• facebook
  • whatsapp
  • telegram

మానవ నాడీవ్యవస్థ

1. బహుకణ జీవులు సమన్వయం కోసం ఏర్పరచుకున్న వ్యవస్థలు:
జ: వినాళగ్రంథి, నాడీవ్యవస్థలు
2. జీవుల శరీరానికి వెలుపల, లోపల జరిగే మార్పులకు ప్రతిచర్యలను చూపే వ్యవస్థ?
జ: నాడీవ్యవస్థ
3. నాడీవ్యవస్థ శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించడానికి ఏర్పరచుకున్న ప్రత్యేక నిర్మాణాలు?
జ: గ్రాహకాలు
4. జంతువులన్నింటిలో క్లిష్టమైన నిర్మాణం ఉన్న నాడీ మండలం వేటిలో కనిపిస్తుంది?
జ: మానవుడు
5. కిందివాటిలో మానవ నాడీమండలంలో సమాచారాన్ని విశ్లేషించలేనిది, ప్రతిచర్యలను ఉత్పత్తి చేయలేనిది?

జ:  మెదడు, వెన్నుపాము, నాడులు
6. ప్రతీకార చర్యలను సమన్వయపరిచే కేంద్రం?
జ: కశేరు నాడీదండం

7. నాడీ మండలంలో వార్తలను విశ్లేషించి, ప్రతిచర్యలను ఉత్పత్తి చేసే నిర్మాణాలు?
జ: న్యూరాన్‌లు
8. నాడీకణంలో సంశ్లేషణ చర్యలు జరిగే భాగం?
జ: సైటాన్
9. ఆక్సాన్‌లోని 'అనాచ్చాదిత ప్రదేశాల'ను ఏమంటారు?
జ: రణ్‌వీర్ కణుపులు

రచయిత: బాబా ఫక్రుద్ధీన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌