• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణం


1. కిందివాటిలో ఏది ఉష్ణీకరణ ప్రక్రియ?
   1) బాష్పీభవనం      2) సాంద్రీకరణం           3) మరగడం        4) అన్నీ
జ‌: 2 (సాంద్రీకరణం)

 

2. ద్రవీభవనం అంటే, ఘనస్థితిలోని పదార్థం ......... లోకి మారడం.
జ‌: స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి

 

3. A, B, C అనే వస్తువులు ఉష్ణసమతాస్థితిలో ఉన్నాయి. B ఉష్ణోగ్రత 45ºC అయితే, C ఉష్ణోగ్రత ఎంత?
జ‌: 45ºC

 

4. ఒక స్టీలు కడ్డీ ఉష్ణోగ్రత 330 K అయితే దాని ఉష్ణోగ్రత ºC పరంగా ఎంత?
జ‌: 57ºC

 

5. విశిష్టోష్ణం S = .......
జ‌: 

 

6. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరిగే స్థానం
జ‌: 100ºC

 

7. ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత
‌: స్థిరంగా ఉంటుంది

 

8. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ స్కేల్, ఫారెన్‌హీట్ స్కేల్ సమానమవుతాయి?
జ‌: -40º

 

9. ఒక ద్రవం బాష్పీభవనం కిందివాటిలో దేని మీద ఆధారపడి ఉంటుంది?
      1) ద్రవ ఉప‌రిత‌లం       2) ఉష్ణోగ్రత         3) ప‌రిస‌రాల‌పై        4) అన్నీ
జ‌: 2 (ఉష్ణోగ్రత)

 

10. కిందివాటిలో శీతలీకరణ ప్రక్రియ
    1) బాష్పీభవనం                              2) మరగడం
    3) బాష్పీభవనం, మరగడం              4) ఏదీకాదు
జ‌: 1 (బాష్పీభవనం)

 

11. గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ..... అంటారు.
జ‌: ఆర్ద్రత

 

12. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి ..... కు అనులోమానుపాతంలో ఉంటుంది.
జ‌: పరమ ఉష్ణోగ్రత

 

13. ఉష్ణశక్తి ప్రసారదిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత కాగా, ఆ ప్రవహించే శక్తియే
జ‌: ఉష్ణం

 

14. ఒకే ఉష్ణోగ్రత వద్ద వివిధ వాయువులున్నాయి. అయితే ఏ విలువ అన్ని వాయువులకు ఒకే విధంగా ఉంటుంది?
జ‌: సరాసరి గతిజశక్తి

 

15. ద్రవస్థితిలోని పదార్థం ఘనస్థితిలోకి మారడాన్ని ఏమంటారు?
జ‌: ఘనీభవనం

 

16. ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారే ప్రక్రియను ఏమంటారు?
జ‌: మరగడం

 

17. ఏదైనా ద్రవాన్ని వేడిచేసినప్పుడు అందులోని వాయువు ద్రావణీయత
జ‌: తగ్గుతుంది

 

18. నీరు మరిగే స్థానం ..... కెల్విన్‌లు.
జ‌: 373

 

19. నీరు మరిగే స్థానం ...... సెల్సియస్.
జ‌: 100

 

20. ద్రవీభవన గుప్తోష్ణం L = ......
జ‌: Q/M 

 

21. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ
జ‌: 540 కె./గ్రా.

 

22. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ
జ‌: 80 కె./గ్రా.

 

23. నీటి ఘనపరిమాణం కంటే మంచు ఘనపరిమాణం ...... గా ఉంటుంది.
జ‌: ఎక్కువ

 

24. ఘనీభవించేటప్పుడు నీరు ..... చెందుతుంది.
జ‌: వ్యాకోచం

 

25. ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిజశక్తి ఆ పదార్థం పరమ ఉష్ణోగ్రతకు ...... ఉంటుంది.
జ‌: అనులోమానుపాతంలో

 

26. కిందివాటిలో శీతలీకరణ ప్రక్రియ ఏది?
    1) బాష్పీభవనం       2) సాంద్రీకరణం      3) మరగడం       4) అన్నీ
జ‌: 1 (బాష్పీభవనం)

 

27. పొగలా గాలిలో తేలియాడే నీటి బిందువులను ..... అంటారు.
జ‌: పొగమంచు

 

28. వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణం ఏమిటి?
జ‌: అధిక బాష్పీభవనం

 

29. కిందివాటిలో శీతలీకరణిగా వాడే పదార్థం
    1) నీరు                   2) మంచు              3) గ్రీజు             4) కిరోసిన్
జ‌: 1 (నీరు)

 

30. గాలిలో నీటి ఆవిరి ..... స్థితిలో ఉన్నప్పుడు గాలి సాంద్రీకరణం చెందుతుంది.
జ‌: సంతృప్త

 

31. ఉష్ణానికి SI ప్రమాణం
జ‌: జౌల్

 

32. ప్రమాణ ద్రవ్యరాశి ఉండే పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని ..... అంటారు.
జ‌: విశిష్టోష్ణం

 

33. నీటిపై మంచు తేలడానికి కారణం
జ‌: మంచు సాంద్రత తక్కువ

 

34. చల్లదనం లేదా వెచ్చదనం తీవ్రతను ...... అంటారు
జ‌: ఉష్ణోగ్రత


35. విశిష్టోష్ణానికి SI ప్రమాణం....
జ‌: J/Kg.K

 

36. అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉండే వస్తువుకు ....... ప్రవహిస్తుంది.
జ‌: కాంతి

 

37. రెండు వస్తువుల మధ్య సమతాస్థితిని సాధించాలంటే ఆ రెండు వస్తువులు ......
జ‌: ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉండాలి

 

38. ........ అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ.
జ‌: బాష్పీభవనం

 

39. 10ºC వద్ద ఉండే A అనే వస్తువును 10 K వద్ద ఉండే B అనే వస్తువుతో ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణం ప్రవహించే దిశ
జ‌: A నుంచి B

 

40. ఉష్ణానికి CGS ప్రమాణం
జ‌: కెలోరీ

 

41. వస్తువు ఉష్ణోగ్రత .....కు అనులోమానుపాతంలో ఉంటుంది.
జ‌: కణాల సరాసరి గతిజశక్తి

 

42. 1 కెలోరీ = ...... జౌళ్లు.
జ‌: 4.186

 

43. ఉష్ణసమతాస్థితి వద్ద, థర్మామీటరు రీడింగ్ ......... ను సూచిస్తుంది.
జ‌: ఉష్ణోగ్రత

 

44. మిశ్రమాల పద్ధతి ప్రకారం వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = ..........
జ‌: చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం

 

45. 30ºC ను కెల్విన్‌లోకి మార్చగా
జ‌: -243

 

46. ఉష్ణం ..... వస్తువు నుంచి ..... వస్తువుకు ప్రవహిస్తుంది.
జ‌: వేడి, చల్లని

 

47. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ .......
జ‌: 540 కె./గ్రా.

 

48. Q = msΔt లో s ను .... అంటారు.
జ‌: విశిష్టోష్ణం

 

49. ఘనపదార్థం, ద్రవపదార్థంగా మారే ప్రక్రియను ..... అంటారు.
జ‌: ద్రవీభవనం

 

50. ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియను ..... అంటారు.
జ‌: ఘనీభవనం

 

51. ఏకాంక ద్రవ్యరాశి ఉండే పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని ఆ పదార్థ ...... అంటారు.
జ‌: విశిష్టోష్ణం

 

52. కిందివాటిలో అధిక విశిష్టోష్ణం ఉన్న పదార్థం
    1) కిరోసిన్           2) నీరు        3) మంచు         4) సీసం
జ‌: 2 (నీరు )

 

53. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది?
    1) 32ºC         2) 0ºC        3) 273 K      4) అన్నీ
జ‌: 4 (అన్నీ)

 

54. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం
జ‌: కెల్విన్

 

55. ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం, వాయువుగా స్థితి మార్పు చెందడమే
జ‌: బాష్పీభవనం

 

56. వాయువు, ద్రవంగా స్థితి మార్పు చెందడాన్ని ..... అంటారు.
జ‌: సాంద్రీకరణం

 

57. 0ºC ...... కెల్విన్‌లు.
జ‌: 273

 

58. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత = ...... + సెల్సియస్‌లో ఉష్ణోగ్రత
జ‌: -273

 

59. కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను ..... అంటారు.
జ‌: పరమ ఉష్ణోగ్రత

 

60. ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిజశక్తి, ఆ పదార్థం ..... కు అనులోమానుపాతంలో ఉంటుంది.
జ‌: పరమ ఉష్ణోగ్రత

 

61. ఏదైనా పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని .... అంటారు.
జ‌: మరగడం

 

62. ఒక వస్తువు ఉష్ణోగ్రతలోని పెరుగుదల, పదార్థం ..... పై ఆధారపడి ఉంటుంది.
జ‌: స్వభావం

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌