• facebook
  • whatsapp
  • telegram

సల్ఫర్, దాని సమ్మేళనాలు

1. వేరుబుడిపెలు ఉండి, నత్రజని స్థాపన చేయగల మొక్క?
జ: చిక్కుడు

 

2. వర్షపు నీటిలోని నైట్రికామ్లంతో చర్యనొంది నైట్రేట్‌లను ఇచ్చే, భూమిలో ఉండే ఆక్సైడ్‌లు ఏవి?
జ: క్షార ఆక్సైడ్‌లు

 

3. ద్రవరాజంలో HNO3, HCl ల నిష్పత్తి ఎంత?
జ: 1:3

 

4. కిందివాటిలో అమ్మోనాల్ మిశ్రమాన్ని గుర్తించండి.
ఎ) NHNO3 + TNT         బి) NH4NO3 + Al        సి) NH4NO3 + CO2       డి) NH4NO3 + S
జ: NH4NO3 + Al

 

5. S8 గొలుసులుండే సల్ఫర్ రూపాంతరం ఏది?
జ: ప్లాస్టిక్

 

6. కార్బన్ డై సల్ఫైడ్‌లో కరగని సల్ఫర్ రూపాంతరం ఏది?
జ: ప్లాస్టిక్

 

7. గన్ పౌడర్ వేటి మిశ్రమం?
జ: సల్ఫర్, బొగ్గు పొడి, పొటాషియం నైట్రేట్    

 

8. హైడ్రోజన్ సల్ఫైడ్ వాసన ఏమిటి?
జ: కుళ్లిన కోడిగుడ్ల వాసన      

 

9. 'జిప్సం' సాంకేతిక నామం ఏమిటి?
జ: CaSO4        

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌