మాదిరి ప్రశ్నలు
1. కార్యక్రమయుత బోధనలోని మొదటి సూత్రం-
జ: చిన్న సోపానాల సూత్రం
2. క్రీడా పద్ధతికి పితామహుడు-
జ: కాల్డ్ వెల్కుక్
3. పాఠశాలను ప్రయోగశాలగా, విద్యార్థులను పరికరాలుగా భావించి బోధించే పద్ధతి-
జ: డాల్టన్ పద్ధతి
4. 'కవికి గీటురాయి పద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం' అనేది ఎవరి అభిప్రాయం?
జ: రామచంద్ర శుక్ల
5. 'ఎత్తుగడల పద్ధతి' అని దేన్నంటారు?
జ: ఉద్యమ పద్ధతి
6. 'ఏదైనా ఒక అంశంపై విరివిగా రాయడం వ్యాసం' అని నిర్వచించింది-
జ: శబ్ద రత్నాకరం
7. 'కిండర్', 'గార్టెన్' అనేవి ఏ భాషా పదాలు?
జ: జర్మనీ
8. ఏ పద్ధతిలో బోధనాంశం మొత్తం 'నియోజనాలు'గా తయారుచేసి వాటిని విద్యార్థులతో పూర్తి చేయిస్తారు?
జ: డాల్టన్ పద్ధతి
9. 1955లో ఉపాధ్యాయ విద్యలో భాగంగా ఏ విశ్వ విద్యాలయం మొదటిసారిగా 'బృంద బోధన'ను ప్రవేశపెట్టింది?
జ: హార్వర్డ్ విశ్వవిద్యాలయం
10. నాటక బోధనను జరపాల్సిన పద్ధతి-
జ: ప్రదర్శన పద్ధతి
11. 'ఆచార్యుడానందమయుడు - విద్యాశాల వినోదారామం' అనే భావనను విద్యార్థులకు కలిగించే పద్ధతి-
జ: క్రీడాపద్ధతి
12. పాఠశాల నిర్వహణకు 'దర్శకురాలు' ఉండే పద్ధతి-
జ: కిండర్గార్టెన్ పద్ధతి
13. బోధన - పునః బోధన ఉన్న బోధనా పద్ధతి-
జ: సూక్ష్మబోధన
14. గుణాత్మక విద్యలో భాగంగా ప్రాథమిక విద్యా పథకం-
జ: కృత్యాధార బోధన
15. 'తీరికగా ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా చేసే పనియే క్రీడ'- అన్నది
జ: గల్లిక్
16. అందుబాటులో ఉన్న 'వనరులను', 'నైపుణ్యాలను' వినియోగించుకుని బోధించే బోధనా విధానం-
జ: బృంద బోధన
17. హెలెన్ పార్క్ హర్ట్స్ పద్ధతిని ప్రారంభించిన పట్టణం-
జ: డాల్టన్
18. సూక్ష్మబోధనలో ఒక నైపుణ్యాన్ని సాధించడానికి ఎన్నిసార్లు బోధన చేయాలి?
జ: 4
19. పాఠశాలలో పనిగంటల తర్వాత అదనంగా కేటాయించిన సమయంలో ఉపాధ్యాయుడి సమక్షంలో ఆరోజు చెప్పిన పాఠాలు విద్యార్థులు చేసే అధ్యయనం-
జ: పర్యవేక్షణాత్మక అధ్యయనం
20. 'ది టెక్టాలజి ఆఫ్ టీచింగ్' గ్రంథాన్ని రచించింది-
జ: స్కిన్నర్
21. స్వీయ గమనంలో నేర్చుకోనిస్తే విద్యార్థి త్వరగా నేర్చుకుంటాడనే ప్రమేయంమీద ఆధారపడిన సూత్రం-
జ: స్వీయగమన సూత్రం
22. ఆధునిక బోధనాపద్ధతులన్నింటికీ మూలాధారమైన పద్ధతి-
జ: క్రీడా పద్ధతి
23. 'వైయక్తిక, సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ది పరచడం'- అనేది తన సూత్రాల్లో ఒకటిగా ఉన్న పథకం-
జ: ఎ.పి.పి.ఇ.పి.
24. కార్యక్రమయుత అభ్యసనకు మూలమైన అభ్యసన సిద్ధాంతం-
జ: కార్యసాధక నిబంధన
25. సంకీర్ణ ఉద్యమానికి సంబంధించిన అంశం-
జ: తోటపని
26. 'వ్యాస చంద్రిక' కర్త-
జ: గురజాడ
27. 'కృత్యాధార పద్ధతి'ని మొదట ప్రస్తావించిన కమిటీ -
జ: ఈశ్వరీభాయి
28. మాంటిస్సోరి పద్ధతిలో విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే సాధనం-
జ: పీడోమీటర్
29. 'సూక్ష్మబోధన' అంటే-
జ: బోధనా మెలకువ
30. గరిష్ఠ స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని ఏ విధానంలో పెంపొందించవచ్చు?
జ: బృంద బోధన
31. ఏ పద్ధతిలో కల్పించిన ప్రత్యక్ష అనుభవాలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల గుర్తింపు నోచుకున్నాయి?
జ: మాంటిస్సోరి పద్ధతి
32. ఏ పద్ధతిలో జరిగే బోధనలో 'భాషా బోధన'కు 90 నిమిషాలు కేటాయించుకోవచ్చు?
జ: బహుళ తరగతి బోధన