• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం 

     మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణాన స్థాపించిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం.
* క్రీ.శ. 1336లో తుంగభద్రా నది ఒడ్డున విద్యారణ్య స్వామి సహాయంతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
* వీరు సంగమ వంశస్థులు. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పరిపాలించాయి.
* రాయచూర్ దోఆబ్ గురించి బహమనీ సుల్తానులకు విజయనగర రాజులకు నిరంతరం యుద్ధాలు జరిగేవి.
* సంగమ వంశంలో గొప్పవాడు రెండో దేవరాయులు.
* ఇతడి కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారశీక రాయబారి క్రీ.శ. 1443లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు.
* సంగమ వంశం తర్వాత సాళువ వంశస్థులు పరిపాలించారు. 
* సాళువ వంశం తర్వాత తుళువ వంశస్థులు పరిపాలించారు.
* తుళువ వంశంలో గొప్ప పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు.

 

శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 1509-1529) 

    విజయనగర సామ్రాజ్య పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు.
* ఉమ్మత్తూరు, శివసముద్రాల పాలకులను ఓడించాడు.
* పోర్చుగీసు వారితో స్నేహసంబంధాలు పెంపొందించుకున్నాడు.
* క్రీ.శ. 1510లో వారితో సంధి చేసుకుని మేలు జాతి అశ్వాలను పొందాడు.
* శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రలతో కటక్‌ను పరిపాలించే గజపతులను, బీజాపూరు సుల్తానులను ఓడించాడు.
* ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, బెజవాడ, రాజమండ్రి మొదలైన దుర్గాలను ఆక్రమించాడు.
* సింహాచలంలో విజయస్తంభాన్ని ఏర్పాటు చేశాడు.
* గజపతి కుమార్తెను రాయలు వివాహం చేసుకున్నాడు.
* శ్రీకృష్ణదేవరాయలు బీజాపూరు సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్‌షాతో రాయచూరు దగ్గర యుద్ధంచేసి ఓడించాడు.
* శ్రీకృష్ణదేవరాయల కాలంలో పోర్చుగీసు వర్తకుడు డోమింగ్ పేయిజ్ విజయనగరాన్ని సందర్శించాడు.
* రాయలు యుద్ధవీరుడు మాత్రమే కాదు పరిపాలనా దక్షుడు కూడా. ప్రజలను పన్నులతో బాధించలేదు.
* నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు.
* రాయలు గొప్ప కవి, పండితపోషకుడు.
* ఆముక్తమాల్యద కావ్యాన్ని రాశాడు. భువనవిజయం అనే పండిత సభను ఏర్పాటుచేసి పండితులను సత్కరించాడు.
* అష్టదిగ్గజాలనే కవులు రాయల ఆస్థానంలో ఉండేవారు.
* కన్నడ, తమిళ భాషల కవులను ఆదరించాడు.
* ఈయన కాలంలో హజార రామాలయం ప్రసిద్ధిచెందింది.
రామాయణ గాథను శిల్పులు హజార రామాలయం గోడలపై చెక్కారు.
* క్రీ.శ. 1529లో శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు.

 

విజయనగర సామ్రాజ్య పతనం 

* క్రీ.శ. 1565లో తళ్లికోట యుద్ధం లేదా రాక్షస - తంగడి యుద్ధం జరిగింది.
* ఈ యుద్ధంలో బీజాపూర్, గోల్కొండ, అహ్మద్‌నగర్ సుల్తానులు ఒక కూటమిగా ఏర్పడి విజయనగరంపై దండెత్తి రామరాజును ఓడించి చంపారు.
* తళ్లికోట యుద్ధంలో ఓటమి చెందడంతో విజయనగర సామ్రాజ్య పతనం మొదలైంది.
* తిరుమల రాయలు పెనుకొండకు పారిపోయాడు.
* తర్వాత విజయనగరాన్ని అరవీటి వంశం పెనుకొండ నుంచి పరిపాలించింది.

 

విజయనగర రాజ్యపాలన - వైభవం
 

మధ్యయుగంలో దక్షిణ భారత రాజ్యాల్లో ప్రసిద్ధి చెందింది విజయనగర సామ్రాజ్యం.
* ఈ సామ్రాజ్యాన్ని అబ్దుల్ రజాక్, న్యూనిజ్, నికోలోకాంటి, డోమింగ్ పేయిజ్ మొదలైన విదేశీ రాయబారులు సందర్శించారు.
* విజయనగర రాజులు సంప్రదాయబద్ధమైన రాచరికాన్ని అనుసరించారు.
* రాజుకు పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి మంత్రి పరిషత్తు ఉండేది.
* చక్రవర్తికి ప్రధానమంత్రి ముఖ్య సలహాదారుడు.
* విజయనగర సామ్రాజ్య కాలంలో రాష్ట్రాలతోపాటు సామంత రాజ్యాలు కూడా ఉండేవి.
* రాష్ట్రాలు గవర్నర్ల ఆధీనంలో ఉండేవి.
* సైన్యంలో అశ్వదళం, గజదళం, కాల్బలం ప్రధానమైనవి. ఫిరంగి దళం కూడా ఉండేది.
* సార్వభౌముల ఆధీనంలో, రాష్ట్ర గవర్నర్లు, నాయకుల ద్వారా కొంత సైన్యాన్ని పోషించేవారు.
* విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం.
* రాజ్యానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు. 1/3వ వంతు భూమిశిస్తును వసూలు చేసేవారు.
* వ్యవసాయాభివృద్ధికి చెరువులు, కాలువలను తవ్వించేవారు.
* పర్షియా, అరేబియా, ఈజిప్టు, ఇటలీ, పోర్చుగల్, సింహళం, చైనా, బర్మా మొదలైన దేశాలతో వర్తక వ్యాపారాలను కొనసాగించారు.
* సమాజంలో బ్రాహ్మణులను గౌరవించేవారు.

* హిందూ ధర్మ రక్షణకు పాటుపడ్డారు.
* శైవ, వైష్ణవాలు ఉండేవి.
* సాళువ రాజుల కాలం నుంచి వైష్ణవమతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
* తిరుపతి, శ్రీరంగం, అహోబిలం మొదలైనవి కొన్ని ప్రముఖ వైష్ణవ కేంద్రాలు.
* విజయనగర రాజులు విఠలస్వామి దేవాలయం, హజార రామ దేవాలయం మొదలైన దేవాలయాలను నిర్మించారు.
* పద్మమహలు, రంగమంటపం మొదలైన వాటిని కట్టించారు.
* సంస్కృతం, కన్నడ, తమిళ భాషల కవులను పోషించారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌