• facebook
  • whatsapp
  • telegram

సహజ దృగ్విషయాలు

వాయువుల్లో వ్యాప‌న‌రేటు అధికంగా ఉండ‌టానికి కార‌ణాలు:
  * వాయువుల్లో క‌ణాల మ‌ధ్య ఖాళీస్థలం అధికంగా ఉండ‌టం
  * వాయుక‌ణాల చ‌ల‌న వేగం అధికంగా ఉండ‌టం
  * వాయువులు అధికంగా వ్యాకోచించ‌డం

 

లేస‌ర్ ఉప‌యోగాలు:
  * మిశ్రమ ఐసోటోపుల‌ను వేరు చేయడంలో
  * కాంపాక్ట్ డిస్క్‌ల‌లో స‌మాచారాన్ని నిక్షిప్తం చేయ‌డంలో

 

1. వంట చేసే సమయంలో ప్రెషర్ కుక్కర్‌లో ....
    1) మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది           2) పీడనం పెరుగుతుంది
    3) ఘనపరిమాణం స్థిరం                      4) అన్నీ సరైనవి
జ‌: 4 (అన్నీ సరైనవి)

 

2. 'పీడనం పెరిగితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది' అనే సూత్రం ఆధారంగా ఆడే క్రీడ ఏది?
జ‌: ఐస్ స్కేటింగ్

 

3. A: బాష్పీభవనం జరిగేటప్పుడు పరిసరాల ఉష్ణోగ్రత పెరుగుతుంది.
     B: సాంద్రీకరణ జరిగేటప్పుడు పరిసరాల ఉష్ణోగ్రత తగ్గుతుంది.
జ‌: A, B రెండూ సరైనవి

 

4. చెవిపై కలిగించే గ్రహణ సంవేదన స్థాయిని ఏమని పిలుస్తారు?
జ‌: ధ్వని తీవ్రత

 

5. కిందివాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ధర్మం ఏది?
    1) ధ్వని పరావర్తనం       2) ధ్వని వక్రీభవనం       3) ధ్వని ధ్రువణం          4) ధ్వని వివర్తనం
జ‌: 3 (ధ్వని ధ్రువణం)

 

6. గొయ్యి/ బంకర్‌లోని యుద్ధ భటుడు భూ ఉపరితలం మీద శత్రు చర్యలను చూడటానికి ఉపయోగించే పరికరం ఏది?
జ‌: పెరిస్కోప్

 

7. రెండు సమతల దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చితే వాటి మధ్య (దర్పణాల మధ్య) ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
జ‌: అనంతం

 

8. మునిగిపోయిన వస్తువులను కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం?
జ‌: సోనార్

 

9. ఒక దర్పణం ఆవర్థనం విలువ?
జ‌: 

 

10. అద్దాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టిన శాస్త్రవేత్త?
జ‌: ఆర్కిమెడిస్

 

11. 'n' వక్రీభవన గుణకం, 'R' వక్రతా వ్యాసార్ధం ఉన్న ఒక సమతల పుటాకార కటకం నాభ్యాంతరం?
జ‌:  

 

12. తరంగ చలనంలో కణాల గరిష్ఠ స్థానభ్రంశాన్ని ...... అంటారు?
జ‌: కంపన పరిమితి

 

13. కిందివాటిలో తరంగం ద్వారా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేది?
      1) అణువులు         2) ద్రవ్యరాశి           3) శక్తి            4) తరంగదైర్ఘ్యం

జ‌: 3 (శక్తి)
 

14. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం?
జ‌: కాంతి పరిక్షేపణం

 

15. నీటిపై గాలి బుడగ దేనిలా ప్రవర్తిస్తుంది?
జ‌: కుంభాకార కటకం

 

16. కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా పనిచేసేవి?
      1) సూర్యగ్రహణం       2) నీడ గడియారం       3) పిన్‌హోల్ కెమెరా        4) అన్నీ సరైనవే
జ‌: 4 (అన్నీ సరైనవే)

 

17. వాహనాల్లో 'రివ్యూ అద్దం'గా ఉపయోగించే దర్పణం ఏది?
జ‌: కుంభాకార దర్పణం

 

18. 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న పుటాకార దర్పణం ముందు 25 సెం.మీ. దూరంలో 4 సెం.మీ.ఎత్తు ఉన్న వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది?
జ‌: దర్పణానికి ముందు 37.5 సెం.మీ. దూరంలో

 

19. వేడి నీటి కంటే నీటి ఆవిరి ఎక్కువ అపాయకరం. ఎందుకు?
జ‌: నీటి ఆవిరి గుప్తోష్ణం ఎక్కువ

 

20. కిందివాటిలో దేని కెలోరిఫిక్ విలువ అధికంగా ఉంటుంది?
        1) ఆల్కహాల్             2) వంట చెరకు                 3) పెట్రోల్       4) పేడ పిడకలు
జ‌: 3 (పెట్రోల్)

 

21. వాయువు ద్రవస్థితిలోకి మార్పు చెందడాన్ని ఏమంటారు?
జ‌: సాంద్రీకరణం

 

22. ఏకాంక ద్రవ్యరాశి ఉన్న పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ సెంటీగ్రేడు పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ ........ అంటారు?
జ‌: విశిష్టోష్ణం

 

23. ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిజశక్తి, ఆ పదార్థ .......కు అనులోమానుపాతంలో ఉంటుంది.
జ‌: పరమ ఉష్ణోగ్రత

 

24. 70ºC వద్ద ఉన్న A అనే వస్తువును 70ºK వద్ద ఉన్న B అనే వస్తువుతో ఉష్ణస్పర్శలో ఉంచితే ఉష్ణం ప్రవహించే దిశ.....?
జ‌: A నుంచి B కి

 

25. m1, m2 ద్రవ్యరాశులు ఉన్న పదార్థాల ఉష్ణోగ్రతలు వరుసగా T1, T2 అయితే వాటిని కలపగా ఏర్పడే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత

జ‌: 

26. కిందివాటిలో వాయు వాయిద్యం కానిది
1) పిల్లన గ్రోవి 2) మాండలిన్ 3) క్లారినెట్ 4) హార్మోనియం
జ‌: 2 (మాండలిన్)

 

27. భూమి వేడెక్కడం (లేదా) గ్లోబల్ వార్మింగ్‌లో ఏ తరహా ఉష్ణ బదిలీ జరుగుతుంది?
     1) ఉష్ణ వహనం            2 ) ఉష్ణ సంవహనం            3) ఉష్ణ వికిరణం       4) అన్నీ సరైనవే
జ‌: 4 (అన్నీ సరైనవే)

 

28. 20ºC ఉష్ణోగ్రత ఉన్న 50 గ్రా నీటికి 40°C ఉష్ణోగ్రత ఉన్న 50 గ్రా. నీటిని కలిపినప్పుడు ఏర్పడే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత
జ‌: 30ºC

 

29. కిందివాటిలో కంపన పరిమితిని వివరించే అంశం కానిది
       1) సాంద్రత             2) పీడనం         3) స్థానభ్రంశం              4) పౌనఃపున్యం
జ‌: 4 (పౌనఃపున్యం)

 

30. ఒక ధ్వని తరంగం వేగం 340 m/ sec తరంగదైర్ఘ్యం 2 సెం.మీ. అయితే ఆ తరంగ పౌనఃపున్యం ఎంత?
జ‌: 17000 Htz

 

31. డాక్టర్లు ఉపయోగించే క్లినికల్ థర్మామీటరులో రీడింగులు ఏ ఉష్ణోగ్రతామానంలో ఉంటాయి?
జ‌: ఫారన్‌హీట్ మానం

 

32. చెమట పట్టినప్పుడు, ఫ్యాన్ వేసినప్పుడు చల్లగా అనిపించడానికి కారణం?
జ‌: బాష్పీభవనం

 

33. కిందివాటిలో నీటి అసంగత వ్యాకోచం అనువర్తనం కానిది-
     1) చలికాలంలో నల్లరేగడి నేలలు బీటలు వారడం
     2) ప్రకృతిలో శిలాశైథిల్యం చెందడం
     3) చలికాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోవడం
    4) వేసవి కాలంలో వాహనాల టైర్లు పగిలిపోవడం
జ‌: 4 (వేసవి కాలంలో వాహనాల టైర్లు పగిలిపోవడం)

 

34. ఆవిరి యంత్రంలో శక్తి ప్రసారం (పరివర్తన) ఎలా జరుగుతుంది?
జ‌: ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా

 

35. తరంగదైర్ఘ్యం అంటే
జ‌: ఒకే ప్రావస్థలో ఉన్న ఏవైనా రెండు కణాల మధ్య దూరం

 

36. కింది భౌతిక రాశుల ప్రమాణాలను జతపరచండి.
      A) తరంగదైర్ఘ్యం      i) కెలోరి
     B) పౌనఃపున్యం       ii) డెసిబెల్
     C) శబ్ద తీవ్రత          iii) హెర్ట్జ
     D) ఉష్ణం                 iv) మీటరు
జ‌: 3 ( A-IV, B-III, C-II, D-I)

 

37. కిందివాటిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు?
     1) ఉష్ణోగ్రత             2) పీడనం          3) సాంద్రత                4) తరంగదైర్ఘ్యం
జ‌: 2 (పీడనం)

 

38. శూన్యంలో కాంతి వేగం ........
      1) 3 × 108 m/sec        2) 3 × 1010 cm/sec      3) 3 × 105 km/sec     4) అన్నీ సరైనవే
జ‌: 4 (అన్నీ సరైనవే)

 

39. 0.1 సెకన్ల తర్వాత ప్రతిధ్వని రావాలంటే శబ్ద జనకానికి, అవరోధానికి (పరావర్తన తలానికి) మధ్య అవసరమైన కనీస దూరం ఎంత?
జ‌: 34.4 మీ.

 

40. ఒక బాలుడు ఎత్తయిన భవంతికి 132 మీటర్ల దూరంలో ఒక టపాకాయను పేల్చాడు. దాని ప్రతిధ్వని 0.8 సెకన్ల తర్వాత వినిపించింది. అయితే ధ్వని వేగాన్ని లెక్కిస్తే?
జ‌: 330 మీ./సె.

 

41. గాజులో కాంతి వేగం 2 × 108 m/sec అయితే గాజు వక్రీభవన గుణకం ఎంత?
జ‌: 1.5

 

42. కిందివాటిలో కాంతి వక్రీభవనం అనువర్తనం కానిది-
      1) ఆకాశంలో నక్షత్రాలు మెరవడం
      2) బావి లోతు తక్కువగా అనిపించడం
      3) ఉదయం, సాయంత్రం సూర్యుడు అండాకారంలో ఉండటం
     4) ఆకాశం నీలి రంగులో కనిపించడం
జ‌: 4 (ఆకాశం నీలి రంగులో కనిపించడం)

 

43. ఒక వస్తువును దర్పణం వక్రతా కేంద్రం వద్ద ఉంచితే ప్రతిబింబం ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది?
జ‌: వక్రతా కేంద్రం వద్ద

 

44. కిందివాటిలో దర్పణ సూత్రం ఏది?

45. 2D కటకాన్ని వాడాలని డాక్టర్ సూచించారు. అయితే ఆ కటకం నాభ్యంతరం ఎంత?
జ‌: 50 సెం.మీ.

 

46. దీర్ఘదృష్టి లేదా 'హైపర్ మెట్రోపియా'ను నివారించడానికి ఉపయోగించే కటకం-
జ‌: కుంభాకార కటకం

 

47. 'తరంగాగ్రాల్లోని ప్రతి బిందువు, ఒక గౌణ తరంగ జనకంగా ప్రవర్తించి, గౌణ తరంగాలను, అన్ని వైపులా కాంతి వేగంతో సమాన వేగంతో వ్యాపింపజేస్తాయి' అని తెలియజేసిన శాస్త్రవేత్త?
జ‌: క్రిస్టియన్ హైగెన్స్

 

48. కిందివాటిని జతపరచండి    
      A) కాంతి కణ సిద్దాంతం               i) న్యూటన్
     B) కాంతి తరంగ సిద్దాంతం            ii) హైగెన్స్
     C) విద్యుదయస్కాంత సిద్ధాంతం    iii) మాక్స్‌వెల్
     D) క్వాంటం సిద్ధాంతం                  iv) మాక్స్‌ప్లాంక్
జ‌: 3 (A-I, B-II, C-III, D-IV)

 

49. కిందివాటిలో లేసర్ పనిచేసే నియమం కానిది-
    1) శోషణం                                  2) పంపింగ్ (లేదా) జనాభా విలోమం
    3) స్వచ్ఛంద ఉద్గారం                 4) దిశనీయత
జ‌: 4 (దిశనీయత)

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌