1. భూగోళంపై ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం -
జవాబు: 2.78%
2. ప్రపంచంలోనే అత్యంత లోతైన మహాసముద్రం
జవాబు: పసిఫిక్
3. హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడ ఉంది?
జవాబు: జావా
4. అత్యంత ఎక్కువగా వాణిజ్యనౌకలు ప్రయాణించే సముద్రం?
జవాబు: అట్లాంటిక్
5. 'M' ఆకారంలో ఉండే సముద్రం
జవాబు: హిందూ
6. సముద్రాల లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
జవాబు: ఫాదమ్స్
7. భూభాగానికి, సముద్ర అడుగు భాగానికి మధ్య ఉన్న ప్రదేశం
జవాబు: ఖండతీరపు అంచు
8. సముద్ర భూతలంలో 'ఖండతీరపు వాలు' ఎంత శాతాన్ని ఆక్రమిస్తుంది?
జవాబు: 8.5%
9. సముద్రంలోని కదలికలకు ముఖ్యమైంది?
జవాబు: ఉష్ణోగ్రత వ్యత్యాసాలు
10. 'అప్ వెల్లింగ్' అంటే
జవాబు: మురికి నీరు బుడగల రూపంలో పైకి రావడం
11. సముద్ర సగటు ఉష్ణోగ్రత
జవాబు: 26.7oC
12. సముద్రాల్లో ఉష్ణోగ్రత ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది?
జవాబు: ఆయనరేఖా ప్రాంతం
13. ధ్రువప్రాంతాల్లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత
జవాబు: -1.90C
14. సముద్ర గర్భంలోని వేడి సముద్రాలకు ఏ రూపంలో వస్తుంది?
జవాబు: ఉష్ణ సంవహనం
15. అత్యధికంగా సునామీలు సంభవించే సముద్రం?
జవాబు: పసిఫిక్
16. సముద్ర జీవరాశులు సముద్రంలో ఏ రసాయనిక పదార్థాన్ని గ్రహించి రక్షక కవచాలుగా ఏర్పరచుకుంటాయి?
జవాబు: కాల్షియం కార్బొనేట్
17. సముద్రజలాల్లో అత్యల్పంగా ఉండే లవణాలు -
జవాబు: మెగ్నీషియం బ్రోమైడ్
18. సముద్రాల్లోని లవణీయతలో మార్పులకి ముఖ్య కారణం
జవాబు: బాష్పీభవనం
19. ఆయనరేఖ ప్రాంతాలతో పోలిస్తే భూమధ్యరేఖ ప్రాంతాల్లో లవణీయత
జవాబు: తక్కువ
20. ఎర్ర సముద్రం, కరేబియన్ సముద్రం, మధ్యధరా సముద్రం - వీటిలో లవణీయత ఎక్కువగా ఉండే సముద్రం-
జవాబు: ఎర్ర సముద్రం
21. సమద్రంలో సమాన లవణీయత ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
జవాబు: ఐసోహెలైన్స్
22. మూడు వైపులా విశాల భూభాగం ఉన్న మహాసముద్ర భాగాన్ని ఏమని పిలుస్తారు?
జవాబు: అఖాతం
23. ధ్రువ ప్రాంతాల నుంచి మంచు కొండలు ఎంతవరకు ప్రయాణిస్తాయి?
జవాబు: 500 అక్షాంశం వరకు
24. సముద్రాల్లో లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత
జవాబు: తగ్గుతుంది
25. మూడు వైపులా ఖండాలతో ఆవరించి ఉన్న సముద్రం ఏది?
జవాబు: హిందూ మహాసముద్రం