• facebook
  • whatsapp
  • telegram

ధ్వని

1. TV ధ్వనిని పెంచితే, ధ్వని లక్షణాల్లో మారేది-
జ: కంపన పరిమితి

 

2. స్టెతస్కోపు గొట్టం ద్వారా ధ్వని ఎలా ప్రయాణిస్తుంది?
జ: బహుళ పరావర్తనం

 

3. ధ్వని వల్ల మెదడు పొందే అనుభూతిని తెలియజేసే ధ్వని లక్షణం-
జ: నాణ్యత

 

4. కిందివాటిలో తరంగం ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లేది-
1) ద్రవ్యరాశి             2) వేగం            3) తరంగదైర్ఘ్యం            4) శక్తి
జ: శక్తి

 

5. స్ప్రింగ్‌లో ఏర్పడే తరంగాలు
జ: అనుదైర్ఘ్య, తిర్యక్

 

6. అనుదైర్ఘ్య తరంగాల్లో కణాలు తరంగచలన దిశకు ........ గా ప్రసరిస్తాయి.
జ: సమాంతరంగా

7. కిందివాటిలో ధ్వనివేగం వేటిలో అధికంగా ఉంటుంది?
1) ఘనపదార్థాలు             2) ద్రవపదార్థాలు             3) వాయువులు             4) చెప్పలేం
జ: ఘనపదార్థాలు

 

8. తరంగ చలనంలో కణాల గరిష్ఠ స్థానభ్రంశాన్ని ..... అంటారు.
జ: కంపనపరిమితి

 

9. కంపనపరిమితి SI ప్రమాణం-
జ: మీటరు

 

10. ఒక తరంగం 2.5 సెకన్‌లలో 20 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత?
జ: 8 Hz

 

11. ఆవర్తన కాలం, పౌనఃపున్యాల లబ్ధం విలువ-
జ:  1

 

12. మానవుడి శ్రావ్య అవధి కనిష్ఠ విలువ
జ: 20 Hz

 

13. కింది ఏ భౌతికరాశిలోని మార్పు వల్ల ధ్వనివేగం మారదు?
1) పౌన:పున్యం             2) తరంగదైర్ఘ్యం             3) పీడనం             4) సాంద్రత
జ: పౌన:పున్యం

14. కిందివాటిలో దేనిలో మార్పునకు ధ్వనివేగం ప్రభావితం కాదు?
1) ఉష్ణోగ్రత                2) యానకం               3) పీడనం               4) తరంగదైర్ఘ్యం
జ: పీడనం

 

15. సితార్, వీణల నుంచి వచ్చే ధ్వనిని వేరుచేసేది-
జ: నాణ్యత

 

16. ఒక వస్తువు పౌనఃపున్యం 200 Hz, గాలిలో ధ్వని వేగం 340 m/sec అయితే ఉత్పత్తి అయిన ధ్వని తరంగదైర్ఘ్యం
జ: 1.7 మీ.

 

17. కిందివాటిలో వాయు వాయిద్యం కానిది
1) పిల్లనగ్రోవి               2) మాండలిన్              3) క్లారినెట్               4) హార్మోనియం
జ: మాండలిన్

 

18. ధ్వని తీవ్రతకు ప్రమాణం-
జ: డెసిబుల్

 

19. వాయువుల్లో సాంద్రత పెరిగిన ధ్వనివేగం-
జ: తగ్గుతుంది

 

20. సోనార్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం-
జ: ధ్వని పరావర్తనం

21. పిల్లన గ్రోవి అనేది ధ్వనికి చెందిన ఈ అంశానికి సంబంధించింది.
జ: అనునాదం

 

22. మానవుడు సెకనుకు వినగలిగే విస్పందనాల సంఖ్య
జ: 10

 

23. ధ్వని దేనిలో వేగంగా ప్రయాణిస్తుంది?
జ: ఉక్కు

 

24. గాలిలో ధ్వని వేగం-
జ: 330 మీ./సె.

 

25. చంద్రుడిపై ధ్వనిని వినలేం ఎందుకంటే
జ: వాతావరణం ఉండదు

 

26. సంగీత ధ్వనిని గుర్తించే లక్షణం-
1) పిచ్                 2) ధ్వని                3) నాదగుణం                4) పైవన్నీ
జ: పైవన్నీ

 

27. భూకంపాలు వచ్చినప్పుడు ఉత్పత్తి అయ్యే తరంగాలు
1) శ్రావ్యధ్వనులు                  2) పరిశ్రావ్య ధ్వనులు                  3) అతిధ్వనులు                  4) పైవన్నీ
జ: పైవన్నీ

28. గర్భస్థ శిశువుకు సంబంధించిన పరీక్షకు ఉపయోగపడే తరంగాలు
జ: అతిధ్వనులు

 

29. ధ్వని బంధక గదుల నిర్మాణంలో కిందివాటిలో వేటిని ఉపయోగిస్తారు?
1) స్వచ్ఛమైన ప్లాస్టిక్              2) రబ్బరు               3) థర్మోకోల్               డి) పైవన్నీ
జ: అన్నీ

 

30. అతిధ్వనులను వినగలిగే జీవి-
1) డాల్ఫిన్               2) కుక్కలు               3) గబ్బిలం               4) పైవన్నీ
జ: పైవన్నీ

 

31. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం-
జ: మైక్రోఫోన్

 

32. గనుల, బావుల లోతును కిందివాటిలో దేని ద్వారా కనుక్కుంటారు?
జ: ప్రతిధ్వని

 

33. ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుడి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి?
జ: 16.5 మీ.

 

34. మునిగిపోయిన వస్తువులను కనుక్కోవడానికి తోడ్పడే పరికరం-
జ: సోనార్

35. ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు?
జ: ఆడియోగ్రఫీ

 

36. సాధారణంగా ఆడవారి కంఠస్వరం స్థాయి పురుషుడి కంటే....
జ: ఎక్కువ

 

37. కిందివాటిలో మాక్‌నంబరును దేనిలో ఉపయోగిస్తారు?
1) ధ్వని              2) విద్యుత్               3) అయస్కాంతం               4) కాంతి
జ: ధ్వని

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌