నీరు సకల జీవకోటికి ప్రాణాధారం. మానవ శరీరంలో అధికశాతం నీరు ఉంటుంది. దీని రసాయన నామం హైడ్రోజన్ మోనాక్సైడ్ (H2O). ఇది ప్రకృతిలో 70% ఆక్రమించి ఉంది. అంతేకాదు భూమిపై నాల్గింట మూడొంతుల నీరే ఉంది.
మానవ శరీరంలో 70% నీరు ఉంటుంది. ఎది ఎక్కువ పదార్థాలను కరిగించుకుంటుది కాబట్టి నీటిని ద్రావణిగా, యంత్రాలను చల్లబరచడానికి శీతలీకరణిగా ఉపయోగిస్తారు.
* నీరు లభించే ప్రాంతాలను నీటి వనరులు అంటారు. సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సులు, బావులు, నీటి బుగ్గ, ఒయాసిస్సులు, నీటిఫలకాలు... నీటి వనరులుగా ఉన్నాయి.
నీరు - ధర్మాలు:
* స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు. ఇది పారదర్శకంగా ఉంటుంది.
* నీరు మూడు రకాల పీడనాలను కలిగి ఉంటుంది.
1. ఊర్థ్వపీడనం
2. అథోపీడనం
3. పార్శ్యపీడనం
* లోతు ఎక్కువైన కొద్దీ పీడనం పెరుగుతుంది. పాత్ర ఆకారం, పరిమాణం పీడనాన్ని ప్రభావితం చేయలేవు.
నీరు - కాఠిన్యత:
* సబ్బుతో నురగనిచ్చే జలాన్ని సాధుజలం లేదా మృదుజలం అంటారు.
* సబ్బుతో నురగనివ్వక, అవక్షేపాన్ని ఏర్పరిచే జలాన్ని కఠిన జలంగా పిలుస్తారు.
* కఠిన జలం వల్ల ఏర్పడే కాఠిన్యత రెండు రకాలు:
i) తాత్కాలిక కాఠిన్యత
ii) శాశ్వత కాఠిన్యత
i) తాత్కాలిక కాఠిన్యత: నీటిలో కాల్షియం, మెగ్నీషియం బైకార్బొనేట్ లవణాలు ఉన్నట్లతే దాన్ని తాత్కాలిక కాఠిన్యత అంటారు.
* తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి మరిగించడం, క్లార్క్ విధానాలను వాడతారు.
* మరిగించడం అనే ప్రక్రియలో నీటిలోని బైకార్బొనేట్ లవణాలు బొగ్గుపులుసు వాయువు (CO2)ను విడుదల చేస్తాయి.
Ca(HCO3)2 CaCO3 + H2O + CO2 ↑
* క్లార్క్ పద్ధతిలో నీటికి తడిసున్నాన్ని కలిపి కాఠిన్యతను తొలగిస్తారు.
Ca(OH)2 + Ca(HCO3)2 → 2 CaCO3 + 2 H2O
* చాకలి సోడాను కలిపి కూడా తాత్కాలిక కాఠిన్యతను తొలగిస్తారు.
Ca(HCO3)2 + Na2CO3 → CaCO3 + 2 NaHCO3
ii) శాశ్వత కాఠిన్యత: నీటిలో కాల్షియం, మెగ్నీషియంకు చెందిన క్లోరైడ్, సల్ఫేట్ లవణాలు ఉన్నట్లయితే దాన్ని శాశ్వత కాఠిన్యత అంటారు.
* శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి పెర్మిట్యూట్ పద్ధతి, అయాన్‌ల మార్పిడి పద్ధతులను ఉపయోగిస్తారు.
a) పెర్మిట్యూట్ పద్ధతి:
ఈ పద్ధతిలో సోడియం పెర్మిట్యూట్ (Na2Al2S2O8) అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. దీని చర్యావేగాన్ని పెంచడానికి నీటికి గాఢ NaCl ద్రావణాన్ని కలుపుతారు. కఠినజలం సాధుజలంగా మారిన తర్వాత పాత్రలో ఏర్పడే పదార్థాలు కాల్షియం, మెగ్నీషియంల పెర్మిట్యూట్‌లు.
b) అయాన్‌ల మార్పిడి పద్ధతి:
ఈ పద్ధతిలో A, B అనే రెండు పాత్రలను తీసుకుంటారు. A అనే పాత్రలో రసాయన పదార్థం జీరోకార్ఫ్‌ను, B అనే పాత్రలో రసాయన పదార్థం డీ ఎసిటేట్‌ను తీసుకుంటారు.
* సాధారణంగా కఠినజలంలో ధనాత్మక అయాన్‌లు Ca+2, Mg+2; శాశ్వత కఠిన జలంలో రుణాత్మక అయాన్‌లు
Cl-, SO4-2 లుగా ఉంటాయి.
* A పాత్ర చర్యాశీలతను పూర్వస్థితికి తీసుకురావడానికి HClను, B పాత్ర చర్యాశీలతను పూర్వస్థితికి తీసుకురావడానికి చాకలిసోడా (Na2CO3)ను కలుపుతారు.
* నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత 0oC, బాష్పీభవన ఉష్ణోగ్రత 100oC
* శాశ్వత కాఠిన్యతను స్వేదన ప్రక్రియ కాల్గాన్ (సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్) పద్ధతి ద్వారా కూడా తొలగించవచ్చు.
* నీరు వివిధ రూపాల్లో ఉంటుంది.
ఉదా: తుషారం, పొగమంచు, ఫ్రాస్ట్, మేఘాలు, మంచు మొదలైనవి.
నీటిలోని మాలిన్యాలు: నీటిలోని మాలిన్యాలు రెండు రకాలు
i) కరగని మలినాలు
ii) కరిగే మలినాలు
i) కరగని మలినాలను తేర్చుట, పానీయ పద్ధతి ద్వారా తొలగిస్తారు.
* తేర్చుట ప్రక్రియ త్వరగా జరగడానికి పటిక పొడి వాడతారు. తేర్చుట అనే ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది.
* పానీయ పద్ధతిని చికిత్సలో ఉపయోగిస్తారు. వాంతులు, వీరేచనాలు అవుతున్న రోగికి నీటిలో ఉప్పు, పంచదార కలిపి ఇవ్వడం.
* తాగునీటిని శుభ్రపరచడానికి ఖర్చులేని, తేలికైనది మూడు కుండల పద్ధతి.
* కొన్ని సందర్భాల్లో నీటిని సూర్యుడికి ఎదురుగా చిమ్మి సూర్యరశ్మి సహాయంతో సూక్ష్మజీవులను నాశనం చేస్తారు. దీన్ని ఏరేషన్ అంటారు.
నీటి కాలుష్యం: నీటిలో ఉండకూడని పదార్థాలు చేరడాన్ని నీటికాలుష్యం అంటారు. లేదా
* జలావరణంలో ఏవైనా పదార్థాలు కలిసి నీటి నాణ్యతను తగ్గించే విధానాన్ని జల కాలుష్యం అంటారు.
* మనదేశంలో చాలా నదులు, సరస్సులు కాలుష్యానికి గురయ్యాయి. దీని వల్ల నీరు తాగడానికి పనికి రాకుండా పోతుంది.
* నీటి కాలుష్యానికి కారణాలు
i) స్వాభావికమైనవి
ii) మానవ కల్పితాలు
iii) వ్యవసాయ పద్ధతులు
* అణువిద్యుత్ కేంద్రాలు, పారిశ్రామికీరణ కూడా నీటి కాలుష్యానికి ప్రధాన కారణం.
* నీటిలో కర్బన, వ్యర్థ పదార్థాలు చేరి నీటిని కలుషితం చేస్తున్నాయి. దాంతో నీటిలోని ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా జలచరాల మనుగడ కష్టమవుతుంది.
» పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాల వల్ల నీటిలోని జీవరాశులు నాశనమవుతున్నాయి. ఈ అంశాన్ని యూట్రోఫికేషన్ అంటారు.
* సముద్రాల్లో చమురు పదార్థాలు చేరడం వల్ల నూనెలు నీటి ఉపరితలం మీద పొరలా ఏర్పడి స్వచ్ఛమైన నీటి ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తాయి.
గాలి కాలుష్యం: (AIR POLLUTION)
భూమిని ఆవరించి ఉండే గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్, నీటిఆవిరి ఎక్కువ మోతాదులో; గ్జీనాన్, మీథేన్, క్రిప్టాన్, హైడ్రోజన్ లాంటి వాయువులు తక్కువ మోతాదులో ఉంటాయి.
* మోటారు వాహనాల ఇంధనాలైన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటివి దహనచర్యకు గురైనప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది. ఇది గాలి కాలుష్యానికి ఒక కారణం.
* కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్ల కళ్లు తిరగడం, స్పృహ తప్పడం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు.
* హరిత గృహప్రభావం (Green House Effect)వాతావరణంలోకి CFC (క్లోరోఫ్లోరో కార్బన్‌లు) విడుదల అవడం వల్ల సంభవిస్తుంది.
* హరితగృహ ప్రభావానికి కారణమైన వాయువు CO2.
* వాతావరణంలో CO2 ను పీల్చడం ద్వారా వికారం, తలనొప్పి, బద్ధకం కలుగుతాయి.
* సల్ఫర్ డయాక్సైడ్ వల్ల మానవుడిలో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. వృక్ష కణాల గోడలకు హాని జరుగుతుంది.
* హైడ్రోజన్ సల్ఫైడ్ - పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు
* హైడ్రోజన్ ఫ్లోరైడ్ - ఫ్లోరోసిస్, కార్సినోజెనిక్
* హైడ్రోకార్బన్‌లు - క్యాన్సర్
* దుమ్ము, ధూళి రేణువులు - కళ్ల మంటలు, అలర్జీ
* పొగమంచు - ఆస్త్మా బ్రాంకైటిస్
* లోహపు రేణువుల కాలుష్యం - మెదడు, కాలేయం, మూత్రపిండాలు పనిచేసే వ్యవస్థ దెబ్బతింటుంది.
తేలియాడే వస్తువులు
సాంద్రత: ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే ద్రవ్యరాశిని సాంద్రత అని అంటారు.
దీనికి CGS ప్రమాణాలు గ్రా./సెం.మీ.3
MKS ప్రమాణాలు కి.గ్రా./మీ.3
* ఎక్కువ సాంద్రత ఉన్న పదార్థాలు బరువైనవి, తక్కువ సాంద్రత ఉన్న పదార్థాలు తేలికైనవి.
ఉదా: నీటి సాంద్రత 1 గ్రా./సెం.మీ.3
పాదరసం సాంద్రత 13.6 గ్రా./ సెం.మీ.3
కిరోసిన్ సాంద్రత 0.8 గ్రా./సెం.మీ.3
* ఒక వస్తువు సాంద్రత నీటి సాంద్రతకు ఎన్నిరెట్లు ఉందో దాన్ని ఆ వస్తువు సాపేక్ష సాంద్రత లేదా తారతమ్య సాంద్రత అంటారు.
* సాపేక్ష సాంద్రత రెండు పదార్థాల సాంద్రతల నిష్పత్తి కాబట్టి ప్రమాణాలు లేవు.
* పాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి లాక్టోమీటరును ఉపయోగిస్తారు.
* ద్రవాల సాంద్రతను తెలుసుకోవడానికి హైడ్రోమీటరు/ డెన్సిటోమీటరును ఉపయోగిస్తారు.
* సాపేక్ష సాంద్రత 1 కంటే ఎక్కువ ఉన్న పదార్థాలు నీటిలో మునుగుతాయి.
ఉదా: నీటిలో రాయి మునగడం
* సాపేక్ష సాంద్రత 1 కంటే తక్కువ ఉన్న పదార్థాలు నీటిలో తేలుతాయి.
ఉదా: నీటిపై కిరోసిన్ తేలియాడటం
* ద్రవంలో తేలే వస్తువులకు ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మొదట గుర్తించినవారు: ఆర్కిమెడిస్
* వస్తువుపై ఊర్థ్వ దిశలో పనిచేసే నీటిబలం కంటే దానిపై పనిచేసే భూమ్యాకర్షణ బలం ఎక్కువైతే వస్తువు మునిగిపోతుంది.
పీడనం: ఒక వస్తువు ఉపరితల ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు.

C.G.S. ప్రమాణాలు = Dyne/cm2
MKS ప్రమాణాలు = Newton/m2
పీడనానికి SI ప్రమాణం పాస్కల్
* భూ ఉపరితంలపై ఉండే అన్ని వస్తువులపై వాయువులు కలగజేసే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు.
వాతావరణ పీడనం P0 = ρhg
ρ = సాంద్రత
h = ఎత్తు
g = గురుత్వత్వరణం
* పాదరసాన్ని ఉపయోగించి భారమితిని మొదట తయారుచేసినవారు: టారిసెల్లి
* భారమితిలో పాదరస మట్టం 76 సెం.మీ. లేదా 760 మి.మీ. ఉంటుంది.
* 76 సెం.మీ. లేదా 760 మి.మీ మట్టాన్ని 1 అట్మాస్ఫియర్ పీడనం అంటారు.
* 1 అట్మాస్ఫియర్ = 1.01 × 105 న్యూటన్/మీ2
లేదా 1.01 డైన్/ సెం.మీ.2
* ఆధార వైశాల్యం 1 సెం.మీ.2, భూమిపై 30 కి.మీ. వాతావరణ ఎత్తులో స్తూపాకార గొట్టంలో ఆవరించి ఉన్న గాలి ద్రవ్యరాశి 1 కి.గ్రా. ఉంటుంది.
* ఒక ద్రవం 'h' ఎత్తులో ఉంటే దాని పీడనం
PA = P0A + W
PA = P0A + hρg.A
* ఒకే లోతులో ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒక ద్రవం పీడనం ఒకేలా ఉంటుంది.
* ఒక వస్తువుపై కలగజేసే బలం అది తొలగించిన ద్రవం బరువుకు సమానం.
* ద్రవంలో ఉన్న వస్తువుపై ఊర్థ్వ దిశలో కలగజేసే బలాన్ని ఉత్ల్పవనం (buoancy) అంటారు.
* ఉత్ల్పవనం బలం ఆ వస్తువు తొలగించిన ద్రవం బరువుకు సమానం.
* ఉత్ల్పవన బలాన్ని మొదట గుర్తించినవారు: ఆర్కిమెడిస్
ఆర్కిమెడిస్ సూత్రం:
ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగా లేదా పాక్షికంగా ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్ల్పవన బలం ఆ వస్తువుపై ఊర్థ్వ దిశలో పనిచేస్తుంది.
* ఆర్కిమెడిస్ సూత్రాలనే 'ప్లవన సూత్రాలు' అంటారు.
* స్వచ్ఛమైన నీటి కంటే ఉప్పునీటి సాంద్రత ఎక్కువ కాబట్టి మనిషి ఉప్పు నీటిలో సులభంగా ఈదగలడు.
* వస్తువుపై పనిచేసే ఉత్ల్పవన బలం వస్తువు ఘనపరిమాణానికి, సాంద్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
* గాలిలో వస్తువు భారం W1, నీటిలో W2, ద్రవంలో వస్తువు భారం W3 అయితే
పాస్కల్ సూత్రం: ఏదైనా ప్రవాహి బంధితమై ఉన్నప్పుడు దానిపై బాహ్య పీడనం కలగజేస్తే ఆ ప్రవాహిలో అన్నివైపులా పీడనం ఒకేవిధంగా ఉంటుంది.
* పాస్కల్ నియమాన్ని నిత్యజీవితంలో హైడ్రాలిక్ యాంత్రాలు, జాకీలు, బ్రేకులు, బ్రామా ప్రెస్‌లో ఉపయోగిస్తారు.
* ద్రవం లోతుకు వెళ్లే కొద్దీ పీడనం పెరుగుతుంది.
20 సెం.మీ. వ్యాసార్ధం ఉన్న గోళం ద్రవ్యరాశి 0.05 కి.గ్రా. అయితే దాని సాపేక్ష సాంద్రత ఎంత?
ద్రవ్యరాశి = 0.05 కి.మీ.
= 0.05 × 1000 గ్రా.
= 50 గ్రా.

ఒక సీసా ఖాళీగా ఉన్నప్పుడు 20 గ్రా, నీటితో నింపినప్పుడు 22 గ్రా., నూనెతో నింపినప్పుడు 21.76 గ్రా. అయితే నూనె సాంద్రత ఎంత?
50 గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక పదార్థ ఘనపరిమాణం 20 ఘ.సెం.మీ. నీటి సాంద్రత 1 గ్రా./ఘ.సెం.మీ. అయితే పదార్థం నీటిలో మునుగుతుందా? తేలుతుందా?
... ఈ పదార్థం నీటిలో మునుగుతుంది.
వాతావరణ పీడనం 100 కిలో పాస్కల్ ఉన్నప్పుడు నీటిలో 10 మీ. లోతున పీడనం ఎలా ఉంటుంది?
సాధన: వాతావరణ పీడనం P0 = 100 కిలో పాస్కల్ = 100 × 1000 పాస్కల్ = 105 పాస్కల్
నీటి సాంద్రత = 1 గ్రా./సెం.మీ.3 = 1000 కి.గ్రా./ మీ.3
గురుత్వ త్వరణం g = 9.8 మీ./సె.2
లోతు h = 10 మీ.
10 మీటర్ల లోతున పీడనం P = P0 + hρg
= 105 + (10 × 9.8 × 1000)
= 1,00,000 + 98000
= 1,98,000 P
= 198 కిలో పాస్కల్
అంటే లోతుకు వెళ్లే కొద్దీ పీడనం పెరుగుతుంది.
బెర్నౌలీ సూత్రం
ఏదైనా ఒక వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచేటప్పుడు తలంపైన పీడనం కింది పీడనం కంటే తక్కువగా ఉంటుంది.
లేదా
ఆదర్శ ప్రవాహి విషయంలో ఏకాంక ఘనపరిమాణానికి ఉన్న పీడనం, గతిజశక్తి, స్థితిజశక్తుల మొత్తం స్థిరం.
(ρ = సాంద్రత)
ఉదా: గాలిలో ఎగిరే విమానం, గాలి పటాలు, గాలి బుడగలు, పారాఛూట్‌లు బెర్నౌలీ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి.
* వెంచురి మీటర్ (దీన్ని ఉపయోగించి ద్రవప్రవాహ రేటును కొలుస్తారు)
* బున్‌సెన్ బర్నర్, వడపోత పంపులో బెర్నౌలీ సూత్రం ఉపయోగిస్తారు.
* స్పిన్‌బాల్ విసరడం, గదిలో ఫ్యాను తిరుగుతున్నపుడు గోడకున్న క్యాలండరు కాగితాలు పైకి ఎగరడం, తుపానులు సంభవించినప్పుడు పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోవడం.
వాతావరణ పీడనం
భూమి చుట్టూ ఉండే గాలి పొరను వాతారణం అంటారు. ఇది భూమిపై ఉండే ప్రతి వస్తువు మీద పీడనాన్ని కలగజేస్తుంది. దీన్ని వాతావరణ పీడనం అంటారు.
* వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం: భారమితి
* వాతావరణ పీడనానికి ప్రమాణాలు
1. అట్మాస్ఫియరిక్ పీడనం (atm)
2. cm of Hg (or) mm of Hg
3. బార్‌లు
4. టార్‌లు
భారమితి: (Baro Meter)
* దీనిలో ఉపయోగించే ద్రవం పాదరసం (Hg).
* పాదరసం సాంద్రత అన్ని ద్రవాల కంటే అధికంగా ఉంటుంది. కాబట్టి పాదరసాన్ని భారమితిలో ఉపయోగిస్తారు.
* పాదరసం సాంద్రత నీటి సాంద్రత కంటే 13.6 రెట్లు ఎక్కువ.
* దీన్ని టారిసెల్లి కనుక్కున్నారు. సాధారణ వాతావరణ పీడనం విలువ 76 సెం.మీ. లేదా 760 మి.మీ.
* పాదరస స్తంభం ఎత్తు 76 సెం.మీ. పాదరస స్తంభం ఎత్తునుబట్టి వాతావరణ పీడనాన్ని తెలుసుకోవచ్చు.
* పాదరస స్తంభం ఎత్తు అకస్మాత్తుగా తక్కువకు పడిపోతే తుపాను సూచనను, నెమ్మదిగా పడినట్లయితే వర్ష సూచనను తెలియజేస్తుంది.
హైడ్రోమీటరు:* ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. కారు బ్యాటరీలోని ఆమ్లం సాంద్రతను కనుక్కోవడానికి 'ద్రవ గురుత్వ మాపకం' ఉపయోగిస్తారు.
* హైడ్రోమీటరు ప్లవన సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది.
ప్లవన - సూత్రాలు
* ప్లవన సూత్రాలను ఆర్కిమెడిస్ ప్రతిపాదించారు.
* పదార్థ సాంద్రత ఆధారంగా ప్లవన సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు.
i) ఒక వస్తువు సాంద్రత ద్రవ సాంద్రతకంటే తక్కువైనప్పుడు అది ద్రవ ఉపరితలంపై తేలుతుంది.
ఉదా: నీటిపై బంతి తేలడం.
ii) ఒక వస్తువు సాంద్రత ద్రవం సాంద్రతకు సమానమైనప్పుడు, ఆ వస్తువు సగభాగం ద్రవంలో మునిగి మిగతా సగ భాగం పైన తేలుతుంది.
ఉదా: నీటిలో బిరడాను ఉంచితే అది నీటి ఉపరితలంపై సగం పైకి, సగం కిందికి ఉన్నట్లు కనిపిస్తుంది.
iii) ఒక వస్తువు సాంద్రత ద్రవ సాంద్రత కంటే ఎక్కువై నప్పుడు ఆ వస్తువు ద్రవంలో మునిగిపోతుంది.
ఉదా: నీటిలో రాయిని వేసినప్పుడు అది మునిగిపోతుంది.
అనువర్తనాలు
* మంచు ముక్క నీటిపై తేలుతుంది. దీనికి కారణం మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ.
* ఇనుప ముక్క నీటిలో మునుగుతుంది. దీనికి కారణం ఇనుము సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ.
* ఇనుము పాదరసంపై తేలుతుంది. కారణం పాదరసం కంటే ఇనుము సాంద్రత తక్కువ.
* జలాంతర్గామి పనిచేయడంలో ప్లవన సూత్రాలు ఉపయోగిస్తారు.
* మామూలు నీటిలో కంటే సాంద్రత ఎక్కువగా ఉన్న సముద్రపు నీటిలో ఈదడం సులభం.
* నీటిపై ఎండుటాకులు వేస్తే సముద్ర మట్టం మారదు.
ద్రవ పదార్థాలు - ధర్మాలు
1. పీడనం
2. తలతన్యత
3. కేశనాళికీయత
4. స్నిగ్ధత
5. ఘనీభవన స్థానం
6. బాష్పీభవన స్థానం అనే ధర్మాలపై ఆధారపడి ఉంటాయి.
తలతన్యత
ప్రతి ద్రవపదార్థం దాని ఉపరితలాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నించే ధర్మాన్ని తలతన్యత అంటారు.
దీని C.G.S. ప్రమాణాలు డైన్/సెం.మీ.
MKS ప్రమాణాలు న్యూటన్/మీ.
ఉదా: వర్షం చినుకులు గోళాకారంలో ఉండటానికి, పాదరసం చిన్న గోళాలుగా ఉండటానికి కారణం తలతన్యత.
అనువర్తనాలు
* రంగులో ముంచిన పెయింట్ బ్రష్ (కుంచె)ను బయటకు తీసినప్పుడు కేశాలు దగ్గరకు రావడానికి కారణం తలతన్యత.
* తల వెంట్రుకలు నీటిలో తడిచినప్పుడు, నూనె రాసినప్పుడు దగ్గరగా రావడానికి కారణం తలతన్యత.
* సబ్బు నీటి తలతన్యతను తగ్గిస్తుంది. అందువల్ల దుస్తులకు అంటుకున్న మురికి పదార్థాలు తొలగిపోతాయి.
* రెండు సమతల గాజు పలకల మధ్య నీటిపొరను ఉంచినప్పుడు వాటిని విడదీయడం చాలా కష్టం కారణం వాటి మధ్య ఉండే సంసంజన బలాలు.
* తలతన్యత ఆధారంగా కీటకాలు నీటి ఉపరితలంపై ఈదగలుగుతాయి.
* ఉష్ణోగ్రతను పెంచితే ద్రవాల తలతన్యత తగ్గుతుంది. సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థాల తలతన్యత శూన్యం.
స్పర్శ కోణం: (Angle of Contact)
* ఒక ద్రవం, ఒక ఘనపదార్థం ఒకదానికొకటి తాకుతున్నప్పుడు ద్రవం లోపల ద్రవం తలానికి గీసిన స్పర్శరేఖ, ఘనపదార్థ తలానికి మధ్య ఉన్నకోణాన్ని స్పర్శ కోణం అంటారు.
* నీరు, ఆల్కహాల్, గ్లిజరిన్ ద్రవాల స్పర్శకోణం గాజుతో 0o ఉంటుంది.
* పాదరసం, గాజుల మధ్య స్పర్శ కోణం 140o
* వాటర్ ప్రూఫింగ్ కారకాల స్పర్శ కోణం 90o కంటే ఎక్కువగా ఉంటుంది.
కేశనాళికీయత:
* ఏదైనా గాజు కడ్డీకి వెంట్రుక వాసి మందం ఉన్న రంధ్రాన్ని చేస్తే దాన్ని కేశనాళికా గొట్టం అంటారు. ఈ కేశనాళికా గొట్టాన్ని ద్రవ పదార్థంలో ముంచినప్పుడు దానిలోని ద్రవం తన అసలు మట్టాని కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో ఉండే ధర్మాన్ని కేశనాళికీయత అంటారు.
* కేశనాళికీయతకు కారణాలు సంసంజన, అసంజన బలాలు.
* ఒకే రకమైన పదార్థ అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలను సంసంజన బలాలు అంటారు.
* రెండు వేర్వేరు పదార్థాల అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలను అసంజన బలాలు అని అంటారు.
* సంసంజన బలాల కంటే అసంజన బలాలు ఎక్కువైనప్పుడు కేశనాళికా గొట్టంలో ద్రవంపైకి ఎగబాకుతుంది.
* అసంజన బలాల కంటే సంసంజన బలాలు ఎక్కువ అయితే కేశనాళికా గొట్టంలో ద్రవం అసలు మట్టాని కంటే తక్కువ కిందికి పడుతుంది.
ఉదా: పాదరసంలోని గాజు కేశనాళం.
అనువర్తనాలు:
* పెన్ను పాళీలో ఇంకు ప్రవహించడం కేశనాళికీయత
* అద్దుడు కాగితం, స్పాంజి ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి.
* కేశనాళికా గొట్టంలో నీటి ఆకారం పుటాకారంగా, పాదరసం కుంభాకారంగా ఉంటాయి.
* ప్రమిదలో నూనె పోస్తే ఒత్తిలోని సూక్ష్మరంధ్రాల ద్వారా ప్రమిద వెలగడం.
* కొవ్వొత్తి మండటం
* భూమిలో ఉన్న నీరు తనంతట తాను చెట్టు వేర్ల సూక్ష్మరంధ్రాల ద్వారా ప్రయాణించి కాండం ద్వారా కొమ్మలను చేరుతుంది. కారణం కేశనాళికీయత.
స్నిగ్ధత:
* ద్రవాలు లేదా వాయువుల వివిధ పొరల మధ్య ఉండే ఘర్షణ బలాన్ని స్నిగ్ధత అని అంటారు.
దీని ప్రమాణాలు: పాయిజ్
* అత్యధిక స్నిగ్ధత ఉండే ద్రవాలను స్నేహక తైలాలు (Lubricants)గా ఉపయోగిస్తారు.
* పారాచూట్ సహాయంతో కిందకు దిగుతున్న వ్యక్తి వేగం వాయువుల స్నిగ్దతా గుణం వల్ల క్రమక్రమంగా తగ్గుతుంది. అందువల్ల భూమిని చేరినప్పుడు ఆ వ్యక్తి వేగం తక్కువగా ఉంటుంది.
* సముద్రంలోని అలలు ఉద్భవించి కొంత దూరం ప్రయాణించిన తర్వాత క్షీణించి పోవడానికి కారణం స్నిగ్ధత.
* గాలి స్నిగ్ధతా బలాలను ఉపయోగించుకుని పారాచూట్ పనిచేస్తుంది.
* ద్రవాల్లో ఉష్ణోగ్రతను పెంచిన కొద్దీ స్నిగ్ధత తగ్గుతుంది. కారణం సంసంజన బలాల పరిమాణం పెరగడం.
* వాయువుల ఉష్ణోగ్రతను పెంచిన కొద్దీ అణువుల మధ్య ద్రవ్యవేగ మార్పిడి ఎక్కువవుతుంది. కాబట్టి వాటి స్నిగ్ధత పెరుగుతుంది.