1. గుర్రపు బండిని లాగుతున్నప్పుడు శక్తి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది?
జ: కండర శక్తి గతిజ శక్తిగా
2. తిరుగుతున్న సీలింగ్‌ఫ్యాన్ రెక్కలకు ఉండే శక్తి
జ: భ్రమణ, స్థితి శక్తులు
3. ఎగురుతున్న పక్షికి ఉండే శక్తి
జ: యాంత్రికశక్తి
4. కదులుతున్న రైలుపెట్టెలో నుంచి ఒక వస్తువును బయటకు జారవిడిచినప్పుడు అది ప్రయాణించే మార్గం
జ: పరావలయం
5. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది
జ: డైనమో
6. పుటాకారంలో ఉన్న రోడ్డుపై ఒక బంతి చేసే చలనం
జ: సరళ హరాత్మక
7. బలానికి అంతర్జాతీయ ప్రమాణం
జ: న్యూటన్
8. భ్రమణ చలనంలోని వస్తువుకు ఉండే నిజమైన బలం
జ: అభికేంద్ర బలం
9. విరామంలోని వస్తువు కిందివాటిలో దేన్ని కలిగి ఉంటుంది?
1) జడత్వం 2) బలం 3) వేగం 4) ద్రవ్యవేగం
జ: 1(జడత్వం)
10. అపకేంద్రబలంపై ఆధారపడి పనిచేసేది
జ: వాషింగ్‌మెషీన్
11. మజ్జిగను చిలికినప్పుడు వెన్న వేరవడానికి కారణం
జ: అపకేంద్రబలం
12. సంధించడానికి సిధ్దంగా ఉన్న ధనస్సులో బాణం ఏ శక్తిని కలిగి ఉంటుంది?
జ: స్థితిశక్తి
13. ప్రచోదనం ప్రమాణం
జ: న్యూ-సెకను
14. 80 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉన్న ఒక వ్యక్తి ప్రయాణిస్తున్న లిఫ్ట్ తీగలు తెగితే అతడి భారం
జ: శూన్యం
15. గమన నియమాలను ఎవరు ప్రతిపాదించారు?
జ: న్యూటన్
16. కిందివాటిలో శక్తికి ప్రమాణం
1) ఎర్గ్ 2) జౌల్ 3) ఎలక్ట్రాన్ ఓల్ట్ 4) అన్నీ
జ: 4 (అన్నీ)
17. ఒక వ్యక్తి బరువు భూమిపై 36 కిలోలు అయితే చంద్రుడిపై అతడి బరువు
జ: 6 కి.గ్రా.
18. లిఫ్ట్‌ను ఎవరు కనుక్కున్నారు?
జ: ఓటిస్
19. కిందివాటిలో మిథ్యాబలం ఏది?
1) ఘర్షణ బలం 2) అపకేంద్ర బలం 3) అభికేంద్ర బలం 4) గురుత్వ బలం
జ: 2 (అపకేంద్రబలం)
20.
జ:
21. కోణీయ వేగానికి ప్రమాణాలు
జ: రేడియన్/సెకన్
22. సెకన్ల లోలకం డోలనావర్తన కాలం ఎన్ని సెకన్లు?
జ: 2
23. ఒక బంతిని నిలువుగా 40 మీ./సె. వేగంతో విసిరితే అది గరిష్ఠ ఎత్తు 80 మీ. చేరడానికి ఎంత సమయం పడుతుంది? (సెకన్లలో)
జ: 4
24. వృత్తాకార మార్గంలో ఒక పూర్తి భ్రమణం చేసిన వస్తువు స్థానభ్రంశం
జ: శూన్యం
25. ఘర్షణను తగ్గించే పద్ధతి
1) పాలిష్ చేయడం 2) స్నేహకాలు వాడటం
3) బాల్‌బేరింగ్ వాడటం 4) అన్నీ
జ: 4 (అన్నీ)
26. 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉండే వస్తువు భారం (న్యూటన్లలో)
జ: 19.6
27. భూమి చుట్టూ చంద్రుడు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే సమయం ఎంత?
1) 27.3 రోజులు 2) 27 రోజుల 4 గంటలు 3) 2.35 × 106 సె. 4) అన్నీ
జ: 4 (అన్నీ)
28. చంద్రుడిపై గురుత్వ త్వరణం విలువ
జ: 1.67 మీ./సె.2
29. చంద్రుడి వ్యాసార్ధం 1740 కి.మీ., ద్రవ్యరాశి 7.4 × 1022 కి.గ్రా. అయితే చంద్రుడిపై గురుత్వ త్వరణం
జ: 1.63 మీ./సె.2
30. 10 మీ వ్యాసార్ధం ఉన్న వృత్తమార్గంలో 1000 కిలోల కారు 10 మీ./సె. వడితో చలిస్తుంది. దానికి కావాల్సిన అభికేంద్ర బలం ఎంత?
జ: 10,000 న్యూ.
31. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరితే అది ఆఖరు సెకనులో ప్రయాణించే దూరం ఎంత?
(g = 10 మీ./సె.2)
జ: 5 మీ.
33. ప్రక్షేపకం చేరే గరిష్ఠ వ్యాప్తి
జ:

34. ఏ ప్రక్షిప్త కోణంతో వస్తువు గరిష్ఠ వ్యాప్తిని పొందుతుంది?
జ: 45o