• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక సాహిత్యం - ధోరణులు - ఉద్యమాలు - జానపద సాహిత్యం

మాదిరి ప్ర‌శ్న‌లు
 

1. విప్లవ కవుల్లో మొదట పేర్కొనదగిన కవి -
సమాధానం: శ్రీశ్రీ

 

2. శివసాగర్ రచన -
1) ఉద్యమం నెలబాలుడు           2) అగ్నిశ్వాస          3) పునాదిరాయి         4) చండాల చాటింపు
సమాధానం: 1 (ఉద్యమం నెలబాలుడు)

 

3. విరసం కవితా సంపుటి -
1) విప్లవం    2) ఝంఝ      3) రెంజిం     4) దివిటి
సమాధానం: 2 (ఝంఝ)

 

4. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలో రచయితలకు సవాల్ కరపత్రం పంచినవారు-
సమాధానం: విశాఖ విద్యార్థులు

 

5. 'ఎరుపంటే కొందరికి భయం. పసిపిల్లలు వారి కంటే నయం' అన్న విప్లవ కవి -
సమాధానం: సుబ్బారావు పాణిగ్రాహి

 

6. ఆరుమంది కవులు ప్రారంభించిన కవితా ధోరణి -
సమాధానం: దిగంబర కవిత

 

7. 'నా చెల్లీ చంద్రమ్మ' పాట రచయిత -
సమాధానం: శివసాగర్

 

8. పాటకు ప్రాచుర్యాన్ని కలిగించిన కవితా ఉద్యమం-
సమాధానం: విప్లవ కవితా ఉద్యమం

 

9. విరసం తొలి అధ్యక్షుడు -
సమాధానం: శ్రీశ్రీ

 

10. 'మరో ప్రస్థానం' ఎవరి రచన?
సమాధానం: శ్రీశ్రీ

 

11. పంచతంత్ర కథలను ఆంగ్లంలోకి అనువదించినవారు -
సమాధానం: బెన్ఫె

 

12. జానపదుల ప్రస్తావన కనిపించే గ్రంథం-
సమాధానం: భారతం

 

13. 'గుమ్మడుపాట' ఏ కోవకు చెందిన గేయం?
సమాధానం: భాగవత గేయం

 

14. తాండ్ర పాపారాయుడు, విజయరామరాజ గజపతి, బుస్సీ లాంటి పాత్రలుండే చారిత్రక గేయం -
సమాధానం: బొబ్బిలి యుద్ధం

 

15. 'సర్వాయి పాపడు కథ' - ఎలాంటి రచన?
సమాధానం: అద్భుతరస గేయం

 

16. 'రోకటి పాటలు' ఏ పద్యాల్లో ఉంటాయని విన్నకోట పెద్దన చెప్పాడు?
సమాధానం: తరువోజ

 

17. శారదకాండ్రు ఏ ప్రాంతంలో వ్యాపించి ఉన్నారు?
సమాధానం: తెలంగాణ

 

18. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు -
సమాధానం: నాయని కృష్ణకుమారి

 

19. జానపద గేయాల్లో 'రామాయణపు పాటలు' ఏ శాఖకు చెందినవి?
సమాధానం: పౌరాణిక గేయాలు

 

20. 'బిరుదురాజు రామరాజు' ఎందుకు ప్రసిద్ధులు?
సమాధానం: జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు

 

21. కన్నడ సాహిత్యంలోని 'దాసపదావళి' లాంటివి తెలుగులో - వేటికి సామీప్యంగా ఉంటాయి?
సమాధానం: పదకవితలు

 

22. కిందివారిలో విప్లవ కవులు -
ఎ. శ్రీశ్రీ    బి. సముద్రాల    సి. వరవరరావు   డి. ఆత్రేయ
1) ఎ, బి     2) బి, సి   3) ఎ, సి    4) ఎ, డి
సమాధానం: 3 (ఎ, సి)

 

23. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కోరే సంస్థ-
సమాధానం: విరసం

 

24. 'సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో - సినబోయి కూర్చున్నావెందుకమ్మా' పాట రచయిత -
సమాధానం: గద్దర్

 

25. ఊగరా ఊగరా ఊరికొయ్య నందుకుని ఊగరా...అన్న కవి -
సమాధానం: శ్రీశ్రీ

 

26. విప్లవ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన భూమయ్య, క్రిష్ణాగౌడ్‌లపై శ్రీశ్రీ రచించిన స్మృతి గీతం
సమాధానం: భూమ్యాకాశాలు

 

27. 'లక్ష నక్షత్రాలు రాలందే ఉద్యమ ఉదయం ఉదయించదు' అన్న కవి-
సమాధానం: జ్వాలాముఖి

 

28. 'మా గుండె మా జెండా - మా మనసే మాకండ' - అన్న కవి ఎవరు?
సమాధానం: కె.వి.రమణారెడ్డి

 

29. 'తుది పయనం - తొలి విజయం' ఎవరి విప్లవ గీతం?
సమాధానం: శ్రీశ్రీ

 

30. 'విషం కలిసిన పాయసం మన స్వరాజ్యం - డబ్బున్న భడవా పోషించే ఉంపుడుగత్తె మన ప్రజాస్వామ్యం' అన్న కవులు
సమాధానం: తిరగబడు కవులు

 

31. 'ఎడంచేత పట్టవోయ్ ఎర్రజెండా పిడికిలి బిగించవోయ్ మరొక చేత' - అన్న ప్రజాకవి
సమాధానం: సుబ్బారావు పాణిగ్రాహి

 

32. తమ కవితలను 'దిక్‌'గా వ్యవహరించిన కవులెవరు?
సమాధానం: దిగంబర కవులు

 

33. కిందివారిలో దిగంబర కవులు ఎవరు?
1) నగ్నముని, చెరబండరాజు                              2) జ్వాలాముఖి, భగత్‌సింగ్
3) కవిరాజు, బోయి భీమన్న                               4) నిఖిలేశ్వర్, బి.రామకృష్ణ
సమాధానం: 1 (నగ్నముని, చెరబండరాజు)

 

34. జ్వాలాముఖి ఏ కవితా శాఖకు చెందిన కవి?
సమాధానం: దిగంబర

 

35. కిందివారిలో దిగంబర కవి ఎవరు?
1) కె.వి.రమణారెడ్డి         2) కుందుర్తి ఆంజనేయులు         3) వరవరరావు         4) నగ్నముని
సమాధానం: 4 (నగ్నముని)

 

36. 'ఈ దేశం క్యాలెండర్లపై తారీఖులం' - అని ప్రకటించింది.
సమాధానం: దిగంబర కవులు

 

37. ఆంగ్ల సాహిత్యంలో 'బీట్నిక్స్ కవులు' తెలుగు సాహిత్యంలో వేటికి సారూప్యం?
సమాధానం: దిగంబర కవులు

 

38. తుర్లపాటి రాజేశ్వరి ప్రసిద్ధ కవిత -
సమాధానం: తాళికట్టిన మృగం

 

39. 'స్త్రీకి శరీరముంది - దానికి వ్యాయామాన్ని ఇవ్వాలి. ఆమెకు మెదడుంది - దానికి అనుభవం ఇవ్వాలి' అన్నదెవరు?
సమాధానం: చలం

 

40. తన రచనలతో స్త్రీ స్వాతంత్య్రానికి పునాదులు వేసిన కథానవలా రచయిత -
సమాధానం: చలం

 

41. స్త్రీవాద కవితా సంకలనం -
1) వైతాళికులు          2) కావ్యమాల          3) నీలిమేఘాలు          4) కళ్యాణ కల్పవల్లి
సమాధానం: 3 (నీలిమేఘాలు)

 

42. తన కవితలో 'పైటను తగలెయ్యాలి' అన్న కవయిత్రి -
సమాధానం: జయప్రభ

 

43. మైనారిటీల అణిచివేతను 'పుట్టుమచ్చ' కవిత ద్వారా వివరించినవారు -
సమాధానం: ఖాదర్ మొహియుద్దీన్

 

44. 'బందిపోట్లు' అనే స్త్రీవాద కవిత రాసిందెవరు?
సమాధానం: కొండేపూడి నిర్మల

 

45. 'వామనుడి మూడోపాదం' స్త్రీవాద కవితా సంపుటి వెలువరించిన కవయిత్రి -
సమాధానం: జయప్రభ

 

46. 'ఆ తతసకల పురాతన భక్తిగీతార్థ సమితియే మాతృకకాగ' పాల్కురికి సోమనాథుడు చేసిన రచన -
సమాధానం: బసవ పురాణం

 

47. అప్పగింతల పాటలు, అలుక పాటలు - ఏ జానపద శాఖకు చెందిన గేయాలు?
సమాధానం: స్త్రీల పాటలు

 

48. 'జానపద కథా స్రవంతి' సంకలన కర్త -
సమాధానం: కె.సుమతి

 

49.  దేశింగురాజు కథలోని కథాస్థలం -
సమాధానం: తమిళనాడు

 

50. గంగమ్మ జాతర సాధారణంగా ఏ వారం మొదలు పెడతారు?
సమాధానం: మంగళవారం

 

51. తెలుగు జానపద గాథల మీద పరిశోధన చేసినవారు -
సమాధానం: నాయని కృష్ణకుమారి

 

52. ఖడ్గాలు చదివే సందర్భం ఏది?
సమాధానం: జాతరలలో వీరభద్ర పళ్లెం తీసుకెళ్లే సమయం

 

53. చల్ మోహన రంగ పాట -
సమాధానం: శృంగార గేయం

 

54. ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తన జీవిత సర్వస్వాన్నీ వెచ్చించింది ఎవరు?
సమాధానం: నేదునూరి గంగాధరం

 

55. 'సర్వాయి పాపన్న' కథను మొదట సేకరించినవారు
సమాధానం: జె.ఎ.బోయెల్

 

56. 'పండుపాట' ఏ కథకు సంబంధించింది?
సమాధానం: భారత కథ

 

57. శ్రీశ్రీ సొంత గొంతుకను లోకానికి చాటిన ప్రథమ గేయం ఏది?
సమాధానం: నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను

 

58. 'తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది - డ్రైనేజీ స్కీములే డేంజరుగా మారుతోంది' - అన్న కవి
సమాధానం: గజ్జెల మల్లారెడ్డి

 

59. 'అగ్ని జల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి' - అనే గేయం ఎందులోనిది?
సమాధానం: అమృతం కురిసిన రాత్రి

 

60. అమృతం కురిసిన రాత్రి రచయిత -
సమాధానం: తిలక్

 

61. 'నువ్వు చెప్పేదేదైనా నీ అనుభవం నుంచి పలకాలి' అని చెప్పే ప్రాథమిక సూత్రం ఉన్న కవితా ధోరణి
సమాధానం: అనుభూతివాద కవిత్వం

 

62. 'కవిత్వం ఒక ఆల్కేమి. దాని రహస్యం కవికి తెలుసు. కాళిదాసుకు తెలుసు. పెద్దనకు తెలుసు. కృష్ణశాస్త్రికి తెలుసు' - అన్న కవి
సమాధానం: తిలక్

 

63. 'కాకికేమి తెలుసు సైకో ఎనాలసిస్'
5 - 3 - 2 ఆముక్త మాల్యద
ఆటవెలది ద్విపదకత్తగారు - ఇందులోని కవితా ధోరణి
సమాధానం: సర్రియలిజమ్

 

64. 'విశ్వంభర' ఏ కోవకు చెందిన కావ్యం?
సమాధానం: ప్రతీకాత్మక కావ్యం

 

65. 'మంటల్లోనే పుట్టాడు. మంటల్లోనే పెరిగాడు. మంటల్లోనే మడిశాడు' అంటూ భగత్‌సింగ్‌పై స్మృతిగీతాన్ని రాసిన కవి-
సమాధానం: శ్రీరంగ నారాయణ బాబు

 

66. దిగంబర కవులు తమ కవితా సంపుటిని రిక్షా కార్మికుడు నాంపల్లి పాండుతో ఆవిష్కరించిన ప్రదేశం
సమాధానం: హైదరాబాదు

 

67. 'నేను కోరేది మీ దయాధర్మ బిక్షకాదు. నాకు రావాల్సిన బాకీ' అన్నదెవరు?
సమాధానం: కొలకలూరి ఇనాక్

 

68. సతీష్ చందర్ రచన -
1) గబ్బిలం             2) పంచమ వేదం             3) పుట్టుమచ్చ             4) రచ్చపుండు
సమాధానం: 2 (పంచమ వేదం)

 

69. 'ఉప్పెన' ఎలాంటి సంకలనం?
సమాధానం: దళిత గీతాల సంకలనం

 

70. తొలి తెలుగు దళితకవిగా భావించే మహాకవి -
సమాధానం: జాషువా

 

71. బోయి భీమన్న రచన -
1) ఆకలి రాజ్యం         2) ఎముక ముక్క చేదుపాట        3) గుడిసెలు కాలిపోతున్నై         4) పాకీపిల్ల
సమాధానం: 3 (గుడిసెలు కాలిపోతున్నై)

 

72. అస్పృశ్యతా నిర్మూలనను కాంక్షించిన గ్రంథం-
సమాధానం: నిరుద్ధ భారతం

 

73. 'మునివాహనుడు' నాటక రచయిత -
సమాధానం: కొలకలూరి ఇనాక్

 

74. 'గబ్బిలం'లోని ప్రధానాంశం -
సమాధానం: అశ్రు సందేశం

 

75. అఖిలభారత దళిత రచయితల మహాసభలు ఎక్కడ జరిగాయి?
సమాధానం: బొంబాయి

 

76. చిక్కనవుతున్న పాట -
1) స్త్రీవాద కవిత్వ సంకలనం                                      2) దళిత కవితా సంకలనం
3) అనుభూతివాద కవితా సంకలనం                          4) మానవతావాద సంకలనం
సమాధానం: 2 (దళిత కవితా సంకలనం)

 

77. 'కొత్త గబ్బిలం' ఏ ప్రక్రియకు చెందింది?
సమాధానం: కవిత

 

78. 'మనుషులు మనుషులుగా పుట్టక మనువులై పుడితేనే ప్రమాదం' - అన్న కవితా విభాగం ఏ వాదానికి సంబంధించింది?
సమాధానం: దళితవాద కవిత్వం

 

79. తెలుగులో 'వచన కవితకు ఆద్యుడు' -
సమాధానం: శిష్ట్లా ఉమామహేశ్వరరావు

 

80. 'తాజ్‌మహల్ పడగొట్టండోయ్' అని అభ్యుదయ ధోరణిలో రాసిన కవి-
సమాధానం: ఆలూరి బైరాగి

 

81. 'నా గొడవ' రాసిన కవి-
సమాధానం: కాళోజీ నారాయణరావు

 

82. ''కప్పతల్లి పెళ్లి" అనే భావగీతాన్ని 'సౌదామిని' అనే కలం పేరుతో రాసిన కవయిత్రి ఎవరు?
సమాధానం: బసవరాజు రాజ్యలక్ష్మమ్మ

 

83. 'బంగారు మామ' పాట రచయిత-
సమాధానం: కొనకళ్ల వెంకటరత్నం

 

84. 'పిలుపు' పాఠం ఏ కవితా శాఖకు చెందుతుంది?
సమాధానం: అభ్యుదయ కవిత్వం

 

85. ఆత్మగౌరవాన్ని ప్రబోధించిన గురజాడ గేయం-
సమాధానం: పూర్ణమ్మ

 

86. నది నిండా నీరున్నది 
       నావపై పిల్లున్నది
       పిల్లాకు వొళ్లున్నది..... అనే భావగీతాన్ని రాసిన భావకవి ఎవరు?
సమాధానం: కవి కొండల వెంకటరావు

 

87. 'ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భవుడు' అంటూ రసికుల హృదయాలను ఉర్రూతలూగించిన కవి -
సమాధానం: పుట్టపర్తి నారాయణాచార్యులు

 

88. 'కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు' అన్న కవి?
సమాధానం: జాషువా

 

89. 'బసవరాజు రాజ్యలక్ష్మమ్మ' కలం పేరు -
సమాధానం: సౌదామిని

 

90. రాయప్రోలు సుబ్బారావు రచించిన 'అనుమతి' కావ్యానికి ఆంగ్ల మాతృక
సమాధానం: డోరా

 

91. 'కొల్లాయి గట్టితేనేమి... మా గాంధీ కోమటై పుట్టితేనేమి' అనే బసవరాజు అప్పారావు కవితా పంక్తులు ఏ కవితా శాఖకు చెందినవి?
సమాధానం: భావ కవిత్వం

 

92. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఊహాప్రేయసి -
సమాధానం: ఊర్వశి

 

93. 'ధారుణీపతి పాలన దండమెపుడు నీహలంబృకన్నను పార్థనీయమగునె' అని కర్షకుడిని కీర్తించిన కవి ఎవరు?
సమాధానం: దువ్వూరి రామిరెడ్డి

 

94. ''మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్, తీయ తేనియ బ్రతుకు మోయలేదీ బ్రతుకు... " అన్న కవి
సమాధానం: దేవులపల్లి కృష్ణశాస్త్రి

 

95. 'పెనుగొండ లక్ష్మి' కావ్యంలో ప్రస్తుతించిన ప్రబంధ కవి -
సమాధానం: భట్టుమూర్తి

 

96. 'కిన్నెరసాని' అంటే -
సమాధానం: వంకవాగు

 

97. చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించిన కవి-
సమాధానం: నండూరి సుబ్బారావు

 

98. ''శిథిలాలయమ్ములో శివుడు లేడోయ్ - ప్రాంగణమ్మున గంట పలుకలేదోయ్"... అన్న కవి
సమాధానం: కృష్ణశాస్త్రి

 

99. ''అయ్యో పాలింకి పోవడానికున్నట్లు - మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బావుండు" అన్న కవితా పంక్తుల కవయిత్రి
సమాధానం: పాటిబండ్ల రజని

 

100. "పెళ్లంటే పెద్ద శిక్షనీ
మొగుడంటే స్వేచ్ఛాభక్షకుడనీ"... కవిత రాసిన కవయిత్రి
సమాధానం: సావిత్రి


 

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌