• facebook
  • whatsapp
  • telegram

నీరు - గాలి, సహజ వనరులు

1. ప్రకృతి నుంచి లభించే వనరులను ఎలా పిలుస్తారు?
జ: సహజ వనరులు

 

2. సముద్రాలు, చెరువులు, నదుల్లోని నీరు నిరంతరం గాలిలోకి చేరడాన్ని ఏమంటారు?
జ: ఆర్ద్రత

 

3. నీరు ఆవిరిగా మారడాన్ని ..... అంటారు.
జ: బాష్పీభవనం

 

4. ఎలాంటి ద్రవాల్లో బాష్పీభవనం త్వరితంగా జరుగుతుంది?
జ: పెట్రోల్

 

5. కిందివాటిలో వేటిలో బాష్పీభవనం ఆలస్యంగా జరుగుతుంది?
           1) ఆల్కహాల్            2) నూనె            3) పెట్రోల్            4) అన్నీ
జ: 2(నూనె)

 

6. హాని కలిగించే పదార్థాలు గాలిలో కలిసి ఉండటాన్ని ఏమంటారు?
జ: గాలి కాలుష్యం

 

7. భూమి వేడెక్కడానికి కారణం
జ: CO2 (బొగ్గుపులుసు వాయువు)

 

8. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే వాయువు
జ: SO2

 

9. కిందివాటిలో ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువు
           1) SO2            2) NO2            3) NO3            4) అన్నీ
జ: 4(అన్నీ)

 

10. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్‌ల నిష్పత్తి
జ: 1 : 4

 

11. ద్రవపదార్థానికి సంబంధించిన ధర్మం ఏది?
           1) తలతన్యత            2) స్నిగ్దత            3) కేశనాళికీయత            4) అన్నీ
జ: 4(అన్నీ)

 

12. కిందివాటిలో గరిష్ఠ స్నిగ్దత గల పదార్థం
           1) నీరు            2) పాదరసం            3) ఆల్కహాల్            4) తేనె
జ: 4(తేనె)

 

13. కిందివాటిలో తలతన్యత ఆధారపడని లక్షణం
   1) ఉపరితల వైశాల్యం      2) ద్రవాల స్వభావం      3) ఉష్ణోగ్రత        4) మాలిన్యాలు
జ: 1(ఉపరితల వైశాల్యం)

 

14. కిందివాటిలో స్నిగ్దతకు సంబంధించనిది ఏది?
           1) ఇది అసంజన బలాలపై ఆధారపడుతుంది
           2) దీని వల్ల ప్రవాహి వేగం తగ్గుతుంది
           3) వాయువుల స్నిగ్దత ఉష్ణోగ్రత వల్ల పెరుగుతుంది
           4) ప్రవాహి ఫలిత వేగం తగ్గుతుంది
జ: 1(ఇది అసంజన బలాలపై ఆధారపడుతుంది)

 

15. నిలకడగా ఉన్న నీటిపైన కిరోసిన్‌ను చల్లినప్పుడు దేనిలో మార్పు జరిగి దోమల గుడ్లు, లార్వాలు మునిగిపోతాయి?
జ: నీటి తలతన్యత తగ్గుతుంది

 

16. జలాంతర్గామి పనిచేయడంలో ఇమిడియున్న సూత్రం
జ: ఆర్కిమెడిస్ సూత్రం

 

17. టారిసెల్లి కనుక్కున్న భారమితి దేన్ని కొలుస్తుంది?
జ: వాతావరణ పీడనం

 

18. వర్షపు చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం ఏమిటి?
జ: తలతన్యత

 

19. నీటిలో డిటర్జెంట్ పౌడర్‌ను కలిపినప్పుడు దాని తలతన్యత
జ: తగ్గుతుంది

 

20. ఒక ప్రదేశంలో భారమితి పాదరస మట్టం హఠాత్తుగా తగ్గితే అది దేన్ని సూచిస్తుంది?
జ: తుపాను

 

21. స్వచ్ఛమైన నీటి స్పర్శకోణం
జ:

 

22. కిందివాటిలో ఏ నీటిపై ఈదడం సులభం?
           1) శుద్ధనీరు            2) సాధారణ నీరు            3) సముద్రపు నీరు            4) నూనె కలిపిన నీరు
జ: 3(సముద్రపు నీరు)

 

23. తలతన్యతకు ప్రమాణం
జ: న్యూటన్/మీ., డైన్/సెం.మీ.

 

24. చెరువులో పడవ మునిగినప్పుడు దాని నీటిమట్టం
జ: మారదు

 

25. వాయువులను వేడి చేస్తే వాటి స్నిగ్దత
జ: పెరుగుతుంది

 

26. కిందివాటిలో ఏ ప్రదేశం వద్ద వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది?
           1) ముంబయి            2) చెన్నై            3) సిమ్లా            4) అలహాబాద్
జ: 3(సిమ్లా)

 

27. ద్రవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
జ: హైడ్రాలజీ

 

28. సముద్ర అలలు క్షీణించడానికి ఉపయోగపడే ధర్మం
జ: స్నిగ్దత

 

29. సందిగ్ద ఉష్ణోగ్రత వద్ద ద్రవాల తలతన్యత
జ: 0

 

30. బెర్నౌలీ సిద్ధాంతాన్ని ఏ నిత్యత్వ నియమం ఆధారంగా ప్రతిపాదించారు?
జ: శక్తి

 

31. ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలను వేరు చేయడానికి ఉపయోగించే ధర్మం
జ: స్నిగ్దత

 

32. ఇసుక ఎడారుల్లో ఒయాసిస్‌లు ఏర్పడటానికి కారణం
జ: కేశనాళికీయత

 

33. ద్రవాల ప్రవాహరేటును కనుక్కునే సాధనం
జ: వెంచురి మీటర్

 

34. లోతుకు వెళ్లే కొద్దీ ద్రవాల పీడనం
జ: పెరుగుతుంది

 

35. వాతావరణ పీడనం Po = .....
జ: phg

 

36. 1 అట్మాస్ఫియర్ = ..... న్యూ/మీ2
జ: 1.01 × 105

 

37. కిరోసిన్ సాంద్రత
జ: 0.8 గ్రా./సెం.మీ.3

 

38. ప్లవన సూత్రాలను ప్రతిపాదించినవారు
జ: ఆర్కిమెడిస్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌