• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - రవాణా విద్య

1. అల్జీర్స్ సమావేశం ఎప్పుడు జరిగింది?
జ: 1973

 

2. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది?
జ: 10 - 12 - 1948

 

3. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదించిన సమావేశం ఎక్కడ జరిగింది?
జ: అల్జీర్స్

 

4. అడవుల నరికివేత అధికంగా ఉన్న ప్రాంతం?
జ: మూడో ప్రపంచ దేశాలు

 

5. పర్యావరణం అంటే ఏమిటి?
జ: మానవాళి అస్తిత్వాన్ని, పరిసరాలను ప్రభావితం చేసే అన్ని అంశాలనుకలిపి పర్యావరణమని పిలుస్తారు.

 

6. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అడవులు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి?
జ: 1%

 

7. సైకిల్ వెనకభాగంలో ఉండాల్సింది ఏమిటి?
జ: ఎర్రటి రిఫ్లెక్టర్

 

8. సైకిల్ ఒక
జ: స్వయంచాలిత వాహనం

 

9. ఇంధన శక్తితో వాహనాలను నడిపేవారికి తప్పనిసరిగా ఉండాల్సింది?
జ: డ్రైవింగ్ లైసెన్స్

 

10. జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు వీరి కోసం....
జ: పాదచారులకోసం

 

11. వాహనం వేగంగా వెళ్తున్నపుడు అకస్మాత్తుగా వేటిని ఉపయోగించకూడదు?
జ: బ్రేకులు

 

12. సైకిల్ ముందుభాగంలో ఉండాల్సింది ఏమిటి?
జ: తెల్లటి దీపం

 

13. హెల్మెట్ ఉపయోగం ఏమిటి?
జ: వాహనాలు నడిపేవారికి ప్రమాదాలు జరగకుండా చేయడానికి

 

14. ఓజోన్ పొరకు విఘాతం కలిగిస్తున్నవి ఏవి?
జ: క్లోరో ఫ్లోరో కార్బన్లు

 

15. పేద, ధనిక దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసం తగ్గించడానికి రూపకల్పన చేసిందెవరు?
జ: విల్లీ బ్రాంట్ కమిషన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌