• facebook
  • whatsapp
  • telegram

మాతృభాషా బోధన - లక్ష్యాలు - స్పష్టీకరణలు

 *  అభ్యసన ప్రధాన ఉద్దేశం విద్యార్థి మూర్తిమత్వ వికాసం. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మూర్తిమత్వ వికాసాన్ని 3 రంగాలుగా విభజించారు.
     1. జ్ఞాన రంగం (Cognitive domain)
     2. భావావేశ రంగం (Affective domain)
     3. మానసిక చలన రంగం (Psychomotor domain)
* జ్ఞానాత్మక రంగంలో ఆరు విధాలైన లక్ష్యాలు ఉంటాయి.
అవి: జ్ఞానం - అవగాహన - అనుప్రయుక్తం - విశ్లేషణ - సంశ్లేషణ - మూల్యాంకనం.
* భావావేశ రంగంలోని ముఖ్యమైన విద్యా లక్ష్యాలు: గ్రహణం - ప్రతిస్పందన - మూల్య నిర్ధారణ - వ్యవస్థీకరణ - లక్షణీకరణ
* మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలు: అనుకరణ - అనువర్తన - నియంత్రణ - సమన్వయం - సహజీకరణ
* విద్యా వ్యవస్థలోని వివిధ సందర్భాలు, వివిధ స్థాయుల్లో అనుసరించే లక్ష్యాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి:
     1) గమ్యాలు         2) ఉద్దేశాలు           3) లక్ష్యాలు        4) స్పష్టీకరణలు

గమ్యాలు (Goals): విద్యా వ్యవస్థ సాధించాల్సిన అంతిమ ధ్యేయాలు. విద్యా ప్రణాళికల రూపకల్పనను నిర్ణయిస్తాయి.
* సుదీర్ఘ కాలంలో మొత్తం విద్యాప్రణాళిక ద్వారా సాధించాల్సిన ప్రవర్తనా మార్పులు.
ఉదా: ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత.

 

ఉద్దేశాలు (Aims): పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి.
* విషయ ప్రణాళికల (Syllabus) రూపకల్పనను నిర్దేశిస్తాయి.
* తెలుగు భాష ప్రధాన ఉద్దేశాలు - అర్థ గ్రహణం, అభివ్యక్తి, గుణవివేచన.

 

లక్ష్యాలు (Objectives)
స్పష్టీకరణలు (Specifications)

* లక్ష్యాలు ఉద్దేశాల నుంచి ఏర్పడతాయి.
* ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పులను సూచిస్తాయి.
* ఒక లక్ష్యాన్ని విశదీకరించే నిర్దిష్టమైన సూక్ష్మరూపమే స్పష్టీకరణలు.
* తెలుగు భాషా బోధనకు పది లక్ష్యాలను ప్రతిపాదించారు.
     1) జ్ఞానం                           2) అవగాహన                             3) భాషాభిరుచి
     4) రసానుభూతి                 5) సముచిత మనోవైఖరులు        6) సంస్కృతీ సంప్రదాయాలు
     7) సృజనాత్మకత               8) భాషాంతరీకరణ                       9) వాగ్రూప వ్యక్తీకరణ
     10) లిఖితరూప వ్యక్తీకరణ.

 

1. జ్ఞానం: భాష బోధనలో జ్ఞానం మూడు అంశాలకు సంబంధించిందై ఉంటుంది.
1) విషయ జ్ఞానం: ఇతివృత్తం, కవి పరిచయం
2) భాషా జ్ఞానం: వ్యాకరణాంశాలు
3) సాహిత్య జ్ఞానం: కావ్యాలు, నాటకాలు, ఆధునిక కవిత్వం, గేయాలు
స్పష్టీకరణలు: గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం.

 

2. అవగాహన: విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని గానీ, భాష మౌలికాంశాలను గానీ అర్థం చేసుకోవడం దీనిలోని ముఖ్య లక్ష్యం.
స్పష్టీకరణలు: ఒక విషయాన్ని తమ మాటల్లో వర్ణిస్తారు.
* భాషణ, లేఖనాల్లో నిక్షిప్తమైన భావాలను వివరిస్తారు.
* సారాంశాన్ని గ్రహిస్తారు.
* శీర్షికను సూచిస్తారు.
* సందర్భసహిత వ్యాఖ్యలు చెప్పగలుగుతారు.
* ఉదాహరణలను సొంతంగా ఇస్తారు.

 

3. భాషాభిరుచి: భాషా సాహిత్య పరిచయం వల్ల భాషపై అభిరుచి ఏర్పడుతుంది.
స్పష్టీకరణలు: విస్తార గ్రంథ పఠనం చేస్తారు.
* సాహిత్య ప్రసంగాల్లో పాల్గొంటారు.
* వక్తృత్వ రచనల పోటీల్లో పాల్గొంటారు.
* కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు.
* ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తారు.
* సాహిత్య రచనలు చేస్తారు.
* సాహిత్య రచనలను విమర్శనా దృష్టితో చదువుతారు.

 

4. రసానుభూతి: ఇది భావావేశ రంగానికి చెందింది.
స్పష్టీకరణలు: రచనల్లోని రస భేదాలను గ్రహిస్తారు.
* అలంకారాల విశిష్టతను తెలుసుకుంటారు.
* ధ్వన్యర్థాలను గ్రహిస్తారు.
* శైలీ భేదాలను పరికిస్తారు.
* పాత్రౌచితిని తెలుసుకుంటారు.
* రసవద్ఘట్టాలను చదివి, ఆనందిస్తారు.

 

5. సముచిత మనోవైఖరులు: ఇది ఒక మానసిక ప్రక్రియ.
స్పష్టీకరణలు: సాహితీవేత్తల పట్ల గౌరవాభిమానంతో ఉంటారు.
* ఇతర భాషల పట్ల సమానాదరం చూపిస్తారు.
* సాహిత్య కృషిని ప్రోత్సహిస్తారు.
* విమర్శనాత్మక దృష్టితో ఉంటారు.
* విమర్శలను సహృదయంతో స్వీకరిస్తారు.

 

6. సంస్కృతీ సంప్రదాయాలు: దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కనబరుస్తారు.
స్పష్టీకరణలు:
* ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారు.
* రచనల్లోని కాల భేద ప్రభావాన్ని తెలుపుతారు.
* ప్రాచీన సాహిత్యంలోని విశేషాలను తెలుపుతారు.
* రచనల్లోని నీతిని గ్రహిస్తారు.
* భారతీయ సంస్కృతి పట్ల ఆదరాభిమానాలను పెంపొందించుకుంటారు.

 

7. సృజనాత్మకత: విద్యార్థులు వ్యక్తీకరణలో సృజనాత్మకతను ప్రదర్శిస్తారు.
స్పష్టీకరణలు:
* స్వతంత్ర రచనలు చేస్తారు.
* శైలిలో ప్రత్యేకతను కనబరుస్తారు.
* తమ రచనల్లో లోకోక్తులు, జాతీయాలను ఉపయోగిస్తారు.
* సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తారు.

 

8. భాషాంతరీకరణ: ఒక భాష నుంచి ఇంకొక భాషకు అనువాదం చేసే నేర్పు కలుగుతుంది.
స్పష్టీకరణలు:
* ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను తెలుసుకుని ఉంటారు.
* ఉభయ భాషల్లోని సమానార్థక పదాలు, జాతీయాలను ఎన్నుకుంటారు.

 

9. వాగ్రూప వ్యక్తీకరణ: విద్యార్థిలో వాగ్రూప వ్యక్తీకరణ శక్తిని అభివృద్ధి చేయడం మాతృభాష ముఖ్య లక్ష్యాల్లో ఒకటి.
స్పష్టీకరణలు:
* దోషరహితంగా ఉచ్ఛారణ చేయగలుగుతారు.
* భావానుగుణమైన స్వరభేదంతో మాట్లాడతారు.
* సరైన వేగంతో మాట్లాడతారు.
* సభాకంపం లేకుండా మాట్లాడతారు.
* ఆకర్షణీయంగా మాట్లాడతారు.
* విషయాలను సరైన ఉచ్ఛారణతో అర్థవంతంగా వివరిస్తారు.

 

10. లిఖితరూప వ్యక్తీకరణ: విద్యార్థులు తమ భావాలను, భాషా ప్రయోగాలను లిఖితరూపంలో వ్యక్తీకరించే నైపుణ్యం పెంపొందించడం మరొక ముఖ్య లక్ష్యం.
స్పష్టీకరణలు:
* వర్ణక్రమ దోషాలు లేకుండా రాస్తారు.
* వ్యాకరణ దోషాలు లేకుండా రాస్తారు.
* అప్రస్తుత విషయలు లేకుండా రాస్తారు.
* చదివిన విషయాన్ని క్లుప్తంగా, భావం చెడకుండా అర్థవంతంగా రాస్తారు.
* లిఖిత రచనలు చేసేటప్పుడు భావానుగుణంగా పరిచ్ఛేదాలుగా విభజించి, రాస్తారు.

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌