• facebook
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ

1. నూతన ఆవర్తన పట్టికలో 2వ పీరియడ్‌లోని మూలకాల సంఖ్య
జ: 8

 

2. V A కు చెందిన నైట్రోజన్ తర్వాత ఆ గ్రూపులో వచ్చే మూలకం పరమాణు సంఖ్య
జ: 15

 

3. 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకం కిందివాటిలో రసాయనికంగా దేన్ని పోలి ఉంటుంది?
ఎ) నైట్రోజన్               బి) ఫ్లోరిన్                  సి) ఫాస్ఫరస్                  డి) ఆర్గాన్
జ: బి (ఫ్లోరిన్)

 

4. కిందివాటిలో అత్యధిక చర్యాశీలత ఉన్న లోహం ఏది?
ఎ) లిథియం            బి) సోడియం             సి) పొటాషియం       డి) రుబీడియం
జ: బి (సోడియం)

 

5. కిందివారిలో మూలకాలను విభజించనివారు ఎవరు?
ఎ) డాబరీ‌నర్           బి) న్యూలాండ్              సి) పౌలింగ్           డి) మెండలీవ్
జ: సి (పౌలింగ్)

6. గాలియంకు మెండలీవ్ పెట్టిన పేరు
జ: ఎకా అల్యూమినియం

 

7. పరమాణు వ్యాసార్ధాన్ని ....... లలో కొలుస్తారు.
జ: pm

 

8. కిందివాటిలో సరైంది.
ఎ) IE2 > IE1            బి) IE< IE1           సి) IE1 = IE2              డి) ఏదీకాదు
జ: ఎ (IE2 > IE1)

 

9. అయనీకరణ శక్తి ప్రమాణం
జ: కిలోజౌల్/మోల్

 

10. కిందివాటిలో పాక్షిక లోహం ఏది?
ఎ) సిలికాన్           బి) సోడియం           సి) కార్బన్                డి) ఫెర్రస్
జ: ఎ (సిలికాన్)

 

11. ఆవర్తన పట్టికలో అసంపూర్తి పీరియడ్ ఏది?
జ: 7వ

12. పీరియడ్‌లలో ఎడమ నుంచి కుడికి వచ్చేటప్పుడు పరమాణువుల పరిమాణం
జ: తగ్గుతుంది

 

13. కిందివాటిలో క్షారమృత్తిక లోహం కానిది?
ఎ) కాల్షియం    బి) మెగ్నీషియం    సి) స్ట్రాన్షియం    డి) లిథియం
జ:  డి(లిథియం)

 

14. ధనవిద్యుదాత్మకతను ........ అని కూడా అంటారు.
జ: లోహ స్వభావం

 

15. కిందివాటిలో చర్యాశీలత తక్కువగా ఉన్న మూలకం ఏది?
ఎ) సోడియం          బి) హీలియం          సి) మెగ్నీషియం         డి) క్లోరిన్
జ: బి (హీలియం)

 

16. కిందివాటిలో అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న మూలకం ఏది?
ఎ) క్లోరిన్            బి) ఫ్లోరిన్             సి) అయోడిన్         డి) బ్రోమిన్
జ: ఎ (క్లోరిన్)

 

17. "మూలకాల ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు" అని చెప్పినవారు
ఎ) మెండలీవ్            బి) న్యూలాండ్           సి) మోస్లే             డి) డీచాకోర్టయిస్
జ: సి (మోస్లే)

18. అల్యూమినియం వేలన్సీ
జ: 3

 

19. ఆవర్తన పట్టిక అడుగు భాగంలో ఉండేవి
జ: లాంథనైడ్స్ , ఆక్టినైడ్స్  

 

20. ఒక మూలకం సంయోగ సామర్థ్యం
జ: వేలన్సీ

 

21. కిందివాటిలో అయనీకరణ శక్తి ఆధారపడని అంశం ఏది?
ఎ) కేంద్రకావేశం                      బి) స్క్రీనింగ్ ఫలితం              
సి) ఎలక్ట్రాన్ విన్యాసం              డి) పరమాణు భారం
జ: డి (పరమాణు భారం)

 

22. ఆవర్తన పట్టికలో 100వ మూలకం
జ: మెండలీవియం

 

23. మూలకాలకు సంకేతాలను ఎవరు ప్రవేశపెట్టారు?
జ: బెర్జిలియస్

24. పరమాణు భారం ఆధారంగా మూలకాలను వర్గీకరించినవారెవరు?
జ: లూథర్ మేయర్, మెండలీవ్

 

25. విస్తృత ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ దేంతో ముగుస్తుంది?
జ: జడవాయువు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌