• facebook
  • whatsapp
  • telegram

సంసర్గ (సమాచార ప్రసార) వ్యవస్థలు

1. తార్కిక వలయాలు వేటి కలయికతో ఏర్పడతాయి?
జ: డయోడ్‌లు, ట్రాన్సిస్టర్‌లు

 

2. అనేక తార్కిక వలయాలను కలిపి ఏర్పరచిన ఒక చిన్న అర్ధవాహక ఉపకరణం
జ: ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్

 

3. మైక్రోప్రాసెసర్ వేటి కలయికతో ఏర్పడుతుంది?
జ: ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్

 

4. కిందివాటిలో నివేశ సాధనం
     A) CU      B) ALU      C) ప్రింటర్      D) మౌస్
జ: D (మౌస్)

 

5. మెమొరీ దేనిలో ఒక భాగం?
జ: CPU

 

6. మైక్రోప్రాసెసర్‌లో అర్థ వివరణ ఇచ్చే సాధనం ఏది?
జ: CU

 

7. మైక్రోప్రాసెసర్‌లో గణన సాధనం ఏది?
జ: ALU

 

8. కంప్యూటర్‌కు దత్తాంశం, సూచనలను వేటి ద్వారా అందిస్తారు?
జ: నివేశ సాధనం

 

9. కిందివాటిలో నివేశ సాధనం ఏది?
     A) కీ బోర్డ్      B) మౌస్      C) ఆప్టికల్ స్కానర్      D) అన్నీ
జ: D (అన్నీ)

 

10. కంట్రోల్ యూనిట్ పంపిన సంకేతాలను అర్థ వివరణ చేసేది
జ: డీకోడర్

 

11. ప్రాథమిక మెమొరీలో దత్తాంశం ఏ విధంగా నిల్వ అవుతుంది?
జ: తాత్కాలికంగా

 

12. గౌణ మెమొరీలో దత్తాంశం ఏ విధంగా నిల్వ అవుతుంది?
జ: శాశ్వతంగా

 

13. కంప్యూటర్ ప్రధాన కార్యాచరణ భాగంలో ఏం ఉంటాయి?
     A) కంట్రోల్ యూనిట్      B) మెమొరీ      C) ALU      D) అన్నీ

జ: D (అన్నీ)
 

14. కంప్యూటర్‌లో ప్రధాన భాగం
జ: CPU

 

15. సూచనల సముదాయాన్ని ఏమంటారు?
జ: ప్రోగ్రాం

 

16. కంప్యూటరు ఏ విధానాన్ని ఉపయోగిస్తుంది?
జ: ద్విసంఖ్యామానం

 

17. '0', '1' అనే రెండు అంకెలు మాత్రమే ఉండే సంఖ్యామానం
జ: ద్విసంఖ్యామానం

 

18. '0' లేదా '1' బైనరీ డిజిట్లను ఏమంటారు?
జ: బిట్

 

19. 0, 1 అనే బైనరీ అంకెలతో సూచిస్తూ కంప్యూటర్‌కు అందించే దత్తాంశంలో ఉండేది
     A) అక్షరాలు      B) సంఖ్యలు      C) సంకేతాలు      D) అన్నీ
జ: D (అన్నీ)

 

20. బైనరీ సంఖ్యను ఏమంటారు?
జ: BIT

 

21. 8 బిట్ల సముదాయం
జ: బైట్

 

22. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైట్లు కలిస్తే
జ: పదం

 

23. ఆదేశాల సముదాయం
జ: ప్రోగ్రాం

 

24. అసెంబ్లర్ ఒక
జ: యంత్రభాష

 

25. BASIC ఒక
జ: ఉన్నత స్థాయి భాష
 

26. నాలుగు BIT ల సముదాయాన్ని ఏమంటారు?
జ: నిబిల్, అర్ధ బైట్
 

27. ఒక బైట్ అనేది
: 2 నిబిల్, 8 బిట్‌లు

 

29. BCD లో ప్రతి బైనరీకి తుల్యమైన పదంలో ఉండేది
జ: 4 BITS

 

30. A నుంచి Z వరకు అక్షరాలను సూచించే జోన్ బిట్లు
జ: 1010

 

31. 0 నుంచి 9 వరకు సంఖ్యలను సూచించే జోన్ బిట్లు
జ: 0101

 

32. BCDలో పొందుపరిచిన సూచనలను ఏమంటారు?
జ: యంత్ర భాష

 

33. ఐకనోస్కోపులో వేటిని ఉపయోగిస్తారు?
జ: కాథోడ్ కిరణాలు

 

34. ఉన్నత స్థాయి భాషను ఉపయోగించడానికి ఉండే నియమాలను ఏమంటారు?
జ: సింటాక్స్

 

35. పరిమిత సంఖ్యలో గుర్తులు, ఇంగ్లిష్ పదాలు ఉండేది
జ: ఉన్నత స్థాయి భాష

 

36. ఉన్నత స్థాయి భాషలోని సూచనలను యంత్ర భాషలోకి తర్జుమా చేసే ప్రోగ్రాం ఏది?
జ: కంపైలర్
 

37. కంపైలర్, ప్రోగ్రాంలను కలిపి ఏమంటారు?
జ: సాఫ్ట్‌వేర్

 

38. కిందివాటిలో ఉన్నత స్థాయి భాష ఏది?
     A) COBOL      B) BASIC      C) FORTRAN      D) అన్నీ
జ: D (అన్నీ)

 

39. ఉన్నత స్థాయి భాష
జ: కంప్యూటర్ హార్డ్‌వేర్‌పై ఆధారపడదు

 

40. కంప్యూటర్‌ను ఉపయోగించి సమస్యను సాధించడానికి ఉండే అంచెలన్నింటినీ కలిపి ఏమని పిలుస్తారు?
జ: సమాచార ప్రక్రియ

 

41. కంప్యూటర్ గణిత ప్రక్రియలు జరిగే ప్రదేశం
జ: CPU

 

42. COBOL అంటే
జ: కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్

 

43. FORTRAN అనేది
జ: ఫార్ములా ట్రాన్స్‌లేషన్

 

44. PASCAL అనేది
జ: బైసీ పాస్కల్ పేరుతో ఏర్పడిన భాష

 

45. COBOL భాషను దేనికి ఉపయోగిస్తారు?
జ: వాణిజ్య దత్తాంశ పరిక్రియ

 

46. FORTRAN భాషను ఏ రంగంలో ఉపయోగిస్తారు?
జ: విజ్ఞాన, ఇంజినీరింగ్

 

47. PASCAL ను ఏ రంగంలో ఉపయోగిస్తారు?
     A) విద్యా రంగం      B) ఇంజినీరింగ్     C) వాణిజ్య రంగం      D) అన్నీ
జ: D (అన్నీ)

 

48. ఎలక్ట్రానిక్స్ అనే ప్రత్యేక భౌతిక శాస్త్ర విభాగం ఏర్పడటానికి; రేడియో, టీవీ లాంటి సాధనాలు తయారుకావడానికి మూల కారణం
జ: ఎలక్ట్రాన్

 

49. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కంప్యూటర్ తరం
జ: అయిదు

 

50. ఎలక్ట్రానిక్ వలయాల్లో కంపకాలు ఉత్పత్తి చేయడానికి వినియోగించేది
జ: ట్రాన్సిస్టర్

 

51. సమాచారాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చేది
జ: మైక్రోఫోన్

 

52. విద్యుత్ సంకేతాలను సమాచారంగా మార్చేది
జ: లౌడ్ స్పీకర్

 

53. రేడియో తరంగాలను సుదూరాల నుంచి కూడా శోధించవచ్చని గుర్తించిన శాస్తవేత్త
జ: మార్కోని

 

54. ధ్వని తరంగాలు విద్యుత్ ప్రవాహ అంశాలుగా, స్పీకర్లు ఈ విద్యుత్ ప్రవాహ అంశాలను ధ్వని తరంగాలుగా పునరుత్పాదన చేసే పరికరం ఏది?
జ: టెలిఫోన్

 

55. టెలిఫోన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ: గ్రాహం బెల్

 

56. నిస్తంత్రీ విధానాన్ని కనుక్కున్నవారు
జ: మార్కోని

 

57. విద్యుదయస్కాంత తరంగాల ఉనికిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ: మాక్స్‌వెల్
 

58. టెలివిజన్‌ను ఎవరు కనుక్కున్నారు?
జ: జె.ఎల్.బయర్డ్
 

59. నిస్తంత్రీ విధానంలో ధ్వని విద్యుత్ ప్రవాహ అంశాలను ఏ విధంగా మార్చి ప్రసారం చేస్తారు?
జ: విద్యుదయస్కాంత తరంగాలు

 

60. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌లో ధ్వని విద్యుత్ ప్రవాహ అంశాలను ఏ విధంగా మార్చి ప్రసారం చేస్తారు?
జ: విద్యుదయస్కాంత తరంగాలు

 

61. విద్యుదయస్కాంత తరంగాలు శూన్యంలో ప్రయాణించే వేగం సెకనుకు
: మూడు లక్షల కి.మీ.

 

62. కాంతి విద్యుత్ ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికం ఏది?
జ: టెలివిజన్
 

63. కిందివాటిలో దేనివల్ల సినిమాటోగ్రఫీ సాధ్యపడింది?
     A) విద్యుదయస్కాంతం      B) కాంతి విద్యుత్ ఫలితం     C) దృష్టి స్థిరత      D) ఏదీకాదు
జ: C (దృష్టి స్థిరత)

 

64. ఏదైనా ఒక వస్తువు ప్రతిబింబం మన కంటి రెటీనాపై పడినప్పుడు అది నిలిచి ఉండే కాలం
జ:  సెకను

 

65. సినీ ప్రొజెక్టర్‌లో ఫిల్ముకు, కటకానికి మధ్య ఉండే దూరం ఎంత?
జ: F కంటే ఎక్కువ, 2F కంటే తక్కువ

 

66. సినీ ప్రొజెక్టర్ తెరపై ఏర్పరిచే ప్రతిబింబం స్వభావం
జ: వృద్ధీకృత నిజ ప్రతిబింబం

 

67. సినీ ప్రొజెక్టర్‌లో సెకనుకు ఎన్ని ఫిల్ములు కదిలేలా చేయడం వల్ల వస్తువులు, మనుషుల కదలికలను తెరపై గమనిస్తాం?
జ: 16 లేదా 16 కంటే ఎక్కువ
 

68. అట్లాంటిక్ సముద్రం మీదుగా నిస్తంత్రీ (wireless) వారధిని ఏర్పరచిన శాస్త్రవేత్త
జ: మార్కోని

 

69. రేడియో తరంగాల ప్రసార పద్ధతి
జ: బ్రాడ్‌కాస్టింగ్

 

70. రేడియో పౌనఃపున్య వాహక తరంగానికి సమాచార తరంగాన్ని కలిపే ప్రక్రియ ఏది?
జ: మాడ్యులేషన్

 

71. r.f. వాహక కణ తరంగాల నుంచి ధ్వని తరంగాలను వేరు చేసే ప్రక్రియ
జ: డీమాడ్యులేషన్

 

72. రేడియో పౌనఃపున్య వాహక తరంగ పౌనఃపున్య విలువ సుమారుగా
జ: 300 కిలో హెర్ట్జ్ నుంచి 30 మెగా హెర్ట్జ్

 

73. రేడియో తరంగాల ప్రసరణకు కావాల్సిన యానకం
జ: యానకం అవసరం లేదు

 

74. శృతి వలయం అంటే
జ: శోధకం

 

75. పూర్వం స్కానింగ్ దేంతో చేసేవారు?
జ: నిప్కాన్ డిస్క్

 

76. స్కానింగ్‌కి ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరికరం
జ: ఐకనోస్కోప్

 

77. విద్యుదయస్కాంత తరంగాలను అన్ని దిశల్లో ప్రసారం చేసేది
జ: ప్రసార యాంటెన్నా

 

78. టెలివిజన్ కెమెరాను ఏమంటారు?
జ: ఐకనోస్కోప్

 

79. ప్రతిబింబాన్ని టీవీ కెమెరా తెరపై నిలువు, అడ్డుగీతలతో ఏర్పడే చిన్న చిన్న గళ్లలోకి పంచే ప్రక్రియను ఏమంటారు?
జ: స్కానింగ్

 

80. టీవీ ప్రోగ్రాముల ప్రసారాన్ని ఏమంటారు?
జ: టెలికాస్టింగ్

 

81. r.f. వాహక తరంగం నుంచి ఆడియో, వీడియో తరంగాలను వేరు చేసే ప్రక్రియ
జ: డీమాడ్యులేషన్

 

82. టెలివిజన్ తెర
జ: ప్రతిదీప్తి పదార్థం పూసిన తెర

 

83. టెలివిజన్ ప్రసారంలో వాహక తరంగ పౌనఃపున్య విలువల అవధి
జ: 30 MHz నుంచి 300 MHz

 

84. ప్రసార యాంటెన్నా వేటిని ప్రసారం చేస్తుంది?
జ: మాడ్యులేట్ చేసిన తరంగాలు

 

85. కావాల్సిన టీవీ కేంద్ర సంకేతాలను ఎంపిక చేసే వలయం
జ: శృతివలయం

 

86. వేర్వేరు టీవీ కేంద్రాలు వేర్వేరు అవధులున్న r.f. వాహక తరంగాలను వాడుకుంటాయి. వీటిని ఏమంటారు?
జ: ఛానల్స్

 

87. సాధారణంగా టెలివిజన్ ప్రసారాలకు ధ్వని, చిత్రం రెండింటికి కలిపి ఎన్ని మెగాహెర్ట్జ్‌ల అవధి (ఛానల్)ని కేటాయిస్తారు?
జ: 6 మెగా హెర్ట్జ్

 

88. టీవీ ప్రసారాల్లో ఆడియో r.f. వాహక తరంగం విలువ వీడియో r.f. వాహక తరంగం కంటే ఎన్ని మెగా హెర్ట్జ్‌లు ఎక్కువగా ఉంటుంది?
జ: 4.5

 

89. కినీస్కోప్‌గా వ్యవహరించే సాధనం ఏది?
జ: టెలివిజన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌