• facebook
  • whatsapp
  • telegram

కనీస అభ్యసన స్థాయులు 

మాదిరి ప్ర‌శ్న‌లు
 

1. కనీస అభ్యసన స్థాయులను అనుసరించి 'ప్రతిభావంతులు' అంటే...?
జ: 90% నుంచి 100% మార్కులు పొందినవారు

 

2. MLLS ఆధారంగా మాట్లాడుతున్న అంశంలోని, రాతలలోని అంశాన్ని గ్రహించి సొంతంగా నిర్ణయానికి రావడం - అనే ఉప సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రధాన సామర్థ్యం?
జ: భావావగాహనం

 

3. కనీస అభ్యసన స్థాయులను నిర్ధారించడానికి ఏర్పాటుచేసిన కమిటీలో పని చేసిన ప్రముఖ విద్యావేత్త ఎవరు?
జ: ఆర్.హెచ్.దవే

 

4. పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహిస్తాడు - దీన్ని కనీస అభ్యసన స్థాయిలో ఎలా సూచిస్తారు?
జ: 6.3.1

 

5. 'కనీస అభ్యసన స్థాయులు' లోని 'స్థాయి' అనే పదం దేన్ని సూచిస్తుంది?
జ: ప్రమాణాలు

 

6. 2-5-4 అనే కనీస అభ్యసన స్థాయి సూచికలో మధ్య అంకె దేన్ని సూచిస్తుంది?
జ: తరగతి

 

7. ఒకటో తరగతి పూర్తి అయ్యే నాటికి విద్యార్థి సాధించాల్సిన ఉప సామర్థ్యాల సంఖ్య?
జ: 19

 

8. కనీస అభ్యసన స్థాయులకు ఉన్న ఒక లక్షణం?
జ: జవాబుదారీతనం

 

9. నిర్ధారించుకున్న ప్రతి అభ్యసన స్థాయి దేనికి ఉపయోగపడాలి?
జ: నిరంతర సమగ్ర మూల్యాంకనం

 

10. క.అ.స్థా. (కనీస అభ్యసన స్థాయి)ని అనుసరించి ''బృందంలో మాట్లాడేటప్పుడు తన వంతు వచ్చినప్పుడు మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం" - అనేదాన్ని ఏ కనీస అభ్యసన స్థాయిగా గుర్తించారు?
జ: భాషోపయోగం

 

11. తొమ్మిది సామర్థ్యాలను కుదించగా ఎన్ని సామర్థ్యాలకు పరిమితమవుతాయి?
జ: 4

 

12. అందుబాటులో ఉన్న లఘు విజ్ఞాన కోశాలను ఉపయోగించగలగడం ఏ సామర్థ్యాన్ని సూచిస్తుంది?
జ: స్వయం అధ్యయనం

 

13. గుణాత్మకత, జవాబుదారీతనంతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినవి?
జ: కనీస అభ్యసన స్థాయులు

 

14. ఒక విద్యార్థి 'సంక్లిష్టమైన ప్రశ్నలను అడిగాడు'. క.అ.స్థా. అనుసరించి ఆ విద్యార్థి ఏ తరగతికి చెంది ఉంటాడు?
జ: 3వ తరగతి

 

15. విద్యార్థుల చేత పాత శుభలేఖలను సేకరింపజేసి విద్యార్థులను వాటిని చదవమని, వాటిపై ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టడం అనేది ఏ సామర్థ్యాన్ని సూచిస్తుంది?
జ: భావావగాహనం

 

16. భారత రాజ్యాంగంలోని ఎన్నో అధికరణం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి?
జ: 45

 

17. వినోద్ అనే విద్యార్థి ఒకటో తరగతి పూర్తి చేశాడు. క.అ.స్థా. ప్రకారం ఆ విద్యార్థి ఎన్ని పదాల పఠనావగాహన సామర్థ్యం కలిగి ఉండాలి?
జ: 1500

 

18. గుణాత్మక విద్యకు స్ఫూర్తినిచ్చే 'కనీస అభ్యసన స్థాయు'లను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఏ సంవత్సరంలో కమిటీ వేసింది?
జ: 1990

19. కనీసం -స్థాయి అనేవి దేని గుణాలను తెలుపుతాయి?
జ: అభ్యసనం

 

20. MLLS ఆధారంగా 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఎన్ని పదాల పఠనావగాహన సామర్థ్యం కలిగి ఉండాలి?
జ: 5000

 

21. నియత కాలంలో విద్యార్థుల్లో విద్యావిషయకంగా అభ్యసనం ద్వారా ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలే ....?
జ: కనీస అభ్యసన స్థాయులు

 

22. భాషలో ఉన్న సంప్రదాయ, సంప్రదాయం కాని వాటికి సంబంధించిన భేదాలను అభ్యసించడం - క.అ.స్థా.అనుసరించి ఈ సామర్థ్యానికి చెందుతుంది.
    1) భావావగాహనం      2) భాషోపయోగం    3) స్వయం అధ్యయనం    4) భాషణం
జ: భాషోపయోగం

 

23. 1- 8- 2 అనే కనీస అభ్యసన స్థాయి సూచికలో 8 అంకె దేన్ని సూచిస్తుంది?
జ: భాషోపయోగం

 

24. ప్రాథమిక దశలో విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు, ఉప సామర్థ్యాల సంఖ్య?
జ: 9 సామర్థ్యాలు, 95 ఉపసామర్థ్యాలు

పార్ట్ ‌- బి

1. గుణాత్మక విద్యకు స్ఫూర్తినిచ్చే 'కనీస అభ్యసన స్థాయు'ల కమిటీలో ప్రముఖుడు?
జ: ఆర్.హెచ్. దవే

 

2. కనీస అభ్యసన స్థాయులను అనుసరించి ప్రధాన సామర్థ్యాలు, ఉపసామర్థ్యాలు ఎన్ని?
జ: 9 సామర్థ్యాలు, 95 ఉపసామర్థ్యాలు

 

3. 'విద్యార్థి పదాల మధ్య అర్థ సంబంధాన్ని గ్రహిస్తాడు' - దీన్ని కనీస అభ్యసన స్థాయుల్లో ఎలా సూచిస్తారు?
జ: 6.3.1

 

4. క.అ.సా.ను అనుసరించి 'సంశ్లిష్టమైన ప్రశ్నలను అడగటం' అనే ఉపసామర్థ్యాన్ని ఏ తరగతిలో సాధించాలి?
జ: 3 వ తరగతి

 

5. MLLS ను అనుసరించి విద్యార్థి 1 వ తరగతి పూర్తయ్యేసరికి ఎన్ని పదాల పఠనావగాహన సామర్థ్యం కలిగి ఉండాలి?
జ: 1500

 

6. క.అ.సా.ను అనుసరించి విద్యార్థి 'సభ్యతతో మాట్లాడటం' అనే ఉపసామర్థ్యాన్ని ఏ తరగతిలో సాధిస్తాడు?
జ: 2 వ తరగతి

 

7. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం 6-14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి?
జ: 45 వ అధికరణం

 

8. కనీస అభ్యసన స్థాయులు ఏ దశకు ఉద్దేశించినవి?
జ: ప్రాథమిక దశ

 

9. నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమమే...
జ: స్థాయి

 

10. బృందంలో మాట్లాడేటప్పుడు తనవంతు వచ్చినపుడు మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం - అనే ఉపసామర్థ్యం ఏ సామర్థ్యానికి చెందుతుంది?
జ: భాషోపయోగం

 

11. క.అ.సా.ను అనుసరించి ''భాషా భాగానికి సంబంధించిన ప్రాయోగికాంశాలను అవగాహన చేసుకోవడం" విద్యార్థులు ఏ తరగతిలో సాధించాలి?
జ: 5 వ తరగతి

 

12. ఒక విద్యాదశ పూర్తయ్యేటప్పటికి అభ్యసనం ద్వారా ప్రతి విద్యార్థి సాధించాల్సిన ప్రావీణ్యతకు ఏమని పేరు?
జ: సామర్థ్యం

 

13. కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించే మూల్యాంకనంలో భాగంగా 'పూర్వపరీక్ష' దేనికి తోడ్పడుతుంది?
జ: ప్రారంభ సమాచారం సేకరించడానికి

 

14. ఒక్కొక్క తరగతిలో విద్యార్థి సాధించాల్సిన ఉపసామర్థ్యాలు ఎన్ని?
జ: 19

 

15. 'అందుబాటులో ఉన్న బాలల చిత్రకోశాన్ని ఉపయోగించగలగడం' - అనే అంశాన్ని కనీస అభ్యసన స్థాయుల్లో ఎలా సూచిస్తారు?
జ: 7.3.1

 

16. 'అపరిచిత పదాలకు ఉక్తలేఖనం తీసుకోవడం' - దీన్ని కనీస అభ్యసన స్థాయులను అనుసరించి ఏ తరగతిలో చేయాలి?
జ: 3 వ తరగతి

 

17. మాట్లాడుతున్న అంశంలోని, రాతల్లోని, కారణ ఫలితాల మధ్య ఉన్న భావాలను గుర్తించడం - అనే ఉపసామర్థ్యం ఏ సామర్థ్యానికి చెందుతుంది?
జ: భావావగాహన

 

18. MLLS ను అనుసరించి 'భాషలో ఉన్న సంప్రదాయ, సంప్రదాయంకాని వాటికి సంబంధించిన భేదాలను అభ్యసించడం' అనే ఉపసామర్థ్యాన్ని ఏ విధంగా సూచించవచ్చు?
జ: 8.4.1


 

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌