• facebook
  • whatsapp
  • telegram

గణిత ఉపాధ్యాయుడు 

1. గణిత ఉపాధ్యాయుడి లక్షణం
1) విషయ పరిజ్ఞానం, మంచి బోధనా పటిమ ఉండాలి.
2) సమస్యా పరిష్కార శక్తి ఉండి, విద్యార్థులకు సహాయపడాలి. 
3) గణిత సామగ్రిని సమర్థవంతంగా ఉపయోగించాలి.
4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)
 

2. గణిత ఉపాధ్యాయుడి లక్షణం కానిది
1) సమయపాలన పాటించడం                                            2) నాయకత్వ లక్షణాలు
3) గణితమే కాకుండా వీలైనన్ని ఇతర రంగాల్లో కనీస పరిజ్ఞానం ఉండటం      4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)
 

3. మంచి గణిత ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి?
1) గణితం పట్ల సంపూర్ణ అవగాహన, సాధికారత ఉండటం.
2) గణితాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవడం.
3) విద్యార్థులను గణిత అభ్యసన పట్ల ఉత్సాహితులను చేయాలి.
4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)
 

4. ఒక గణిత ఉపాధ్యాయుడిగా నీవు ప్రతిభావంతులను ఎలా ప్రోత్సహిస్తావు?
1) ప్రతిభా పరీక్షలకు సన్నద్ధం చేస్తాను.                                        
2) గణిత గ్రంథాల పఠనం అలవాటు చేస్తాను.
3) సమస్యలకు ఇతర పరిష్కార మార్గాలను అన్వేషించేలా చేస్తాను.    
4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)
 

5. విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తి కలిగించడానికి చేపట్టదగిన కార్యక్రమం
i) గణితంలో చిక్కు ప్రశ్నలు వేయడం     ii) పజిల్స్
iii) రిడిల్స్                             iv) విద్యార్థులను ఎల్లప్పుడూ పొగడటం
జ: i, ii, iii
 

6. గణిత ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని పెంచడానికి చేపట్టదగిన చర్య ఏది?
i) ఎప్పటికప్పుడు విద్యార్థుల నోటు పుస్తకాలను చూసి తప్పులను సరిదిద్దడం.
ii) ప్రతిభావంతులైన విద్యార్థులతో సరికొత్త ప్రశ్నలు రాయించి అందరితో సాధింపజేయడం.
iii) విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నియోజనాలు ఇవ్వడం.
iv) కుటుంబ సభ్యులతో చర్చించడం.
జ: i, ii, iii

7. ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి తక్కువ సమయాన్ని తీసుకునేవారు
జ: ప్రతిభావంతులు
 

8. కిందివాటిలో ప్రతిభావంతుల లక్షణాన్ని గుర్తించండి.
i) గణిత విషయాలను త్వరగా, సులభంగా అవగాహన చేసుకుంటారు.
ii) అమూర్త భావనలను అర్థం చేసుకోలేరు.
iii) ఆలోచనల్లో సృజనాత్మకత ఉండదు.
iv) సవాళ్లతో కూడిన గణిత సమస్యలను స్వీకరిస్తారు.
జ: i, iv
 

9. AMTI (అసోసియేషన్ ఆఫ్ మాథమేటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా) ఎక్కడ ఉంది?
జ: చెన్నై
 

10. గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు నిర్వహించదగిన కార్యక్రమం ఏది?
జ: అభ్యసన స్థాయిని గుర్తించి, వారి అవసరాలకు తగినట్లు బోధించడం.
 

11. కాల నిర్ణయ పట్టికలో గణితానికి ఎన్నో పీరియడ్ కేటాయించాలి?
జ: రెండు
 

12. మొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ ఏ దేశంలో జరిగింది?
జ: రొమేనియా
 

13. గణితంలో వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి చేపట్టదగిన కార్యక్రమం ఏది?
1) బోధనలో దృశ్యోపకరణాలను వాడటం.
2) తరుచుగా లోపనిర్థారణ నికషలు నిర్వహించి, లోపనివారణ చర్యలు చేపట్టడం.
3) ప్రోత్సాహకాలు ఇవ్వడం.
4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌