• facebook
  • whatsapp
  • telegram

జీవక్రియలు

1. కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకునే ద్రావకం?

Ans: KOH
 

2. రెండు కణుపుల కేంద్రకం ఉన్న కణం ఏది?
Ans: ఇసినోఫిల్

 

3. ఆకులో సూర్యకాంతికి బహిర్గతమయ్యే కణజాలం?
Ans: స్తంభాకార కణజాలం

 

4. బొద్దింకలో శ్వాసాంగాలు ఏవి?
Ans: ట్రాకియా

 

5. దైహిక మహాధమని తీసుకు వెళ్లేది?
Ans: వాయుసహిత రక్తం

 

6. కార్బన్ డై ఆక్సైడ్ గ్లూకోజ్‌గా మారే చర్యను గుర్తించింది ఎవరు?
Ans: కాల్విన్

7. ప్రతిజనకాలు 'A', ప్రతిజనకాలు 'B' లేని మనిషి రక్తం ఏ వర్గానికి చెందింది?
Ans: O

 

8. గ్లాటిస్‌పై మూతలా పనిచేసే భాగం ఏది?
Ans: ఎపిగ్లాటిస్

 

9. ఈస్ట్ కణాలు పైరూవిక్ ఆమ్లాన్ని ఏ రకంగా మారుస్తాయి?
Ans: ఇథనాల్

 

10. కిందివాటిలో కిరణజన్య సంయోగక్రియకు అవశ్యకం కానిది ఏది?
        హరితరేణువు,       ఆక్సిజన్,        కార్బన్ డయాక్సైడ్,       కాంతి 
Ans: ఆక్సిజన్

 

11. పెరుగు తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది?
Ans: ల్యాక్టోబాసిల్లస్

 

12. ఒక NADH అణువు ఆక్సీకరణ చెందడం ద్వారా ఏర్పడే ATP అణువుల సంఖ్య?
Ans: 3

 

13. శ్వాస వర్ణకానికి ఉదాహరణ ఏది?
Ans: హిమోగ్లోబిన్

14. బాహ్య అస్థిపంజరం ఉండేది?
       ఎ) నాగుపాము     బి) కప్ప          సి) చీమ        డి) స్కోలియోడాన్ 
Ans: చీమ

 

15. బొద్దింకలో విసర్జన అవయవాలు ఏవి?
Ans: మాల్ఫీజియన్ నాళికలు

 

16. మానవుల్లో త్రిపత్ర కవాటం రక్తాన్ని ఏ మార్గంలో వెళ్లనిస్తుంది?
Ans కుడి కర్ణిక నుంచి కుడి జఠరిక లోకి

 

17. రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే రక్త ప్రోటీన్ ఏది?
Ans: ఫైబ్రినోజన్

 

18. ఒకరిని విశ్వదాతగా పరిగణించారు. అతడి రక్తవర్గం ఏది?
Ans: O


Ans:  3 C6H12O6 + 18 O2 + 18 H2O

20. కాంతి వ్యవస్థ PS I, కాంతి వ్యవస్థ PS II నుంచి గ్రహించిన ఎలక్ట్రాన్లు దేనికి సరఫరా అవుతాయి?
Ans: NADP

 

21. మైటోకాండ్రియా ఏ జీవుల్లో ఉంటుంది?
Ans: కేంద్రక జీవులు

 

22. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు .......
Ans: కార్బనిక్ పదార్థాలు వినియోగం అవుతాయి

 

23. 25 సంవత్సరాల వయసున్న మనిషి శ్వాసక్రియ రేటు ఎంత?
Ans: నిమిషానికి 15 సార్లు

 

24. ఏక ప్రసరణ హృదయం ఉండే జీవి ఏది?
Ans: చేప

 

25. శోషరసం దేనిలో భాగం?
Ans: రవాణా వ్యవస్థ

 

26. తెల్ల రక్తకణాల్లో అతి పెద్దవి?
Ans: మోనోసైట్లు

27. ఏ ప్రక్రియ ద్వారా అమీబా ఆమ్లజనిని గ్రహించి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది?
Ans: విసరణ

 

28. కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యంపై ప్రభావం చూపే అంతర కారకాలు ఏవి?
Ans: హరిత రేణువులు, నీరు

 

29. నిష్కాంతి చర్యలు ఎప్పుడు జరుగుతాయి?
Ans: కాంతి ఉన్నప్పుడు, లేనప్పుడు

 

30. కణశ్వాసక్రియ జరుగుతున్నప్పుడు కణాల్లో శక్తి ఉత్పత్తికి అవరోధం కలిగించేవి?
Ans: ప్రత్యేక విష పదార్థాలు

 

31. కిందివాటిలో ఆల్కహాల్ తయారీలో ముడిపదార్థాలు కానివి ఏవి?
       ఎ) మొలాసిస్, మొల‌కెత్తిన బార్లీ         బి) ద్రాక్షర‌సం, గోధుమ గింజ‌లు
        సి) మొలాసిస్‌, ద్రాక్షర‌సం              డి) చెర‌కు ర‌సం, ధాన్యం
Ans: చెరకు రసం, ధాన్యం

 

32. జీవి ATP లోని శక్తి ఏ పోషకం తయారీకి ఉపయోగపడుతుంది?
Ans: విటమిన్లు

 

33. కేంద్రకపూర్వ జీవుల్లో చర్యలు జరిపి శక్తిని ఉత్పత్తి చేసే భాగం?
Ans: కణత్వచం

34. అయిదు గ్లూకోజ్ అణువుల ఆక్సీకరణలో లభించే ATP అణువుల నికర లాభం ఎంత?
Ans: 190

 

35. స్త్రీల శ్వాసక్రియ కదలికల్లో ముఖ్యపాత్ర వహించే భాగం/ భాగాలు ఏవి?
Ans: పక్కటెముకలు

 

36. ఆక్సీకరణ భాస్వీకరణం దేనిలో జరుగుతుంది?
Ans: మైటోకాండ్రియా

 

37. రెఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసే ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి కారణం ఏమిటి?
Ans: తక్కువ ఉష్ణోగ్రతలో ఎంజైమ్‌లు క్రియాత్మకంగా ఉండక, శ్వాసక్రియ రేటు తక్కువగా ఉండటం.

 

38. చాలా కీటకాల్లో రక్తానికి రంగు ఉండకపోవడానికి కారణం?
Ans: ఆక్సిజన్‌ని మోసుకువెళ్లే ప్రోటీన్ లోపించడం

 

39. శ్వాసక్రియ కోసం చేపలో నీరు ప్రవహించే మార్గం?
Ans: నోరు - ఆస్యకుహరం - గ్రసని - అంతర జల శ్వాస రంధ్రం - మొప్ప కోష్టం - బాహ్య జల శ్వాస రంధ్రం - బయటకు.

 

40. రక్తనాళాలు లేని జీవులు ఏవి?
        ఎ) మొల‌స్కా, కీట‌కాలు                        బి) కీట‌కాలు, ఉభ‌య‌చ‌రాలు
        సి) ఉభ‌య‌చ‌రాలు                                 డి) స‌రీసృపాలు, ప‌క్షులు
Ans: మొలస్కా, కీటకాలు

41. బొద్దింక హృదయంలో రక్తం ప్రవహించే దిశ ఏది?
Ans: వెనుక నుంచి ముందుకు

 

42. మానవ హృదయంలో దైహిక మహాధమని ఎక్కడ నుంచి బయలుదేరుతుంది?
Ans: ఎడమ జఠరిక

బాబా ఫక్రుద్దీన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌