• facebook
  • whatsapp
  • telegram

కణశాస్త్రం

1. సజీవ, నిర్జీవ వ్యవస్థల నిర్మాణం వేటితో ప్రారంభమవుతుంది?
జ: పరమాణువులు
2. సజీవ, నిర్జీవ వ్యవస్థల మధ్య 'అంతరం/ భేదం' ఏ దశ నుంచి కనిపిస్తుంది?
జ: అణువులు
3. కింద ఇచ్చిన వాటిలో సరిగా జతపరచనిది?
ఎ) ఆంటన్ వాన్ లీవెన్‌హక్: ఏకకణజీవుల మనుగడను తెలిపారు
బి) ష్లీడన్: మొక్కల కణజాలాలను, ష్వాన్ జంతుకణజాలాలను పరిశీలించారు
సి) రాబర్ట్ బ్రౌన్: కేంద్రకాంశాన్ని మొదట గుర్తించారు
డి) రుడాల్ఫ్ విర్కోవ్: ప్రతి కణం ముందుతరం కణం నుంచి ఏర్పడుతుందని తెలిపారు
జ: రాబర్ట్ బ్రౌన్: కేంద్రకాంశాన్ని మొదట గుర్తించారు
4. రాబర్ట్ హుక్‌కు సంబంధించి సరికాని ప్రవచనం ఏదో గుర్తించండి.
ఎ) ఈయన 1665లో బెరడు ముక్కను పరిశీలించాడు.
బి) ఈయన పరిశీలనతో 'కణచరిత్ర' మొదలైంది
సి) బెరడులో తేనెపట్టులాంటి నిర్మాణాలుండవని తెలిపారు
డి) ఈయనను కణశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు.
జ: బెరడులో తేనెపట్టులాంటి నిర్మాణాలుండవని తెలిపారు

5. కణసిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు?
జ: 1838
6. కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
: ఎం.జె. ష్లీడన్, టి. ష్వాన్
7. జీవపదార్థంలో అధిక పరిమాణంలో ఉండే అనుఘటకాలేవి?
జ: నీరు
8. 'నిర్మాణంలో తక్కువ శ్రేణికి చెందినవి, విధులలో ఉన్నతశ్రేణికి చెందినవి' ఏమిటి?
జ: బ్యాక్టీరియాలు
9. బహుకణ జీవుల్లో అతిపెద్దదైన ఉష్ట్రపక్షి అండ/ పిండకణం పరిమాణం సుమారుగా-
జ: 15 - 20 cm
10. మానవ శరీరంలో అతి పొడవైన కీలితాలు (సుమారు 1 m) కలిగిన కణం?
జ: నాడీకణం
11. వృక్షకణాల్లో డీఎన్ఏ ఉండేది-
జ: కేంద్రకం, మైటోకాండ్రియా, హరితరేణువులు
12. ప్రోటీన్‌లకు సంబంధించి సరైంది ఏది?
ఎ) ప్రోటీన్‌ల నిర్మాణ సమాచారం డీఎన్ఏ వద్ద ఉంటుంది

బి) రైబోజోమ్‌లు ప్రోటీన్‌లను సంశ్లేషిస్తాయి
సి) గాల్జీ సంక్లిష్టాలు ప్రోటీన్‌లను స్రవిస్తాయి
డి) పైవన్నీ
జ:  పైవన్నీ
13కిందివాటిని జతపరచండి.
               1. కేంద్రకం                        ఎ. స్వయం విచ్ఛిత్తి అంశాలు
               2. మైటోకాండ్రియా                 బి. రంగులను కలిగిస్తాయి
               3. లైసోజోమ్‌లు                   సి. అతి ముఖ్యమైన కణాంగం
               4. క్రోమోప్లాస్టులు                  డి. కణశక్త్యాగారాలు
: 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
14. కణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చడంతోపాటు కణ కదలికల్లో పాల్గొనే కణాంగం?
జ: సైటోస్కెలిటన్
15. 'కణవిభజన'లో పాల్గొనే, జంతుకణాల్లో మాత్రమే ఉండే కణాంగం?
జ: సెంట్రియోల్స్
16. 'టోనోప్లాస్ట్' అంటే...?
జ: కణరసాన్ని ఆవరించి ఉండే పొర

(రచయిత: పి. బాబా ఫక్రుద్దీన్)

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌