• facebook
  • whatsapp
  • telegram

కర్బన రసాయన శాస్త్రం

1. వ్యాపారాత్మకంగా ఇథనోల్‌ని ఏమని పిలుస్తారు?
జ: పరమ ఆల్కహాల్

 

2. కిందివాటిలో సమజాత శ్రేణిని కనుక్కోండి.
    ఎ) C3H6, C4H10          బి) CH3COOH, C2H5COOH
    సి) C4H8, C3H4            డి) ఏదీకాదు
జ: బి (CH3COOH, C2H5COOH)

 

3. కిందివాటిలో ఆల్కీన్ ఏది?
    ఎ) C5H10     బి) C4H10     సి) C6H10     డి) C6H8
జ: ఎ (C5H10)

 

4. ఎసిటిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్‌తో చర్య జరిపినప్పుడు దానికి గాఢ H2SO4 కలుపుతాం. అది ........ లా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిని ........... అంటారు.
జ: నిర్జలీకరణి, ఎస్టరిఫికేషన్

 

5. కింది ఏ హైడ్రోకార్బన్ అణుసాదృశ్యాన్ని ప్రదర్శిస్తుంది?
    ఎ) C2H4       బి) C2H6       సి) C3H8       డి) C4H10

జ: డి (C4H10)
 

6. ఎసిటిక్ ఆమ్లం నీటిలో కరిగినప్పుడు ద్విగత ఆమ్లం ఏర్పడుతుంది. ఎందుకంటే అది .........
జ: బలహీన ఆమ్లం

 

7. ఆల్డిహైడ్ పేరు రాయడానికి ఉపయోగించే పరపదం ఏమిటి?
జ: ఆల్ (-al)

 

8. ఎంత శాతం ఎసిటిక్ ఆమ్లానికి నీటితో కలిపి చర్య జరిపితే అది వెనిగర్‌గా మారుతుంది?
జ: 5 - 10%

 

9. ఆల్కేన్‌ల సాధారణ ఫార్ములా
జ: CnH2n + 2

 

10. కిందివాటిలో sp సంకరీకరణ అణువు-
       ఎ) CH4        బి) C2H4        సి) C2H2          డి) C3H6
జ: ఎ (CH4)

 

11. ఇథిలీన్‌లో C - C బంధకోణం ఎంత?
జ: 120°

 

12. గ్రాఫైట్ సాంద్రత .......... గ్రా/ ఘ.సెం.మీ.
జ: 2.25

 

13. సమీకృత వలయాల్లో వేటిని ఉపయోగిస్తారు?
జ: నానో నాళాలు

 

14. కిందివాటిలో విశిష్ట నిరోధక ఔషధంగా దేన్ని ఉపయోగిస్తారు?
       ఎ) నానో నాళాలు           బి) C60          సి) గ్రాఫైట్         డి) వజ్రం

జ: బి (C60)
 

15. కిందివాటిలో కార్బన్ ధర్మం కానిది-
      ఎ) కాటినేషన్              బి) లోహధర్మం      సి) సాదృశ్యత             డి) బహుబంధాల ఏర్పాటు
జ: బి (లోహధర్మం)

 

16. R - CHOను ఏమని పిలుస్తారు?
జ: ఆల్డిహైడ్

 

17. ఎల్‌పీజీలో అధిక శాతం ఉండే కర్బన సమ్మేళనం?
జ: బ్యూటేన్

 

18. మద్యసేవన నిర్ధారణ పరికరంలో ఉపయోగించే రసాయనం ఏది?
జ: K2Cr2O7

 

19. ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొనే రసాయన సమ్మేళనాలు
జ: ఆల్కేన్లు

 

20. కిందివాటిలో క్లోరోఫాం ఫార్ములా-
      ఎ) CHCl2       బి) CH2Cl2       సి) CHCl3       డి) CH3Cl
జ: సి (CHCl3)

 

21. కింది ఏ ద్రావణాన్ని 10% ఉపయోగించి వాహనాలకు ఇంధనంగా వాడతారు?
       ఎ) ఆల్కహాల్        బి) గాసోలిన్        సి) ఫార్మాల్డిహైడ్        డి) మీథేన్
జ: బి (గాసోలిన్)

 

22. ఆల్కహాల్ ఉనికిని ఏ లోహం సహాయంతో గుర్తిస్తారు?
జ: సోడియం

 

23. నీటిలో తేలియాడుతున్న సబ్బుకణాల సముదాయాన్ని ........ అంటారు.
జ: మిసిలి

 

24. స్టియరిక్ ఆమ్లం ఫార్ములా
జ: C17H35COOH

 

25. గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉండేవి-
జ: వనస్పతి

 

26. సెంట్లు అనేవి ఏ కర్బన సమ్మేళనాలు?
జ: ఏరోమాటిక్

 

27. రోగులకు స్పృహ లేకుండా చేసే పదార్థం ఏది?
జ: క్లోరోఫాం

 

28. కృత్రిమంగా పచ్చికాయలను పరిపక్వతకు తీసుకురావడానికి ఉపయోగించేది-
జ: ఇథిలిన్

 

29. ఫార్మాలిన్ అనేది దేని ద్రావణం?
జ: ఫార్మాల్డిహైడ్

 

30. సాధారణంగా 'టేబుల్ షుగర్' అని దేన్ని పిలుస్తారు?
: సుక్రోజ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌