• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర బోధన లక్ష్యాలు  

1. జ్ఞానరంగంలోని ఉన్నతశ్రేణి లక్ష్యం ఏది?
జ: సంశ్లేషణ

 

2. ''విద్యార్థి కుంభాకార కటకం, పుటాకార కటకంలో ఉన్న భేదాలను గుర్తిస్తాడు" అనేది-
జ: అవగాహన

 

3. 'విద్యార్థి బలం, ద్రవ్యరాశి, త్వరణం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తాడు' అనేది-
జ: అవగాహన

 

4. 'విద్యార్థి సమస్యలను విశ్లేషిస్తాడు' అనే స్పష్టీకరణ ఉన్న లక్ష్యమేది?
జ: వినియోగం

 

5. 'విద్యార్థి గ్రాఫ్‌లను తగిన స్కేలుతో గీస్తాడు' అనే లక్ష్యం -
జ: నైపుణ్యం

 

6. 'విద్యార్థి అపజయాలకు కుంగిపోడు అనేది-
జ: శాస్త్రీయ వైఖరి

 

7. 'విద్యార్థి పరికరాల్లో రీడింగులను సరిగ్గా పఠించడం' అనే లక్ష్యం-
జ: పరిశీలన నైపుణ్యం

 

8. 'విద్యార్థి తన విరామ సమయంలో సైన్స్ మ్యాగజైన్‌లు చదువుతున్నాడు' - తద్వారా నెరవేరిన లక్ష్యం?
జ: అభిరుచి

 

9. 'విద్యార్థి మూలకాలను లోహాలు, అలోహాలు, అర్ధలోహాలుగా వర్గీకరించాడు' - నెరవేరిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన

 

10. విద్యార్థి నునుపుగా ఉన్న నేలపై వేగంగా నడిస్తే జారిపడటానికి కారణం చెబితే ఏ లక్ష్యం నెరవేరినట్లు?
జ: వినియోగం

 

11. 'విద్యార్థి విశాల భావాలను కలిగి ఉంటాడు' అనేది-
జ: శాస్త్రీయ వైఖరి

 

12. బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించిన లక్ష్యాలు ఉండేది?
జ: జ్ఞానరంగం

 

13. 'ప్రయోగాన్ని తగిన వేగం, సునిశితత్వంతో నిర్వహిస్తాడు'- అనేది
జ: హస్తలాఘవ నైపుణ్యం

 

14. విద్యార్థి సైన్స్ క్లబ్‌లో సభ్యత్వం తీసుకుని, కార్యక్రమాల్లో పాల్గొంటే ఏ లక్ష్యం నెరవేరింది?
జ: అభిరుచి

 

15. నీటికి ఉన్న పీడనాలు ఎన్ని రకాలు? అవి ఏవి? అనే ప్రశ్న కొలిచే లక్ష్యం?
జ: జ్ఞానం

 

16. 'వేడిచేస్తే లోహాలు వ్యాకోచం చెందుతాయి' అనేది
జ: సామాన్యీకరణం

 

17. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం మొదటి అధ్యక్షుడు?
జ: సర్వేపల్లి రాధాకృష్ణన్

18. విద్యార్థి బోర్నవిటా డబ్బాతో త్రిపాది స్టాండు తయారు చేస్తే నెరవేరిన లక్ష్యం ఏమిటి?
జ: నైపుణ్యం
 

19. 'ప్రయోగానికి తగిన పరికరాలను ఏర్పాటు చేయగలడు'- అనేది
జ:
నైపుణ్యం
 

20. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం?
జ: శీలస్థాపనం

 

21. భావావేశ రంగంలోని లక్ష్యాలను వివరించింది ఎవరు?
జ: డేవిడ్ ఆర్. క్రాత్‌వాల్

 

22. "Taxonomy of Educational Objectives" గ్రంథ రచయిత-
జ: బి.ఎస్. బ్లూమ్స్

 

23. 'ప్రస్తుత విలువల వర్గీకరణ అంత సంతృప్తికరంగా లేదు. మరింత క్షుణ్నమైన రీతిలో ఆయా పాఠ్య విషయాల భావనలను పరిశీలించి, పునర్‌వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది' అని పేర్కొన్నది ఎవరు?
జ: అర్నెల్

 

24. కిందివాటిలో బ్లూమ్ విద్యాలక్ష్యాల వర్గీకరణ ఉపయోగం కానిది-
1) విద్యా ప్రణాళికలను రూపొందించడానికి               2) వార్షిక, యూనిట్, పాఠ్యపథకాల తయారీకి
3) రెమిడియల్ టీచింగ్ కోసం                          4) ఏదీకాదు
జ: ఏదీకాదు

 

25. శాస్త్రీయ వైఖరి ఉన్న వ్యక్తి లక్షణం కానిది ఏది?
1) విమర్శనాత్మక వైఖరి అవసరం లేదు                              2) నిగర్విగా ఉండటం
3) సదుపాయాలను, వనరులను దుర్వినియోగం చేయకపోవడం        4) అపజయాలకు కుంగిపోకపోవడం
జ: విమర్శనాత్మక వైఖరి అవసరం లేదు

 

26. 'పాఠ్యపథక తయారీలో లక్ష్యాల ఎంపిక అవసరమా?' అని ప్రశ్నించింది.
జ: సాకెట్

 

27. ఉపాధ్యాయుడు బోధనలో కల్పించిన కృత్యాల ద్వారా విద్యార్థిలో కలిగిన ప్రభావాలు లేదా అనుభవాలను ఏమంటారు?
జ: అభ్యసనానుభవాలు

 

28. 'బ్లూమ్ వర్గీకరణ కృత్రిమమైంది. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలు పరస్పర సంబంధం ఉన్నవి. స్కేలుతో విభజించలేనివి' అని పేర్కొంది ఎవరు?
జ: జాక్సన్

 

29. 'లక్ష్యాల సాధనకన్నా విద్యార్థుల భాగస్వామ్యం ముఖ్యం. లక్ష్యాలు ఉపాధ్యాయుడి స్వేచ్ఛను అరికడతాయి' అని పేర్కొన్నది?
జ: జాక్సన్

 

30. నేటి విద్యావ్యవస్థలు పట్టణవాసులకు అనుగుణంగా, పాఠ్య గ్రంథాలకు పరిమితమై, స్వహస్తాలతో పనిచేయడానికి అవకాశం లేనివిగా ఉన్నాయి అని విమర్శించింది?
జ: ఈశ్వరీభాయ్ పటేల్

 

31. SUPW రూపకర్త ఎవరు?
జ: ఈశ్వరీభాయ్ పటేల్

 

32. బారోమీటర్, అనిమోమీటర్, హైగ్రోమీటర్, థర్మామీటర్ సాధనాల ఉపయోగం ఏ రెండు శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని తెలుపుతుంది?
                                
జ: విజ్ఞానశాస్త్రం - భౌగోళిక శాస్త్రం

 

33. చార్టులు, నమూనాలు, బొమ్మలు తయారుచేయడం ద్వారా పొందే అనుభవాలు?
జ: ప్రత్యక్ష అనుభవాలు

 

34. 'సెకండరీ స్థాయిలో విజ్ఞానశాస్త్ర బోధన మేధస్సుకు సంబంధించిందిగా, ఉన్నత విద్యను సిద్ధపరిచేదిగా ఉండాలి' అని సిఫారసు చేసింది?
జ: కొఠారీ

 

35. కిందివాటిలో శాస్త్రీయవైఖరి పెంపొందడానికి ఒక మార్గం కానిది?
1) ప్రయోగాలు చేయడం             2) క్షేత్ర పర్యటనలు చేయడం
3) సంకుచితంగా ఆలోచించడం       4) ఒక సమస్యకు ప్రాక్కల్పన పద్ధతిలో సమాచారం సేకరించడం
జ: సంకుచితంగా ఆలోచించడం

 

36. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో అత్యున్నత రంగం?
జ: మానసిక చలనాత్మకరంగం
 

37. విద్యార్థి ప్రవర్తనలో తీసుకురావాలనుకున్న వాంఛనీయమైన మార్పులను ఏమంటారు?
జ: లక్ష్యాలు

 

38. రేడియో ప్రసారాలు వినడం ద్వారా పొందేవి?
జ: పరోక్ష అనుభవాలు    

 

39. ఉపాధ్యాయుడు 'కార్బన్‌ను గాలిలో మండిస్తే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుందని' బోధిస్తే విద్యార్థి C + O2 -> CO2 అని తన నోట్‌బుక్‌లో రాసుకుంటే నెరవేరిన లక్ష్యం?
జ: అవగాహన

 

40. కొఠారీ కమిషన్ కాలం?
జ: 1964 - 66

 

41. మొదలియార్ కమిషన్ కాలవ్యవధి?
జ: 1952 - 53

 

42. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం మొదటి అధ్యక్షుడు?
జ: సర్వేపల్లి రాధాకృష్ణన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌