• facebook
  • whatsapp
  • telegram

జాతీయవాద ఉద్యమాలు

సమైక్య రాజ్యాలు

1. బిస్మార్క్  ఏ దేశ ప్రధానమంత్రి?
 

2. 'దాస్ క్యాపిటల్' గ్రంథ రచయిత  ఎవరు? 
 

3. తృతీయ ఇంటర్నేషనల్‌ను ఏర్పాటు చేసిన ప్రదేశం ఏది?
 

4. కవూర్ స్థాపించిన 'రిసోర్జిమెంటో'  దేనికి సంబంధించింది?  
 

5. బిస్మార్క్ విధానం ఏమిటి?
 

6. 'యంగ్ ఇటలీ'ని స్థాపించిందెవరు?  
 

7. ఐక్య జర్మనీ మొదటి చక్రవర్తి  ఎవరు?
 

8. ఫ్రాంకో - ప్రష్యన్ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
 

9. గారిబాల్డీ ఆధీనంలోని సైన్యానికి ఉన్న పేరు ఏది?
 

10. 'పనిహక్కు సూత్రం' ప్రతిపాదించినవాడు ఎవరు?
 

11. 'కమ్యూనిస్ట్ మేనిఫెస్టో' గ్రంథకర్త  ఎవరు?
 

12. 'చరిత్ర అంటే వర్గ సంఘర్షణల నమోదు తప్ప మరేమీ కాదు'' అని చెప్పింది ఎవరు?
 

13. నేపుల్స్‌లో ప్రారంభమై, ఇటలీ అంతటా వ్యాపించిన విప్లవ రహస్య సంఘాన్ని ఏమని అంటారు?
 

14. మజ్జినీని సముద్రం, ఆకాశం మాత్రమే కనిపించే విధంగా ఏ దుర్గంలో నిర్బంధించారు?
 

15. 1852లో 'పీడ్మాంట్' ప్రధానిగా నియమితులైంది ఎవరు?
 

16. ఇటలీ ఏకీకరణను ఎన్ని దశల్లో సాధించారు?
 

17.  ఏ యుద్ధ విరమణ సంధి ద్వారా నెపోలియన్ ఆస్ట్రియాతో యుద్ధానికి స్వస్తిపలికాడు?
 

18. కవూర్ మరణించిన తర్వాత 'ఇటలీ ఏకీకరణ' పనిని ఎవరు పూర్తి చేశారు? 
 

19. ఐక్య ఇటలీరాజు ఎవరు?
 

20. ప్రజాస్వామ్యం, జాతీయ వాదం మాదిరిగా  ఏది ప్రబలమైన శక్తి?
 

21. ప్లేటో  దేని సమానత్వం గురించి వివరించాడు?
 

22. ఏ వ్యక్తీ సొంత ఆస్తి సమకూర్చుకోని ఓ సమాజం గురించి రాసినవాడు ఎవరు? 
 

23. కార్మికులకు ఏదో ఒకటి చేయడంలో విజయవంతమైన వారిలో మొదటివాడు ఎవరు?
 

24. సామ్యవాద తత్వానికి కొత్తదారి చూపించిందెవరు?

25. క్రీ.శ. 1864లో లండన్‌లో 'ప్రథమ ఇంటర్నేషనల్'ను నిర్వహించిందెవరు?
 

26. క్రీ.శ. 1871  ఫిబ్రవరిలో  ఎక్కడ ఒక 'కమ్యూన్' ఏర్పడింది?
 

27. ప్రపంచంలో మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏది? 
 

జవాబులు:  1- ప్రష్యా   2 - కార్ల్‌మార్క్స్  3 - మాస్కో  4. వార్తాపత్రిక  5 - బలప్రయోగం  6 - మజ్జినీ  7 - మొదటి విలియం  8 - ఫ్రాంక్‌ఫర్డ్  9 - రెడ్ షర్ట్స్  10 - లూయి బ్లాంక్  11 - కార్ల్‌మార్క్స్  12 - కార్ల్‌మార్క్స్ 13 - కార్బొనరీ  14 - సవోనా  15 - కవూర్   16 - అయిదు     17 - విల్లా ఫ్రాన్స్      18 - విక్టర్ ఎమ్మాన్యుల్  19 - విక్టర్ ఎమ్మాన్యుల్  20 - సామ్యవాదం 21 - సంపద  22 - థామస్ మూర్ 23 - లూయి బ్లాంక్  24 - కార్ల్ మార్క్స్  25 - కార్ల్ మార్క్స్  26 - ప్యారిస్  27 - ప్యారిస్ కమ్యూన్     
 

సరైన సమాధానాన్ని గుర్తించండి:
 

1. 'కార్బొనరీ' అనేది ఒక
     ఎ) కస్టమ్స్ యూనియన్            బి) వార్తాపత్రిక           సి) గ్రంథం           డి) విప్లవ సంఘం

 

2. 'దాస్ క్యాపిటల్' రచయిత 
     ఎ) రాబర్ట్ ఓవెన్           బి) కార్ల్‌మార్క్స్           సి) సైమన్           డి) లూయి బ్లాంక్

 

3. గారిబాల్డీ ఏర్పాటుచేసిన సైనిక దళం 
     ఎ) రెడ్ షర్ట్స్           బి) యంగ్ ఇటలీ           సి) బ్లూ స్టార్స్           డి) కార్బొనరీ

 

4. 'అంతర్జాతీయ శ్రామికుల అసోసియేషన్' నిర్వాహకుడు 
     ఎ) బిస్మార్క్           బి) గారిబాల్డీ           సి) కవూర్           డి) కార్ల్‌మార్క్స్

 

5. బిస్మార్క్ వీటిద్వారా జర్మనీ ఏకీకరణ సాధించాడు 
     ఎ) రెండు యుద్ధాలు - నాలుగు సంవత్సరాలు      బి) మూడు యుద్ధాలు - ఆరు సంవత్సరాలు 
     సి) రెండు యుద్ధాలు - ఆరు సంవత్సరాలు           డి) మూడు యుద్ధాలు - నాలుగు సంవత్సరాలు

 

6. తృతీయ ఇంటర్నేషనల్‌ను ఏర్పాటుచేసిన ప్రదేశం 
     ఎ) లండన్           బి) జర్మనీ           సి) మాస్కో           డి) టోక్యో

 

7. 'పని హక్కు సూత్రం' ప్రతిపాదించినవాడు
      ఎ) లూయి ఫిలిప్      బి) లూయి బ్లాంక్       సి) లూయి పాశ్చర్       డి) లూయి ఫిలిప్-1

 

8. కవూర్ మరణించిన తర్వాత 'ఇటలీ ఏకీకరణ' పనిని పూర్తి చేసినవాడు 
     ఎ) విక్టర్ ఎమ్మాన్యుల్       బి) గారిబాల్డీ             సి) మజ్జినీ             డి) బిస్మార్క్

 

9. 'సవోనా' దుర్గంలో బందీగా ఉన్నవాడు
     ఎ) థామస్ మూర్           బి) ప్లేటో                   సి) కవూర్             డి) మజ్జినీ

 

10. క్రీ.శ. 1871 ఫిబ్రవరిలో కమ్యూన్ ఇక్కడ ఏర్పడింది 
      ఎ) లండన్                     బి) ప్యారిస్                సి) మాస్కో             డి) బెర్లిన్

 

11. కవూర్ పీడ్మాంట్ ప్రధానిగా నియమితుడైన సంవత్సరం 
      ఎ) 1850                      బి) 1851                  సి) 1852                డి) 1853

 

12. కవూర్ ప్రారంభించిన వార్తాపత్రిక
     ఎ) రిసోర్జిమెంటో             బి) కమ్యూనిస్ట్ మేనిఫెస్టో             సి) దాస్ క్యాపిటల్             డి) ఇవేవీకావు

 

13. సామ్యవాద భావాల రచనలో చురుకైన పాత్ర నిర్వహించిన మేధావి 
      ఎ) రాబర్ట్ ఓవెన్             బి) థీర్స్             సి) ప్లేటో             డి) థామస్

 

14. 'కార్బోనరీ' ఇక్కడ ప్రారంభమైంది.
       ఎ) రోమ్               బి) నేపుల్స్           సి) లిస్బన్             డి) మాడ్రిడ్

 

15. 'యంగ్ ఇటలీ'లో చేరాలంటే ఎన్ని సంవత్సరాల వయసుండాలి 
       ఎ) 40 ఏళ్లు దాటి          బి) 40 ఏళ్లలోపు        సి) 50 ఏళ్లు దాటి      డి) 50 ఏళ్లలోపు
జవాబులు: 1 - డి;  2 - బి;  3 - ఎ;  4 - డి;  5 - బి; 6 - సి  7 - బి;  8 - ఎ;  9 - డి;  10 - బి; 11 - సి;  12 - ఎ; 13 - ఎ 14 - బి;  15 - బి.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌