• facebook
  • whatsapp
  • telegram

దైర్ఘ్యమానం


1. స్క్రూగేజి కనీసపు కొలత ఎంత?
జ: 0.01 మి.మీ.

 

2. ఒక మరసీలపై 1 సెం.మీ దూరంలో 10 గాడులున్నాయి. దాని మరభ్రమణాంతరం-
జ: 1 మి.మీ.

 

3. ఒక స్క్రూగేజి తల 20 పూర్తి భ్రమణాలు చేసినప్పుడు మరసీల కదలిన దూరం 10 మి.మీ. అయితే మరభ్రమణాంతరం ఎంత?
జ: 0.5 మి.మీ.

 

4. ఒక స్క్రూగేజి మరభ్రమణాంతరం 0.2 సెం.మీ. మరసీలపై ఉన్న గాడుల సంఖ్య-
జ: 5/సెం.మీ.

 

5. ఒక స్క్రూగేజి మరభ్రమణాంతరం 0.1 సెం.మీ. మరసీలపై 1 సెం.మీ. దూరంలో ఉన్న గాడుల సంఖ్య-
జ:  10

 

6. ఒక స్క్రూగేజి కనీసపు కొలత 0.02 మి.మీ., దాని తలస్కేల్‌పై 100 విభాగాలున్నాయి అయితే మరభ్రమణాంతరం-
జ:  2 మి.మీ.

 

7. ఒక స్క్రూగేజి కనీసపు కొలత 0.02 మి.మీ., దాని మర భ్రమణాంతరం 1 మి.మీ అయితే తలస్కేలుపై ఉన్న విభాగాల సంఖ్య-
జ: 50

 

8. ఒక స్క్రూగేజి కనీసపు కొలత 0.02 మి.మీ., దాని తలస్కేలుపై 50 విభాగాలున్నప్పుడు దాని మరభ్రమణాంతరం-
జ: 1 మి.మీ.

 

9. ఒక స్క్రూగేజి తల 5 పూర్తి భ్రమణాలు చేసింది. దాని మరభ్రమణాంతరం 0.1 సెం.మీ. అయితే మర కదిలిన దూరంఎంత?
జ: 5 మి.మీ.
 

10. ఒక స్క్రూగేజి మరభ్రమణాంతరం 0.1 సెం.మీ. ఎప్పుడవుతుందంటే మరసీల కదలిన దూరం 5 మి.మీ., దాని తల -
జ: 5 పూర్తి భ్రమణాలు చేసినప్పుడు

 

11. పిచ్ స్కేలుపై ఒక సెం.మీ.కు 20 విభాగాలున్నాయి. తలస్కేలుపై 50 విభాగాలున్నాయి. అయితే మరభ్రమణాంతరం ఎంత?
జ: 0.5 మి.మీ.

 

12. తలస్కేలు శూన్యవిభాగం సూచీరేఖకు దిగువన ఉంటే, పరికరం శూన్యాంశ దోషం, సవరణలు వరసగా-
జ: ధనాత్మకం, రుణాత్మకం

 

13. తలస్కేలు శూన్యవిభాగం సూచీరేఖకు ఎగువన ఉన్న, పరికరం శూన్యాంశదోషం, సవరణ వరసగా-
జ: రుణాత్మకం, ధనాత్మకం

 

14. సూచీరేఖపై ఉన్న స్కేలును ఏమంటారు?
జ: పిచ్ స్కేలు లేదా ప్రధాన స్కేలు

 

15. ఒక పరికరాన్ని ఉపయోగించి కచ్చితంగా కొలవదగిన అతిచిన్న కొలతను ఏమంటారు?
జ: ఆ పరికరం కనీసపు కొలత

 

16. ఒక పలక మందం లేదా ఒక తీగ వ్యాసం ఎంత?
జ: P.S.R. + C.H.S.R × L.C.

 

17. ఒక స్క్రూగేజి తలస్కేలు మీద 100 విభాగాలున్నాయి. తలను 4 సార్లు పూర్తి భ్రమణం చేయించినప్పుడు మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే మరభ్రమణాంతరం -
జ: 0.5 మి.మీ.

 

18. ఒక స్క్రూగేజి తలస్కేలు మీద 100 విభాగాలున్నాయి. తలను 4 సార్లు పూర్తి భ్రమణం చేయించినప్పుడు మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే పరికరం కనీసపు కొలత ఎంత?
జ: 0.005 మి.మీ.

 

19. ఒక స్క్రూగేజి తల స్కేలు మీద 50 విభాగాలున్నాయి. తలను 2 సార్లు పూర్తి భ్రమణం చేయించినప్పుడు మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే పరికరం కనీసపు కొలత ఎంత?
జ: 0.02 మి.మీ.

 

20. ఒక స్క్రూగేజి తలస్కేలు మీద 50 విభాగాలున్నాయి. తలను 2 సార్లు పూర్తి భ్రమణం చేయిస్తే మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే పరికరం మరభ్రమణాంతరం -
జ: 1 మి.మీ.

 

21. ఒక స్క్రూగేజి ధనశూన్యాంశ దోషం 5 విభాగాలు. దాని తలస్కేలు కొలత 67 అయితే సవరించిన తలస్కేలు కొలత ఎంత?
జ: 62 విభాగాలు

 

22. ఒక స్క్రూగేజి రుణశూన్యాంశదోషం 5 విభాగాలు. దాని తలస్కేలు కొలత 76 అయితే సవరించిన తలస్కేలు కొలత ఎంత?
జ: 81

 

23. ఒక స్క్రూగేజి పిచ్‌స్కేలు మీద ఒక సెం.మీ. దూరంలో 10 విభాగాలున్నాయి. తలస్కేలుపై 100 విభాగాలున్నాయి. అయితే మరభ్రమణాంతరం
జ: 1 మి.మీ.

Posted Date : 28-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌