• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంత వర్ణపటం

      సూర్యుడి కాంతిని పట్టకం ద్వారా పంపినప్పుడు అది వక్రీభవనం చెంది వర్ణ విశ్లేషణ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏడు రంగులు (VIBGYOR) ఒక సముదాయంగా ఏర్పడతాయి. ఈవిధంగా ఏర్పడిన రంగులు (లేదా) తరంగ దైర్ఘ్యాలు (లేదా) పౌనఃపున్యాల సముదాయాన్ని 'వర్ణపటం' అంటారు. వర్ణపటాలను అధ్యయనం చేసే శాస్త్రమే 'స్పెక్ట్రోస్కోపి'. అధ్యయనానికి ఉపయోగించే పరికరాన్ని 'స్ప్రెక్టోస్కోప్' అంటారు.
 

విద్యుదయస్కాంత వర్ణపటం: ఏదైనా ఒక వర్ణపటం, విద్యుదయస్కాంత వర్ణపటం కావడానికి కింది లక్షణాలుండాలి. 
* విద్యుదయస్కాంత వికిరణాలు ఒకదానితో మరోటి లంబ దిశలో కంపిస్తున్న విద్యుత్‌క్షేత్రం , అయస్కాంత క్షేత్రాలను  కలిగి ఉంటాయి.
ఈ విద్యుదయస్కాంత క్షేత్రాలు, కాంతి ప్రసరించే దిశకు లంబకోణంలో కంపిస్తుంటాయి.
* విద్యుదయస్కాంత తరంగాలన్నింటికీ తిర్యక్ తరంగ లక్షణాలుంటాయి.
* శూన్యంలో విద్యుత్ అయస్కాంత తరంగాలన్నీ కాంతి వేగంతో సమానంగా ప్రయాణిస్తాయి.
అంటే C =
 మీ./సె.
 

విద్యుదయస్కాంత వర్ణపటం - రకాలు

        విద్యుదయస్కాంత వర్ణపటాలు 7 రకాలు. అవి: 1) దృగ్గోచర వర్ణపటం 2) పరారుణ వర్ణపటం 3) మైక్రో తరంగాలు 4) రేడియో తరంగాలు 5) అతినీలలోహిత వర్ణపటం 6) X-కిరణాలు 7)   -కిరణాలు (గామా కిరణాలు)
        ఈ విద్యుదయస్కాంత వర్ణపటాలకు పైన పేర్కొన్న ఉమ్మడి లక్షణాలున్న కారణంగా, వీటిని గుర్తించడానికి వాటి తరంగ దైర్ఘ్యాలు, అవి ఉత్పత్తయ్యే విధానాల ఆధారంగా విభజించారు. పట్టిక I లో చూడవచ్చు.

 

రేడియో ఖగోళశాస్త్రం

        రేడియో తరంగాలు గ్రహాంతరాల నుంచి కూడా ప్రసరిస్తుంటాయి. గ్రహాంతర రేడియో ఉద్గారాల నుంచి పట చిత్రనం చేయడాన్ని రేడియో ఖగోళశాస్త్రం అంటారు. దృశ్యమాన దూరదర్శనులతో(ఆప్టికల్ టెలిస్కోప్) కనుక్కోని విషయాలను ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.
ఓజోను పొర క్షీణించడానికి కారణాలు: శరీరం అతినీలలోహిత వికిరణాల ప్రభావానికి అల్పంగా గురైనప్పుడు చర్మం మాడినట్లు, అదే ఎక్కువగా గురైనప్పుడు క్యాన్సరు వస్తుంది. ఇలాంటి విషపూరిత వికిరణాల నుంచి మనల్ని ఓజోను పొర రక్షిస్తోంది. కానీ, ఇటీవల వాయుద్రావణ పిచికారులు, శీతలీకరణ యంత్రాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ఫ్లోరో కార్బన్లతో ఓజోన్ రసాయనిక చర్య జరపడం వల్ల క్షీణిస్తోంది.
దృఢ X కిరణాలు - మృదు X కిరణాలు: 1895లో రాంట్‌జెన్ X - కిరణాలు కనుక్కున్నాడు.
దృఢ X - కిరణాలు: వీటి తరంగ దైర్ఘ్యాలు 0.01 Ao నుంచి 10 Ao వరకు ఉంటాయి. ఇవి ఎక్కువ లోతుకు చొచ్చుకు పోతాయి. కాబట్టి వీటిని పదార్థ నిర్మాణం, పరిశ్రమల్లోని వస్తువులను శోధించడానికి ఉపయోగిస్తారు.
మృదు X - కిరణాలు: వీటి తరంగ దైర్ఘ్యాలు 10 Ao నుంచి 100 Ao వరకు ఉంటాయి. ఇవి ఎక్కువలోతుకు చొచ్చుకుపోవు.

     
అందువల్ల వీటిని వైద్యరంగంలో వ్యాధి నిర్ధరణకు ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని రేడియోగ్రఫీ అంటారు. వీటిని రోగ నివారణకు, చికిత్సకు ఉపయోగిస్తారు. దీన్ని 'రేడియో థెరపీ' అంటారు. 

రంగులు-రకాలు: రంగులు రెండు రకాలు. అవి: ప్రాథమిక రంగులు, గౌణరంగులు.

ఎరుపు (R), ఆకుపచ్చ (G), నీలం (B) రంగులను ప్రాథమిక రంగులు అంటారు. ప్రాథమిక రంగులను సమపాళ్లలో కలిపి గౌణరంగులను ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణకు పసుపుపచ్చ(Y), ముదురు ఎరుపు (M), ముదురు నీలం (C). ప్రాథమిక, గౌణరంగులను సులభంగా గుర్తుంచుకోవడానికి వెన్‌చిత్రాన్ని చూడండి.
       వెన్ చిత్రాన్ని గమనించినట్లయితే ఒక గౌణరంగును దాని వ్యతిరేక దిశలోని ప్రాథమిక రంగుతో అనుపాతంలో మిశ్రమం చేస్తే తెల్లని రంగు వస్తుంది.
ఉదా: 1) ఆకుపచ్చ (G) + ముదురు ఎరుపు (M) = తెలుపు (W)
            (ప్రాథమిక రంగు)  (ఎదురుగా ఉన్న గౌణరంగు)
2) ఎరుపు(R) + ముదురునీలం(C) = తెలుపు (W)
3) నీలం(B) + పసుపు(Y) = తెలుపు (W)


Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌