• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

1. 'విశాల' అనేది ...
జ: జగణం

 

2. ప్రాస అంటే...?
జ: పద్యపాదంలోని రెండో అక్షరం

 

3. 'మసజసతతగ' అనే గణాలు ఉన్నది?
జ: శార్దూలం

 

4. చంపకమాల పద్యానికి యతిస్థానం ఎన్నో అక్షరం?
జ: 11వ అక్షరం

 

5. సూర్యగణం..
1) నల          2) నగ        3) రగణం       4) అన్నీ
జ: అన్నీ

 

6. 'తెలుగు వాక్యం' గ్రంథ రచయిత ఎవరు?
జ: చేకూరి రామారావు

 

7. 'ఆమె ఎందుకు నవ్వుతోందో? ' అనేది...
జ: సందేహార్థక వాక్యం

 

8. 'ఇది స్వానుభవం వల్ల నేర్చుకున్న జీవిత సత్యం' - అనేది...?
జ: నామ్నీకరణ వాక్యం

 

9. 'కమలాక్షునర్చించు కరములు కరములు' అనేది ఏ అలంకారానికి ఉదాహరణ?
జ: లాటానుప్రాస

 

10. ఉత్ప్రేక్షాలంకారంలో....
జ: ఊహ ఉంటుంది

 

11. 'యాత్ర'కి వికృతి ...
జ: జాతర

 

12. 'వంగడం' అనే మాటకి ప్రకృతి...
జ: వంశం

 

13. 'విరోధి'కి పర్యాయ పదం?
1) శత్రువు         2) వైరి             3) రిపు            4) అన్నీ
జ: అన్నీ

 

14. 'సమీరం' పర్యాయపదం...
జ: పవనం

 

15. 'రాజు'కి ఉన్న నానార్థం?
జ: చంద్రుడు

 

16. వేమన పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి?
జ: ఆటవెలది

 

17. 'కులం' అనే అర్థం ఉన్న పదం?
జ: వర్ణం

 

18. 'మిన్ను' అంటే...?
జ: ఆకాశం

 

19. 'ఆసక్తి'కి వ్యతిరేక పదం?
జ: నిరాసక్తి

 

20. బాలవ్యాకరణ కర్త ఎవరు?
జ: చిన్నయసూరి

పార్ట్ - 2

1. కంద పద్యంలో వాడే గణాలు ఏవి?
జ: గగ-భ-జస-నల

 

2. వృత్త పద్య రచన ఏది?
జ: 'మార్గ' రచన

 

3. ఆయత పక్షతుండహతి నక్కుల శైలము లెల్లనుగ్గుగా- అన్న పద్యపాదంలో గణాలు-
జ: భ-ర-న-భ-భ-ర-వ

 

4. సీస పద్య పాదంలో గణాలు-
జ: ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు

 

5. ద్విపదకు-మంజరీ ద్విపదకు తేడా ఏమిటి?
జ: ప్రాస విషయం

 

6. ఊది పలికితే గురువు అయ్యేది ...
జ: సంయుక్తాక్షరానికి ముందున్న అచ్చు

 

7. కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరుప నుంటి - అనే పద్య పాదం దేనికి సంబంధించింది?
జ: సీసం

 

8. ముత్యాలసరం మొదటి మూడు పాదాల్లో మాత్రానియమం-
జ: పధ్నాలుగు మాత్రలు

 

9. జ గణం బేసి గణంగా ఉండకూడని ఛందం-
జ: కందం

 

10. శ్రీనాథుడు రచించిన ఏ పద్యాలకు విశిష్ట స్థానం ఉంది?
జ: సీసం

 

11. ఒక మాత్ర కాలంలో ఉచ్ఛరింపబడే అక్షరాన్ని ఏమంటారు?
జ: లఘువు

 

12. ఉత్పలమాల వృత్తంలో రెండో గణం-
జ: ర గణం

 

13. ఇంద్ర గణాలెన్ని?
జ: 6

 

14. కంద పద్యరచనకు ప్రసిద్ధుడైన కవి ఎవరు?
జ: తిక్కన

 

15. మ-స-జ-స-త-త-గ అనే గణాలున్న వృత్తం ఏది?
జ: శార్దూలం

 

16. కిందివాటిలో సూర్యగణం?
1) భ గణం 2) న గణం 3) స గణం 4) త గణం
జ: న గణం

 

17. ఏ పద్యం రాయడం కష్టమంటారు?
జ: కందం

 

18. ద్విపదలో ప్రతి పాదంలో ఉండే గణాలు-
జ: మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం

 

19. ప్రాసయతి అంటే?
జ: ప్రాస మైత్రి వాడటం

 

20. 'య గణం'లో గురు లఘువుల క్రమత
జ: l U U

 

21. ముత్యాలసరం చివరి పాదంలోని మాత్రల సంఖ్య-
జ: 7-14 వరకు

 

22. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ప్రతి పాదంలో వరుసగా ఉండే పద్యం-
జ: తేటగీతి

 

23. పద్యపాదంలోని రెండో అక్షరం-
జ: ప్రాస

 

24. శార్దూల పద్యంలో యతిమైత్రి చెల్లే అక్షరం-
జ: 13

 

25. తనువెల్ల సత్యంబు తలపెల్ల గరుణ - అనే పద్యపాదం దేనికి సంబంధించింది?
జ: ద్విపద

 

26. చందస్సులో చెప్పే 'మాత్ర' అంటే క్షణంలో ...
జ: నాలుగో భాగం

 

27. పద్య లక్షణాలు, గేయ లక్షణాలు చెప్పే శాస్త్రం ఏది?
జ: ఛందశ్శాస్త్రం

 

28. 'ప్రాస'కు ఏది ప్రధానం?
జ: హల్లు

 

29. చతుర్మాత్రాగణాలున్న పద్యం-
జ: కందం

 

30. తెలుగు పద్యానికి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు-
జ: యతిప్రాసలు

 

31. మొదటి అక్షరానికి, నాలుగో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కంద పద్యంలో ఏయే పాదాల్లో పాటిస్తారు?
జ: రెండు, నాలుగు

 

32. ఏ పద్యానికి చివర మరో పద్యం రాయాలి?
జ: సీసం

 

33. సూర్యగణాలెన్ని?
జ: 6

 

34. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు?
జ: గురువు

 

35. చంపకమాల వృత్తంలో మొదటి గణం ఏది?
జ: నగణం

 

36. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఏమంటారు?
జ: యతి

 

37. కందపద్యంలో ఏయే పాదాల్లో యతిమైత్రి లేదు?
జ: 2, 4

 

38. ఆటవెలది పద్యంలోని 1, 3 పాదాల్లో గణాలు ఎలా ఉంటాయి?
జ: 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు

 

39. మొదటి రెండు లఘువులు, చివరిది గురువైతే ఆ గణం ఏది?
జ: సగణం

 

40. స-భ-ర-న-మ-య-వ గణాలున్న పద్యం ఏది?
జ: మత్తేభం

 

41. ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ప్రతి పాదంలో వరుసగా ఉండే పద్యం
జ: తేటగీతి

 

42. 10వ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం-
జ: ఉత్పలమాల

 

43. మత్తేభ పద్యంలో మొదటి రెండు లఘువులను గురువుగా మారిస్తే ఏర్పడే పద్యం-
జ: శార్దూలం

 

44. ప్లుతమంటే?
జ: మూడు మాత్రల కాలం

 

45. ద్విపాద ద్వయం ఏకపాదంగా ఉన్న పద్యం ఏది?
జ: తరువోజ

 

46. 'యతి'కి పర్యాయపదం కానిది ఏది?
జ: ఋషి

 

47. రెండక్షర గణాలు ఎన్ని?
జ: 4

 

48. అక్షర గణాలు ఎన్ని?
జ: 8

 

49. 'మత్త కోకిల' గణాలు-
జ: రసజజభర

 

50. ఇంద్రగణాలు - సూర్యగణాలను ఎలా పిలుస్తారు?
జ: ఉపగణాలు

 

51. సిరియె భోగోప లబ్ధికి జీవగఱ్ఱ - అనే పద్యంలోని గణాల క్రమత-
జ: 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్య గణాలు

 

52. పగయడగించు టెంతయు శుభంబది లెస్స యడంగునే పగం- అనే పద్యపాదంలోని గణాలు-
జ: నజభజజజర 

 

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌