* బెరీలియం (Be), మెగ్నీషియం (Mg), కాల్షియం (Ca), స్ట్రాన్షియం (Sr), బేరియం (Ba), రేడియం (Ra) మూలకాలను IIA గ్రూపు మూలకాలు అంటారు. వీటికి క్షారమృత్తిక లోహాలనే పేరూ ఉంది.
* వీటిలో రేడియం (Ra) రేడియోధార్మిక మూలకం. ఇది అరుదుగా లభిస్తుంది.
* IIA గ్రూపు మూలకాల సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం .
క్షారమృత్తిక లోహాల ముఖ్య ఖనిజాలు:
బెరిల్ | - [Be3Al2(SiO3)6] |
డోలమైట్ | - [CaCO3. MgCO3] |
కార్నలైట్ | - [MgCl2.KCl.6H2O] |
బెరైట్ | - BaSO4 |
మాగ్నసైట్ | - MgCO3 |
ఎప్సం లవణం | - MgSO4.7H2O |
జిప్సం | - CaSO4.2H2O |
* మెగ్నీషియం, కాల్షియం మూలకాలు వాటి కార్బొనేట్లు, సల్ఫేట్ల రూపంలో ప్రకృతిలో విరివిగా లభిస్తాయి.
ధర్మాలు: బెరీలియం మిగిలిన క్షారమృత్తిక లోహాల కంటే భిన్నంగా ప్రవర్తిస్తుంది.
* బెరీలియానికి ఉండే అధిక ధ్రువణ సామర్థ్యం వల్ల అది కోవలెంట్ సమ్మేళనాలను ఎక్కువగా ఏర్పరుస్తుంది.
* Be ద్వంద్వ స్వభావం ఉన్న లోహం. BeSO4 నీటిలో కరుగుతుంది. కానీ, మిగిలిన IIA గ్రూపు మూలకాల సల్ఫేట్లు నీటిలో కరగవు.
* Be, దాని లవణాలు జ్వాల పరీక్షను ఇవ్వవు. మిగిలినవి వాటి స్వాభావిక జ్వాల రంగునిస్తాయి.
* Be సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. దీని అత్యధిక కోవలెన్సీ 4.
* బెరీలియం, అల్యూమినియంతో కర్ణ సంబంధాన్ని ప్రదర్శిస్తుంది.
* Be, Al మూలకాలు రెండింటికీ ఒకే EN విలువ (1.50) ఉంటుంది.
* గాఢ HNO3 తో Be, Al రెండూ క్రియారహితమవుతాయి.
* గాఢ HNO3లో ముంచడం వల్ల ఒక లోహం దాని స్వభావ సిద్ధ రసాయన చర్యాశీలతను కోల్పోవడాన్ని క్రియారాహిత్యం అంటారు.
* Be, Al మూలకాల కార్బైడ్లు నీటితో చర్య జరిపి మీథేన్‌ను ఇవ్వటం వల్ల వీటిని మిథనైడ్‌లు అని అంటారు.
* IIA గ్రూపు మూలకాల పరమాణు వ్యాసార్ధం, పరమాణు పరిమాణాలు పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ పెరుగుతాయి.
* IIA గ్రూపు మూలకాల అయనీకరణ శక్తి విలువలు పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ (పరమాణు పరిమాణం పెరగడం వల్ల) తగ్గుతాయి.
* Be నుంచి Ra వరకూ పరమాణు పరిమాణం పెరుగుదలతో రుణ విద్యుదాత్మక విలువలు తగ్గుతాయి.
* IA గ్రూపు (క్షార లోహాలు) మూలకాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాల కంటే IIA గ్రూపు (క్షారమృత్తిక లోహాలు) మూలకాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి.
రసాయన ధర్మాలు
క్షార మృత్తిక లోహాలు అత్యంత చురుకైనవి.
O2తో చర్య: ఈ మూలకాలన్నీ ఆక్సిజన్‌లో మండి ద్విగుణాత్మక సమ్మేళనాలను ఇస్తాయి.
Be మాత్రం మోనాక్సైడ్‌ను ఇస్తుంది.
2 Be + O2→2BeO Ba పెరాక్సైడ్‌ను ఇస్తుంది.
Ba + O2→BaO2. మిగిలినవి మోనాక్సైడ్లు, పెరాక్సైడ్లను ఇస్తాయి.
H2తో చర్య: క్షార మృత్తిక లోహాలు హైడ్రోజన్‌తో చర్యలో పాల్గొని (MH2) అనే సాధారణ ఫార్ములా ఉండే హైడ్రైడ్లను ఇస్తాయి. ఈ హైడ్రైడ్ల అయానిక స్వభావం కిందివిధంగా ఉంటుంది.
BeH2< MgH2< CaH2< SrH2< BaH2
(సంయోజనీయ (అయానిక స్వభావం)
స్వభావం)
హాలోజన్లతో చర్య: క్షార మృత్తిక లోహాలు హాలోజన్లతో చర్య జరిపి MX2 అనే సాధారణ ఫార్ములా ఉండే హాలైడ్లను ఏర్పరుస్తాయి.
* నీటిలో వీటి ద్రావణీయత పరమాణు సంఖ్య పెరుగుదలతోపాటు తగ్గుతుంది.
* BeF2 చాలా ఎక్కువగా కరుగుతుంది. మిగిలిన గ్రూపు మూలకాల ఫ్లోరైడ్‌లన్నీ నీటిలో కరగవు.
నీటితో చర్య: నీటితో క్షార మృత్తిక లోహాల చర్యాశీలత, వాటి పరమాణు సంఖ్య పెరుగుదలతోపాటు పెరుగుతుంది.
* బెరీలియం వేడి నీటితో కూడా చర్య జరపదు. మెగ్నీషియం చల్లటి నీటితో చర్య పరపదు కానీ, వేడి నీటిని విఘటనం చెందిస్తుంది.
Mg + 2H2O →Mg (OH)2 + H2 ↑
* మిగిలిన మూలకాలు చల్లటి నీటితో చర్య జరుపుతాయి.
మెగ్నీషియం సంగ్రహణం: మాగ్నసైట్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే లభించే మెగ్నీషియం ఆక్సైడ్ (MgO)ను కార్బన్, క్లోరిన్‌తో చర్యనొందిస్తే MgCl2 ఏర్పడుతుంది. ఈ మెగ్నీషియం క్లోరైడ్‌ను విద్యుత్ విశ్లేషణ చేస్తే Mg లోహం ఏర్పడుతుంది.
ఉపయోగాలు: బెరీలియంను నియాన్ దీపాల్లో ఎలక్ట్రోడుల తయారీకి వాడతారు. Cu ను మిశ్రమ లోహాల తయారీలో వాడతారు.
* మెగ్నీషియంను 'మాగ్నాలియం' లేదా 'ఎలక్ట్రాన్' లాంటి మిశ్రమ లోహాల తయారీలో వాడతారు. కొన్ని లోహ నిష్కర్షణల్లో 'డీ ఆక్సిడైజర్'గా ఉపయోగపడుతుంది.
* కాల్షియంను Be, Cr, Th మొదలైన వాటి తయారీలో; పెట్రోలియం నుంచి సల్ఫర్‌ను వేరుచేయడానికి ఉపయోగిస్తారు.
CaO తయారీ: కాల్షియం ఆక్సైడ్‌ను 'క్విక్ లైమ్' అంటారు. సున్నపు రాయిని భస్మీకరణం చేస్తే, CaO ఏర్పడుతుంది.
CaCO3 CaO +CO2 ↑
* సున్నపు రాయిని అధిక ఉష్ణోగ్రతల వద్ద భస్మీకరణం చేస్తే, కాల్షియం సిలికేట్ (CaSiO3) ఏర్పడుతుంది.
* సున్నపురాయికి సజల H2SO4ను కలిపి, ద్రావణాన్ని గాఢ పరిస్తే, జిప్సం ఏర్పడుతుంది.
CaCO3 + H2SO4→CaSO4 + H2O + CO2 ↑
CaSO4 + 2H2O CaSO4 . 2H2O
జిప్సం
ఉపయోగాలు: CaO ను మోర్టార్, సిమెంట్, గాజు, కాల్షియం క్లోరైడ్‌ల తయారీకి ఉపయోగిస్తారు.
* సున్నపురాయి, బంకమన్నును కలిపి వేడిచేస్తే, 'హైడ్రాలిక్ మోర్టార్' వస్తుంది. దీన్ని విరంజనకారిగా, యాంటీ సెప్టిక్‌గా ఉపయోగిస్తారు.
* 1 భాగం తడిసున్నం, 3 భాగాలు ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని 'లైమ్ మోర్టార్' అంటారు. దీనికి సిమెంట్‌ను కలిపితే 'సిమెంట్ మోర్టార్ అంటారు. ఈ సిమెంట్ మోర్టార్‌ను భవన నిర్మాణాల్లో ఉపయోగిస్తారు.
* CaCO3 సిమెంట్, వాషింగ్ సోడా, గాజు తయారీల్లో ఉపయోగిస్తారు.
కాల్షియం సల్ఫేట్: ప్రకృతిలో కాల్షియం సల్ఫేట్ జిప్సం (CaSO4. 2H2O) గా లభిస్తుంది. దీన్ని
120-1300C వరకు వేడిచేస్తే, 'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్' లభిస్తుంది.
* CaSO4.1/2H2O ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు.
* CaSO4 లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను మూసల తయారీలో ఉపయోగిస్తారు.
* వైద్యరంగంలో విరిగిన ఎముకలను సరైన స్థానంలో అమర్చడానికి, దంత వైద్యం, ఆట బొమ్మల తయారీలోనూ వాడతారు.
*జిప్సంను సిమెంట్ తయారీలో, వడపోత కాగితాలను స్వేదనం చేయడానికి వాడతారు.
జీవశాస్త్రంలో మెగ్నీషియం, కాల్షియంల ప్రాధాన్యం
: జంతు కణాల్లో
అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటుంది.
* ఫాస్ఫో హైడ్రోలేజ్‌లు, ఫాస్ఫోట్రాన్స్‌ఫరేజ్‌లు లాంటి ఎంజైమ్‌లలో


* చెట్లలోని ఆకుపచ్చ పదార్థమైన క్లోరోఫిల్‌లో



* రక్తం గడ్డ కట్టడానికి, గుండె క్రమంగా కొట్టుకోవడానికి, కండరాలు ముడుచుకు పోవడానికి కూడా అయాన్లు తోడ్పడతాయి.