• facebook
  • whatsapp
  • telegram

బోధనోపకరణాలు  

'అభ్యసనానికి ప్రేరణ, పునర్బలనం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్యశ్రవణ ఉపకరణాలు.' - బర్టన్
       'అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు.'   -కార్టర్ వి.గుడ్
      'బోధన, శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తులు, సమూహాల మధ్య ఆలోచనలను పంచుకోవడానికి, సమాచారాన్ని వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తుజాలమే దృశ్యశ్రవ్య సాధనాలు.'              - ఎడ్గార్‌డేల్ 
దృశ్యశ్రవ్య సాధనాలే బహుళ సంవేదనాత్మక సామాగ్రి. 
       'దృష్టి, శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్యశ్రవ్య ఉపకరణాలు.'  - విద్యా నిఘంటువు 
    'పలు సంవేదనాత్మక మార్గాలను ఉపయోగించి భావనలను, వ్యాఖ్యలను, ప్రశంసలను చేయడానికి, వివరించడానికి, పోల్చడానికి ఉపాధ్యాయులకు సహకరించే ప్రత్యామ్నాయ సాధనాలు బోధనోపకరణాలు.'     - మెక్‌నోన్,రాబర్ట్

          బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి, ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలని కొఠారి కమిషన్ సూచించింది. 
          సంప్రదాయక దృశ్యశ్రవ్య ఉపకరణాల స్థానంలో వెల తక్కువ ఉన్న, వెలలేని, అభివృద్ధి పరిచిన ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావకారిగా, వాస్తవికతకు దగ్గరగా మలచాలని 1986 జాతీయ విద్యా విధానం నొక్కి చెప్పింది. 
          శరీర భాగాలైన కాళ్లు, చేతులు, కళ్లు, చెవులు, నాసికకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ, ప్రతిభాయుతమైన వాస్తవ విద్యను అందించవచ్చునని గాంధీజీ అభిప్రాయపడ్డారు. 
          బోధనాభ్యసన క్రియను సమర్థంచేయగల సాధనాలను ఉపాధ్యాయులు తయారుచేసుకోవాలని తద్వారా బోధనాంశానికి, ఉపకరణాలకు మధ్య సమన్వయం సాధించవచ్చునని 1992 పునర్నవీకరించిన జాతీయ విద్యా విధానం అభిప్రాయపడింది.

 

బోధనోపకరణాలు - ప్రాముఖ్యం:
* సంవేదనాత్మక శక్తుల సమగ్ర వినియోగం.
* బోధనా సిద్ధాంతాల ప్రాతిపదికన బోధన జరుగుతుంది.
* విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచవచ్చు.
* ప్రత్యక్ష అనుభవాల ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయి.

* వైవిధ్యం ఉన్న వివిధ అనుభవాలను కలిగించవచ్చు.
* తరగతి గదిలోని క్రమశిక్షణా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
* అభ్యసనలో విద్యార్థులకు పునర్బలనాన్ని కలిగిస్తాయి.
* విద్యార్థుల వైయక్తిక భేదాలకు తగిన ప్రాధాన్యం లభిస్తుంది.

 

బోధనోపకరణాలు - వర్గీకరణ: బోధనోపకరణాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
I. ముద్రితామాధ్యమాలు:
1. గ్రంథాలు   2. వర్క్ పుస్తకాలు   3. మ్యాగజైన్‌లు   4. సమాచార పత్రికలు   5. కరపత్రాలు

 

II. యాంత్రికత లేని సాధనాలు:
1. రేఖాచిత్ర సాధనాలు:
ఎ) ఛాయాచిత్రాలు   బి) ఫ్లాష్‌కార్డులు   సి) పోస్టర్లు   డి) చార్టులు   ఇ) బొమ్మలు   ఎఫ్) గ్రాఫ్‌లు  జి) మ్యాప్‌లు
హెచ్) కార్టూన్‌లు  ఐ) హాస్య పత్రికలు (కామిక్స్).

 

2. ప్రదర్శనా బల్లలు:
ఎ) నల్లబల్ల   బి) తెల్లబల్ల   సి) ప్యానల్ బోర్డు   డి) బులిటెన్ బోర్డు   ఇ) మ్యాగ్నెట్ బోర్డు   ఎఫ్) పెగ్ బోర్డు జి) రోలింగ్ బోర్డు

 

3. త్రిమితీయ సాధనాలు:
ఎ) మాదిరి/ నమూనాలు   బి) వస్తువులు   సి) డయోరమా   డి) తోలుబొమ్మలు   ఇ) కదిలే బొమ్మలు ఎఫ్) మైక్రోస్కోపులు   జి) ప్రయోగ పరికరాలు

 

III. యాంత్రిక సాధనాలు:
1. ప్రక్షేపిత సాధనాలు:

ఎ) ఫిల్మ్‌లు   బి) ఫిల్మ్ స్ట్రిప్‌లు   సి) ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్   డి) స్త్లెడ్‌లు   ఇ) ఎపిడియోస్కోప్   ఎఫ్) టేప్‌రికార్డర్లు, క్యాసెట్లు

 

2. బహుళార్థక సాధనాలు (Mass Media)
ఎ) రేడియో   బి) టీవీ   సి) టెలికాన్ఫరెన్స్   డి) వీడియో కాన్ఫరెన్స్

 

3. కంప్యూటర్లు

IV. క్రియాశీలతా సాధనాలు:
1. క్షేత్ర పర్యటనలు   2. ప్రదర్శనలు   3. నాటకీకరణ

 

రేడియో

* ఉన్నత విద్యాక్షేత్ర విషయాలపై రేడియో బ్రాడ్‌కాస్టింగ్ అభివృద్ధిచెందిన దేశాల్లో 1920లో మొదట జరిగింది.
* మన దేశంలో ప్రైవేటు వ్యక్తులు బొంబాయి, కలకత్తాలలో ట్రాన్స్‌మీటర్లను ఏర్పాటుచేసి 1927లో రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ప్రారంభించారు.
* 1930లో భారత ప్రభుత్వం దీన్ని చేపట్టి ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసును ఏర్పాటుచేసింది.
* 1936లో ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసును 'ఆల్ ఇండియా రేడియో'గా మార్చారు.
* 1957 నుంచి 'ఆకాశవాణి' అని, ప్రస్తుతం 'ప్రసారభారతి' అని పిలుస్తున్నారు.

 

రేడియో ప్రసారాలు రెండు రకాలు:
1) సాధారణ కార్యక్రమాలు   2) విద్యా కార్యక్రమాలు.

 

రేడియో ప్రసారాల స్క్రిప్టుల్లోని రకాలు:
1) నేరుగా మాట్లాడటం   2) డాక్యుమెంటరీ   3) ముఖాముఖీ మాట్లాడటం   4) ప్యానల్ చర్చ  
5)సజీవసందర్భాలు   6) చర్చా గోష్టులు   7) నాటకీకరణ   8) క్విజ్ సెషన్.

 

రేడియో కార్యక్రమాల నిర్వహణ:
1. షెడ్యూళ్ల తయారీ   2. సమన్వయం   3. అభ్యాసకులను సిద్ధపరచడం   4. తగిన వాతావరణాన్ని కల్పించడం 5. బోధనాలక్ష్యాలు   6. చర్చ   7. నియోజనం   8. మూల్యాంకన నివేదిక.

 

టెలివిజన్ ద్వారా బోధన జరపడంలో సోపానాలు:
1. విద్యార్థిని సిద్ధపరచడం.   2. దూరదర్శన్ కార్యక్రమాన్ని సమర్పించడం.  3. పాఠ్య విషయాన్ని చర్చించడం. 4. విద్యార్థిని పరీక్షించడం.   5. పాఠ్యాంశాన్ని సమీక్షించడం.

టెలివిజన్ కార్యక్రమాల్లోని రకాలు:
1. వినోద కార్యక్రమాలు   2. పాఠ్య విషయాలకు సంబంధించిన కార్యక్రమాలు   3. ప్రత్యేక కార్యక్రమాలు 4.ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు.
* MANA T.V., కె.యు.బ్యాండ్ ద్వారా ప్రత్యక్ష, రికార్డు చేసిన పాఠ్యాంశాలు 6 నుంచి 10వ తరగతి వరకు, బి.ఎడ్., డి.ఎడ్.లలోని చాత్రోపాధ్యాయులకు, అందులోని అధ్యాపకులకు, టీచర్లకు 2011 నుంచి SAPNET ద్వారా ప్రసారం చేస్తున్నారు.
* విందాం - విద్యా తరంగాలు అనే రేడియో కార్యక్రమాలు కూడా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాఠశాల విద్య, ప్రసారభారతి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
* ఉపాధ్యాయ, ఉపాధ్యాయ బోధకుల కార్యక్రమాలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రసారమవుతాయి.

 

ప్రత్యామ్నాయ పరికరం: ఒక నియమాన్ని లేదా ఒక శాస్త్రీయ లేదా దృగ్విషయాన్ని లేదా ధర్మాన్ని లేదా యదార్థాన్ని స్పష్టంగా వివరించడానికి తయారుచేసిన, తక్కువ ధరతో కూడిన, సంప్రదాయ సిద్ధ పరికరానికి బదులుగా వాడే దాన్ని 'ప్రత్యామ్నాయ పరికరం' అంటారు.

ప్రత్యామ్నాయ పరికరం తయారీ - సోపానాలు:
లక్ష్యాలు  
  ప్రణాళిక 
  తయారీ    పైలెట్ టెస్టింగ్    నిర్ధారించడం    ఉత్పత్తి చేయడం.

ప్రత్యామ్నాయ బోధనోపకరణాల ప్రయోజనాలు:
* ద్రవ్యాన్ని పొదుపు చేయవచ్చు.
* నిర్మాణాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
* వ్యర్థం నుంచి అర్థవంతమైన పరికరాల తయారీ.
* పాఠశాలలకు పరికరాల లోటు తీరుతుంది.
* నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండి, స్వయం సమృద్ధి సాధించవచ్చు.
* ప్రత్యామ్నాయ పరికరాల తయారీ, వినియోగం ద్వారా ఆర్థిక విలువ, విద్యా విలువ, మనో వైజ్ఞానిక విలువ, సాంఘిక విలువ నెరవేరతాయి.

 

ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధన పేటిక:
* ఒ.బి.బి. పథకంలో భాగంగా సరఫరా చేసిన 35 బోధనాభ్యసన సామగ్రిలో ఇది ఒకటి.
* ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించింది.  సైన్సు విషయాలను చిన్న ప్రయోగాలతో అవగాహన చేయించడమే దీని ముఖ్య ఉద్దేశం.

* దీనిలో 1. తక్కువ ఖరీదుండే సామగ్రి 2. చేతిపనిముట్లు
* దీనిలో మొత్తం 76 రకాల వస్తువులు ఉంటాయి.
* పిల్లల్లో శాస్త్రీయ వైఖరులను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతుంది.

 

సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక:
* ప్రాథమికోన్నత పాఠశాలకు (6, 7 తరగతులకు) ఉద్దేశించింది.
* దీనిలోని వస్తువులు 1. పరికరాలు (70) 2. రసాయనాలు (23) 3. గాజు సామగ్రి (14).
* మొత్తం వస్తువుల సంఖ్య = 107.
* ఇది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపయోగపడుతుంది.

ఇంటర్‌నెట్

* ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ నెట్‌వర్కులతో కూడిన నెట్‌వర్క్‌ను ఇంటర్‌నెట్ పేరుతో పిలుస్తున్నారు.
¤* భారతదేశంలో 1995 ఆగస్టు నుంచి విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (విఎస్ఎన్ఎల్) ఇంటర్‌నెట్ సేవలు ప్రారంభించింది. మొదట్లో ఢిల్లీ, కలకత్తా, చెన్నైలలో ఈ సేవలు అందుబాటులో ఉండేవి.

* 1998 నాటికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ (డిఒటి), విఎస్ఎన్ఎల్ నిర్వహించే 42 నోడ్స్‌కు సేవలు విస్తరించాయి.
* ఐఎస్‌పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్.
* ఇంటర్‌నెట్‌తో అనుసంధానానికి మూడు భిన్నమైన పద్ధతులున్నాయి. అవి... 1. డెడికేటెడ్ ఇంటర్‌నెట్ కనక్షన్ 2. డయల్ ఆఫ్ ఇంటర్‌నెట్ కనక్షన్ 3. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్ కనక్షన్.
* వెబ్ అంటే World Wide Web (WWW) అని అర్థం. ఇది ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచిస్తుంది.
* వెబ్ పేజీలు చూడాలంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ లాంటి బ్రౌజర్ అవసరమవుతుంది.
* వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇంటర్‌నెట్‌లో ఒక భాగం.
* ఇ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిలింగ్. ఇది ఇంటర్‌నెట్‌లో అత్యధికంగా ఉపయోగించే సర్వీసు.
* వెబ్‌లోని సమాచారాన్ని అన్వేషించేందుకు ఉపయోగించే సాధనాలనే 'సెర్చ్ ఇంజిన్స్' అంటారు.
* ఎంఎస్ఎన్, అల్టావిస్టా, గూగుల్ అనేవి సెర్చ్ ఇంజన్లకు ఉదాహరణలు.
* ఇంటర్‌నెట్‌లో ఎక్కడో మారుమూల ఉన్న కంప్యూటర్‌లోని ఫైలును మీ కంప్యూటర్‌లో కూడా కాపీ చేసుకునే ప్రక్రియనే డౌన్ లోడింగ్ అంటారు.
* లిస్ట్ సెర్వ్ (LISTSERV): ఇంటర్‌నెట్‌లో లేదా కార్పొరేట్ నెట్‌వర్క్‌లో ఎలక్ట్రానిక్ మెయిలింగ్ లిస్ట్‌లో తయారుచేసి, నిర్వహించి, నియంత్రించేందుకు ఉపయోగించే వ్యవస్థనే 'లిస్ట్‌సెర్వ్' అని పిలుస్తారు.

* లిస్ట్‌సెర్వ్ అనేది  L - సాఫ్ట్ ఇంటర్నేషనల్ లైసెన్స్ పొందిన రిజిష్టర్డ్ ట్రేడ్‌మార్క్. దీన్ని ఎప్పుడూ కేపిటల్ అక్షరాలలోనే రాస్తారు.
¤* యుఆర్ఎల్ అంటే యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఇంటర్‌నెట్‌లో వెబ్‌పేజి కచ్చితంగా ఎక్కడ ఉందో సూచిస్తుంది.
* వెబ్‌లో అనేక రకాల ప్రొటోకాల్స్ ఉన్నాయి. అందులో http ఒకటి.http అంటే hyper text tranfer protocol.
http://www.microsoft.com/catalog/navigation.asp.. లో www అనేది సైట్ వరల్డ్‌వైడ్ వెబ్‌లో ఉందని సూచిస్తుంది.
microsoft అనేది వెబ్‌సైట్ పేరును సూచిస్తుంది.
* .com అనేది వెబ్‌సైట్ డొమైన్ పేరును సూచిస్తుంది.
* .com అంటే వాణిజ్యపరమైంది(commercial).
* /catalog/navigation.asp అనేది వెబ్ సర్వర్‌ను హార్డ్‌డిస్క్‌లో ఉంచిన ఫైల్ పాత్‌ను తెలియచేస్తుంది.

* వెబ్ పేజీలను చూడటాన్ని ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ అంటారు.
* బోధనోపకరణాల్లో మరో ముఖ్యమైన సాధనం టేప్ రికార్డర్.
* భాషాబోధనలో, సంగీతం నేర్చుకునేటప్పుడు, మైక్రో టీచింగ్ నిర్వహణలో టేప్ రికార్డర్‌ను వాడవచ్చు.
* టేప్ రికార్డర్‌ను ఉపపయోగించి ఉచ్ఛారణ దోషాలను నివారించవచ్చు.

 

ఎడ్గార్ డేల్ శంఖానుభవం
(Edgar dale cone of Experience)

1. ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు: ఉదాహరణకు జంతువులు, వాటి నివాసాలు, మొక్కలు, మంచి నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించడం.
 

2. సవరించిన అనుభవాలు (కల్పిత అనుభవాలు): వీటిలో అనుభవాలు పరిమాణం, క్లిష్టత విద్యార్థుల సౌలభ్యం కోసం సవరించి ఉంటుంది. వీటి తయారీ లేదా సహకారంతో విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఉదా: వస్తువులు, నమూనాలు మొదలైనవి.
సామాజిక వనరులు:
1. భౌతిక వనరులు
2. సజీవ సమాజం
3. బౌద్ధిక వనరులు.
భౌతిక వనరులు: ప్రకృతిలోని నదులు, సరుస్సులు, చెరువులు, కర్మాగారాలు పరిశ్రమలు మొదలైనవి.

 

సజీవ సమాజం: జంతువులు, వృక్షాలు, వ్యవసాయ క్షేత్రాలు, జంతు ప్రదర్శనలు, ఆసుపత్రులు మొదలైనవి.
 

బౌద్ధిక వనరులు: వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు, వృత్తి నిపుణులు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు మొదలైనవారు. సామాజిక వనరులు ఎందుకు విద్యాబోధనలో ఉపయోగించుకోవాలో తెలిపినవారు - ఫ్రీమన్, కె.డేలింగ్, టి.ఇ.లేసియన్, జె.ఎస్.సి. టిప్పెట్. సామాజిక వనరుల వినియోగం వల్ల నెరవేరే ప్రయోజనాలను తెలిపినవారు - ఇ.డి. హస్, ఇ.ఎస్. ఓబర్న్, సి.డబ్ల్యు. హఫ్‌మన్.
 

సామాజిక వనరులను వినియోగించుకునే పద్ధతులు: రెండు విధాలు.
1. పాఠశాలను సమాజంలోకి తీసుకుని వెళ్లడం.
2 సమాజాన్ని పాఠశాలకు తీసుకుని రావడం.


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌