• facebook
  • whatsapp
  • telegram

భౌతిక, రసాయనశాస్త్ర బోధన అభ్యసన పథక రచనలు  

వార్షిక పథకం
* పాఠ్యాంశాలను సంవత్సరం మొత్తం బోధించడానికి తయారు చేసుకునే పథకాన్ని వార్షిక పథకం అంటారు.
* ఈ పథకాన్ని విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తయారు చేస్తారు.

 

వార్షిక పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:
* పాఠశాల పనిదినాల సంఖ్య
* పాఠశాల బోధనా లక్ష్యాలు
* సైన్స్ బోధనా లక్ష్యాలు
* సైన్స్ పీరియడ్ల సంఖ్య
* పరీక్షల నిర్వహణకు అవసరమైన రోజులు
* ఉపాధ్యాయుడి సెలవులు
* ప్రత్యేక సెలవు రోజులు

 

వార్షిక పథకం ప్రయోజనాలు
* బోధనకు ఒక క్రమపద్ధతిని సూచిస్తుంది.
* రివిజన్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

 

యూనిట్ పథకం
* సంబంధం ఉన్న పాఠ్యాంశాలన్నింటినీ కలిపి 'యూనిట్' అంటారు.
* ప్రిస్టన్ ప్రకారం, 'విద్యార్థి చూడగలిగిన పరస్పర సంబంధం ఉండే పాఠ్య విషయం గల ఒక సమైక్య భాగం యూనిట్'
* యూనిట్ అంటే విజ్ఞానశాస్త్ర విషయ భాగాన్నే కాకుండా విషయాన్ని కూడా బోధించే పద్ధతి.
* ఒక యూనిట్‌లోని అంశాలను బోధించేందుకు రూపొందించే సమగ్ర పథకం 'యూనిట్ పథకం'.

 

సోపానాలు
1) సమీక్ష
2) బోధనా లక్ష్యాలు
3) విషయ విశ్లేషణ
4) బోధనాభ్యసన కృత్యాలు
5) బోధనోపకరణాలు
6) ఉపయుక్త గ్రంథాలు
7) మూల్యాంకనం

 

పాఠ్యపథకం
* విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్ర భావనలను, నైపుణ్యాలను పెంపొందించేందుకు తయారుచేసే సమీక్షనే పాఠ్యపథకం అంటారు.
* ఎల్‌బి స్టాండ్ ప్రకారం, 'పాఠ్యపథకం ఒక కార్యాచరణ పథకం'

 

ప్రయోజనాలు
* ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* కాలం వృథా కాదు
* క్రమబద్ధమైన బోధన జరుగుతుంది.

 

హెరాబర్ట్ సో పానాలు
* పరిచయం లేదా సన్నాహం
* హాజరు పరచడం లేదా విషయ సమర్పణ
* పోలిక లేదా సంసర్గం
* సాధారణీకరణం
* వినియోగం
* పునర్విమర్శ

 

అభ్యసన అనుభవాలు
* అభ్యాసకుడికి, విషయానికి మధ్య జరిగే పరస్పర చర్యలే అభ్యసన అనుభవాలు
* బోధనలో ఉపాధ్యాయుడు కల్పించిన అభ్యసనా కృత్యాల ద్వారా విద్యార్థిలో కలిగే ప్రభావాలు లేదా అనుభవాలనే అభ్యసన అనుభవాలు అంటారు.

 

అభ్యసన అనుభవాలు - రకాలు
ప్రత్యక్ష అనుభవాలు: విద్యార్థులు ప్రత్యక్షంగా పొందే అనుభవాలు.
పరోక్ష అనుభవాలు: ఇతర మాధ్యమాల ద్వారా పొందే జ్ఞానం వల్ల కలిగే అనుభవాలను పరోక్ష అనుభవాలు అంటారు. విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు.
ప్రతినిధిత్వ అనుభవాలు: ప్రత్యక్ష అనుభవాలకు అవకాశం లేనప్పుడు, వాటిని పోలిన నమూనాల ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు.

 

అభ్యసనానుభవాలు - వనరులు
* ఇల్లు, కుటుంబం, సమాజం, స్నేహితులు, సమూహాలు, పాఠశాల, ప్రసార సాధనాలు.


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌