• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర స్వభావం  

1. విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన విద్యావేత్తలు ఎవరు?
జ: పాయింకేర్, శర్మ

 

2. 'సిద్ధాంతమనేది సత్యాల మధ్య సంబంధాన్ని లేదా సత్యాలను అర్థవంతమైన రీతిలో వివరించే ఒక మార్గం' అని పేర్కొన్నది?
జ: గుడ్, హల్

 

3. విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది?
1) విజ్ఞానశాస్త్రం సంచిత జ్ఞానం                                 2) విజ్ఞానశాస్త్రం ఒక ప్రక్రియ
3) విజ్ఞానశాస్త్ర జ్ఞానం సాపేక్ష సత్యం                            4) విజ్ఞానశాస్త్రం శాస్త్రీయ పద్ధతిని అనుసరించదు
జ: విజ్ఞానశాస్త్రం శాస్త్రీయ పద్ధతిని అనుసరించదు

 

4. విజ్ఞానశాస్త్రాన్ని సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాలుగా పేర్కొన్నది -
జ: ష్యాబ్, ఫీనిక్స్

 

5. 'విజ్ఞానశాస్త్రం అంటే పరస్పర సంబంధం ఉన్న భావనలు, భావన పథకాలు' అని పేర్కొన్నది?
జ: జె.బి. కొనాంట్

 

6. ఒక తెగ లేదా సమూహ జీవుల పుట్టుక, పరిణామం గురించి తెలియజేస్తూ, జాతుల మధ్య సంబంధాలు వివరించే శాస్త్రం?
జ: ఫైలోజని

 

7. ఉత్తమ విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదటి ప్రక్రియ నైపుణ్యం-
జ: పరిశీలన

 

8. స్తబ్ధ దృష్టిలో విజ్ఞానశాస్త్రం అంటే...?
1) సూత్రాలు            2) సిద్ధాంతాలు            3) భావనలు            4) పైవన్నీ
జ: పైవన్నీ

 

9. 'నీటి లోతుకు, పీడనానికి సంబంధం ఉందని' తెలిపేది?
జ: ప్రకటనాత్మక పరికల్పన

 

10. ప్రయోగాత్మకంగా గానీ, సిద్ధాంతరీత్యా గానీ పరికల్పన వివరాలను సూత్రీకరించడంలో సహయపడేది?
జ: శాస్త్రీయ విధానం

 

11. విజ్ఞానశాస్త్ర గతిశీల దృష్టికి సంబంధించింది-
జ: పరిశీలన

 

12. విజ్ఞానశాస్త్ర మూలభావన కానిది?
1) శాస్త్రం సంభావ్యతను మాత్రమే తెలుపుతుంది                2) శాస్త్రం సాపేక్ష సత్యాన్ని మాత్రమే తెలుపుతుంది
3) శాస్త్రం పరిశీలించిన దృగ్విషయాలపై ఆధారపడదు          4) శాస్త్రం సంకుచితం
జ: శాస్త్రం సంకుచితం

 

13. ప్రాక్కల్పన లక్షణం కానిది?
1) తార్కికంగా, వాస్తవంగా ఉండాలి                                   
2) పునఃపరిశీలనకు వీలుగా ఉండాలి
3) దత్తాంశ సేకరణకు వీలుగా ఉండకూడదు        
4) పరిశీలించిన విషయాల ఆధారంగా ఆమోదయోగ్యంగా ఉండాలి
జ: దత్తాంశ సేకరణకు వీలుగా ఉండకూడదు

 

14. 'సిద్ధాంతం సంఘటనల మధ్య సంబంధాన్ని స్పష్టపరుస్తుంది. అంతేకాక ఆ సంఘటనల కారణాన్ని వివరిస్తూ, భవిష్యత్తులోని సంభావ్యతలను ప్రాగుక్తీకరిస్తుంది' అని పేర్కొన్నది-
జ: మాథ్స్‌సన్

 

15. 'జ్ఞానం అంతా భావనల ద్వారానే ఏర్పడుతుంది' అని పేర్కొన్నది -
జ: సోక్రటీస్

 

16. సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశం కానిది?
1) సాధారణీకరణం             2) ప్రయోగం                   3) ప్రాగుక్తీకరణ              4) మాపనం
జ: సాధారణీకరణం

 

17. 'విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే' అని పేర్కొన్నది?
జ: కార్ల్ పియర్సన్
 

18. 'విజ్ఞానశాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం' అని పేర్కొన్నది-
జ: సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు

 

19. విజ్ఞానశాస్త్రమంటే ఒక మాపనం అని పేర్కొన్నది?
జ: అర్హీనియస్

 

20. సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాతి పరిణామాన్ని లేదా సంఘటనను ఊహించడమే...?
జ: ప్రాగుక్తీకరించడం


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌