• facebook
  • whatsapp
  • telegram

గణిత బోధనా పద్ధతులు

1. గుణశ్రేఢిలో సాధారణ పదాన్ని కనుక్కోవడానికి అనుసరించే బోధనా పద్ధతి ఏది?
జ: ఆగమన పద్ధతి
 

2. (am)n = amn  అనే సంబంధాన్ని బోధించడానికి సరైన పద్ధతి ఏది?
జ: ఆగమన, నిగమన పద్ధతులు
 

3.  అని నిరూపించడానికి అనువైన బోధనా పద్ధతి
జ: విశ్లేషణ పద్ధతి
 

4. a + b + c = 0 అయితే a3 + b3 + c3 = 3abc అని నిరూపించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
జ: సంశ్లేషణ
 

5. గణితం నేర్చుకోవడానికి అత్యంత సహజమైన అభ్యసన పద్ధతి
జ: ఆగమన పద్ధతి
 

6.   అయితే   అని నిరూపించడానికి ఉపయోగించే బోధనా పద్ధతి?
జ: సంశ్లేషణ 
 

7. '9x2 - 16 ను కారణరాశులుగా విభజించు' అనే సమస్యను బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: నిగమన
 

8. కిందివాటిలో ఆగమన పద్ధతికి చెందిన గుణం
(i) తార్కిక పద్ధతి                         (ii) ఆలోచన, పరిశీలన, ప్రయోగాత్మకత అభివృద్ధి చెందుతాయి.
(iii) ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది.    (iv) ఒక సూత్రం నుంచి మరో సూత్రాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.
జ: i, ii, iii
 

9. ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన శాస్త్రవేత్త ఎవరు?
జ: పెస్టాలజీ
 

10. సంశ్లేషణ పద్ధతిలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది?
జ: జ్ఞాపకశక్తి
 

11. నిగమన పద్ధతికి చెందిన గుణం
(i) కాలాన్ని పొదుపు చేస్తుంది.                 (ii) గణనలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది.
(iii) ఉపజ్ఞతను పెంపొందిస్తుంది.               (iv) సంపూర్ణ అవగాహన పెరుగుతుంది.
జ: i, ii
 

12. గణిత గ్రంథ రచనల్లో ఉపయోగించే పద్ధతి
జ: సంశ్లేషణ
 

13. కిందివాటిలో 'విశ్లేషణ'కు చెందిన అంశాలేవి?
(i) ఇది ఒక ఆలోచనా ప్రక్రియ.                (ii) సారాంశం నుంచి దత్తాంశం వరకు సాగుతుంది.
(iii) ఇది దీర్ఘ, మనోవైజ్ఞానిక పద్ధతి.            (iv) సంపూర్ణ అవగాహన పెంపొందుతుంది.
జ: పైవన్నీ
 

14. 'శీర్షాభిముఖ కోణాలు సమానం' అని సాధారణీకరించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: ఆగమన
 

15. '(3x2)4 ను సూక్ష్మీకరించండి?' అనే సమస్యను బోధించడానికి సరైన బోధనా పద్ధతి
జ: నిగమన
 

16. జ్యామితీయ సిద్ధాంతాల నిరూపణలో ఏ బోధనా పద్ధతిని ఉపయోగిస్తారు?
జ: విశ్లేషణ
 

17. 1 + 3 = 4; 1 + 3 + 5 = 9; 1 + 3 + 5 + 7 = 16 ఉదాహరణల నుంచి  1 + 3 + 5 + ......... (n సంఖ్యలు) = n2 అనే సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: ఆగమన
 

18.   అని రాబట్టడానికి సరైన బోధనా పద్ధతి ఏది?
జ: నిగమన
 

19. సంశ్లేషణా పద్ధతి పరిమితి
(i) సంపూర్ణ అవగాహన ఉండదు.                    (ii) విద్యార్థి సందేహాలు నివృత్తి కావు.
(iii) స్మృతికి అధిక ప్రాధాన్యత ఉంటుంది.          (iv) ఆవిష్కరణకు, ఆలోచనలకు అవకాశం లేదు.
జ: i, ii, iv
 

20. కిందివాటిలో 'సూత్రీకరణ పద్ధతి' ఏది?
1) ఆగమన              2) నిగమన            3) విశ్లేషణ           4) సంశ్లేషణ
జ: ఆగమన

21. అన్వేషణ పద్ధతికి మూలపురుషుడు ఎవరు?
జ: ఆర్మ్‌స్ట్రాంగ్
 

22. 'వనరులు ఎలా సేకరించాలి?' అనే విషయం ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానాన్ని సూచిస్తుంది?
జ: పథక నిర్మాణం
 

23. విద్యార్థులు వారి స్థాయుల్లో ఒక పరిశోధకుడిగా, శాస్త్రజ్ఞుడిగా భావించుకునే గణిత బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ పద్ధతి
 

24. పునశ్చరణకు అవకాశం లేని పద్ధతి ఏది?
జ: ప్రాజెక్ట్ పద్ధతి
 

25. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుంది?
1) స్నేహితుడిగా           2) మార్గదర్శకుడిగా           3) తత్త్వవేత్తగా          4) అన్నీ
జ: అన్నీ
 

26. విద్యార్థులతో గింజలను కుప్పలుగా పెట్టించి, ఒక్కో కుప్పలో గింజల సంఖ్య ఆధారంగా గుణకార పట్టికను తయారుచేయడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ

27. 'సమస్య పరిష్కారానికి ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకత్వం మాత్రమే చేస్తూ, సమస్య పరిష్కారం చేయకూడదు' అనే విధానాన్ని సూచించే బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ
 

28. విద్యార్థి కేంద్రంగా ఉండి, విషయాన్ని చేయడం ద్వారా నేర్చుకోవడం (అవగాహన, వినియోగం, నైపుణ్యాలను అప్రయత్నంగా విద్యార్థులకు కలిగించడం) అనే లక్షణం ఏ పద్ధతికి చెందుతుంది?
జ: ప్రకల్పన
 

29. 'ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయ పూర్వకమైన కృషి' అని నిర్వచించినదెవరు?
జ: కిల్‌పాట్రిక్
 

30. కిందివాటిలో ప్రాజెక్టు ఏది?
i. పాఠశాలలో కో-ఆపరేటివ్ బ్యాంకు నిర్వహించడం.
ii. ఒక ఇంటి నిర్మాణానికి పథకం, అంచనాను రూపొందించడం.
iii. త్రిభుజ వైశాల్యానికి సూత్రం రాబట్టడం.
iv. గ్రంథాలయాన్ని నిర్వహించడం.
జ: i, ii, iv
 

31. దత్త సమస్యలో తెలిసిన, కనుక్కోవాల్సిన అంశాల మధ్య ఉన్న ప్రాథమిక సంబంధాలను నిర్ణయించడంలో సహాయపడేలా పటం రూపంలో విద్యార్థికి సమస్యను అందచేయడం అనేది ఏ సమస్యా పరిష్కార పద్ధతి?
జ: రేఖాచిత్ర పద్ధతి
 

32. మనోవిజ్ఞానశాస్త్ర అభ్యసనా సూత్రాలపై ఆధారపడిన పద్ధతి?
జ: ప్రకల్పనా పద్ధతి
 

33. గణిత ఉపాధ్యాయుడు స్నేహితుడు, నాయకుడిగా ఉండే బోధనా పద్ధతి?
జ: ప్రయోగశాల
 

34. రాంబస్ (సమచతుర్భుజ) లక్షణాలను అన్వేషించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది?
జ: అన్వేషణ
 

35. సమస్యా పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం ఏది?
జ: సమస్యను గుర్తించడం
 

36. శంకువు ఘనపరిమాణం   ఘ.యూ. అని నిరూపించడానికి అనువైన బోధనా పద్ధతి?
జ: ప్రయోగశాల
 

37. కిందివాటిలో కిల్‌పాట్రిక్ ప్రకారం ప్రాజెక్ట్ కానిది-
1) ఉత్పత్తిదారుల ప్రాజెక్ట్     2) వినియోగదారుల ప్రాజెక్ట్    3) మేధోసంబంధమైన ప్రాజెక్ట్    4) సమస్యా ప్రాజెక్ట్
జ: మేధోసంబంధమైన ప్రాజెక్ట్
 

38. కఠినంగా ఉండే రాత సమస్యకు సదృశంగా తేలికైన మౌఖిక సమస్య ఇచ్చి, ఆ సాధనా విధానాన్ని క్లిష్ట సమస్యకు అన్వయించి, తద్వారా దత్త సమస్యను పరిష్కరించే సమస్యా పరిష్కార పద్ధతి
జ: సాదృశ్యాల
 

39. కిందివాటిలో ప్రకల్పనా పద్ధతికి చెందిన గుణం
i. లక్ష్యాధారంగా ఉంటుంది.
ii. ప్రణాళికాబద్ధంగా ఉంటుంది.
iii. పనిచేస్తూ నేర్చుకోవడం అనే సూత్రం ఇమిడి ఉంటుంది.
iv. గణితతత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది.
జ: i, ii, iii
 

40. సమస్యా పరిష్కార పద్ధతికి చెందిన గుణం
i. విద్యార్థుల్లో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది.
ii. విద్యార్థుల్లో ఉన్నత ఆలోచనల అభివృద్ధికి దోహదపడుతుంది.
iii. పట్టుదల, ఆత్మవిశ్వాసం, సహనం లాంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
iv. స్వయం అభ్యసనకు దోహదపడుతుంది.
జ: ii, iii, iv

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌