1. Fe2O3 + 2 Al Al2O3 + 2 Fe ఈ రసాయన చర్య దేనికి ఉదాహరణ?
జ: స్థానభ్రంశం
2. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి ఇనుపరజను కలిపితే ఏం జరుగుతుంది?
జ: ఐరన్ క్లోరైడ్, హైడ్రోజన్ వాయువు విడుదలవుతాయి
3. BaCl2 + Na2SO4

జ: ద్వంద్వ వియోగం
4. హైడ్రోజన్, క్లోరిన్ వాయువుల నుంచి HCl ఏర్పడటం అనే రసాయన చర్య-
జ: రసాయన సంయోగం
5. కిందివాటిలో ఏది వియోగ చర్యను కలగజేయదు?
ఎ) విద్యుత్ విశ్లేషణ బి) ఉష్ణం సి) కాంతి డి) స్వేదనం
జ: డి (స్వేదనం)
6. క్షయం చెందడం అనేది ఏ ప్రక్రియ?
జ: ఆక్సీకరణం
7. ముక్కిపోవడం అనేది ఏ రకమైన చర్య?
జ: ఆక్సీకరణం
8. అప్పుడే కోసిన ఆపిల్ పండు నిదానంగా గోధుమ రంగులోకి మారడం ఏ తరహా రసాయన చర్య?
జ: ఆక్సీకరణం
9. వెండి వస్తువులపై 'నల్లటి' పూత ఏర్పడటం-
జ: క్షయకరణం
10. చిప్స్ ఎక్కువకాలం నిల్వ ఉండటానికి ఏ వాయువును నింపుతారు?
జ: నైట్రోజన్
11. శరీరంలో ఆహారం జీర్ణమవడం ఏ తరహా చర్య?
జ: భౌతిక మార్పు
12. రసాయన చర్యలో పాల్గొనే కారకాలు
జ: క్రియాజనకాలు
13. 1 A° = m
జ: 10-10
14. నీటి అణువులో ఏర్పడే బంధం-
జ: సమయోజనీయ
15. ధ్రువ ద్రావణాలకు ఉదాహరణ-
జ: H2O
16. అయానిక పదార్థాలు ఏ ద్రావణాల్లో కరుగుతాయి?
జ: ధ్రువ
17. BeCl2 ఆకృతి-
జ: రేఖీయం
18. O2 సంయోజకత
జ: 2
19. స్థిర ధనాత్మక అయాన్‌లను ఏమంటారు?
జ: కాటయాన్‌లు
20. కిందివాటిలో అష్టక నియమానికి వ్యతిరేకమైంది-
ఎ) Ne బి) Xe సి) Kr డి) He
జ: డి (He)
21. పరమాణువులో రుణాత్మక కణాలు-
జ: ఎలక్ట్రాన్‌లు
22. కిందివాటిలో రుణ విద్యుదాత్మకత ఉండే మూలకం-
ఎ) సోడియం బి) ఆక్సిజన్ సి) మెగ్నీషియం డి) కాల్షియం
జ: బి (ఆక్సిజన్)
23. పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణం భావనను ప్రవేశపెట్టినవారు-
జ: లైనస్ పౌలింగ్
24. బెరీలియం క్లోరైడ్‌లో బంధకోణం విలువ
జ: 180°
25. NH3 అణువు ఆకృతి
జ: పిరమిడ్
26. కిందివాటిలో తరిగిపోయే శక్తి వనరు .....
ఎ) సౌరశక్తి బి) పవనశక్తి సి) నేలబొగ్గు 4) జలశక్తి
జ: సి (నేలబొగ్గు)
27. 1 బ్యారెల్ = ...... లీటర్లు.
జ: 159
28. 4000 సంవత్సరాల కిందటే బాబిలోనియాలో వాడిన పెట్రో ఉత్పన్నం .....
జ: ఆస్ఫాల్ట్
29. కిందివాటిలో కోల్‌తార్ ఉపయోగం కానిది -
ఎ) మందుల తయారీ బి) పేలుడు పదార్థాలు సి) ఇంధనం డి) రంగులు
జ: సి (ఇంధనం)
30. నాఫ్తలీన్ గుళికలను ..... నుంచి తయారు చేస్తారు.
జ: కోల్‌తార్
31. ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు?
జ: జ్వలన ఉష్ణోగ్రత
32. కిందివాటిలో త్వరగా దహనం చెందని పదార్థం-
ఎ) స్పిరిట్ బి) పెట్రోలు సి) కర్పూరం డి) వంటచెరకు
జ: డి (వంటచెరకు)
33. ఎల్‌పీజీ (ద్రవ పెట్రోలియం గ్యాస్) కెలోరిఫిక్ విలువ (KJ/kg లలో)
జ: 55,000
34. నూనెతో కూడిన మంటలను ఆర్పడానికి .......ను ఉపయోగిస్తారు.
జ: CO2
35. 'బంగారు దారం' అని దేన్ని పిలుస్తారు?
జ: జనపనార
36. వర్షానికి తడవని దుస్తులను తయారుచేసినవారు-
జ: మొకింతోష్
37. కర్రగుజ్జుకు, రసాయనాలను కలిపి వేటిని తయారు చేస్తారు?
జ: రేయాన్
38. పాలిస్టర్ దారాలను వేటి నుంచి తయారు చేస్తారు?
జ: పెట్రోలియం
39. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన దారం -
జ: నైలాన్
40. పళ్లు తోముకునే బ్రష్ కుంచెను ....తో తయారు చేస్తారు.
జ: నైలాన్
41. పిల్లల డైపర్‌లలో ఉపయోగించే దారం ఏది?
జ: రేయాన్
42. కిందివాటితో 'కృత్రిమ ఉన్ని' అని దేన్ని అంటారు?
ఎ) అక్రలిత్ బి) రేయాన్ సి) నైలాన్ డి) టెర్లిన్
జ: ఎ (అక్రలిత్)
43. వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ ఏది?
జ: పాలిథీన్, PVC
44. ప్లాస్టిక్‌ను ఎవరు కనుకున్నారు?
జ: పార్క్స్
45. 'ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు' అని ఎవరిని పిలుస్తారు?
జ: బేక్‌లాండ్
46. ప్లాస్టిక్ వినియోగంలో ఉపయోగించాల్సిన సూత్రం
జ: 4R
47. వేడిచేసినప్పుడు మృదువుగా, చల్లబరిచినప్పుడు కఠినంగా తయారయ్యేవి-
జ: థర్మోప్లాస్టిక్