• facebook
  • whatsapp
  • telegram

పాఠ్యప్రణాళిక, బోధన ఉపగమాలు - పద్ధతులు  

1. 'కరికులమ్' అనేది ఏ భాషా పదం?
జ: ఇంగ్లిష్

 

2. పాఠశాలలో నిర్ధారించిన లక్ష్యాలనూ, ఉద్దేశాలనూ రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే - కరికులమ్ అని పేర్కొంది-
జ: కన్నింగ్‌హామ్

 

3. ప్రాచీన సంకుచిత దృక్పథంలో పాఠ్య ప్రణాళికగా భావించింది-
జ: పాఠ్యాంశాలు

 

4. పాఠ్య ప్రణాళిక పరిధి-
జ: విస్తృతమైంది

 

5. పాఠశాల జీవితం మొత్తం-
జ: కరికులమ్

 

6. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం - 2005లో పేర్కొన్న మార్గదర్శక సూత్రం కానిది-
జ: కంఠస్తం చేసే పద్ధతిని పెంపొందించడం

 

7. సైన్స్ సహపాఠ్య కార్యక్రమం-
జ: ప్రయోగశాలల ఏర్పాటు, సైన్స్ కార్నర్‌ల ఏర్పాటు, సైన్స్ సెమినార్లు నిర్వహించడం

 

8. బోధించవలసిన అంశాల విస్తృతిని, పరిమితిని తెలియజేసేది-
జ: సిలబస్

 

9. పాఠశాల వెలుపల, లోపల విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపం-
జ: విద్యా ప్రణాళిక

 

10. VI నుంచి X తరగతుల్లో సామాన్యశాస్త్రం విషయ ప్రణాళిక ఆయా తరగతుల స్థాయిని బట్టి ఎన్ని ప్రధానాంశాల్లో వివరించారు?
జ: 7

 

11. 'పాఠ్యప్రణాళిక అనేది అనుభవాల సమగ్ర రూపం, సమైక్యత, సహ సంబంధం పెంపొందించేది' అని పేర్కొన్నది-
జ: సెకండరీ విద్యాకమిషన్

 

12. 'పరిశోధనల ఆధారంగా పాఠ్య ప్రణాళికలో తరచూ మార్పులుండాలి.' అని పేర్కొంది-
జ: కొఠారి కమిషన్

 

13. 'పాఠ్యప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి'. అని పేర్కొంది-
జ: కొఠారి కమిషన్

 

14. ఎస్.యు.పి.డబ్ల్యు. భావనను ప్రవేశపెట్టింది-
జ: ఈశ్వరీభాయ్ పటేల్

 

15. పర్యావరణ పరిరక్షణ గురించి తెలిపే పరిసరాల విజ్ఞానంలోని ప్రధానాంశం-
జ: పరిసరాల నుంచి అభ్యసనం

 

16. ఎన్.సి.ఎఫ్. - 2005 ప్రకారం పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను ఏ ప్రాతిపదికపై రాశారు-
జ: శాంతి కోసం విద్య

 

17. ఎన్.సి.ఎఫ్. - 2005 ప్రకారం పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాల్లో ప్రాధాన్యం ఇచ్చిన అంశాలు-
జ: పరిశీలన, విశ్లేషణ, పరికల్పనలు

 

18. పరిసరాల విజ్ఞానంలో మన శరీరం - ఆరోగ్యం - పరిశుభ్రత, కుటుంబం, గాలి, నీరు, మన నివాసం, మన ఆహారం, మొక్కలు - జంతువులు, మన భూమిలను ఏ విధానంలో అమర్చారు?
జ: సర్పిలాకార విధానం

 

19. 'బడిపిల్లల పుస్తకాల సంచుల బరువును తగ్గించాలి' అని పేర్కొన్న కమిటీ
జ: యశ్‌పాల్ కమిటీ

 

20. జాతీయ విద్యావిధానం ప్రకారం (ఎన్.పి.ఇ.- 1986) జాతీయ సమైక్యతా భావనను పెంపొందించడానికి పాఠ్యప్రణాళికలో చేర్చిన విజ్ఞానశాస్త్ర అంశాలు-
జ: పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం, పరిమిత కుటుంబ భావన

 

21. 'విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక సమస్య పరిష్కార పద్ధతిని, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలి'. అని పేర్కొంది-
జ: జాతీయ విద్యావిధానం - 1986

 

22. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం - 2005 ప్రకారం సరైంది-
జ: ఎలిమెంటరీ దశ I-VIII, సెకండరీ దశ IX-X, హయ్యర్ సెకండరీ దశ XI-XII

 

23. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనమని పేర్కొంది-
జ: జీవన్

 

24. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడాన్ని ఆగమనమని పేర్కొంది-
జ: ఫౌలర్

 

25. నేర్చుకున్న విషయాలు మరచినా, పునఃనిర్మాణానికి అవకాశం ఉన్న ఉపగమం-
జ: ఆగమనం
 

26. వినియోగ లక్ష్యాన్ని సంతృప్తి పరిచే పద్ధతి-
జ: నిగమనం

 

27. సాధారణీకరణాలను, సిద్ధాంతాలను నూతన పరిస్థితులకు అన్వయింపజేసి, వాటి యధార్థతను తెలుసుకునే పద్ధతి-
 నిగమనం

 

28. బట్టీస్మృతిని పెంపొందించే పద్ధతి-
జ: నిగమనం

 

29. విద్యార్థులకు అనుభవంలోలేని కొత్త విషయాలు బోధించడానికి ఉపయోగపడని పద్ధతి-
జ: ఉపన్యాస

 

30. విద్యార్థుల్లో కేవలం పరిశీలనా నైపుణ్యాలను మాత్రమే కొంతవరకు పెంపొందించగల పద్ధతి-
జ: ఉపన్యాస - ప్రదర్శనా పద్ధతి

 

31. విజ్ఞానశాస్త్ర విషయాలను ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులతో వివరిస్తూ బోధించే పద్ధతి -
జ: చారిత్రక

 

32. విజ్ఞానశాస్త్ర విషయాలను ద్రవ్యాత్మక, సంశ్లేషణాత్మక నిర్మాణాలుగా వివరిస్తూ పాఠ్యాంశాలను బోధించే పద్ధతి -
జ: నిర్మాణాత్మక పద్ధతి

 

33. శాస్త్రీయ పద్ధతిలో అతి కష్టమైన సోపానం-
జ: దత్తాంశాలను ప్రతిక్షేపించడం
 

34. శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థి ఆలోచనలు, వివిధ రకాల సామర్థ్యాలు, నైపుణ్యాలు ప్రదర్శించడానికి అనువైన సోపానం-
జ: దత్తాంశాలను ప్రతిక్షేపించడం

 

35. 'హ్యూరిస్టిక్' అనే పదం దేని నుంచి ఉత్పన్నమైంది?
జ: Heuristo

 

36. విద్యార్థి తనకుతానే పరిశీలించడం, తర్కిం చడం, తానే పనిచేయడం, ఆలోచించడం లాంటి స్వయంకృషి ఉన్న పద్ధతి-
జ: అన్వేషణ

 

37. శాస్త్రీయ విధానంలో విద్యార్థికి ఎక్కువ తర్ఫీదు ఇచ్చే బోధన పద్ధతి-
జ: అన్వేషణ పద్ధతి

 

38. 'ప్రయోగశాలల కోసమే విజ్ఞానశాస్త్రం ఏర్పడింది' అనే తప్పుడు భావనను విద్యార్థుల్లో కలిగించే పద్ధతి-
జ: అన్వేషణ పద్ధతి

 

39. ప్రాథమిక తరగతుల్లో అమలుపరచడానికి వీలుకాని బోధన పద్ధతి-
జ: అన్వేషణ పద్ధతి

 

40. ఒక ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధమైన సామాజిక, సహజ పద్ధతుల్లో ఆ ప్రయోజనాన్ని సాధించడం-
జ: ప్రాజెక్టు

 

41. ప్రాజెక్టు పద్ధతికి ఆధారమైంది-
జ: వ్యవహారిక సత్తా వాదం

 

42. విద్యార్థి జీవితం కేంద్రంగా ఉన్న బోధన పద్ధతి-
జ: ప్రాజెక్టు పద్ధతి

 

43. ప్రాజెక్టు పద్ధతిని రూపొందించింది-
జ: జె.ఎ.స్టీవెన్‌సన్

 

44. థారన్‌డైక్ అభ్యాసనా సూత్రాన్ని సంతృప్తిపరిచేది-
జ: ప్రాజెక్టు అమలుపరచడం

 

45. ఆట, పాటల ద్వారా శారీరకధారుడ్యాన్ని పెంపొందించాలని సూచించిన కమిటీ-
జ: ఈశ్వరీభాయ్

 

46. ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రభావపూరితమైన పద్ధతి-
జ: కృత్య పద్ధతి

 

47. ప్రాజెక్టు పద్ధతిలో ఫలిత నియమం ఏ దశలో ఉంటుంది?
జ: మూల్యాంకనం

 

48. పూర్వ ప్రక్రియాత్మక దశ వయసు-
జ: 3 - 6 సంవత్సరాలు

 

49. ప్రాజెక్టు పద్ధతిలో ప్రాజెక్టును ఎంపిక చేసుకునేది-
జ: విద్యార్థులు

 

50. అన్వేషణ పద్ధతి మూలపురుషుడు-
జ: హెచ్.ఇ.ఆర్మ్‌స్ట్రాంగ్

 

51. పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజజీవిత భాగమే ప్రకల్పన అని పేర్కొంది-
జ: బల్లార్డ్

 

52. అతి తక్కువ కాలంలో ఎక్కువ సిలబస్‌ను ఎక్కువమంది విద్యార్థులకు బోధించడానికి వాడే పద్ధతి -
జ: ఉపన్యాస

 

53. సిలబస్‌ను పునఃశ్చరణ చేయడానికి వాడే పద్ధతి-
జ: ఉపన్యాస

 

54. 'పాఠ్య ప్రణాళికను విద్యార్థుల అవసరాలకు తగినట్లు రూపొందించడంలో, పాఠశాలలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండాలి' అని పేర్కొంది
జ: కొఠారి


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌