• facebook
  • whatsapp
  • telegram

భౌతికశాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు  

1. కిందివాటిలో విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశం కానిది?
ఎ) సాధారణీకరణాలను అభివృద్ధి చేయడం.
బి) శాస్త్రపద్ధతులను వినియోగించకుండా ఉండటం.
సి) శాస్త్రవేత్తల కృషిని విద్యార్థులు అభినందించడం.
డి) సాంకేతికశాస్త్ర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించే సామర్థ్యాన్ని వృద్ధి చేయడం.
జ: బి (శాస్త్రపద్ధతులను వినియోగించకుండా ఉండటం)

 

2. శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందే విలువ ఏది?
జ: క్రమశిక్షణ విలువ

 

3. 'మనవిశ్వం' అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ ఏది?
జ: సౌందర్యాత్మక విలువ

 

4. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్‌లో బై.పి.సి గ్రూపు తీసుకోవడంలో విజ్ఞానశాస్త్రపరంగా అతడికి ఉన్న విలువ?
జ: వృత్తిపరమైన విలువ

 

5. 'విలువలు' ఏ రంగానికి చెందినవి?
జ: భావావేశ

 

6. కిందివాటిలో శాస్త్రీయ వైఖరికి చెందని లక్షణం ?
ఎ) నిష్పాక్షిక దృష్టితో ఉండటం               బి) ఇతరుల భావాలను గుర్తించడం    
సి) తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం       డి) సమస్య పరిష్కారంలో ప్రణాళికాబద్ధమైన విధానాన్ని పాటించడం

జ: సి (తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం)

 

7. ఒక దేశం జీవన విధానాన్ని తెలిపే విలువ ఏది?
జ: సాంస్కృతిక విలువ

 

8. విద్యార్థి సమస్యను గుర్తించడం, విశ్లేషించడం, తగిన సమాధానాన్ని అన్వేషించడం అనేవి ఏ బోధనా ఉద్దేశంలోని అంశాలు?
జ: శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ

 

9. విద్యార్థుల్లో అవగాహన, బుద్ధికుశలత, సత్యాన్వేషణ లాంటి అంశాలు అభివృద్ధి చెందడంలో గల విలువ ఏది?
జ: బౌద్ధిక విలువ

 

10. 'శాస్త్ర అభ్యసనం ద్వారా తమ ప్రవర్తనలో, శీలంలో, మూర్తిమత్వంలో అభివృద్ధిని అలవర్చుకున్నారు' దీన్ని తెలియచేసే విలువ
జ: నైతిక విలువ

 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌