• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర పథక రచన

* ప్రభుత్వం పాఠశాల విద్య కోసం విద్యా ప్రణాళికను రూపొందించి సరఫరా చేస్తుంది.
* విద్యా ప్రణాళికలోని పాఠ్యాంశాలను ఏ నెలలో ఎంతెంత బోధించాలి, ఎప్పుడు ఎంత బోధించాలి అనే ఆలోచనల ప్రతిరూపమే పథక రచనలు.
 

పథక రచనలు - రకాలు:
1) వార్షిక పథకం
2) యూనిట్ పథకం
3) పాఠ్య పథకం
1) వార్షిక పథకం:
* జూన్ నుంచి ఏప్రిల్ వరకు జరిగే విద్యా కార్యక్రమాలను వార్షిక పథకం అంటారు.
* ఒక తరగతికి చెందిన ఒక సంవత్సర కాలంలో బోధించాల్సిన విషయాలను యూనిట్లుగా విడగొట్టి వాటికి తగినన్ని పీరియడ్‌లను కేటాయించి నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని వార్షిక ప్రణాళిక అంటారు.
 

వార్షిక పథకాన్ని రూపొందించేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు
1) పాఠశాల పనిదినాలు - 220
2) ఉపాధ్యాయుడు ప్రకటించే ప్రత్యేక సెలవులు
3) ప్రభుత్వం ప్రకటించే ప్రత్యేక సెలవులు
4) పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే రోజులు
5) ఉపాధ్యాయుడు వృత్త్యంతర శిక్షణ పొందే రోజులు
6) ప్రతినెలలో లభ్యమయ్యే పనిదినాల సంఖ్య
 

వార్షిక పథకం నమూనా:

 

ప్రయోగాలు:
* ఏ యూనిట్‌ను ఏ నెలలో బోధించాలో తెలుసుకుంటాడు.
* ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు.
కిందివాటిలో వార్షిక పథకంలో లేని అంశం (      )
1) యూనిట్స్
2) యూనిట్ పూర్తి చేయడానికి పట్టే పీరియడ్ల సంఖ్య
3) నల్లబల్ల
4) సబ్ యూనిట్స్
 

ఉపయోగాలు:
* నిర్ణీత కాలంలో సిలబస్‌ను పూర్తిచేసి, రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
* ఇది సుదీర్ఘమైన ప్రణాళిక లేదా దీర్ఘకాలిక ప్రణాళిక.
* వార్షిక పథకంలో ప్రధాన అంశం యూనిట్.
 

2. యూనిట్ పథకం:
నిర్వచనాలు

* ఒక సమగ్ర, సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరను యూనిట్ అంటారు - హెర్బార్ట్
* అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల అతిపెద్ద విషయ భాగాన్నే యూనిట్ అంటారు - ప్రెస్టిన్
* విద్యార్థుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా శ్రద్ధతో ఎన్నుకునే విషయ బాహ్య రూపాన్ని యూనిట్ అంటారు - సాంపోర్ట్

టైమ్ షెడ్యూల్ చార్టు నమూనా

నోట్: టైమ్ షెడ్యూల్ చార్టును రూపొందించుకున్న తర్వాత యూనిట్ పథకం తయారుచేయాలి.
* ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ పథకం ద్వారా బోధన 1972 - 73లో ప్రారంభమైంది.
* వార్షిక పథకం తయారు చేసిన తర్వాత ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సిన పాఠ్య పథకమే యూనిట్ పథకం.

మంచి యూనిట్ లక్షణాలు:
* విద్యార్థులకు ప్రత్యక్ష, వ్యక్తిగత అనుభవాత్మక కృత్యాలను అందించేదిగా ఉంటుంది.
* యూనిట్‌లో విద్యార్థి నిత్యజీవితానికి సంబంధించిన అన్వయాలు ఉండాలి.
* విద్యార్థులకు ఆసక్తిని కలింగిచే కృత్యాలు ఉండాలి.
* ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని దాటి వెళ్లడానికి అవకాశం ఉండాలి.
 

పాఠ్య పథకం:
* సబ్ యూనిట్‌లోని ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారుచేసిన పథకాన్నే పాఠ్య పథకం అంటారు.
* సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శినే పాఠ్యపథకం అంటారు.
 

పాఠ్యపథకం - హెర్బార్ట్ సోపానాలు:
* జె.ఎఫ్. హెర్బార్ట్ అనే విద్యావేత్త సూచనలతో పాఠ్యపథకానికి గుర్తింపు వచ్చింది.
* ఈయన పాఠ్యపథకంలో సూచించిన సోపానాలు 6.
1. సన్నాహం: ఈ దశలో ఉపాధ్యాయుడు తాను బోధించే పాఠ్యాంశానికి సంబంధించి పూర్వజ్ఞానాన్ని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా రాబడతారు.
* ఈ దశలో విద్యార్థులు తెలిసిన భావాల ఆధారంగా తెలియని విషయాల వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తారు.
2. సమర్పణ: ఈ దశలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని విషయాలను ఒక తార్కిక క్రమంలో అందించడానికి ప్రయత్నిస్తాడు.
3. సంసర్గం: ఈ దశలో పూర్వ భావాలు, నూతన భావాల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది.
4. సాధారణీకరించడం: ఈ దశలో విద్యార్థులు పాఠ్యాంశంలోని నూతన భావాలను అవగాహన చేసుకొని సాధారణీకరణం చేయడమనే క్లిష్టస్థాయికి చేరుకుంటారు.
5. అన్వయం: సాధారణీకరణం చేసిన విషయాలను తగిన సమయంలో వినియోగించడానికి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటారు.
6. పునర్విమర్శ: ఈ దశలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశంపై విద్యార్థులు ఆర్జించిన లక్ష్యాలను పరీక్షిస్తాడు.
 

పాఠ్యపథకం నమూనా:

 

ఉపయోగాలు:
* ఉపాధ్యాయుడు తక్కువ శ్రమతోనే లక్ష్యాలను సాధించగలడు.
* ఉపాధ్యాయుడి పాఠ్యాంశ బోధన ఆసక్తికరంగా ఉంటుంది.
* ఉపాధ్యాయుడికి సమయం ఆదా అవుతుంది.
* ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు
* మూల్యాంకనం క్రమబద్ధంగా జరుగుతుంది.

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌