• facebook
  • whatsapp
  • telegram

జీవన విధానాలు

1. కార్బోహైడ్రేట్స్‌లో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ పేరేమిటి?
జ: శ్వాసక్రియ
2. విద్యుదయస్కాంత వికిరణంలో ఏ కిరణాలకు కంటికి కనపడే కాంతి కంటే ఎక్కువతరంగ ధైర్ఘ్యాలు ఉంటాయి?
జ: ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు
3. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఎంత శాతం ఉంటుంది?
జ:  0.03%
4. ఏ త్వచాల దొంతరలను గ్రానా అంటారు?
జ:  థైలకాయిడ్
5. కాంతి కిరణాల్లో ఉండే శక్తిని ఏమంటారు?
జ:  క్వాంటం

6. కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది?
జ: మైటోకాండ్రియాలో
7. శ్వాసక్రియలో మొదటి దశ పేరేంటి?
జ: గ్త్లెకాలిసిస్
8. సిట్రిక్ ఆమ్లంలో జరిగే వరుస చర్యలను ఏ శాస్త్రజ్ఞుడు అధ్యయనం చేశాడు?
జ: సర్ హాన్స్‌క్రెబ్స్
9. బొద్దింకలో శ్వాసేంద్రియాలు ఏవి?
: వాయునాళాలు
10. వాయుగోణులు దేనిలో ఉంటాయి?
జ: ఊపిరితిత్తులు
11. వానపాములో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది?
జ: చర్మం

12. ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతుంది?
జ: వాయుగోణుల్లో
13. మానవుడిలో 'C' ఆకారంలో ఉండే మృదులాస్థి ఉంగరాలు దేనిలో ఉంటాయి?
జ: వాయునాళంలో
14. కిరణజన్య సంయోగక్రియలోని నిల్వ ఉండే శక్తి దేని నుంచి లభిస్తుంది?
జ: సూర్యకాంతి
15. సిరా సరణి దేనికి సంబంధించింది?
జ: హృదయం
16. ద్విప్రసరణ రక్తప్రసరణ వ్యవస్థ ఉన్న జీవి ఏది?
జ: కోతి
17. వానపాము రక్తంలోని హిమోగ్లోబిన్ ఏ రూపంలో ఉంటుంది?
జ: ప్లాస్మా

18. వేటి కలయిక వల్ల సిరాసరణి ఏర్పడుతుంది?
జ: మహాసిరల
19. మానవుడిలో ఆమ్లజని సహిత రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు ఏది సరఫరా చేస్తుంది?
జ: మహాధమని
20. ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే హృదయాన్ని ఏమంటారు?
జ:  పుపుస హృదయం
21. అసంపూర్ణంగా విభజన చెందిన జఠరికలున్న జీవులేవి?
జ:  సరీసృపాలు
22 . గుండెపోటు ఎలా వస్తుంది?
:  హృదయ ధమనిలో అడ్డంకులేర్పడితే
23. బి.పి ని కొలిచే పరికరం పేరేమిటి?
జ: స్పిగ్మో మానోమీటరు

24. మానవుడిలో సామాన్య రక్తపీడనం ఎంత?
జ: 120/80
25. అధోమహాసిర ఎలాంటి రక్తాన్ని హృదయానికి తెస్తుంది?
జ:  ఆమ్లజని రహిత
26. వేటిని హిమోగ్లోబిన్ అతిశక్తిమంతంగా మోస్తుంది?
జ:  ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్
27. రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతమెంత?
జ:  0.85 - 0.9
28. రక్తకణాల్లో అతి చిన్న రక్తకణమేది?
జ:  లింఫోసైట్
29. ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్తకణాలేవి?
జ:  లింఫోసైట్స్

30. కేంద్రకం లేని రక్తకణం ఏది?
జ: బేసోఫిల్
31. తెల్ల రక్తకణాల జీవిత కాలం ఎంత?
జ:  12 - 13 రోజులు
32. 'ఎర్ర రక్తకణాల శ్మశనవాటిక' అని దేన్ని అంటారు?
జ:  ప్లీహం
33. రక్తపరీక్షలో రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు?
జ:  సోడియం సిట్రేట్, సోడియం ఆక్జలేట్
34. ఎర్ర రక్తకణంలో కేంద్రకం ఉండే క్షీరదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జ:  ఒంటె
35. పెద్దవారిలో ఎర్ర రక్తకణాలు, పొడవైన అస్థికలు ఎక్కడ ఏర్పడతాయి?
జ:  మజ్జలో

36. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఏమంటారు?
జ: ఎరిత్రో పాయిసిస్
37. ఎర్ర రక్తకణాలు ఎర్రగా ఉండటానికి కారణమేమిటి?
జ: హిమోగ్లోబిన్ ఉండటం వల్ల
38. శరీరంలోని ఏ కణాలను సూక్ష్మ రక్షకభటులంటారు?
జ:  న్యూట్రోఫిల్స్
39. గరిష్ఠ శ్వాసక్రియ రేటు ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది?
జ:  45 డిగ్రీ సెంటిగ్రేడ్
40. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు ఎంత?
జ:  నిమిషానికి 32 సార్లు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌