1. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్యప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి-
జ: ఏకకేంద్ర పద్ధతి
2. అమెరికాలో 1962లో ఏర్పరచిన 'విజ్ఞాన శాస్త్రం - శాస్త్రీయ విధానం' రూపకర్త ఎవరు?
జ: జాన్. ఆర్. మేయర్
3. పాఠ్యాంశాలను బోధన సామగ్రి లభించే కాలాలకు అనుగుణంగా అమరుస్తూ పాఠ్యప్రణాళికను రూపొందించడం...
జ: రుతుక్రమ అమరిక విధానం
4. 'పాఠ్యప్రణాళికలో విద్యార్థులను ఇమడ్చడం కాకుండా, విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక రూపుదిద్దుకోవాలి' అని పేర్కొన్నది?
జ: బ్రూబేకర్
5. యూనిట్ పద్ధతిని బాగా వృద్ధి చేసింది?
జ: మోరిసన్
6. పాఠ్యప్రణాళికలో ఉండేది-
1) సిలబస్ 2) బోధనా పద్ధతులు 3) బోధన ఉపకరణాలు 4) పైవన్నీ
జ: 4
7. ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు అత్యావశ్యకం. ఈ ప్రవర్తనా సామర్థ్యాలను వృద్ధిచేసే అభ్యసనానుభవాల సమూహం-
జ: మూల పాఠ్యప్రణాళిక
8. విద్యార్థుల వ్యక్తిగత విభేదాలను కూడా దృష్టిలో ఉంచుకుని అబ్బాయిలకు, అమ్మాయిలకు, గ్రామీణ, పట్టణప్రాంత విద్యార్థులకు అనువుగా పాఠ్య ప్రణాళిక ఉండాలని తెలిపే సూత్రం?
జ: నమ్యత, వైవిధ్యతా సూత్రం
9. పరిశోధనల ఆధారంగా పాఠ్యప్రణాళికలో తరచూ మార్పులుండాలని పేర్కొన్నది?
జ: కొఠారీ
10. పాఠ్య ప్రణాళిక విస్తృత పరిధిలో ఉండాలని పేర్కొన్నది?
జ: కొఠారీ
11. పాఠ్యప్రణాళిక పాఠ్యపుస్తకాలకే పరిమితమై పట్టణప్రాంత వాసులకు తగినట్లుగా పని చేయడానికి వీలులేనిదిగా ఉందని విమర్శించింది ఎవరు?
జ: ఈశ్వరీభాయ్ పటేల్
12. పాఠ్యప్రణాళిక విద్యార్థులలో సమస్య పరిష్కార శక్తులను పెంపొందించేదిగా, స్వయంగా నిర్ణయాలను తీసుకోవడంలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలని పేర్కొన్నది-
జ: 1986 జాతీయ విద్యావిధానం
13. జాతీయ సమగ్ర పాఠ్యప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి సైన్స్ పాఠ్యప్రణాళిక నుంచి చేర్చిన అంశం?
జ: చిన్న కుటుంబ భావన
14. సైన్స్ పురోగమనం వల్ల పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు మధ్య ప్రధానమైన విద్యా విషయాల్లో దూరం బాగా పెరిగిందని పేర్కొన్నది?
జ: కొఠారీ