* బొగ్గును మండించడం, శరీరంలో ఆహారం జీర్ణమవడం, ఇనుము తుప్పుపట్టడం, శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ, పాలు పెరుగుగా మారడం, పొడిసున్నానికి నీటిని కలపడం, టపాసులను పేల్చడం లాంటివన్నీ రసాయన మార్పులే.
* ఒక రసాయన చర్య జరిగినప్పుడు కింది మార్పులు జరుగుతాయి.
i) తొలి పదార్థాలు వాటి గుణాత్మక ధర్మాలు కోల్పోతాయి.
ii) రసాయన చర్యలు ఉష్ణమోచక, ఉష్ణగ్రాహక చర్యలు.
iii) కరగని అవక్షేపాన్ని ఏర్పరుస్తూ చర్య జరపవచ్చు.
iv) కొన్ని సందర్భాల్లో వాయువు విడుదల కావచ్చు.
* ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పునకు గురవుతాయో వాటిని క్రియాజనకాలు అంటారు.
* రసాయన చర్యలో కొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
* ఒక రసాయన చర్యను అతి సూక్ష్మరూపంలో లేదా సంకేతాల్లో తెలియజేస్తే దాన్ని రసాయన సమీకరణం అంటారు.
ఉదా: CaOకు నీటిని కలపడం వల్ల Ca(OH)2 ఏర్పడుతుంది.
CaO + H2O Ca(OH)2
* ఏ రసాయన సమీకరణంలోనైతే క్రియాజనకాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి సమీకరణాన్ని తుల్యరసాయన సమీకరణం అంటారు.
Fe2O3 + 2 Al 2 Fe + Al2O3
* రసాయన సమీకరణంలో క్రియాజనకాలు లేదా క్రియాజన్యాలు కిందివాటిపై ఆధారపడతాయి.
i) భౌతిక స్థితి
ii) ఉష్ణోగ్రతలో మార్పులు
iii) ఏదైనా వాయువు వెలువడటం
iv) ఏదైనా అవక్షేపం ఏర్పడటం
* పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని జలద్రావణాలు అంటారు.
* వేడిచేయడానికి ''Δ" అనే గుర్తుతో సూచిస్తారు.
* ఉష్ణాన్ని విడుదల చేస్తే ఆ రసాయన చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు.
C + O2

* ఉష్ణాన్ని గ్రహించే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
N2 + O2

* రసాయన చర్యలో వాయువు విడుదల అయినట్లయితే '↑' గుర్తు వాడతారు.
* అవక్షేపం ఏర్పడినట్లయితే '↓' గుర్తును వాడతారు.
* రసాయన సమీకరణం క్రియాజనకాల, క్రియాజన్యాల సాపేక్ష ద్రవ్యరాశుల గురించి తెలియజేస్తుంది.
* రసాయన సమీకరణం నుంచి కింది సంబంధాలు తెలుసుకోవచ్చు.
A) ద్రవ్యరాశి - ద్రవ్యరాశి సంబంధం
B) ద్రవ్యరాశి - ఘనపరిమాణ సంబంధం
C) ఘనపరిమాణ - ఘనపరిమాణ సంబంధం
D) ద్రవ్యరాశి, ఘనపరిమాణం, అణువుల మధ్య సంబంధం
ఉదా: 8 గ్రాముల కాల్షియం కార్బొనేట్‌ను వేడిచేస్తే విడుదలైన CO2 ద్రవ్యరాశి ఎంత?
100 గ్రా. CaCO3 44 గ్రా. CO2 ను ఇస్తుంది.
8 గ్రాముల CaCO3 ఇచ్చే CO2 = 8/100 × 44 = 3.52 గ్రా.
* STP వద్ద 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్యనొందినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ద్రవ్యరాశి, ఘనపరిమాణం లెక్కించండి.
46 గ్రా. సోడియం - 2 గ్రా. హైడ్రోజన్‌ను ఇస్తుంది.
230 గ్రా. సోడియం - 230/46 × 2 = 10 గ్రా.
* స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 1 గ్రాము మోలార్ ద్రవ్యరాశి గల ఏదైనా వాయువు 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. దీన్నే గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటారు.
రసాయన చర్యలు - రకాలు: ఇవి 4 రకాలు.
1. రసాయన సంయోగం
2. రసాయన వియోగం
3. రసాయన స్థానభ్రంశం
4. రసాయన ద్వంద్వ వియోగం
1. రసాయన సంయోగం:
ఒక రసాయన చర్యలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు చర్యజరిపి ఒక క్రియాజన్యాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని రసాయన సంయోగం అంటారు.
C + O2 → CO2 + Q
* పొడిసున్నానికి నీటిని కలిపి తడిసున్నం తయారు చేయడం.
CaO + H2O →Ca(OH)2 + Q
2. రసాయన వియోగం:
ఒక రసాయన చర్యలో ఒక క్రియాజనకం రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం అంటారు.
CaCO3

* ఇది ఒక ఉష్ణవియోగ చర్య. వేడిచేయడం ద్వారా పదార్థాలు వియోగం చెందినట్లయితే వాటిని ఉష్ణవియోగ చర్యలు అంటారు.
2 Pb(NO3)2

2 H2O → 2 H2 + O2
2 AgBr → 2 Ag + Br2 ↑
పై చర్యలు కాంతి సమక్షంలో జరుగుతాయి కాబట్టి వీటిని కాంతి రసాయన చర్యలు అంటారు.
* పై చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అని కూడా అంటారు.
3. రసాయన స్థానభ్రంశం:
రసాయన చర్యలో సమ్మేళనంలోని ఒక మూలకం మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించి దాని స్థానంలోకి ఇది వస్తుంది. దీన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.
e.g.: Zn + 2 HCl → ZnCl2 + H2
Fe + CuSO4→ FeSO4 + Cu
Zn + 2 AgNO3→ Zn(NO3)2 + 2 Ag
Pb + CuCl2 → PbCl2 + Cu
4. రసాయన ద్వంద్వ వియోగం:
ఒక రసాయన చర్యలోని రెండు క్రియాజనకాలు ధన, రుణ ప్రాతిపదికలుగా మార్పు చెందితే అలాంటి చర్యలను రసాయన ద్వంద్వ వియోగం అంటారు.
NO2SO4 + BaCl2 → BaSO4 + 2 NaCl
NaOH + HCl → NaCl + H2O
NaCl + AgNO3→ AgCl + NaNO3
ఆక్సీకరణం, క్షయకరణం:
* ఒక రసాయన చర్యలో ఆక్సిజన్‌ను కలపడం లేదా హైడ్రోజన్‌ను తీసివేయడం ద్వారా జరిగే చర్యలను ఆక్సీకరణ చర్యలు అంటారు.
* ఒక రసాయన చర్యలో ఆక్సిజన్‌ను తీసివేయడం లేదా హైడ్రోజన్‌ను కలపడం ద్వారా జరిగే చర్యలను క్షయకరణ చర్యలు అంటారు.
* ఆక్సీకరణం, క్షయకరణం ఒకేచర్యలో జరిగితే వాటిని రెడాక్స్ చర్యలు అంటారు.
2 Cu + O2 → 2 CuO ఆక్సీకరణ చర్య.
CuO + H2 → Cu + H2O క్షయకరణ చర్య.
నిత్యజీవిత అనువర్తనాలు
* టపాసులు పేలడం ఆక్సీకరణ చర్య. దీనిలో మెగ్నీషియం ఆక్సీకరణం చెందడం వల్ల మిరుమిట్లు గొలిపే కాంతి విడుదల అవుతుంది.
* ఆపిల్ కోసినప్పుడు నిదానంగా గోధుమ రంగులోకి; నిమ్మకాయ కోసినప్పుడు మెల్లిగా ఎరుపు రంగులోకి; ఇనుప వస్తువులు కొత్తవి తెల్లగా, కాలం గడిచేకొద్ది గోధుమ రంగులోకి మారతాయి. కారణం ఆక్సీకరణమే.
* ఆపిల్‌లో ఉండే పాలీఫినాల్ ఆక్సిడేజ్/టైరోసినేజ్ అనే ఎంజైమ్ ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆపిల్‌ను గోధుమ రంగులోకి మారుస్తుంది.
* ఇనుము తుప్పుపట్టడం ఒక ఆక్సీకరణ చర్య.
* వెండి వస్తువులపై నల్లని పూత, రాగి వస్తువులపై ఆకుపచ్చ పూత ఏర్పడటానికి కారణం క్షయకరణం.
4 Ag + 2 H2S + O2 → 2 Ag2S + 2 H2O
(నలుపు)
2 Cu + O2 → 2 CuO
* తేమగల క్లోరిన్ వాయువులు రంగు గల వస్తువులను విరంజనం చెందించి రంగును కోల్పోయేలా చేస్తాయి.
Cl2 + H2O → HOCl + HCl
HOCl → HCl + [O]
ఇది క్షయకరణ చర్య.
* కొన్నిసార్లు వర్షాకాలంలో విద్యుత్తు స్తంభం నుంచి వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనికి కారణం విద్యుత్ తీగపై లోహఆక్సైడ్ పూత ఏర్పడటమే.
ఈ లోహఆక్సైడ్ విద్యుత్ నిరోధంగా పనిచేస్తుంది.
* వెండి వస్తువులపై నల్లని పూత, రాగి వస్తువులపై ఆకుపచ్చ పూత ఏర్పడటానికి కారణం క్షయకరణం.
4 Ag + 2 H2S + O2 → 2 Ag2S + 2 H2O
(నలుపు)
2 Cu + O2 → 2 CuO
* తేమగల క్లోరిన్ వాయువులు రంగు గల వస్తువులను విరంజనం చెందించి రంగును కోల్పోయేలా చేస్తాయి.
Cl2 + H2O HOCl + HCl
HOCl → HCl + [O]
ఇది క్షయకరణ చర్య.
* కొన్నిసార్లు వర్షాకాలంలో విద్యుత్తు స్తంభం నుంచి వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనికి కారణం విద్యుత్ తీగపై లోహఆక్సైడ్ పూత ఏర్పడటమే.
ఈ లోహఆక్సైడ్ విద్యుత్ నిరోధంగా పనిచేస్తుంది.
ముక్కిపోవడం:
* నూనెలు/కొవ్యులు ఎక్కువకాలం నిల్వచేయడం ద్వారా ఆక్సీకరణం చెంది వాటి రుచి, వాసన మారిపోతాయి. దీన్నే ముక్కిపోవడం అంటారు.
* ముక్కిపోవడం ఒక ఆక్సీకరణ చర్య.
* ఆహారం పాడవకుండా ఉండాలంటే విటమిన్ C లేదా విటమిన్ E కలపాలి.
* నూనెలు/కొవ్వులు నిల్వ ఉంచడానికి యాంటీ ఆక్సిడెంట్‌లు కలుపుతారు.
* ఆక్సీకరణం తగ్గించడానికి పదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేస్తారు.
* చిప్స్ తయారీదారులు చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ప్యాకెట్‌లో నైట్రోజన్ వాయువును నింపుతారు. ఇది ఆక్సీకరణాన్ని నిరోధిస్తుంది.
రసాయన బంధం
* ఇప్పటి వరకు తెలిసిన మూలకాలు - 115
* హంఫ్రీ డేవీ అనే రసాయన శాస్త్రవేత్త 250 లోహపు ఫలకలతో ఒక బ్యాటరీని నిర్మించారు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఉపయోగించి లవణ ద్రావణాల విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా పొటాషియం, సోడియంలను రాబట్టారు.
* హీలియం తప్ప మిగిలిన అన్ని జడవాయువుల వేలెన్సీ కర్పరంలో 8 మూలకాలు ఉంటాయి.
* మూలక పరమాణువు, దానిలోని వేలెన్సీ ఎలక్ట్రాన్‌లను పటం రూపంలో చూపించే పద్దతిని లూయీస్ గుర్తు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం అంటారు.
* బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ను ( లేదా '×' గుర్తుతో సూచిస్తారు.)
ఉదా:
వేలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం:
* 'కొసెల్', 'లూయీ' అనే శాస్త్రవేత్తలు 1916లో వేలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
*ఎలక్ట్రాన్‌ల ఆధారంగా వేలెన్సీని నిర్వచించడమే దీని ఉద్దేశం.
* జడవాయువుల రసాయన జడత్వం ఆధారంగా వేలెన్సీకి ఒక తార్కిక వివరణ ఇచ్చారు.
* ఎలక్ట్రాన్‌లను కోల్పోయిన మూలక అయాన్‌ను కాటయాన్, ఎలక్ట్రాన్‌ను స్వీకరించిన మూలక అయాన్‌ను ఆనయాన్ అంటారు.
* IA, IIA, IIIA గ్రూపు మూలకాలు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
ఉదా: Na+, Mg2+, Al+3
* VIA, VIIA గ్రూపు మూలకాలు ఆనయాన్‌లను ఏర్పరుస్తాయి.
ఉదా: O-2, Cl-1
* VIIIA గ్రూపు మూలకాలు ఎలాంటి అయాన్‌లను ఏర్పరచవు.
* ఒక లోహపరమాణువు దాని వేలెన్సీ నుంచి కోల్పోయే ఎలక్ట్రాన్‌ల సంఖ్య దాని గ్రూపు సంఖ్యకు సమానం.
ఉదా: Na వేలెన్సీ 1, Mg వేలెన్సీ 2. ఇవి వాటి గ్రూపు సంఖ్యకు సమానం.
* అలోహ మూలకం దాని పరమాణువు నుంచి గ్రహించే సంఖ్యనే దాని వేలెన్సీ అంటారు. ఇది కూడా దాని గ్రూపు సంఖ్యకు సమానం.
ఉదా: క్లోరిన్ వేలెన్సీ π = (8 - 7) = 1.
అయానిక బంధం:
కొసెల్ అనే శాస్త్రవేత్త కింది అంశాల ఆధారంగా అయానిక బంధాన్ని వివరించారు.
i) రెండు వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్‌ల మార్పిడి వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది.
ii) ఆవర్తన పట్టికకు ఎడమవైపున ఎక్కువ చర్యశీలత గల లోహాలు, కుడివైపున ఎక్కువ చర్యాశీలత గల అలోహాలు ఉన్నాయి.
iii) జడవాయువులు తక్కువ చర్యాశీలతను, ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతాయి.
iv) బాహ్యకక్ష్యలో 1, 2 లేదా 3 ఎలక్ట్రాన్లు ఉన్న లోహ పరమాణువులు చివరి కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి జడవాయువు స్థిర విన్యాసాన్ని పొందడానికి ఆ ఎలక్ట్రాన్‌లను కోల్పోయి కాటయాన్‌లుగా మారతాయి.
v) 5, 6, 7 వేలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగిన అలోహాలు వాటి చివరి కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లను పొందడానికి ఎలక్ట్రాన్‌లను గ్రహించి ఆనయాన్‌లను ఏర్పరుస్తాయి.
* రెండు ఆవేశపూరిత అయాన్‌ల మధ్య ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటారు.
* ఆనయాన్‌ల మధ్య పనిచేసే బలాలు స్థిర విద్యుత్ బలాలు కాబట్టి ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం లేదా ఎలక్ట్రోస్టాటిక్ బంధం అంటారు.
* వేలెన్సీ భావనను ఎలక్ట్రాన్‌ల పరంగా వివరించారు. కాబట్టి దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధం అంటారు.
Na → Na+ + e- 1 e- + Cl → Cl-1
అయానిక బంధం ద్వారా ఏర్పడే పదార్థాలు:
NaCl, MgCl2, Na2O (డై సోడియం మోనాక్సైడ్), AlCl3 etc.
* ఒక నిర్దిష్ట ఆవేశంగా అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం ఉండే అయాన్‌లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను అయాన్ సమన్వయ సంఖ్య అంటారు.
ఉదా: NaClలో Na సమన్వయ సంఖ్య - 6
Cl సమన్వయ సంఖ్య - 6.
* సాధారణంగా లోహ మూలకాలు బాహ్యకక్ష్య నుంచి ఎలక్ట్రాన్‌లను కోల్పోయి అష్టక విన్యాసం పొందడానికి ప్రయత్నిస్తాయి. ఈ ధర్మాన్ని లోహధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు.
* ధన విద్యుదాత్మకత ఉన్న మూలకాలు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
* కాటయాన్‌గా, ఆనయాన్‌గా మారే స్వభావం 4 అంశాలపై ఆధారపడుతుంది.
అవి:
i) పరమాణు పరిమాణం
ii) అయనీకరణ శక్మం
iii) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
iv) రుణ విద్యుదాత్మకత
* తక్కువ అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎక్కువ పరమాణు పరిమాణం ఉన్న మూలకాలు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
* అధిక అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, తక్కువ పరమాణు పరిమాణం ఉన్న మూలకాలు ఆనయాన్‌లను ఏర్పరుస్తాయి.
సమయోజనీయ బంధం:
* 1916లో జి.ఎన్.లూయీస్ పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్‌ల మార్పిడి జరగకుండానే అష్టక విన్యాసం పొందుతాయని వివరించారు.
* వేలెన్సీ ఎలక్ట్రాన్‌లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులతో పంచుకోవడం వల్ల సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
* ఇందులో ఎలక్ట్రాన్ జంటను పరస్పరం సమష్టిగా పంచుకుంటాయి.
ఉదా: ఫ్లోరిన్, ఆక్సిజన్, మీథేన్, అమ్మోనియా, నీటి అణువుల ఏర్పాటు.
* సంయోగం చెందే పరమాణువుల మధ్య రెండు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే ద్విబంధం, మూడు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే త్రిబంధం అంటారు.
* ఒక మూలకం సమయోజనీయ బంధాలను ఏర్పరిచే సంఖ్యను సమయోజనీయత అంటారు.
* సమయోజనీయ బంధంతో కలపబడిన రెండు పరమాణు కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద ఉండే దూరాన్ని బంధ దూరం లేదా బంధదైర్ఘ్యం అంటారు.
* దీన్ని నానోమీటర్ (nm) లేదా ఆంగ్‌స్ట్రాం యూనిట్ (A°)ల్లో కొలుస్తారు.
* BeCl2 లో Cl - Be - Cl బంధకోణం 180°.
* BF3లో బంధకోణం 120°, మీథేన్‌లో బంధకోణం 109°28'.
* అమ్మోనియా (NH3)లో 107°18'గా, నీటి అణువు (H2O)లో 104°31' గా బంధకోణం ఉంటుంది.
* అణువుల ఆకృతులను వేలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం వివరించలేకపోయింది.
* మూడు అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడిన అణువుల్లో అన్ని పరమాణువులు ఒక కేంద్రక పరమాణువుతో సమయోజనీయ బంధంతో బంధింపబడి ఉన్నప్పడు వాటి మధ్య బంధకోణాలను వివరించడానికి VESPRT సిద్ధాంతం రూపొందించారు.
VESPRT అంటే Valence - Shall - Electron - Pair - Repulsion - Theory
* దీన్ని సిట్జివిక్, పావెల్ 1940లో ప్రతిపాదించారు.
* 1957లో దీన్ని గిలెస్పీ, నేహామ్ అనే శాస్త్రవేత్తలు మరింతగా అభివృద్ధి పరిచారు.
* BeCl2, CO2 ఆకృతి రేఖీయం.
* NH3 (అమ్మోనియా) ఆకృతి త్రికోణీయ ద్విపిరమిడ్.
* వెస్పర్ట్ సిద్ధాంతం బంధశక్తులను వివరించడంలో విఫలమైంది.
* వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని లైనస్ పౌలింగ్ ప్రతిపాదించారు.
* రెండు ఆర్బిటాళ్ల అంత్యాలు అతిపాతం చెందడం వల్ల లేదా పరమాణు కేంద్రకాలు కలిసే అక్షీయ రేఖ వెంబడి ఆర్బిటాళ్ల అతిపాతం వల్ల సిగ్మా బంధం (σ) ఏర్పడుతుంది.
* ఆర్బిటాళ్లు పార్శ్వభాగాల అతిపాతం వల్ల పై బంధం (π) ఏర్పడుతుంది.
* π బంధం కంటే σ బంధం బలమైంది, స్వతంత్రమైంది.
* O2 అణువు ఏర్పాటులో 1σ, 1π బంధం ఏర్పడతాయి. (ద్విబంధం)
* N2 అణువు ఏర్పాటులో 1σ, 2π బంధాలు ఏర్పడతాయి. (త్రిక బంధం)
* లైనస్ పౌలింగ్ పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణం అనే దృగ్విషయాన్ని ప్రతిపాదించారు.
* పరమాణు ఆర్బిటాళ్లను పునర్ వ్యవస్థీకరించడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం లాంటి ధర్మాలున్న సర్వసమాన ఆర్బిటాళ్లను ఏర్పరిచే దృగ్విషయాన్ని సంకరీకరణం అంటారు.
* BeCl2లో sp సంకరీకరణం.
* BF3లో sp2 సంకరీకరణం.
* అమ్మోనియాలో sp3 సంకరీకరణం ఉంటుంది.
* అయానిక పదార్థాలు ధ్రువద్రావణాల్లో కరుగుతాయి, అధ్రువ ద్రావణాల్లో కరగవు.
* సమయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి. నీరు లాంటి ధ్రువ ద్రావణాల్లో కరగవు.
మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా?
* దైనందిన జీవితంలో శుద్ధపదార్థం అంటే కల్తీలేనిది అని అర్థం.
* వ్యాపారాత్మకంగా పాల నుంచి వెన్నను తీయడానికి, వైద్యశాలలో రక్తనమూనా, మూత్ర నమూనాలను పరీక్షించడానికి అపకేంద్ర యంత్రాలను వాడతారు.
* అపకేంద్ర యంత్రం భారయుత, తేలికపాటి కణాలను వేరుచేస్తుంది.
* లాండ్రి డ్రయ్యర్ ఒక తరహా అపకేంద్ర యంత్రం.
* మన చుట్టూ ఉన్న పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. శుద్ధ పదార్థాలు
2. మిశ్రమ పదార్థాలు
* సజాతీయ పదార్థాన్ని శుద్ధ పదార్థం అంటారు.
* పదార్థం ఏ భాగం నుంచి తీసుకున్న నమూనాలోనైనా సంఘటనంలో మార్పు ఉండదు.
ఉదా: శుద్ధ బంగారంలో సూక్ష్మభాగం తీసుకున్న దాని సంఘటనంలో మార్పు ఉండదు.
* రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల అనుఘటకాల కలయిక వల్ల ఏర్పడినదాన్ని మిశ్రమం అంటారు.
* ఒక మిశ్రమంలోని పదార్థాలు భౌతిక కలయికగానే ఉంటాయి. రసాయన సంయోగంగా ఉండవు.
* మిశ్రమాలు ఎల్లప్పూడూ సజాతీయం కావు.
* మిశ్రమాలు రెండు రకాలు.
i) సజాతీయ మిశ్రమం
ii) విజాతీయ మిశ్రమం
i) సజాతీయ మిశ్రమం:
మిశ్రమంలో ఉండే అనుఘటకాలు ఏకరీతిగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమాన్ని సజాతీయ మిశ్రమం అంటారు.
* ఇందులోని పదార్థకణాలు కంటితో వేర్వేరుగా గుర్తించలేని విధంగా సంయోగం చెంది ఉంటాయి.
ఉదా: గాలి అనేక వాయువుల మిశ్రమం. నిమ్మరసం, ఉప్పుద్రావణం.
ii) విజాతీయ మిశ్రమం:
మిశ్రమంలో భిన్న స్థితుల్లో ఉండే పదార్థ భాగాలు కలిసినట్లయితే ఆ మిశ్రమాన్ని విజాతీయ మిశ్రమం అంటారు.
ఉదా: నూనె, నీటి మిశ్రమం; నాఫ్తలిన్, నీటి మిశ్రమం
ద్రావణాలు (Solutions):
* రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు.
* ద్రావణాలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉండవచ్చు.
* ద్రావణం అనేది ద్రావితం, ద్రావణి అనే అనుఘటకాల మిశ్రమం.
ద్రావణం = ద్రావితం + ద్రావణి
* ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉన్ప పదార్థాన్ని ద్రావితం, ఎక్కువ పరిమాణంలో ఉండి కరిగించుకునే పదార్థాన్ని ద్రావణి అంటారు.
ఉదా: చక్కెర ద్రావణంలో చక్కెర ద్రావితం, నీరు ద్రావణి.
టింక్చర్ అయోడిన్‌లో అయోడిన్ ద్రావితం, ఆల్కహాల్ ద్రావణి.
శీతల పానియాల్లో CO2 ద్రావితం, నీరు ద్రావణి.
ద్రావణాలు - ధర్మాలు:
i) ద్రావణ గాఢత:
నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉండే ద్రావితం పరిమాణాన్ని ఆ ఉష్ణోగ్రత వద్ద ద్రావణీయత అంటారు.
* ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగ గలదో అంతే ద్రావితాన్ని కలిగి ఉండే ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.
* ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణం ఇంకా ఏ మాత్రం ద్రావితాన్ని కరిగించుకోలేదు.
* ఒక ద్రావణంలో గరిష్ఠంగా కరిగే ద్రావిత పరిమాణం కంటే, తక్కువ ద్రావితం కరిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు.
* ద్రావణీయత ఆధారపడి ఉండే అంశాలు
i) ద్రావితం, ద్రావణుల స్వభావం
ii) ఉష్ణోగ్రత
* ఒక ద్రావణిలో ద్రావిత పరిమాణం తక్కువగా ఉంటే విలీన ద్రావణం, ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉంటే గాఢ ద్రావణం అని అంటారు.
* నిర్దిష్ట ఘనపరిమాణం గల ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత ఘనపరిమాణాన్ని
లేదా
* నిర్ధిష్ట ఘనపరిమాణం గల ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణ గాఢత అంటారు.
ఉదా: 200 గ్రా. నీటిలో 50 గ్రా. ఉప్పు కరిగి ఉంది. ఆ ద్రావణ ద్రవ్యరాశి శాతం కనుక్కోండి.
సాధన: ద్రావిత ద్రవ్యరాశి = 50 గ్రా.
ద్రావణి ద్రవ్యరాశి = 200 గ్రా.
= 1/5 = 0.2 × 100 = 20%
ఉదా: 80 ml ద్రావణంలో 20 ml చక్కెర కరిగి ఉంది. ఘనపరిమాణ శాతం కనుక్కోండి.
అవలంబనాలు, కాంజికాభ ద్రావణాలు
* ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థ కణాలను కలిగి ఉండే ద్రావణాలను అవలంబనాలు అని అంటారు.
* ఇవి విజాతీయ మిశ్రమాలు
ఉదా: మట్టిని నీటిలో కలిపినప్పుడు ఏర్పడే మిశ్రమం.
* కరగని ఘనపదార్థం, ద్రవపదార్థం కలిసి ఉండే విజాతీయ మిశ్రమాలే అవలంబనాలు.
* మిశ్రమం ద్వారా కాంతిని ప్రసరింపజేసినప్పుడు కాంతి కణాలను సులభంగా పరిక్షేపణం చెందించే మిశ్రమాలను కొల్లాయిడ్‌లు లేదా కాంజికాభ ద్రావణాలు అంటారు.
* వీటి లక్షణాలు ద్రావణాలు, అవలంబనాలకు మధ్యస్థంగా ఉంటాయి.
ఉదా: పాలు, వెన్న, జున్ను, క్రీం, జెల్, షూ-పాలిష్, మేఘం.
* సాధారణంగా కొల్లాయిడ్ ద్రావణాలు విజాతీయ మిశ్రమాలు.
* ఇవి రెండు ప్రావస్థలను కలిగి ఉంటాయి.
i) విక్షేపణ ప్రావస్థ (disperse phase)
ii) విక్షేపణ యానకం (dispersion medium)
* విక్షేపణ ప్రావస్థ అనేది కొల్లాయిడ్ యానకంలో తక్కువ నిష్పత్తిలో ఉంటుంది. ఇందులో కొల్లాయిడ్ కణాల పరిమాణం 1nm - 100 nm వరకు ఉంటుంది.
* విక్షేపణ యానకం అనేది కొల్లాయిడ్ కణాలు విస్తరించి ఉన్న ఒక యానకం.
* రెండు ప్రావస్థలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఏ రూపంలోనైనా ఉండవచ్చు.
* రెండు ప్రావస్థల భౌతిక స్థితిపై ఆధారపడి వివిధ రకాల కొల్లాయిడ్ ద్రావణాలు ఏర్పడతాయి.
* కొల్లాయిడ్ ద్రావణాలు దృశ్యకాంతిని పరిక్షేపణం చెందించడాన్ని టిండాల్ ప్రభావం అంటారు. దీన్ని టిండాల్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు.
* సూర్యకిరణాలు చెట్టు కొమ్మలు, ఆకుల మధ్య ప్రసరించినప్పుడు; వంటగదిలో పొయ్యి నుంచి వచ్చే పొగలో సూర్యకాంతి పడినప్పుడు టిండాల్ ప్రభావం గమనించవచ్చు.
* జలుబు, దగ్గుకు వాడే 'సిరప్ ఒక అవలంబనం.
* అవలంబనాలను వడపోత, తేర్చడం లాంటి ప్రక్రియల ద్వారా వేరుచేయవచ్చు.
* కొల్లాయిడ్‌లను వడపోత ద్వారా వేరు చేయలేం. వీటిని వేరు చేయడానికి అపకేంద్రిత విధానాన్ని ఉపయోగిస్తారు.
మిశ్రమాలను - వేరుచేయడం
i) ఉత్పతనం ద్వారా మిశ్రమాలను వేరుచేయడం
ii) బాష్పీభవనం ద్వారా మిశ్రమాలను వేరుచేయడం.
* క్రొమటోగ్రఫీ అనేది ఒక ప్రయోగశాల ప్రక్రియ. దీని ద్వారా ఒక మిశ్రమంలో ఉండే భిన్న అనుఘటకాలను వేరుచేయవచ్చు.
* సిరాలోని అనుఘటకాలను వేరు చేయడానికి; మొక్కలు, పుష్పాల్లోని రంగు వర్ణకాలను వేరుచేయడానికి క్రొమటోగ్రఫీ ఉపయోగిస్తారు.
* వివిధ రకాల రసాయన సంయోగాలను కనుక్కోడానికి క్రొమటోగ్రఫ్రీ ఉపయోగిస్తారు.
* ఒక ద్రవం వేరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోతే వాటిని మిశ్రణీయ ద్రవాలు అంటారు.
ఉదా: ఆల్కహాల్ నీటిలో పూర్తిగా కరగడం.
* ఒక ద్రవం మరొక ద్రవంలో కరగకుండా సులువుగా వేరుచేయగలిగే ద్రవాలను అమిశ్రణీయ ద్రవాలు అంటారు.
ఉదా: నూనెతో నీటిని కలపడం
డీసిల్‌తో నీటిని కలపడం.
* రెండు మిశ్రణీయ ద్రవాలను వేరు చేయడానికి స్వేదన ప్రక్రియను ఉపయోగిస్తారు.
* రెండు లేదా అంతకంటే ఎక్కువ మిశ్రణీయ ద్రవాల బాష్పీభవన స్థానాల్లో వ్యత్యాసం 25°C కంటే తక్కువగా ఉండే ద్రవాలను వేరుచేయడానికి అంశిక స్వేదన ప్రక్రియను ఉపయోగిస్తారు.
* ఈ వ్యత్యాసం 25°C కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సాధారణ స్వేదన ప్రక్రియను ఉపయోగిస్తారు.
శుద్ధపదార్థాలు రకాలు:
* ఏ పదార్థాల అనుఘటకాలను భౌతిక ప్రక్రియతో వేరుచేయలేమో వాటిని శుద్ధ పదార్థాలు అంటారు.
* శుద్ధ పదార్థాలు రెండు రకాలు. అవి:
1. మూలకాలు
2. సంయోగ పదార్థాలు
1. మూలకాలు:
* రసాయన చర్యల ద్వారా చిన్న చిన్న కణాలుగా విడగొట్టలేని పదార్థాన్ని మూలకం అంటారు.
* మూలకాలను లోహాలు, అలోహాలు, అర్ధలోహాలుగా విభజిస్తారు.
* 1669లో జర్మన్ రసవాది ''హెన్నింగ్ బ్రాడ్" మూత్రాన్ని మరిగించి భాస్వరాన్ని (ఫాస్ఫరస్) కనుక్కునే ప్రయత్నం చేశారు.
* మూలకం అనే పదాన్ని మొదట రాబర్ట్ బాయిల్ ఉపయోగించారు.
* మూలకాన్ని నిర్వచించిన వారు: లెవోయిజర్
* ''మూలకం అనేది పదార్థం మూల రూపం. ఇది రసాయన చర్యల్లో మరికొన్ని కణాలుగా విడిపోదు" అని లెవోయిజర్ నిర్వచించారు.
* సర్ హంఫ్రీ డేవీ 'సోడియం' బోరాన్ క్లోరిన్, మెగ్నిషియం మూలకాలను కనుక్కున్నారు.
2. సంయోగ పదార్థాలు:
* రసాయన చర్యలో ఏదైనా పదార్థం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోతే దాన్ని సంయోగ పదార్థం అంటారు.
*సంయోగ పదార్థ ధర్మాలు దాని అనుఘటక మూలకాల ధర్మాలకు భిన్నంగా ఉంటాయి. కానీ మిశ్రమం దాని అనుఘటక పదార్థాల ధర్మాలను ప్రదర్శిస్తుంది.
ప్రశ్న: 50 ml పోటాషియం క్లోరైడ్ ద్రావణంలో 2.5 గ్రాములు పొటాషియం క్లోరైడ్ ఉంటే దాని ఘనపరిమాణం శాతం కనుక్కోండి.