 'డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్' గ్రంథ రచయిత ఎవరు?
జ: జాన్ డ్యూయీ

 

91. బొగార్డస్ పరీక్ష ద్వారా దేన్ని అంచనా వేస్తారు?
జ: వైఖరి

 

92. 'ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి, సహజంగా ఆలోచించగలిగి, సమర్థవంతంగా వ్యవహరించగల సామర్థ్యమే ప్రజ్ఞ' అని పేర్కొన్నవారు ఎవరు?
జ: వెష్లర్

 

93. మానసిక వయసును ఎలా లెక్కిస్తారు?
జ: ప్రజ్ఞాపరీక్షలో నిష్పాదన ద్వారా

 

94. కిందివాటిలో ప్రజ్ఞ లక్షణం
     1) వేగ అభ్యసనం      2) నైపుణ్యం    3) స్మృతి     4) జ్ఞానం
జ: 1(వేగ అభ్యసనం)

 

95. సృజనాత్మకత ఉన్నవారు
  1) అంతర్‌దృష్టితో ఉంటారు           2) యత్నదోషాలు చేస్తారు  
  3) అంతర సంబంధాలు కనుక్కుంటారు     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

96. ప్రజ్ఞా లబ్ధి అనే భావనను ప్రవేశపెట్టినవారు
జ: విలియం స్టెర్న్

 

97. ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక సంస్కృతికి చెందినవారిపై ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు
జ: కల్చర్ ఫేర్ టెస్ట్

 

98. అన్ని సంస్కృతులు, భాషల వారికి వీలుగా తయారుచేసిన ప్రజ్ఞా పరీక్ష
జ: రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష

 

99. కిందివాటిలో ప్రజ్ఞ లక్షణం-
     1) సర్దుబాటు                 2) అభ్యసన సామర్థ్యం      
     3) కొత్త పరిస్థితులకు సర్దుబాటు      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

100. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో తెలియజేసే పరీక్షలు
జ: సహజ సామర్థ్యం

 

101. సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు
జ: సి.ఎల్. హాల్

 

102. సహజ సామర్థ్య వికాసానికి ఏది అవసరం?
     1) శిక్షణ      2) అభ్యాసం      3) ఆవర్తన పునర్బలనం      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

103. సృజనాత్మకత, ప్రజ్ఞ మధ్య సంబంధం
జ: నిర్దిష్ట సంబంధం లేదు

 

104. కిందివాటిలో యాంత్రిక ఆలోచనా ప్రక్రియ ఏది?
   1) సహజ సామర్థ్యం    2) సమైక్య ఆలోచన    
   3) విభిన్న ఆలోచన    4) వైఖరి
జ: 2(సమైక్య ఆలోచన)

 

105. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానం, నైపుణ్యం లేదా నిర్వచించదగిన ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?
జ: సహజ సామర్థ్యం

 

106. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలను ఎవరు రూపొందించారు?
జ: మార్క్స్

 

107. ఒక తరగతి విద్యా సాధన సామాన్య సంభావ్యత వక్రరేఖలోని అంశాలను సూచించడానికి కారణం ఏమిటి?
జ: వ్యక్తి అంతర భేదాలు

 

108. తరగతి గదిలో విద్యార్థుల సాధనా స్థాయి తగ్గుదలకు గల కారణాలు కనుక్కునేందుకు అనేక పరీక్షలు చేసినదెవరు?
జ: బినే

 

109. శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ
జ: ఆర్మీ బీటా పరీక్ష

 

110. ప్రజ్ఞా ఉద్యమ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు?
జ: బినే

 

111. విశ్వనాథ్ పెడగాజీని అద్భుతంగా బోధించగలడు కానీ తెలుగు బోధించడం రాదు. ఇది-
జ: వ్యక్తంతర్గత భేదం

 

112. ఆర్మీ ఆల్ఫా పరీక్షకు చెందని అంశం ఏది?
     1) సామూహిక పరీక్ష      2) శాబ్దిక పరీక్ష      
     3) శక్తి పరీక్ష      4) పేపర్ పెన్సిల్ పరీక్ష
జ: 3(శక్తి పరీక్ష)

 

113. అభిరుచులకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
     1) అభిరుచులు అభ్యసనం, అనుభవాల వల్ల ఏర్పడతాయి.
     2) పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తదాత్మీకరణం చేసుకుంటారో అవే అభిరుచులు.
     3) అభిరుచుల వికాసానికి వాటిలోని సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ తోడ్పడతాయి
     4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)

 

114. నటులు, రాజకీయ నాయకుల్లో అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది?
జ: సాంఘిక ప్రజ్ఞ

 

115. DAT పరీక్షలో మాపనం చేయని అంశం ఏది?
జ: స్మృతి

 

116. ప్రజ్ఞ ఉన్నవారిలో దాదాపుగా ఉండే ఆలోచన ఏది?
జ: సమైక్య ఆలోచన

 

117. 'అమూర్త ఆలోచనా చింతనమే ప్రజ్ఞ' అని నిర్వచించినవారు
జ: టెర్మన్

 

118. 'ఆటల్లో మంచి ప్రతిభను కనబరిచే విద్యార్థి ఇతర రంగాల్లో కూడా అంతే ప్రతిభను కనబరుస్తాడు' అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ: బినే

 

119. ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఇంటిపని కల్పించాడు. ఇది విద్యార్థుల్లోని ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది?
జ: సాధన

 

120. కిందివాటిలో వైయక్తిక భేదాలను నిర్ణయించే కారకాలు ఏవి?
     1) ప్రజ్ఞ      2) సహజ సామర్థ్యాలు      3) వైఖరులు      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

121. DAT ద్వారా ఎన్ని సహజ సామర్థ్యాలను గుర్తించవచ్చు?
జ: 8

 

122. 'మెజర్‌మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్' గ్రంథ రచయిత ఎవరు?
జ: థార్న్‌డైక్

 

123. ఒక వ్యక్తి అన్ని సామర్థ్యాలను ప్రభావితం చేసే కారకం ఏది?
జ: సామాన్య కారకం

 

124. వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు పూనుకున్న గాల్టన్ ఏ దేశస్థుడు?
జ: బ్రిటన్

 

125. కిందివాటిలో ప్రజ్ఞా లబ్ధి పరిమితిలోని అంశాలి ఏవి?
     1) వయోజనులను కచ్చితంగా మాపనం చేయలేం.
     2) అమూర్త, యాంత్రిక ప్రజ్ఞలనే మాపనం చేయొచ్చు.
     3) ప్రజ్ఞను సాంఖ్యకాల్లో వివరించినప్పుడు శూన్య స్థానాన్ని సూచించలేదు.
     4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)

 

126. వ్యక్తి ప్రవర్తనను ప్రేరేపించే శక్తి దేనికి ఉంది?
జ: అభిరుచి

 

127. కిందివాటిలో వైఖరులకు సంబంధించి సరికానిది
     1) వైఖరులు పుట్టుకతోనే ఏర్పడతాయి.
     2) వైఖరులు మారుతూ ఉంటాయి.
     3) విద్యార్థుల విజయం వారి వైఖరులపై ఆధారపడి ఉంటుంది.
     4) ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి.
జ: 1(వైఖరులు పుట్టుకతోనే ఏర్పడతాయి.)

 

128. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా దేన్ని మాపనం చేయవచ్చు?
జ: సామర్థ్యం

 

129. 1905లో తయారుచేసిన బినే - సైమన్ పరీక్షలోని అంశాలెన్ని?
జ: 30

 

130. 'Frames of Mind: The Theory of Multiple Intelligences' పుస్తక రచయిత ఎవరు?
జ: గార్డ్‌నర్

 

131. కిందివాటిలో భేదాత్మక సహజ సామర్థ్య నికషలో పరీక్షించని అంశమేది?
     1) శాబ్దిక వివేచనం       2) అమూర్త వివేచనం      
     3) స్మృతి సామర్థ్యం      4) గుమస్తా సామర్థ్యం
జ: 3(స్మృతి సామర్థ్యం)

 

132. గార్డినర్ ప్రకారం ఫ్యాషన్ డిజైనర్లలో ఉండే ప్రజ్ఞ
జ: తార్కిక

 

133. గిల్‌ఫర్డ్ ప్రకారం సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికంగా ఉంటే... విభిన్న ఆలోచన ఉన్నవారికి ఏది అధికంగా ఉంటుంది?
జ: సృజనాత్మకత

 

134. సాంఖ్యక పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్యా కాలం, స్మృతి, సంవేదనలపై పరీక్షలు రూపొందించినవారు ఎవరు?
జ: ఫ్రాన్సిస్ గాల్టన్

 

135. మానవశాస్త్ర పరిశోధనాశాలను మొదట స్థాపించినవారు ఎవరు?
జ: ఫ్రాన్సిస్ గాల్టన్

 

136. వ్యక్తుల భౌతిక భేదాలే కాకుండా మానసిక భేదాలను కూడా గుర్తించి వారికి అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో పేర్కొన్న గ్రంథం?
జ: ఎమిలీ

 

137. గాల్టన్ వల్ల ప్రభావితుడైన శాస్త్రజ్ఞుడు
జ: జె. మెకిన్ కాటిల్

 

138. జె.ఎమ్. కాటిల్ ఉపయోగించిన సాంఖ్యకశాస్త్ర పద్ధతి
జ: కారక విశ్లేషణ

 

139. వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం
జ: అనువంశికత

 

140. 18 సంవత్సరాలు పైబడిన వయోజనుల ప్రజ్ఞా లబ్ధిని గణించేటప్పుడు వారి శారీరక వయసును ఎంతగా పరిగణించాలి?
జ: 18 సంవత్సరాలు

 

141. అభిరుచులను ప్రత్యేకంగా గుర్తించేందుకు మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్‌కి సంబంధించిన అభిరుచుల ప్రశ్నావళిని తయారుచేసినవారు
జ: జి. స్టాన్లీ హాల్

 

142. 'డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో' జె.పి. చాప్లిన్ ప్రకారం అభిరుచి అంటే
     1) ఒక అంశంపై అవధానం నిలపడం
     2) ఒక అంశంపై ముఖ్యమనిపించే మానసిక పరిస్థితి
     3) గమ్యం వైపు నడిపే ప్రేరణా స్థితి
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

143. ఒక బాలుడి ప్రజ్ఞా లబ్ధి 45. అతడిని ఏ విధంగా వర్గీకరించవచ్చు?
జ: బుద్ధిహీనుడు

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌