• facebook
  • whatsapp
  • telegram

జంతు ప్రపంచం - అవయవ వ్యవస్థలు

1. ఆహారంలో ఇమిడి ఉన్న శక్తిని వినియోగపడే శక్తిగా మార్చడానికి సహాయపడే వ్యవస్థ- 
జ:  జీర్ణ వ్యవస్థ
2. శరీరంలో వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి వెలుపలికి పంపడంలో సహాయపడే వ్యవస్థ- 
జ:  విసర్జక వ్యవస్థ   
3. 'ఆహార పదార్థాల ఆక్సీకరణ'ఏ క్రియలో మనకు కనిపిస్తుంది?
జ: శ్వాస క్రియ
4. జీర్ణనాళం ఏ భాగంతో ప్రారంభమై, ఏ భాగంతో అంతమవుతుంది?
జ: నోరు, పాయువు
5. 2123/2123 అనే దంతసూత్రంలో పై వరుస/ కింది వరుస దేన్ని సూచిస్తుంది?
జ:  ఒక దవడలోని సగభాగం దంతాల సంఖ్యను
6. ఆస్యకుహరంలోని మొత్తం విసురు దంతాల సంఖ్య-
జ: 12

7. నాలుక ఉపరితలం మీద 'చేదు రుచి'ని తెలిపే గ్రాహకాలు ఏ భాగంలో ఉంటాయి?
జ: వెనుక భాగం
8. లాలాజలానికి ఏ లక్షణం ఉంటుంది?
జ: కొద్దిగా క్షార లక్షణం
9. వాయునాళంలోకి ఆహారం వెళ్లకుండా సహాయపడే నిర్మాణం-
జ: కొండనాలుక
10. ఆహార, శ్వాస మార్గాల కూడలిగా పిలిచే గరాటు లాంటి నిర్మాణం-
: గ్రసని
11. ఆస్యకుహరంలో పాక్షికంగా నమిలిన ఆహారాన్ని ఏమంటారు?
జ: బోలస్
12. జీర్ణాశయ కుడ్యంలో ఉన్న జీర్ణాశయ గ్రంథుల పేరేమిటి?
: జఠర గ్రంథులు

13. ఒక వ్యక్తి తన ఆహారంలో ఎక్కువ మొత్తంలో అపరాలు/ పప్పు దినుసులు తీసుకున్నాడు. అయితే అవి జీర్ణనాళంలోని ఏ భాగాల్లో జీర్ణమవుతాయి?
జ: జీర్ణాశయం, ఆంత్రమూలం, శేషాంత్రికం
14. జీర్ణనాళంలో 'U' ఆకారంలో ఉన్న చిన్నపేగు మొదటి భాగం-
: ఆంత్రమూలం
15. జీర్ణనాళంలోని ఏ భాగాల్లో జీర్ణక్రియ జరగదు?
జ: గ్రసని, ఆహారవాహిక, పెద్దపేగు
16. గ్రసని, స్వర పేటికలోనికి తెరుచుకునే రంధ్రాన్ని ఏమని పిలుస్తారు?
జ: కంఠబిలం
17. మానవుడి శ్వాస వ్యవస్థలోని ఏ భాగంలో శబ్దాలు ఉత్పత్తి అవుతాయి?
జ: శబ్దపేటిక

18. ఊపిరితిత్తులకు రక్షణ కలిగించే రెండు పొరలతో నిర్మితమైన త్వచం-
జ: ప్లూరా
19. ఊపిరితిత్తుల్లోని ఏ భాగాల్లో వాయువుల మార్పిడి జరుగుతుంది?
జ: వాయు గోణులు,  వాయు కోశాలు,  ఆల్వియోలై
20. బాహ్య శ్వాసక్రియలో ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల మార్పిడి వేటిలో జరుగుతుంది?
జ: ఊపిరితిత్తులు
21. ఊపరితిత్తుల నుంచి వెలుపలికి వచ్చే గాలిలో ఉండే ఆక్సిజన్ వాయువు శాతం-
జ: 16%
22. పురుషుల శ్వాస కదలికల్లో ప్రముఖ పాత్ర వహించే నిర్మాణం-
జ: ఉదరవితానం
23. మానవుడిలో విసర్జనక్రియ నిర్వహించే అవయవాలు-
జ: చర్మం, ఊపిరితిత్తులు,  మూత్రపిండాలు

24. విసర్జన ముఖ్య లక్ష్యం ఏమిటి?
జ: శరీరంలో అయానుల తులస్థితిని కాపాడటం. 
25. మానవుడిలోని విసర్జక పదార్థం-
జ: యూరియా
26. మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం-
జ: నెఫ్రాన్
27. నెఫ్రాన్ (మూత్రనాళిక)లో మూత్రం తయారయ్యే భాగం-
జ: భౌమన్ గుళిక
28. డయాలసిస్ అంటే-
జ: కృత్రిమ పద్ధతిలో రక్తం నుంచి విసర్జక పదార్థాలను వేరుచేయడం
29. మూత్రం పచ్చని రంగులో ఉండటానికి కారణమయ్యే వర్ణ ద్రవ్యం-
జ: బైలురూబిన్
30. రక్తప్రసరణ వ్యవస్థ కింది భాగాల కలయిక-
జ: హృదయం, రక్తం,  రక్తనాళాలు
31. హృదయ అంతర్నిర్మాణంలో కుడికర్ణిక, కుడిజఠరికల మధ్య ఉన్న కవాటం-
జ: అగ్రత్రయ కవాటం

32. హృదయంలోని ఏ గది ఆమ్లజని సహితరక్తాన్ని ఊపిరితిత్తులు తప్ప మిగతా అన్ని శరీరభాగాలకు పంప్ చేస్తుంది?
జ: ఎడమ జఠరిక
33. హృదయ స్పందనలో 'డయాస్టోల్' అంటే-
జ: హృదయ కండరం సడలిక దశ
34. రక్తపీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
జ: స్పిగ్నోమానోమీటర్
35. హృదయంలో మూడుగదులు ఏ వర్గ జంతువుల్లో కనిపిస్తాయి?
జ: ఉభయ చరాలు
36. రక్తం నీలం రంగులో ఉండే జంతువు-
జ: నత్త
37. మానవుడి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంచే పదార్థం-
జ: హెపారిన్

38. హిమోగ్లోబిన్‌లో ఉన్న 'గ్లోబిన్' అనేది-
జ: ప్రోటీన్ అణువు
39. ఎర్రరక్తకణాల జీవిత కాలం-
జ: 120 రోజులు
40. ఏ అవయవాన్ని 'ఎర్రరక్త కణాల శ్మశానవాటిక' అంటారు?
జ: ప్లీహం
41. ఎయిడ్స్ వ్యాధిలో నశించే తెల్లరక్త కణాలు ఏవి?
: లింఫోసైట్లు
42. రక్తం గడ్డకట్టడంలో సహాయపడే రక్తకణాలు ఏవి?
జ: త్రాంబోసైట్లు
43. శరీరంలోని వివిధ అవయవాలు, అవయవ వ్యవస్థల మధ్య సమన్వయాన్ని కలిగించే వ్యవస్థ-
జ: నాడీ వ్యవస్థ

44. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు-
 జ: నాడీ కణం, న్యూరాన్
45. పోలియోలాంటి వ్యాధుల్లో వైరస్‌లతో నశించే నాడులు-
జ: చాలక నాడులు
46. మెదడు, వెన్నుపాములు నాడీ మండలంలోని ఏ విభాగానికి చెందుతాయి?
జ: కేంద్రీయ నాడీవ్యవస్థ
47. మెదడుకు రక్షణనిచ్చే ఎముకలతో ఏర్పడిన పెట్టెలాంటి నిర్మాణం-
జ: కపాలం
48. వెన్నుపాము అడ్డుకోతలో 'H' ఆకారంలో ఉండే పదార్థం-
జ: బూడిదరంగు పదార్థం

49. శరీర సమతాస్థితికి సహాయపడే మెదడు భాగం-
జ: అనుమస్తిష్కం
50. మానవుడిలో పరధీయనాడుల జతల సంఖ్య-
జ: 43
51. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారుగా-
జ: 2 శాతం
52. అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీమండలంలో దేని అధీనంలో ఉంటాయి?
జ: వెన్నుపాము

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌