1. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఎవరిది?
జ: ప్రజలది
2. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది?
జ: భారతదేశం
3. 'డెమోస్' అనే పదం ఏ భాషకు చెందింది?
జ: గ్రీకు
4. 'ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం' అని తెలిపినవారు?
జ: అబ్రహాం లింకన్
5. 'డెమోస్', 'క్రోషియా' అనే పదాలకు అర్థం
జ: ప్రజలు, పరిపాలన
6. భారతదేశంలో మొట్టమొదటి స్థానిక ఎన్నికలు జరిగిన సంవత్సరం?
జ: 1884
7. చట్టాలు, శాసనాల ప్రాతిపదికపై ప్రభుత్వాన్ని నిర్వహించడాన్ని ఏమంటారు?
జ: సమన్యాయపాలన
8. పోలింగ్ బూత్ అధికారిని ఏమంటారు?
జ: ప్రిసైడింగ్ ఆఫీసర్
9. భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం
జ: 1952
10. పార్లమెంటులో ఎగువసభ
జ: రాజ్యసభ
11. భారతదేశంలో ఏ రకమైన పాలన ఉంది?
జ: పార్లమెంటరీ పాలన
12. లోక్సభ సభ్యుల పదవీకాలం ఎంత?
జ: 5 సంవత్సరాలు
13. భారత పౌరులు ఎన్ని సంవత్సరాలకు ఓటుహక్కు పొందుతారు?
జ: 18 సంవత్సరాలు
14. భారతదేశ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు?
జ: S.Y. ఖురేషీ
15. ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారి ఎవరు?
జ: రిటిర్నింగ్ అధికారి
16. ద్రవిడ మున్నేట్ర కజగం(D.M.K) పార్టీ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: తమిళనాడు
17. 14వ సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జ: 2004
18. ఎలక్టొరేట్ అంటే ఏమిటి?
జ: ఓటర్ల సముదాయం
19. అకాలీదళ్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: పంజాబ్
20. 15వ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం?
జ: 2009