• facebook
  • whatsapp
  • telegram

రసాయన మార్పులు

రసాయన సమీకరణం: ఒక మూలకం పరమాణువును సులభ పద్ధతిలో సూచించే విధానాన్నే 'సంకేతం' అంటారు. ఒక సమ్మేళనంలోని అణువులో ఉన్న పరమాణువులను సంకేతపరంగా సూచించేదాన్ని 'సూత్రం' లేదా 'ఫార్ములా' అంటారు. రసాయన చర్యను ఫార్ములాలతో సూచించడాన్ని రసాయన సమీకరణం అంటారు.
 

రసాయన మార్పులు

రసాయన సమీకరణం కింది విషయాలను తెలుపుతుంది.
(i) చర్యలో పాల్గొన్న క్రియాజనకాలు.
(ii) చర్యలో లభించే క్రియాజన్యాలు.
(iii) చర్యలో పాల్గొన్న క్రియాజనక, క్రియాజన్యాల పరమాణు, అణు సంఖ్యలు.
(iv) క్రియాజనక, క్రియాజన్య భారాలు.
(v) క్రియాజనక, క్రియాజన్య మోల్‌ల సంఖ్యలు.
(vi) వాయు స్థితిలో ఉన్న క్రియాజనక, క్రియాజన్య ఘనపరిమాణాలు.
ఉదా: కింది రసాయన సమీకరణాన్ని పరిశీలిద్దాం.
CaCO3 + 2HCl
CaCl2 + H2O + CO2


వీటి భారాలు వరుసగా...
[40 + 12 + (3 × 16)] + 2 (1 + 35.5)  (40 + 2 × 35.5) + (2 × 1 + 16) + (12 + 2 × 16)
100 + 73  
111 + 18 + 44
పై సమీకరణం ద్వారా కింది విషయాలను తెలుసుకోవచ్చు.
* ఒక అణువు CaCO3, రెండు అణువుల 'HCl'తో చర్యపొంది ఒక అణువు CaCl2, ఒక అణువు 'H2O' ఒక అణువు CO2 లను ఇస్తాయి.
* 100 భాగాల CaCO3, 73 భాగాల HClతో చర్యపొంది 111 భాగాల CaCl2, 18 భాగాల H2O, 44 భాగాల CO2 లను ఇస్తాయి.
* ఒక మోల్ CaCO3 (100 గ్రా.), 2 మోలుల HCl (2 × 36.5 = 73 గ్రా.)తో చర్యపొంది, ఒక మోల్ CaCl2 (111 గ్రా.), ఒక మోల్ H2O (18 గ్రా.), ఒక మోల్ CO2 (44 గ్రా.) లను ఇస్తాయి.
* ఒక మోల్ CaCO3 రెండు మోల్‌ల HClతో చర్య పొందినప్పుడు ఏర్పడిన ఒక మోల్ CO2 వాయువు ప్రమాణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద (NTP) 22 .4 లీ. ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది.

రసాయన సమీకరణాల ఆధారంగా క్రియాజనక - క్రియాజన్యాలభారాల గణనలు
ఉదా: CaCO3  
 CaO + CO2
ఈ తుల్య సమీకరణం ప్రకారం ఒక అణువు CaCO3ను వియోగం చెందిస్తే ఒక అణువు CaO, ఒక అణువు CO2 లు లభిస్తాయి.
* CaCO3 అణుభారం
 Ca = 40; C = 12; O = 16
   CaCO3 అణుభారం = 40 + 12 + (3 × 16) = 40 + 12 + 48 = 100 గ్రాములు
* CaO అణుభారం

 Ca = 40; O = 16
    CaO అణుభారం = 40 + 16 = 56 గ్రాములు
* CO2 అణుభారం
 C = 12; O = 16
    CO2 అణుభారం = 12 + (2 × 16) = 44 గ్రాములు
కాబట్టి 100 గ్రాముల CaCO3 ను వియోగం చేస్తే 56 గ్రాముల CaO, 44 గ్రాముల CO2 లు వెలువడతాయి.
ఉదా: 2H2 + O2
 2H2O
పై సమీకరణంలో 10 గ్రాముల H2 ఎన్ని గ్రాముల O2 తో చర్య పొందుతుంది?
H2 అణుభారం = 2 గ్రాముల ఆక్సిజన్ అణుభారం = 32 గ్రాములు
H2O అణుభారం = 18 గ్రాములు
పై సమీకరణంలో 2 × 2 గ్రాముల H2
32 గ్రాముల O2 తో చర్య పొందుతుంది.
10 గ్రాముల H2  
 ? ఎన్ని గ్రాముల O2తో చర్యపొందుతుంది.


ఉదా: 8 గ్రాముల కాల్షియం కార్బొనేట్‌ను వేడిచేస్తే విడుదలైన కార్బన్-డై-ఆక్సైడ్ భారమెంత?
(C = 12; Ca = 40; O = 16)
తుల్య సమీకరణం
CaCO3 
 CaO + CO2
CaCO3 అణుభారం
= 40 + 12 + (3 × 16)
= 40 + 12 + 48 = 100 గ్రాములు
CO2 అణుభారం = 12 + (2 × 16) = 12 + 32 = 44 గ్రాములు
సమీకరణం ప్రకారం 100 గ్రా. CaCO3  
 44 గ్రాముల CO2ని ఇస్తుంది.
8 గ్రాముల CaCO3  
 ? ఎన్ని గ్రాముల CO2 ని ఇస్తుంది.

ఉదా: ఒక గ్రాము కార్బన్‌తో చర్యపొందే ఆక్సిజన్ భారాన్ని గ్రాముల్లో లెక్కించండి. 24 గ్రాముల కార్బన్ ఆక్సిజన్‌తో చర్యపొంది ఏర్పరిచే CO2 భారం ఎంత?
కార్బన్ + ఆక్సిజన్
 కార్బన్ డై ఆక్సైడ్
C + O2
 CO2
C పరమాణు భారం = 12 గ్రాములు
ఆక్సిజన్ పరమాణుభారం = 16 గ్రాములు
కాబట్టి 'CO2' భారం = (1 × 12 + 2 × 16) = 12 + 32 = 44 గ్రాములు.
12 గ్రాముల కార్బన్‌తో చర్యపొందే ఆక్సిజన్ భారం = 32 గ్రాములు
1 గ్రాము కార్బన్‌తో చర్యపొందే ఆక్సిజన్ భారం = ?


24 గ్రాముల కార్బన్ ఆక్సిజన్‌తో చర్యపొంది ఏర్పరిచే CO2 భారం = ?
12 గ్రాముల కార్బన్ ఆక్సిజన్‌తో చర్యపొంది ఏర్పరిచే CO2 భారం = 44 గ్రాములు

 

రసాయన మార్పులు - రకాలు

రసాయన మార్పులు 4 రకాలు. అవి:
1) రసాయన సంయోగం      2) రసాయన వియోగం
3) రసాయన స్థానభ్రంశం      4) రసాయన ద్వంద్వ వియోగం
* రసాయన సంయోగం: రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే పదార్థాన్ని ఏర్పరచడాన్ని 'రసాయన సంయోగం అంటారు. ఇవి ఉష్ణమోచక చర్యలు. 'A', 'B'లు రెండు రసాయనిక పదార్థాలైతే వాటి సమ్మేళనం ఒక కొత్త రసాయనిక పదార్థం 'C' అవుతుంది.

ఉదా: 1) C + O2   CO2
         2) 2Mg + O2   
 2MgO
         3) CaO + H2O
 Ca(OH)2
         4) 2Na + Cl2
 2NaCl
         5) N2 + 3H2  
2NH3
         6) Ca (OH)2 + CO2  
 CaCO3 + H2O
* రసాయన వియోగం: ఒక పదార్థాన్ని వేడిచేసినప్పుడు విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఏర్పరచడాన్ని రసాయన వియోగం అంటారు. ఇవి ఉష్ణగ్రాహక చర్యలు. 'A' అనే ఒక రసాయన పదార్థాన్ని వేడి చేస్తే అది విడిపోయి B, C లుగా ఏర్పడుతుంది.


ఉదా: CaCO3 CaO + CO2 
         2Hgo  2Hg + CO2 
         CuCO3

 CuO + CO
         2KNO3 2KNO2 + O2
         2H2O2  2H2O + O2 
         2Pb (NO3)2 2PbO + 4NO2 + O2 

* రసాయన స్థానభ్రంశం: ఒక మూలకం (లేదా) ప్రాతిపదిక వేరొక మూలకం (లేదా) ప్రాతిపదిక స్థానభ్రంశం చెందిస్తే దాన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.

ఉదా: Zn + CuSO4 ZnSO4 + Cu
         Zn + H2SO4
 ZnSO4 + H2
         Cu + 2AgNO3
 Cu(NO3) + 2 Ag.
         Zn + 2HCl

 ZnCl2 + H2
         Fe + CuSO4
 FeSO4 + Cu
         Pb + CuCl2
 PbCl2 + Cu

* రసాయన ద్వంద్వ వియోగం: రెండు పదార్థాలు వాటి మూలకాలు (లేదా) ప్రాతిపదికలు పరస్పరం మార్చుకునే చర్యను ''ద్వంద్వ వియోగం" అంటారు.

ఉదా: Pb(NO3)2 + 2KI   PbI2 + 2KNO3
         Na2 SO4 + BaCl2
 BaSO4 + 2NaCl
         NaOH + HCl
 NaCl + H2O
         NaCl + AgNO3
 AgCl + NaNO3

రసాయన చర్యలు - రకాలు
రసాయన చర్యలు రెండు రకాలు...
1) ద్విగత చర్యలు 2) అద్విగత చర్యలు
 ద్విగత చర్యలు: రసాయన వియోగ చర్యలను చర్య ప్రయోగ పరిస్థితులను బట్టి తిరోగమింపచేయవచ్చు. ఇలాంటి చర్యలను ''ద్విగత చర్యలు" అంటారు. వీటిని

 గుర్తుతో సూచిస్తారు.
ఉదా: PCl5
 PCl3 + Cl2
 అద్విగత చర్యలు: రసాయన వియోగ చర్యలను చర్య ప్రయోగ పరిస్థితులను బట్టి తిరోగమింపచేయలేని చర్యలను అద్విగత చర్యలు అంటారు.
ఉదా: AgNO3 + HCl 
  AgCl + HNO3
                                           (అవక్షేపం)

రసాయన సంయోగ నియమాలు
రసాయన సంయోగ నియమాలు 3 రకాలు
1) ద్రవ్యనిత్యత్వ నియమం         2) స్థిరానుపాత నియమం           3) బహ్వానుపాత నియమం
 ద్రవ్యనిత్యత్వ నియమం: రసాయన చర్యలలో పదార్థం జనించదు లేదా నశించదు అని ద్రవ్యనిత్యత్వ నియమం తెలుపుతుంది. అంటే, చర్యకు ముందు, చర్య తర్వాత పదార్థ భారంలో తేడా ఉండదు.
ఉదా: 1) CaO + H2
 Ca(OH)2
         2) 2KClO3
 2 KCl + 3O2
         3) Zn + CuSO
 ZnSO4 + CO2
పై రసాయన మార్పులన్నింటిలో క్రియాజనకాల భారాల మొత్తం క్రియాజన్యాల భారాల మొత్తానికి సమానం.
* స్థిరానుపాత నియమం: రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి ఒక సంయోగ పదార్థాన్ని ఏర్పరిస్తే ఆ మూలకాల భారాల నిష్పత్తి స్థిరం. ఈ నిష్పత్తి పదార్థం ఏర్పడిన విధానంపై ఆధారపడదు. దీన్ని స్థిరానుపాత నియమం అంటారు. ఒకే రకమైన మూలకాల నుంచి ఏదైనా పదార్థం వేర్వేరు పద్ధతుల ద్వారా ఏర్పడినప్పటికీ, భార నిష్పత్తిలో మార్పు ఉండదు.
* బహ్వానుపాత నియమం: రెండు మూలకాలు కలిసి రెండు, లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఏర్పరచినప్పుడు స్థిర భావం ఉన్న మొదటి మూలకంతో చర్య పొందే రెండో మూలకం భారాలు సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంటాయి.
ఉదా: KClO3 ను వేడిచేస్తే 'KCl', ఆక్సిజన్‌లు లభిస్తాయి. 2.45 గ్రా. KClO3 ని వేడిచేయగా, 1.49 గ్రా., KCl ఏర్పడింది. వెలువడిన ఆక్సిజన్ వాయువు భారాన్ని కనుక్కోండి?

​​​​​​​

ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం క్రియాజనకాల భారాల మొత్తం క్రియాజన్యాల భారాల మొత్తానికి సమానం.
KClO3 
 KCl + O2
2.45 గ్రా.

 1.49 + x
 x = 2.45 - 1.49 = 0.96 గ్రా.
∴​​​​​​​ ఆక్సిజన్ భారం = 0.96 గ్రా.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌