• facebook
  • whatsapp
  • telegram

విసర్జక వ్యవస్థ

1. ప్రపంచంలో మొదటగా తయారుచేసిన కృత్రిమ అవయవం
జ: మూత్రపిండం
2. 'మాల్ఫీజియన్ నాళికల'ను విసర్జక అవయవాలుగా కలిగి ఉన్న జీవి
జ: బొద్దింక
3. కిందివాటిలో 'యూరియా'ను విసర్జించే జీవులు ఏవి?
      A) చేప - కప్ప   B) వానపాము - సాలెపురుగు   C) మానవుడు - వానపాము    D) మానవుడు - నెమలి
జ: C(మానవుడు - వానపాము)
4. మొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసినవారు
జ: చార్లెస్ హ‌ఫ్‌న‌గేల్‌
5. కప్ప టాడ్‌పోల్ లార్వా విసర్జించే పదార్థం
జ: అమ్మోనియా
6. ఏ హార్మోన్ లోపం వల్ల అతి మూత్రవ్యాధి వస్తుంది?
జ: వాసోప్రెస్సిన్

7. మానవుడి మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం
జ: యూరోక్రోమ్
8. కిందివాటిలో ఏ అవయవం విసర్జన వ్యవస్థకు సంబంధించింది కాదు?
      A) చెమట గ్రంథి       B) మూత్రపిండం       C) ఊపిరితిత్తులు       D) లాలాజల గ్రంథి
జ: D(లాలాజల గ్రంథి)
9. మొదట విసర్జకాంగాలు ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఏర్పడ్డాయి. వాటి విసర్జకావయవాలు
జ: జ్వాలాకణాలు
10. కిందివాటిలో యూరియా తయారీలో ప్రముఖ పాత్ర వహించేది?
      A) పెద్దపేగు       B) మూత్రపిండం       C) మూత్రాశయం       D) కాలేయం
జ: D(కాలేయం)
11. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు చేరి కాళ్లు, చేతులు ఉబ్బడాన్ని ఏమంటారు?
జ: యూరేమియా
12. ఏ పదార్థాలు అధికంగా తీసుకున్న వారి మూత్రంలో యూరియా ఎక్కువగా కనిపిస్తుంది?
జ: ప్రొటీన్స్

13. 'Excretion' అనేది 'Ex', 'Crenere' అనే రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. అయితే Crenere అంటే అర్థం
జ: పంపడం
14. మూత్రంలో నీటి శాతం ఎంత?
జ: 96%
15. వివిధ జంతువులు విసర్జించే పదార్థాల్లో అత్యంత విషపూరితమైంది.
జ: అమ్మోనియా
16. మూత్రపిండం క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం.
జ: నెఫ్రాన్
17. కృత్రిమ మూత్రపిండాలను మొదట ప్రవేశపెట్టిన డచ్ దేశస్థుడు
జ: విలియం జె.కాఫ్
18. రక్తంలో లవణాలను కావాల్సిన స్థాయిలో ఉంచేవి
జ: మూత్రపిండాలు
19. మూత్రపిండాల్లోని ఏ భాగంలో మూత్రం వడపోతకు గురవుతుంది?
జ: నెఫ్రాన్
20. సాధారణంగా మూత్రపిండాల పొడవు, మందం దాదాపుగా ....., .... సెం.మీ.
జ: 10, 4

21. కిందివాటిలో నెఫ్రాన్‌లోని వృక్కనాళిక భాగానికి చెందనిది?
      A) సమీప సంవళిత నాళం       B) హెన్లీశిక్యం       C) భౌమన్ గుళిక       D) దూరస్థ సంవళిత నాళం
జ: C(భౌమన్ గుళిక)
22. భౌమన్ గుళిక గోడల్లోని ఉపకళ కణజాలంతో ఏర్పడిన కణాలను ఏమంటారు?
జ: పోడోసైట్లు
23. గుచ్ఛగాలనం ద్వారా భౌమన్ గుళికలో ఏర్పడిన ప్రాథమిక మూత్రంలో లేనివి?
జ: రక్తకణాలు
24. నెఫ్రాన్‌లో వరణాత్మక పునఃశోషణం ఏ భాగంలో జరుగుతుంది?
జ: సమీప సంవళిత నాళం
25. మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఏమని పిలుస్తారు?
జ: ESRD


రచయిత: కనుముక్కల నాగేంద్ర

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌