• facebook
  • whatsapp
  • telegram

సముద్రాల లవణీయత

        శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సముద్ర జలాలకు లవణీయత రెండు కారణాల వల్ల ఏర్పడుతుంది.
* స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన లేవు. సముద్ర జలాల్లోని కొన్ని జీవరాశులు కాల్షియం కార్బొనేట్‌ను గ్రహించి, వాటికి రక్షక కవచాలుగా ఏర్పరచుకున్నాయి. దాంతో సముద్ర జలాల్లో కార్బొనేట్ శాతం తగ్గిపోయి సోడియం క్లోరైడ్ (ఉప్పు) శాతం పెరిగి సముద్ర జలాలు ఉప్పగా మారాయి.
* నదీ జలాల కంటే సముద్ర జలాలు ఎక్కువగా ఆవిరవడం వల్ల కూడా లవణాల గాఢత పెరిగి, తద్వారా సముద్ర జలాల లవణీయత ఎక్కువైందని శాస్త్రవేత్తల అభిప్రాయం.

 

లవణీయత: సముద్ర జలాల ఉప్పదనం రేటును 'సముద్ర లవణీయత' అంటారు.
           ప్రమాణ సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల బరువుకు అదే ప్రమాణ సముద్రపు నీటి బరువుకు ఉన్న నిష్పత్తిని 'సముద్ర లవణీయత' అంటారు. 
           సగటున 1000 గ్రాముల నీటిలో సుమారు 35 గ్రాముల లవణాలుంటే, ఆ నీటిని 'సామాన్య లవణీయత' అంటారు. 35 గ్రాముల కంటే తక్కువ లవణాలుంటే 'అల్ప లవణీయత' అని, అంతకంటే ఎక్కువగా ఉంటే 'అధిక లవణీయత' అంటారు.

 

సామాన్య లవణీయత ప్రకారం సముద్ర జలాల సంఘటనం
 


 

లవణీయతలో మార్పులు: సముద్ర నీటి లవణీయత సముద్రాలన్నింటిలో, వివిధ ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. అక్కడున్న భౌతిక, భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అవి
1) బాష్పీభవనం
2) మంచినీరు కలవడం
3) సముద్రంలోని నీటి బుగ్గలు
4) సముద్ర జలాల కదలిక

 

1) బాష్పీభవనం: సముద్ర జలాల లవణీయత ముఖ్యంగా బాష్పీభవనంపై ఆధారపడి ఉంటుంది. బాష్పీభవనం పెరిగితే లవణీయత కూడా పెరుగుతుంది. అంటే బాష్పీభవనం, లవణీయత అనులోమానుపాతంలో ఉంటాయి. సముద్రంలో లవణీయత తూర్పువైపు ఎక్కువగా, పడమరవైపు తక్కువగా ఉంటుంది. దీనికి కారణం సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర అస్తమించడం.
 

2) మంచినీరు కలవడం: వర్షం లేదా నదులు లేదా హిమనీనదాలు కరగడం లేదా మంచినీరు సముద్రంలో కలవడంతో లవణీయతలో మార్పులు వస్తాయి.
లవణీయత తక్కువగా ఉన్న ప్రాంతాలు
A) భూమధ్య రేఖ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉండి బాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది. అయినప్పటికీ ప్రతిరోజూ సాయంత్రం కురిసే సంవాహన వర్షపాతం వల్ల భూమధ్యరేఖ ప్రాంతంలో లవణీయత తక్కువగా ఉంటుంది.
B) ప్రపంచంలోనే పెద్ద నదులైన అమెజాన్, కాంగో, నైలు, హొయాంగ్‌హో, గంగ మొదలైన నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లోనూ.
C) భూ పరివేష్ఠిత సముద్రాలైన నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల్లోనూ.
D) సముద్రాల్లో మంచి నీటి బుగ్గలున్న ప్రాంతాల్లోనూ.
E) ధ్రువ ప్రాంతంలో మంచు కరిగే ప్రాంతాల్లోనూ లవణీయత తక్కువగా ఉంటుంది.

 

3. సముద్ర జలాల కదలిక: సముద్ర జలాలు ఒక చోట స్థిరంగా ఉండకుండా తరంగాలు, పోటు-పాట్లు, ప్రవాహాల రూపాల్లో కదులుతూ ఉంటాయి. ఈ కదలికల వల్ల సముద్ర లవణీయత అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. అందువల్ల లవణీయత తగ్గుతుంది. ఎర్ర సముద్రం, మృత సముద్రాల్లో ఇలాంటి కదలికలు ఉండవు. దాంతో ఆ సముద్రాల్లో లవణీయత ఎక్కువగా ఉంటుంది.
క్షితిజ సమాంతరంగా సముద్రంలో ఉన్న లవణీయతలు ఒక్కో సముద్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. సముద్రాల్లో సమాన లవణీయతలున్న ప్రాంతాలను కలిపే రేఖలను 'సమ లవణ రేఖలు' (Isohaline) అంటారు.

 

లవణీయత ఎక్కువగా ఉన్న సముద్రాలు 
 1) ఎర్ర సముద్రం 34 - 41%
2) పర్షియన్ సింధుశాఖ 37 - 38%
3) మధ్యదరా సముద్రం 37 - 39%

 

సాధారణ లవణీయత ఉన్న సముద్రాలు
1. కరేబియన్ సముద్రం 35 - 36%
2. బాస్ జలసంధి 35%
3. కాలిఫోర్నియా సింధుశాఖ 25 - 35.5%

 

లవణీయత తక్కువగా ఉన్న సముద్రాలు
1. ఆర్కిటిక్ మహాసముద్రం 20 - 35%
2. ఆస్ట్రేలియా సముద్రం 33 - 34%
3. బేరింగ్ సముద్రం 28 - 33%

వివిధ అక్షాంశ మండలాల్లో సముద్ర లవణీయత

అక్షాంశ మండలాలు       -      సముద్ర లవణీయత%
70 - 50                        -        30 - 31
50 - 40                        -        33 - 34
40 - 15                        -        35 - 30
15 - 10                        -        34.5 - 35

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌